ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల నాల్గవ దశ పోలింగ్ జరుగుతోంది. ఈ దశలో రాష్ట్రంలోని 13 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 130 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ స్థానం నుంచి పోటీకి దిగారు.
లఖీమ్‌పూర్ ఖీరీ జిల్లాలోని ఫూల్‌బెహడ్ పరిధిలోని భూఢ్ గ్రామంలో వర్షం కారణంగా బూత్ నంబర్ 259లో పోలింగ్ నెమ్మదిగా జరుగుతోంది. ఉదయం ఎనిమిది గంటల వరకూ ఈ బూత్‌లో కేవలం 40 మంది మాత్రమే ఓటు వేశారు. భారీ వర్షం కారణంగా పోలింగ్ బూత్ ఖాళీగా కనిపిస్తోంది. మరోవైపు బహరాయిచ్ పరిధిలోని కార్త్‌నియాఘాట్ అటవీ ప్రాంతంలో ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఓటర్లు ఇక్కడ అత్యధిక సంఖ్యలో కనిపిస్తున్నారు. కాగా ఓటరు గుర్తింపు కార్డు సరిపోలని కారణంగా నలుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
కాన్పూర్‌లో పోలింగ్ ప్రారంభానికి ముందే ఈవీఎంలు మొరాయించాయి. ఫలితంగా గంగా గంజ్, బిఠూర్, కల్యాణ్‌పూర్ తదితర ప్రాంతాల్లో పోలింగ్ కొద్దిసేపు నిలిచిపోయింది. కల్యాణ్‌పూర్‌లో ఈవీఎంలు మొరాయించిన విషయాన్ని సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి రాజారామ్ పాల్ ఒక ట్వీట్ ద్వారా ఎన్నికల సంఘానికి తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment