
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్ గురువారం దేశవ్యాప్తంగా స్వల్ప ఘర్షణలు, చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిందని ఈసీ వెల్లడించింది. 20 రాష్ట్రాల్లోని 91 నియోజకవర్గాల్లో జరిగిన తొలివిడత పోలింగ్‌లో పలు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం అత్యధికంగా ఉండగా, మరికొన్ని రాష్ట్రాల్లో 60 శాతం ఓటింగ్ కూడా నమోదు కాలేదు.
ఇక బిహార్‌లో కేవలం 50 శాతం పోలింగ్ నమోదవగా, త్రిపురలో అత్యధికంగా 81.80 శాతం ఓటింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు మొత్తం 25 లోక్‌సభ స్ధానాల్లో జరిగిన పోలింగ్‌లో 76.69 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణలో 60 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లో 81 శాతం పోలింగ్ నమోదైంది. యూపీలో 63.69 శాతం, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లో 56 శాతం, జమ్ము కశ్మీర్‌లో 54.49 శాతం, అసోంలో 68 శాతం, నాగాలాండ్‌లో 78 శాతం, సిక్కింలో 69 శాతం, మణిపూర్‌లో 78 శాతం, మేఘాలయాలో 67.16 శాతం, అరుణాచల్‌ప్రదేశ్‌లో 66 శాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో 70 శాతం , లక్షద్వీప్‌లో 66 శాతం పోలింగ్ నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment