నేను సీఎం అయ్యే పరిస్థితి రాదు | Chandrababu is best CM, I Can't be CM ever - Balakrishna | Sakshi
Sakshi News home page

నేను సీఎం అయ్యే పరిస్థితి రాదు

Published Tue, Jun 23 2015 2:15 AM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM

నేను సీఎం అయ్యే పరిస్థితి రాదు - Sakshi

నేను సీఎం అయ్యే పరిస్థితి రాదు

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ
* రాష్ట్రంలో ఎప్పటికీ చంద్రబాబే సీఎం

సాక్షి, హైదరాబాద్: ఏపీకి తాను ముఖ్యమంత్రిని అయ్యే పరిస్థితి రాదని హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి చైర్మన్ నంద మూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. కేన్సర్ ఆస్పత్రి వార్షికోత్సవంలో సోమవారమిక్కడ ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీకి మీరు సీఎం అవుతారని వార్తలు వస్తున్నాయి కదా? అని మీడియా ప్రశ్నించగా.. ‘పరిస్థితి అంతవరకూ రాదు.

అలాంటిదేమీ లేదు’ అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు నిరాటంకంగా అదే పదవిలో కొనసాగుతారని వెల్లడించారు. అడ్డంకులు ఎన్ని  ఎదురైనా రాష్ట్రం లో ఎప్పటికీ చంద్ర బాబే సీఎంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన అయితేనే రాష్ట్రాన్ని, పార్టీని సమర్థంగా నడపగలరని అభిప్రాయపడ్డారు. ఆస్పత్రిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకే తాను వచ్చానని, అందువల్ల రాజకీయాలు మాట్లాడబోనన్నారు. ఏపీలోనూ ఇదే తరహా క్యాన్సర్ ఆస్పత్రిని త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement