
సాక్షి, అనంతపురం: హిందూపురం ప్రజల బాగోగులు బాలకృష్ణకు పట్టవని ఎమ్మెల్సీ ఇక్బాల్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, షూటింగ్‌లు లేనప్పుడే హిందూపురానికి బాలకృష్ణ వస్తారని ధ్వజమెత్తారు. హిందూపురం అంటే బాలకృష్ణకు ఎందుకంత చిన్నచూపు అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సాగునీటి జలాలపై బాలకృష్ణ స్పందించలేదన్నారు. ఏపీ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టింది చంద్రబాబే. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను చంద్రబాబు చూసిచూడనట్లు వదిలేశారు. రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ ఇరిగేషన్ సమావేశాలంటూ’’ ఇక్బాల్ దుయ్యబట్టారు.
చదవండి: చంద్రబాబు పగటి వేషగాడు, పిట్టలదొర: మంత్రి కొడాలి నాని