
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు నాయుడు నారా హమారా కాదని, నీరో చక్రవర్తని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మహ్మద్ ఇక్బాల్ మండిపడ్డారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల హమీలపై నిలదీస్తే విద్యార్థులను చిత్రహింసలకు గురిచేస్తారా అని ప్రశ్నించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తే లాఠీలతో కొట్టిస్తారా అని నిలదీశారు. ముస్లింల పట్ల చంద్రబాబుకు చిత్తుశుద్ధి లేదని దుయ్యబట్టారు. ముస్లింలపై చంద్రబాబుకు ప్రేమ లేదని టీడీపీ నేతలే చెప్పారన్నారు. చంద్రబాబు ముస్లింలను సెకండరీ గ్రేడ్ పౌరులుగా చూస్తున్నారని మండిపడ్డారు. ఓటుకు కోట్లు కేసుకు భయపడి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదికి వంగి వంగి సలామ్‌లు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబువన్నీ అబద్ధపు ప్రచారాలని, నాలుగేళ్ల బీజేపీతో అంటాకాగింది చంద్రబాబేనని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment