పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ (వైఎస్‌ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాలు) పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది.
అనంతపురం అర్బన్ : పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ (వైఎస్‌ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాలు) పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఓటింగ్ తొలుత మందకొడిగా మొదలైంది. ఆ తరువాత పుంజుకుంది. ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య పట్టభద్ర ఓటింగ్ 11.06 శాతం, ఉపాధ్యాయ ఓటింగ్ 14.85 శాతం నమోదైంది. 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య పట్టభద్ర ఓటింగ్ 27.18 శాతం, ఉపాధ్యాయ ఓటింగ్ 56.26 శాతం, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య పట్టభద్ర ఓటింగ్ 37.64 శాతం, ఉపాధ్యాయ ఓటింగ్ 68.38 శాతం, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పట్టభద్ర ఓటింగ్ 46.64 శాతం, ఉపాధ్యాయ ఓటింగ్ 83.01 శాతం, సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య పట్టభద్ర ఓటింగ్ 63.25 శాతం, ఉపాధ్యాయ ఓటింగ్ 93.26 శాతం నమోదైంది.
జిల్లాల వారీగా ఓటింగ్ ఇలా..
పట్టభద్ర ఓటింగ్ ఇలా...
జిల్లా 10 గంటలు 12గంటలు 2 గంటలు 4 గంటలు 6 గంటల తుది శాతం
వైఎస్‌ఆర్ 10.23 32.00 38.50 41.00 57.34 57.34
కర్నూలు 13.90 24.55 34.50 46.94 64.22 64.22
అనంతపురం 9.06 25.18 39.93 51.97 68.19 68.19
మొత్తం 11.06 27.18 37.64 46.64 63.25 63.25
ఉపాధ్యాయ ఓటింగ్ ఇలా...
జిల్లా 10 గంటలు 12గంటలు 2 గంటలు 4 గంటలు 6 గంటల తుది శాతం
వైఎస్‌ఆర్ 15.00 55.00 68.00 85.00 93.60 93.60
కర్నూలు 12.20 59.83 69.40 82.05 93.33 93.33
అనంతపురం 17.36 53.94 67.75 81.99 92.84 92.84
మొత్తం 14.85 56.26 68.38 83.01 93.26 93.26