Iqbal Mehmood
-
ఎమ్మెల్యే బాలకృష్ణపై ఎమ్మెల్సీ ఇక్బాల్ ఫైర్
సాక్షి, అనంతపురం: హిందూపురం ప్రజల బాగోగులు బాలకృష్ణకు పట్టవని ఎమ్మెల్సీ ఇక్బాల్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, షూటింగ్‌లు లేనప్పుడే హిందూపురానికి బాలకృష్ణ వస్తారని ధ్వజమెత్తారు. హిందూపురం అంటే బాలకృష్ణకు ఎందుకంత చిన్నచూపు అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సాగునీటి జలాలపై బాలకృష్ణ స్పందించలేదన్నారు. ఏపీ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టింది చంద్రబాబే. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను చంద్రబాబు చూసిచూడనట్లు వదిలేశారు. రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ ఇరిగేషన్ సమావేశాలంటూ’’ ఇక్బాల్ దుయ్యబట్టారు. చదవండి: చంద్రబాబు పగటి వేషగాడు, పిట్టలదొర: మంత్రి కొడాలి నాని -
చంద్రబాబూ.. ఇప్పుడేమంటారు?
సాక్షి, అనంతపురం: ఇండియా టుడే సర్వే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి కనువిప్పు కావాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఇక్భాల్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్ 3వ స్థానంలో నిలిచారని, ఆయన పనితీరు కు ఈ సర్వే కొలమానం అని పేర్కొన్నారు. రాజీనామాలు చేయాలని కోరిన చంద్రబాబు ఇప్పుడేమంటారని ఆయన ప్రశ్నించారు. సంక్షేమం-అభివృద్ధి తో సీఎం జగన్ దూసుకెళ్తున్నారన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే చంద్రబాబు కూడా ఓడిపోతారని, టీడీపీ ఎమ్మెల్యేలకు దమ్ము, ధైర్యం ఉంటే అమరావతి కోసం రాజీనామాలు చేసి ఎన్నికల కు వెళ్లాలని ఆయన సవాల్ విసిరారు. చంద్రబాబు విధ్వంసాన్ని ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ ఇక్బాల్ దుయ్యబట్టారు. (‘జగన్ భవిష్యత్తులో మీరు ఫస్ట్ ర్యాంక్ సాధిస్తారు’) -
‘నారా హమారా కాదు.. నీరో చక్రవర్తి’
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు నాయుడు నారా హమారా కాదని, నీరో చక్రవర్తని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మహ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల హమీలపై నిలదీస్తే విద్యార్థులను చిత్రహింసలకు గురిచేస్తారా అని ప్రశ్నించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తే లాఠీలతో కొట్టిస్తారా అని నిలదీశారు. ముస్లింల పట్ల చంద్రబాబుకు చిత్తుశుద్ధి లేదని దుయ్యబట్టారు. ముస్లింలపై చంద్రబాబుకు ప్రేమ లేదని టీడీపీ నేతలే చెప్పారన్నారు. చంద్రబాబు ముస్లింలను సెకండరీ గ్రేడ్ పౌరులుగా చూస్తున్నారని మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసుకు భయపడి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదికి వంగి వంగి సలామ్‌లు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబువన్నీ అబద్ధపు ప్రచారాలని, నాలుగేళ్ల బీజేపీతో అంటాకాగింది చంద్రబాబేనని పేర్కొన్నారు. -
సమయం అయిపోయినా దర్జాగా నోట్ల మార్పిడి!
రాంపూర్ : బ్యాంకు నోట్ల మార్పిడికి సాధారణ ప్రజలు గంటల కొద్దీ క్యూలైన్లో నిల్చుని ఇబ్బందులు పడుతుంటే... ఉత్తరప్రదేశ్‌లో ఓ మంత్రి మాత్రం దర్జాగా బ్యాంకు సమయం అయిపోయిన తర్వాత వెళ్లి మరీ నోట్లు మార్చుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అలాగే బ్యాంకు మేనేజర్, ఆ మంత్రి కలిసి కూర్చుని కబుర్లు చెపుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆహార, ఔషధ పరిపాలన విభాగానికి చెందిన రాష్ట్ర మంత్రి ఇక్బాల్ మెహమూద్‌ను తన ఇద్దరు కొడుకులను సంబాల్లోని ఓ ప్రైవేట్ బ్యాంకు మేనేజర్ సమయం అయిపోయిన తర్వాత(ఏడు గంటల తర్వాత) బ్యాంకులోకి అనుమతించారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా నాలుగున్నరకే మూతపడే బ్యాంకులు, పెద్ద నోట్ల రద్దుతో నెలకొన్న పరిణామాలతో ప్రజల కోసం మరికొద్ది గంటలు తెరచి ఉంచుతున్నాయి. ఆరుగంటలకు బ్యాంకు మూత పడిన తర్వాత, ఆ బ్యాంకు మేనేజర్, మంత్రి కొడుకులకు నోట్ల మార్పిడికి అవకాశమిచ్చారని తెలుస్తోంది. అదేవిధంగా మంత్రి, మేనేజర్ ఇద్దరు కలిసి క్యాబిన్లో కూర్చొని పిచ్చాపాటిగా మాట్లాడుకున్నట్టు ఆ వీడియో చూపిస్తోంది. అయితే ఈ విషయాన్ని ఆయన ఖండించటం గమనార్హం. బ్యాంకులోకి వెళ్లేముందు అందరిలాగే, తాను క్యూలో నిల్చున్నానని ఆయన తెలిపారు. ‘నిజమే తాను బ్యాంకు మేనేజర్ వద్ద కూర్చుని మాట్లాడాను.. అలాగే మా అబ్బాయిలు కూడా ధ్రువీకరణ పత్రాలు చూపించే కరెన్సీ నోట్లు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఆ తర్వాతే మేనేజర్ని కలిశాం’ అంటూ ఇక్బాల్ చెప్పారు. మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించిన బ్రాంచ్ మేనేజర్ జవేద్ ఖాన్ ‘బుధవారం కరెన్సీ త్వరగా అయిపోయింది. కొన్ని గంటలు నోట్ల ఎక్స్చేంజ్ను నిలిపివేశాం. నాలుగున్నర తర్వాత బ్యాంకుకు క్యాష్ రావడంతో అప్పుడు నోట్ల మార్పిడి ప్రక్రియ ప్రారంభించాం. దీంతో సాధారణ రోజుల కంటే కొంత ఆలస్యంగా బ్యాంకును మూసివేయాల్సి వచ్చింది’ అని పేర్కొన్నారు. అలాగే మంత్రికి కూడా బ్యాంకు సమయం అయిపోయిన తర్వాత నోట్లను మార్పిడి చేయాల్సి వచ్చిందన్నారు. ఈ ప్రక్రియలో ప్రొటోకాల్‌ను ఉల్లంఘించినట్టు తనకు అనిపించడం లేదని సమర్థించుకున్నారు.