Hindupur MLA Balakrishna
-
ఎక్కడయ్యా.... బుల్ బుల్ బాలయ్యా ?
-
ఎమ్మెల్యే బాలకృష్ణపై ఎమ్మెల్సీ ఇక్బాల్ ఫైర్
సాక్షి, అనంతపురం: హిందూపురం ప్రజల బాగోగులు బాలకృష్ణకు పట్టవని ఎమ్మెల్సీ ఇక్బాల్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, షూటింగ్‌లు లేనప్పుడే హిందూపురానికి బాలకృష్ణ వస్తారని ధ్వజమెత్తారు. హిందూపురం అంటే బాలకృష్ణకు ఎందుకంత చిన్నచూపు అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సాగునీటి జలాలపై బాలకృష్ణ స్పందించలేదన్నారు. ఏపీ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టింది చంద్రబాబే. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను చంద్రబాబు చూసిచూడనట్లు వదిలేశారు. రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ ఇరిగేషన్ సమావేశాలంటూ’’ ఇక్బాల్ దుయ్యబట్టారు. చదవండి: చంద్రబాబు పగటి వేషగాడు, పిట్టలదొర: మంత్రి కొడాలి నాని -
బాలకృష్ణా.. హిందూపురం ప్రజలు గుర్తున్నారా?
హిందూపురం: ఓట్లు వేసిన ప్రజలు గుర్తున్నారా అని ఎమ్మెల్యే బాలకృష్ణను ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ప్రశ్నించారు. శనివారం పట్టణంలోని 32వ వార్డు అహ్మద్ నగర్‌కు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు వెంకటేశ్వరరావు, తన అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వారికి పార్టీ కండువాలు కప్పి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీ, ఇతర పార్టీ నాయకులు వైఎస్సార్సీపీలో చేరుతున్నారన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణను నమ్ముకున్న కార్యకర్తలతో పాటు ఓట్లు వేసిన ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ, బాబు, పార్టీలో చేరిన వారిలో లక్ష్మణ్ రావు, అతావుల్లా, గంగమ్మ, వలి, ఆల్లాబకాష్, గౌతమ్, జగదీష్, ఇర్ఫాన్ పాల్గొన్నారు. -
బాలకృష్ణ కాన్వాయ్‌లో ప్రమాదం
అనంతపురం : సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కాన్వాయ్‌కు మరోసారి ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌లోని కార్లు హిందూపురం మండలం కోడికొండ చెక్‌పోస్టు సమీపంలో బుధవారం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అయితే ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ ఏడాది జూన్‌లో కూడా బాలకృష్ణ కాన్వాయ్‌లోని ఓ వాహనం బెంగళూరు సమీపంలో బోల్తా కొట్టిన విషయం తెలిసిందే. -
మంత్రి చందూలాల్ కు బాలకృష్ణ ఆహ్వానం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో జరుగనున్న లేపాక్షి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మంగళవారం తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్‌ను కలిశారు. సచివాలయంలోని మంత్రి చాంబర్‌కు విచ్చేసిన ఆయన ఈ సందర్భంగా చందూలాల్‌ను లేపాక్షి ఉత్సవాలకు హాజరవ్వాలంటూ స్వయంగా అధికారిక ఆహ్వాన పత్రాన్నిఅందజేశారు. ఈ మేరకు బాలకృష్ణ మాట్లాడుతూ ... రాష్ట్రాలు వేరైనా తెలుగు ప్రజలంతా ఒక్కటే. అందుకే ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న లేపాక్షి ఉత్సవాలకు పర్యాటక శాఖ మంత్రిని ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. లేపాక్షిని అతి పెద్ద పర్యాటక ప్రాంతంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ నెల 27,28 తేదీల్లో రెండు రోజుల పాటు జరుగనున్న లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నం. అందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉత్సవానికి పొరుగు రాష్ట్రాల మంత్రులు కూడా హాజరువుతున్నారు అని పేర్కొన్నారు. బాలకృష్ణ ఆహ్వానాన్ని అందుకున్న చందూలాల్ స్పందిస్తూ.... బాలకృష్ణ స్వయంగా వచ్చి ఆహ్వానించడం చాలా సంతోషం. తప్పకుండా లేపాక్షి ఉత్సవాలకు హాజరవుతానని హామీ ఇచ్చారు. అనంతరం అరగంట పాటు ఉత్సవాలకు సంబంధించిన పలు విషయాలను చర్చించుకున్నారు. హిందూపురం నియోజకవర్గం లోని చిన్నగ్రామమైన లేపాక్షిలో జరిగే ఈ ఉత్సవానికి తనతో పాటు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కూడా హాజరవుతారని చందూలాల్ తెలిపారు. -
నేను సీఎం అయ్యే పరిస్థితి రాదు
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ * రాష్ట్రంలో ఎప్పటికీ చంద్రబాబే సీఎం సాక్షి, హైదరాబాద్: ఏపీకి తాను ముఖ్యమంత్రిని అయ్యే పరిస్థితి రాదని హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి చైర్మన్ నంద మూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. కేన్సర్ ఆస్పత్రి వార్షికోత్సవంలో సోమవారమిక్కడ ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీకి మీరు సీఎం అవుతారని వార్తలు వస్తున్నాయి కదా? అని మీడియా ప్రశ్నించగా.. ‘పరిస్థితి అంతవరకూ రాదు. అలాంటిదేమీ లేదు’ అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు నిరాటంకంగా అదే పదవిలో కొనసాగుతారని వెల్లడించారు. అడ్డంకులు ఎన్ని ఎదురైనా రాష్ట్రం లో ఎప్పటికీ చంద్ర బాబే సీఎంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన అయితేనే రాష్ట్రాన్ని, పార్టీని సమర్థంగా నడపగలరని అభిప్రాయపడ్డారు. ఆస్పత్రిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకే తాను వచ్చానని, అందువల్ల రాజకీయాలు మాట్లాడబోనన్నారు. ఏపీలోనూ ఇదే తరహా క్యాన్సర్ ఆస్పత్రిని త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.