
వైఎస్సార్ సీసీ నాయకులు మహ్మద్ ఇక్బాల్ (ఫైల్ ఫోటో)
సాక్షి, కర్నూలు: పాలనలో పారదర్శకత లేదనీ, ప్రశ్నించే ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధిలో రాష్ట్రం వెలిగిపోతోందని చెప్పుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్ సీసీ నాయకులు, రిటైర్డ్ ఐజీ మహ్మద్ ఇక్బాల్ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ద్వంద్వ పాలనా, కుట్ర రాజకీయాలు చేసి ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఇప్పుడూ అదే తరహా రాజీకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్ర రాజధానిపై ఉన్న ప్రేమ రాయలసీమపై లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమ అన్ని రంగాల్లో వెనకబడిందనీ, ఈ గడ్డపై పుట్టినందుకు ముఖ్యమంత్రి బాగా రుణం తీర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి చంద్రబాబుకు చెమటలు పడుతున్నాయని అన్నారు. నాలుగేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజల్ని అన్ని రకాలుగా మోసం చేసిన ముఖ్యమంత్రికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment