percentage
-
ట్రంప్ ‘ఉక్కు’ పాదం..!
న్యూఢిల్లీ: అన్ని రకాల ఉక్కు, అల్యుమినియం దిగుమతులపై పాతిక శాతం టారిఫ్‌లు వడ్డించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచన భారత పరిశ్రమలను కలవరపరుస్తోంది. దీనితో బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం భారత్ ఉక్కు ఎగుమతుల్లో అమెరికా వాటా సుమారు అయిదు శాతం లోపు ఉంటోంది. అయినప్పటికీ భారతీయ ఉక్కు ఎగుమతిదార్లు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయడంలో కొంత సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని మూడీస్ రేటింగ్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ హుయ్ తింగ్ సిమ్ తెలిపారు. అమెరికా టారిఫ్‌ల దెబ్బతో మిగతా దేశాల్లో సరఫరా పెరిగిపోయి, భారత్ ఎగుమతులకు ప్రతికూలం కావచ్చని పేర్కొన్నారు. గత పన్నెండు నెలలుగా భారీ స్థాయిలో ఉక్కు దిగుమతులతో ధరలు, ఆదాయాలు పడిపోయి దేశీ ఉత్పత్తి సంస్థలు ఇప్పటికే సతమతమవుతున్నట్లు వివరించారు. ఇదే సమయంలో టారిఫ్‌ల వల్ల అమెరికాలోని ఉక్కు ఉత్పత్తి సంస్థలకు ప్రయోజనం చేకూరుతుందని సిమ్ చెప్పారు. అక్కడ దేశీయంగా ఉక్కుకు డిమాండ్ పెరిగి, ధరలూ పెంచుకునే అవకాశం లభిస్తుందన్నారు. సుంకాల విధింపుతో అమెరికాకు ఉక్కు ఎగుమతులు 85 శాతం మేర తగ్గిపోవచ్చని ఇండియన్ స్టీల్ అసోసియేషన్ (ఐఎస్ఏ) ప్రెసిడెంట్ నవీన్ జిందాల్ తెలిపారు. ఇలా మిగిలిపోయేదంతా, ప్రస్తుతం వాణిజ్యపరమైన ఆంక్షలు లేని అతి పెద్ద మార్కెట్లలో ఒకటైన భారత మార్కెట్లోకి వెల్లువెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు, అల్యూమినియం పరిశ్రమపై ప్రభావం గట్టిగా పడొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే భారత అల్యుమినియం ఎగుమతుల్లో అమెరికా వాటా దాదాపు 12 శాతం ఉంటుంది. గతేడాది నవంబర్ నాటికి 777 మిలియన్ డాలర్ల అల్యూమినియం ఎగుమతులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఉక్కు పరిశ్రమతో పోలిస్తే అల్యుమినియం రంగంపై టారిఫ్‌ల ఎఫెక్ట్ ఎక్కువగా ఉండనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ట్రంప్‌తో నిర్వహించబోయే సమావేశంలో టారిఫ్‌ల అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2018 వ్యూహం.. ట్రంప్ 2018 వ్యూహాన్నే మళ్లీ అమలు చేస్తే వాణిజ్యానికి సంబంధించి బేరసారాలు ఆడేందుకు దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ చెప్పారు. 2018లోనూ ట్రంప్ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నా, అప్పట్లో మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌పై పెద్దగా ప్రభావం పడలేదు. ప్రతిగా 2019లో 28 అమెరికన్ ఉత్పత్తుల దిగుమతులపై భారత్ కూడా అదనపు సుంకాలు విధించింది. 2023లో భారత్ నుంచి ఉక్కు, అల్యుమినియం దిగుమతులపై అమెరికా టారిఫ్‌లు తొలగించింది. తాజాగా టారిఫ్‌ల పెంపు అనేది అమెరికాకు అత్యధికంగా ఎగుమతి చేసే జపాన్, యూరప్ దేశాలు, కెనడా, మెక్సికోపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ సరఫరా పెరిగిపోయి, ధరలు పడిపోవడం వల్ల భారత్‌కి కూడా కాస్త ప్రతికూలంగానే ఉండొచ్చని విశ్లేషకులు తెలిపారు. ఆందోళన చెందనక్కర్లేదు: ఉక్కు శాఖఅమెరికాకు భారత్ ఉక్కు ఎగుమతులు అంతగా లేవు కాబట్టి టారిఫ్‌ల గురించి దేశీ పరిశ్రమ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ తెలిపారు. ‘గతేడాది మనం 14.5 కోట్ల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తే అందులో అమెరికాకు ఎగుమతి చేసింది చాలా తక్కువే. కాబట్టి, టారిఫ్‌ల పెంపు పెద్ద సమస్య కాబోదు‘ అని ఆయన చెప్పారు. దేశీయంగా ఉక్కు వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో డిమాండ్‌కి తగ్గట్లుగా పరిశ్రమ సరఫరా చేయలేని పరిస్థితి ఏర్పడవచ్చని వివరించారు. -
ఐదు విడతల్లో భారీగా తగ్గిన పోలింగ్
-
AP: పాలన బాగుంటే పోలింగ్ పెరుగుతుంది
సాక్షి, అమరావతి: పరిపాలన నచ్చితే ప్రజలు తమ మద్దతు ఓట్ల రూపంలో చూపిస్తారని, అందుకు అనుగుణంగానే పోలింగ్ శాతం పెరుగుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్‌కు, రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో కేసీఆర్‌కు ప్రజలు వరుసగా రెండుసార్లు అధికారం కట్టబెట్టటాన్ని ఇందుకు నిదర్శనంగా ఉదహరిస్తున్నారు. ఇప్పుడు ఏపీలోనూ అదే ట్రెండ్ కనిపిస్తోందని, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్ ప్రభుత్వానికి మరోసారి పట్టం గట్టడం ఖాయమని, అందుకనే పోలింగ్ శాతం పెరిగిందని విశే్లషిçÜ్తున్నారు. పోలింగ్ శాతం పెరగడం ప్రభుత్వంపై వ్యతిరేకతను సూచిస్తోందనే ప్రచారంలో నిజం లేదని సీనియర్ రాజకీయ నేత ఒకరు అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చితే నిస్సంకోచంగా మళ్లీ అదే ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని పేర్కొంటున్నారు.ఈ మంచి కొనసాగేలా..ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 99 శాతం హామీలను అమలు చేయడంతోపాటు పథకాలన్నీ కొనసాగిస్తామని ప్రజల్లో విశ్వాసం కల్పించడంతో పెద్ద ఎత్తున పోలింగ్‌కు తరలి వచ్చారని, ఈ మంచి కొనసాగాలని కోరుకుంటున్నారనేందుకు పోలింగ్ శాతం పెరగడమే రుజువని సీనియర్ రాజకీయవేత్తలు స్పష్టం చేస్తున్నారు. 2019లో కంటే 2024లో పోలింగ్ శాతం పెరగడం వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంగా చూడాలన్న ఆకాంక్షలకు సంకేతమని పేర్కొంటున్నారు.వైఎస్సార్ పాలనే రుజువు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2004 అసెంబ్లీ ఎన్నికల్లో 69.8 శాతం పోలింగ్‌తో దివంగత వైఎస్సార్ అధికారం చేపట్టారు. 2004 నుంచి 2009 వరకు ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఈ క్రమంలో 2009 ఎన్నికల్లో 72.7 శాతం పోలింగ్‌తో ప్రజలు మరోసారి వైఎస్సార్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు.విద్య, వైద్య రంగాలలో తొలిసారిగా పెను మార్పులు తెచ్చిన వైఎస్సార్‌కు జేజేలు పలికారు. పోలింగ్ శాతం పెరగడం వల్ల వైఎస్సార్‌కు ప్రజల మద్దతు పెరిగినట్లు స్పష్టంగా కళ్లెదుట కనిపించిన వాస్తవమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 2004కు మించి 2009లో పోలింగ్ 2.9 శాతం పెరిగింది.కేసీఆర్‌కు రెండుసార్లు అధికార పగ్గాలు..రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో 2014 ఎన్నికల్లో 69.5 శాతం పోలింగ్ నమోదు కాగా కేసీఆర్ అధికారం చేపట్టారు. కేసీఆర్ పాలన నచ్చడంతో 2018 ఎన్నికల్లో 73.2 శాతం పోలింగ్‌తో మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేశారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.సానుకూల ప్రచారంతో..ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో 79.77 శాతం పోలింగ్‌తో ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా దీవించారు. ఐదేళ్ల సీఎం జగన్ పాలన నచ్చడంతో పాటు పథకాలన్నీ కొనసాగాలని ప్రజలు కోరుకోవడంతో ఈదఫా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓట్లు వేశారని, అందుకే పోలింగ్ శాతం 81.86 శాతానికి పెరిగిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మళ్లీ సీఎంగా జగనే ఉండాలని ప్రజలు భావిస్తున్నారనేందుకు గత ఎన్నికల కంటే పోలింగ్ అదనంగా 2.09 శాతం పెరగడం సంకేతమని స్పష్టం చేస్తున్నారు. ఐదేళ్లుగా మీ బిడ్డ పాలనలో మీ ఇంటికి మంచి జరిగిందని భావిస్తే ఓటుతో ఆశీర్వదించాలని, సైనికులుగా తోడుగా నిలవాలని, పథకాలన్నీ కొనసాగాలంటే వైఎస్సార్సీపీకి ఓటు వేయాలని సీఎం జగన్ ఎన్నికల్లో సానుకూల ప్రచారం చేయడం ప్రజలకు నచ్చిందని, అందుకే ఓట్ల రూపంలో జేజేలు పలికారని సీనియర్ రాజకీయ నేత ఒకరు వ్యాఖ్యానించారు. -
నెలాఖరుకు 1% తగ్గనున్న కరోనా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఈ నెలాఖరుకు స్వల్పంగా తగ్గుముఖం పట్టే అవకాశాలున్నట్లు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (అస్కి) తాజా అధ్యయనంలో తేలింది. ఆగస్టులో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసులు, రికవరీ, మరణాల రేటు నివేదికల ను పరిశీలించి శాస్త్రీయ అంచనాలను అస్కి వెల్లడించింది. ఈ నెలాఖరుకు రాష్ట్రంలో వంద కరోనా టెస్టులు చేస్తే అందులో ఐదుగురికి అంటే సుమారు 5 శాతం పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలిపింది. అదే ఆగస్టు చివరి నాటికి వంద మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా సరాసరిన 6 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వివరించింది. అంటే ఈ నెలాఖరుకు ఒక్క శాతం మేర కోవిడ్ కేసులు తగ్గుతాయన్న మాట.. ఇక కరోనా రోగుల్లోనూ రోజువారీగా రికవరీ రేటు 70%గా నమోదయ్యే అవకాశాలున్నాయంది. వంద మంది కోవిడ్ రోగుల్లో డెత్ రేటు ఒక్క శాతం మాత్రమేనని వెల్లడించింది. సెప్టెంబర్ 7న కోవిడ్ వ్యాప్తి ఇలా..: రాష్ట్రవ్యాప్తంగా రోజువారీగా కోవిడ్ కేసుల వ్యాప్తి, రికవరీ రేటుపై వైద్య, ఆరోగ్య శాఖ ఇస్తున్న నివేదికల ఆధారంగా అస్కి నిపుణులు అధ్యయనం చేస్తున్నారు. సెప్టెంబర్ 7న కోవిడ్ పాజిటివ్ కేసుల నమోదు 6 శాతంగా నమోదైందని ఈ అధ్యయనం తేల్చిం ది. పాజిటివ్ రోగుల్లో రికవరీ రేటు 73 శాతంగా ఉందని తెలిపింది. కాగా ఈ ఏడాది నవంబర్ వరకు రాష్ట్రంలో కోవిడ్ కేసుల వ్యాప్తిపై తాము రూపొందించిన శాస్త్రీయ అంచనాలను ప్రకటిస్తామని అస్కి నిపుణుడు డాక్టర్ సస్వత్ కుమార్ మిశ్రా ‘సాక్షి’కి తెలిపారు. ఇక సెప్టెంబర్ తొలివారంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. ఆ రెండు జిల్లాల్లోనే ఎక్కువ: సెప్టెంబర్ తొలివారం నాటికి కోవిడ్ కేసు ల నమోదులో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలే అగ్రభాగాన నిలిచినట్లు అస్కి అధ్యయనం వెల్లడించింది. హైదరాబాద్‌లో మొత్తం జనాభాలో 1.3% మంది, రంగారెడ్డి జిల్లాలో 1% మందికి వైరస్ సోకినట్లు తెలి పింది. తర్వాత స్థానాల్లో మేడ్చల్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాలు నిలిచాయి. ములుగు జిల్లాలో అతి తక్కువ కేసులు నమోదైనట్లు పేర్కొంది. -
వేతనాల్లో శాతాల వారీ కోత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలలో కోత విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడంపై ఆర్థిక శాఖ మంగళవారం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల పూర్తి వేతనాన్ని శాతాల వారీగా వాయిదా వేయనున్నారు. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. జీవో నం. 27లో పేర్కొన్న విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు మార్చికి సంబంధించి ఏప్రిల్‌లో రావాల్సిన పూర్తి వేతనంలో కోత విధించనున్నారు. ఈ కోత వాయిదా మాత్రమేనని, ప్రభుత్వం నిర్ణయించిన విధంగా వేతన వ్యత్యాసాన్ని వాయిదా రూపంలో అమలు చేయాలని స్పష్టం చేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన జీతాల బిల్లులు ఈ పాటికే ఈ కుబేర్‌లో సమర్పించి ఉంటే ఈ వ్యత్యాసాన్ని ఐఎఫ్ఎంఐఎస్ ద్వారా వర్తింపజేయాలని, ఇప్పటివరకు సమర్పించని బిల్లులను జీవోలో పేర్కొన్న వ్యత్యాసాన్ని వర్తింపజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనంలో 10% వేతనాన్ని వాయిదా వేయాలని, హోంగార్డులు, అంగన్వాడీ కార్యకర్తలు/హెల్పర్లు, వీఆర్ఏలు, విద్యావాలంటీర్లు తదితరులకిచ్చే గౌరవ వేతనానికీ ఈ వాయిదా వర్తిస్తుందన్నారు. నాలుగో తరగతి పెన్షనర్లకు 10%, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల పింఛన్లో 50%, అఖిల భారత సర్వీసు ఉద్యోగుల పింఛన్లో 60% వాయిదా వేయాలన్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల వేతనాలకు సంబంధించి ఇప్పటికే జారీ చేసిన బిల్లులు, చెక్కులను వెనక్కు తీసుకోవాలని, ప్రభుత్వ నిర్ణయం ప్రకారం వ్యత్యాసాన్ని వర్తింపజేసి వేతనాన్ని వాయిదా వేయాలని, ఆ మేరకు మళ్లీ బిల్లులు, చెక్కులు మంజూరు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. -
ఐడీబీఐ బ్యాంక్ షేరు జోరు
బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు పతనంకాగా.. ఐడీబీఐ బ్యాంక్ కౌంటర్‌కు మాత్రం డిమాండ్ పెరిగింది. బ్యాంకులో మిగిలిన వాటాను విక్రయించనున్నట్లు బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించడంతో ఈ షేరు 10 శాతం దూసుకెళ్లింది. బీఎస్ఈలో శనివారం ఐడీబీఐ బ్యాంకు షేరు రూ. 3.4 ఎగసి రూ. 37.30 వద్ద ముగిసింది. ప్రమోటర్‌గా ప్రభుత్వం ఐడీబీఐ బ్యాంకులో 46.5 శాతం వాటాను కలిగి ఉంది. ఎల్ఐసీకి 51 శాతం వాటా ఉంది. గత సెప్టెంబర్‌లో ఎల్ఐసీ, ప్రభుత్వం సంయుక్తంగా బ్యాంకులో రూ. 9300 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. బ్యాంకు పెట్టుబడి అవసరాలకు తదుపరి ఎల్ఐసీ మరో రూ. 4743 కోట్లను పంప్చేసింది. కాగా.. ప్రభుత్వం స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా ఐడీబీఐ బ్యాంకులో వాటాను విక్రయించేందుకు నిర్ణయించుకున్నట్లు తాజాగా వెల్లడించింది. -
విస్తీర్ణం తగ్గింది
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రధాన నగరాల్లో 2014లో అపార్ట్మెంట్ సగటు విస్తీర్ణం 1,400 చ.అ.గా ఉండేది. కానీ, 2019 నాటికది 1,020 చ.అ.లకు తగ్గింది. అత్యధికంగా ముంబైలో ఫ్లాట్ల సైజ్లు 45 శాతం మేర తగ్గిపోయాయి. 2014లో ఇక్కడ ప్రాపర్టీల సగటు విస్తీర్ణం 960 చ.అ. కాగా.. ఇప్పుడది 530 చ.అ. పడిపోయింది. పుణేలో అయితే క్షీణత 38 శాతంగా ఉంది. ప్రస్తుతమిక్కడ సగటు విస్తీర్ణం 600 చ.అ.లుగా ఉంది. ఇక, ఎన్సీఆర్లో 6 శాతం క్షీణతతో 1,390 చ.అ.లకు, బెంగళూరులో 9 శాతం క్షీణించి 1,300 చ.అ.లకు, చెన్నైలో 8 శాతం క్షీణతతో అపార్ట్మెంట్ సగటు సైజ్ 1,190 చ.అ.లకు చేరింది. హైదరాబాద్‌లో సగటు అపార్ట్మెంట్ విస్తీర్ణం 1,570 చ.అ.లుగా ఉంది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే ఇదే అతిపెద్ద విస్తీర్ణం. ఐదేళ్ల క్రితం కోల్‌కతాలో ఫ్లాట్ సైజ్ 1,230 చ.అ.లుగా ఉండేది. ఇప్పుడక్కడ సగటు విస్తీర్ణం 9 శాతం క్షీణించి 1,120 చ.అ.లుగా ఉంది. విభాగాల వారీగా విస్తీర్ణం ఎంత తగ్గిందంటే.. రూ.40 లక్షల లోపు ధర ఉన్న అందుబాటు గృహాల విస్తీర్ణం ఐదేళ్లలో 28 శాతం తగ్గాయి. 2014లో 750 చ.అ.లుగా ఉన్న అఫడబుల్ హౌజ్ సైజ్లు 2019 నాటికి 540 చ.అ.లకు తగ్గిపోయాయి. రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల మధ్య ధర ఉన్న మధ్యస్థాయి గృహాల విస్తీర్ణం 17 శాతం తగ్గాయి. 2014లో 1,150 చ.అ.లు కాగా.. ఇప్పుడవి 950 చ.అ.లకు క్షీణించాయి. రూ.80 లక్షల నుంచి రూ.1.25 కోట్ల ధర ఉన్న ప్రీమియం హోమ్స్ విస్తీర్ణం 21 శాతం తగ్గాయి. 2014లో 1,450 చ.అ.లుండగా.. ఇప్పుడవి 1,140 చ.అ.లకు తగ్గిపోయాయి. రూ.1.5 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల ధర ఉన్న లగ్జరీ గృహాల సైజ్ 18 శాతం క్షీణించాయి. 1,640 చ.అ. నుంచి 1,350 చ.అ.లకు తగ్గాయి. రూ.2.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉండే అల్ట్రా లగ్జరీ గృహాల విస్తీర్ణం 8 శాతం తగ్గాయి. ఐదేళ్ల క్రితం ఆయా ఫ్లాట్ల సైజ్ సగటు 2,400 చ.అ.లు ఉండగా.. ఇప్పుడవి 2,200 చ.అ.లకు తగ్గిపోయాయి. తక్కువ విస్తీర్ణం గృహాలకే డిమాండ్.. ప్రధాన నగరాల్లో అందుబాటు గృహాలకు డిమాండ్ పెరగడమే అపార్ట్మెంట్ల విస్తీర్ణం తగ్గడానికి ప్రధాన కారణమని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్ అనూజ్ పూరీ తెలిపారు. అఫడబుల్ హౌసింగ్‌కు ప్రభుత్వం రాయితీలు ఇస్తుండటంతో కొనుగోలుదారులు ఈ గృహాల వైపే మొగ్గుచూపుతున్నారన్నారు. అయితే ఆయా అఫడబుల్ గృహాలు రూ.45 లక్షల లోపు ధర 850 చ.అ. బిల్టప్ ఏరియాను మించకూడదు. అప్పుడే ప్రభుత్వం నుంచి రాయితీలు అందుతాయి. అంతేకాకుండా అఫడబుల్ గృహాలకు జీఎస్టీ కూడా తక్కువే. ఇతర గృహాలకు జీఎస్టీ 5 శాతం ఉంటే అఫడబుల్ ప్రాజెక్ట్‌లకు ఒక్క శాతమే ఉంది. -
రాష్ట్రాల వారీగా పోలింగ్ ఇలా..
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్ గురువారం దేశవ్యాప్తంగా స్వల్ప ఘర్షణలు, చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసిందని ఈసీ వెల్లడించింది. 20 రాష్ట్రాల్లోని 91 నియోజకవర్గాల్లో జరిగిన తొలివిడత పోలింగ్‌లో పలు రాష్ట్రాల్లో ఓటింగ్ శాతం అత్యధికంగా ఉండగా, మరికొన్ని రాష్ట్రాల్లో 60 శాతం ఓటింగ్ కూడా నమోదు కాలేదు. ఇక బిహార్‌లో కేవలం 50 శాతం పోలింగ్ నమోదవగా, త్రిపురలో అత్యధికంగా 81.80 శాతం ఓటింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు మొత్తం 25 లోక్‌సభ స్ధానాల్లో జరిగిన పోలింగ్‌లో 76.69 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణలో 60 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమ బెంగాల్లో 81 శాతం పోలింగ్ నమోదైంది. యూపీలో 63.69 శాతం, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లో 56 శాతం, జమ్ము కశ్మీర్లో 54.49 శాతం, అసోంలో 68 శాతం, నాగాలాండ్‌లో 78 శాతం, సిక్కింలో 69 శాతం, మణిపూర్‌లో 78 శాతం, మేఘాలయాలో 67.16 శాతం, అరుణాచల్‌ప్రదేశ్‌లో 66 శాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో 70 శాతం , లక్షద్వీప్‌లో 66 శాతం పోలింగ్ నమోదైంది. -
పర్సంటేజీ పేచీ
ముఖ్యనేత కాసుల వేట అందుకోసం చిల్లర వేషాలు రూ.కోటిన్నర రోడ్డుకు మోకాలడ్డు వేలాదిమందికి ఇబ్బందులు ‘ప్రజా సంక్షేమానికి పాటుపడే నాయకులు ఒకప్పుడుండేవారట!’ అనే రోజులు వచ్చేసేలాఉన్నాయి. ప్రజలెలా పోతే నాకేంటి? నాకు రావాల్సిన పర్సంటేజీ వస్తే చాలనుకుంటున్న నేతలే టీడీపీ హయాంలో ఎక్కువగా కనిపిస్తున్నారు. కోనసీమ కేంద్రమైన అమలాపురంలో ఓ నియోజకవర్గ నేత తీరు ఇలాగే ఉంది. పర్సంటేజీలు లేకుండా ఏ పనైనా చేసేది లేదంటూ తెగేసి చెబుతూండడంతో సహచర నేతలే నివ్వెరపోతున్నారు. సాక్షి ప్రతినిధి, కాకినాడ : అమలాపురం శివారు ఇందుపల్లి వంతెన నుంచి భట్లపాలెం మీదుగా అమలాపురం ఎత్తు రోడ్డు వరకూ రెండు కిలోమీటర్ల పంచాయతీరాజ్ రహదారి ఉంది. ఆ రోడ్డుపై నిత్యం పది పన్నెండు వేల మంది ప్రయాణిస్తుంటారు. వీరిలో కళాశాలలు, పాఠశాలల విద్యార్థులే 3 వేల మంది పైగా ఉంటారు. ట్రాఫిక్ రద్దీ ఉండే అమలాపురం పట్టణంలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా.. అల్లవరం మండలం బోడసకుర్రు, సామంతకుర్రు, డి.రావులపాలెం, దేవగుప్తం, పేరూరు, పాశర్లపూడి నుంచి వచ్చేవారు ఇందుపల్లి మీదుగా అంబాజీపేట, పి.గన్నవరం, రావులపాలెం తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు ఇది బాగా దగ్గర మార్గం. ఈ రోడ్డులో వెళ్తే మూడు కిలోమీటర్ల దూరం కూడా కలిసి వస్తుంది. ఇంత ముఖ్యమైన ఈ రోడ్డుకు పెద్ద పెద్ద గోతులు పడి, రాళ్లు పైకి లేచిపోవడంతో ప్రజలు మూడున్నరేళ్లుగా నిత్యం నరకం చవి చూస్తున్నారు. పదేపదే విజ్ఞప్తులు చేయగా.. రెండేళ్ల క్రితం ఈ రోడ్డు మరమ్మతుల కోసం జెడ్పీ నుంచి రూ.5 లక్షలు ఇచ్చారు. మరమ్మతులు చేశారు. మళ్లీ మామూలే అయిపోయింది. గోదావరి పుష్కరాల మిగులు నిధుల నుంచి ఈ రోడ్డు ఆధునికీకరణ కోసం మూడు నెలల క్రితం రూ.1.50 కోట్లు కేటాయించారు. ఈ విషయం తెలిసి ఆ రోడ్డులో ప్రయాణించేవారు చాలా సంతోషించారు. ఈ రోడ్డుకు మహర్దశ పడుతుందని గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. రోడ్డు పనులకు ఆన్లైన్ టెండర్లు కూడా పిలిచారు. రావులపాలేనికి చెందిన కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నారు. ఇక పనులు మొదలవుతాయని ఎదురు చూస్తున్న తరుణంలో నియోజకవర్గ ముఖ్య నేత ఒకరు ఆ రోడ్డుపై చిల్లర ఏరుకునేందుకు సిద్ధమయ్యారు. పర్సంటేజీ విషయంలో పేచీ మొదలు పెట్టారు. దీంతో రోడ్డు ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన అర్ధాంతరంగా నిలిచిపోయింది. సాధారణంగా ఇటువంటి అభివృద్ధి పనులు చేపట్టేటప్పుడు ఆన్లైన్ టెండర్లయితే ఆ ప్రాంతానికి చెందిన ముఖ్య నేతకు 2 శాతం పర్సంటేజీ ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నదే. కానీ ఆ నియోజకవర్గ ముఖ్యనేత అందరి మాదిరిగా 2 శాతం కుదరదంటూ డీల్‌కు అంగీకరించలేదని సమాచారం. 2 శాతం పర్సంటేజీ అంటే రూ.3 లక్షలివ్వాలి. దీనికి మరో రూ.లక్ష వేసి రూ.4 లక్షలు ఇస్తామని ఆ నేత వద్దకు రెండో దఫా ప్రతిపాదన రాగా తిరస్కరించారు. కాయగూరల బేరంలా ఇటువంటివేమీ కుదరవని, ఇస్తే రూ.8 లక్షలు ఇవ్వాలని, లేకుంటే తనకు ముఖం చూపించవద్దని ఆ నేత కేకలు వేసి పంపించేశారని చెబుతున్నారు. ఆందోళన చేస్తే కేసులంటూ బెదిరింపులు ఈ పరిస్థితుల్లో ని««దlులు సిద్ధంగా ఉన్నా పనులు ముందుకు కదలకపోవడంతో ఆగ్రహించిన స్థానికులు ఇటీవల మూడు గంటలపాటు ఆందోళన చేశారు. వారికి సంఘీభావంగా ఆ రోడ్డుపై నిత్యం ప్రయాణిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న బీవీసీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు సైతం ధర్నాలో పాల్గొన్నారు. ఈ ఆందోళన ఆ నేతకు ఎంతమాత్రం రుచించలేదు. ఆందోళన చేసిన స్థానికులతోపాటు కాలేజీ విద్యార్థులపై కూడా కేసులు నమోదు చేయాలని అమలాపురం పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి తన అక్కసు వెళ్లగక్కారు. ఇప్పటికీ విద్యార్థులపై కేసులు పెట్టమంటున్నారని తెలిసింది. పనుల శంకుస్థాపన జరగకపోవడానికి ఆ నేతకు పర్సంటేజీ పేచీయే కారణం కాగా, పైకి మాత్రం ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు డేట్లు సర్దుబాటు కావడం లేదనే కుంటిసాకులు చెబుతున్నారు. -
‘హలో వన్ సీ ఉంది.. పర్సంటేజ్ ఎంత?’
-
‘హలో వన్ సీ ఉంది.. పర్సంటేజ్ ఎంత?’
రూ. 2 వేల నోట్లు ఇస్తారా లేక రూ.100 నోట్లా.. ఆర్మూర్‌లో జోరుగా కమీషన్ వ్యాపారం ఆర్మూర్అర్బన్: ‘‘హలో నా పార్టీ దగ్గర వన్ సీ (రూ.కోటి) బ్లాక్‌మనీ ఉంది.. వైట్ చేయడానికి ఎంత పర్సంటేజ్ తీసుకుంటావు. నాకు ఎంత కమీషన్ ఇస్తావు..? నాతో కలుపుకొని ఇంకా ముగ్గురం ఉన్నాం. అందరం సంతృప్తి అయ్యేలా సెటిల్ చేయ్’’ ఇదీ ప్రస్తుతం కొద్ది రోజులుగా పెద్ద నోట్లపై నడుస్తున్న పర్సంటేజీల దందా. కేంద్ర ప్రభుత్వం నల్లధనాన్ని అరికట్టడానికి ఈ నెల 8న రూ.500, 1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసేంద. దీంతో ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు ఆర్మూర్ ప్రాంతంలో పర్సంటేజీల దందాకు తెర లేపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాగే బ్లాక్‌మనీని వైట్ చేయడానికి బ్రోకర్ల అవతారమెత్తారు. ఎవరినీ చూసిన ఫోన్ పట్టుకుని గంటల తరబడి ఇవే లావాదేవీల గురించి చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం రూ.లక్ష బ్లాక్ మనీని వైట్ చైయడానికి బ్రోకర్లు 20-30 శాతం వరకు ఆశిస్తున్నట్లు సమాచారం. అంటే రూ.లక్ష వైట్ కావాలంటే రూ.80 వేలు మిగులుతారుు. అరుుతే, ప్రభుత్వం కొన్నింటికి మినహారుుంపు ఇవ్వడంతో లావాదేవీలు ఫోన్ల వరకే పరిమితమయ్యాయని, ఎక్కడా సెటిల్మెంట్ జరగలేదని చెబుతున్నారు. ఈ గడువు గురువారం ముగియడంతో ఇక నల్లధనం పెద్ద మొత్తంలో బయటకు వస్తుందంటున్నారు. పెరిగిన బంగారం ధర.. పెద్ద నోట్లు రద్దు కావడంతో పేరుకుపోరుున నల్లధనాన్ని మార్చుకోవడానికి బడా వ్యాపారులు నానా తంటాలు పడుతున్నట్లు సమాచారం. ఎక్కువ ధర పెట్టిన బంగారం కొంటుండడంతో దాని ధర పెరిగిపోరుుంది. నోట్ల రద్దుతో భవిష్యత్తులో స్థిరాస్తుల విలువ పడిపోయే అవకాశం ఉందని కొందరు తమ ఇళ్ల స్థలాలు ఇప్పుడున్న ధరలకు విక్రరుుస్తున్నట్లు సమాచారం. నల్లధనం ఉన్న కొంత మంది పెద్ద మనుషులు స్థలాలను కొనుగోలు చేస్తూ స్థిరాస్తులుగా మార్చుకుంటున్నారు. స్థిరాస్తుల వ్యాపారంలో లావాదేవీలు జరిగిన పెద్ద నోట్లను చివరకు కొంత మంది జీరో అకౌంట్లలో పరిమితి వరకు జమ చేస్తున్నట్లు సమాచారం. జమ చేసే సమయంలో ఆరు నుంచి 12 నెలల వరకు వడ్డీ లేకుండా డబ్బులను వాడుకోవచ్చని ఎర వేస్తున్నట్లు తెలిసింది. కరెన్సీ మార్పిడి కోసం బ్యాంకు ఎదుట ఆందోళన రుద్రూర్ : రద్దరుున నోట్ల మార్పిడికి గురువారం చివరి రోజు కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో బ్యాంకులకు పోటెత్తారు. దీంతో బ్యాంకులన్నీ కిటకిటలాడారుు. అరుుతే, రుద్రూర్ సిండికేట్ బ్యాంకులో డబ్బు ఇవ్వకపోవడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. చివరి రోజు కావడంతో ఖాతాదారులు పెద్ద సంఖ్యలో బ్యాంకుకు వచ్చారు. అరుుతే, బ్యాంకర్లు గంటలోపే విత్ డ్రాలను నిలిపివేయడంతో ఖాతాదారులు అసహనానికి గురయ్యారు. కరెన్సీ మార్పిడి చేసివ్వాలని ఆందోళన చేపట్టారు. సమాచారమందుకున్న పోలీసులు.. హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఖాతాదారులతో మాట్లాడి పరిస్థితి చక్కదిద్దారు. -
వాటా కోసమే దాడులు
♦ రైల్వే ఉన్నతాధికారుల విచారణలో నిర్ధారణ ♦ 25 శాతం పర్సంటేజీ కోసం కోడెల ‘పెదబాబు’ పట్టు సాక్షి, అమరావతి : నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనుల్లో 25 శాతం పర్సంటేజీ కోసమే స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు ‘పెదబాబు’ దాడులు జరుపుతున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. పర్సంటేజీల పర్వానికి సంబంధించి ఉన్నత స్థాయిలో పంచాయితీ జరిగినా కోడెల కుమారుడు పెడచెవిన పెట్టి వరుస దాడులకు తెగబడుతున్న సంగతి తెల్సిందే. తాను అడిగిన వాటా ఇవ్వకుండా పనులు సాగిస్తుండటంపై పెదబాబు అనుచరులు రైల్వే అధికారులు, కూలీలపై రెండో మారు దాడులకు తెగబడ్డారని రైల్వే ఉన్నతాధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. రైల్వే శాఖ ఈ దాడి ఘటనను సీరియస్‌గా తీసుకోవడంతో స్పీకర్ కుమారుడికి చిక్కులు తప్పవని తెలుస్తోంది. రైల్వే కూలీలు, సిబ్బందిపై దాడులు జరిగిన తర్వాత రైల్వే ఉన్నతాధికారులు ఓ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనుల దాడుల ఘటనను రైల్వే ఉన్నతాధికారులు మంగళవారం విజయవాడకు వచ్చిన కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు దృష్టికి తీసుకెళ్లారు. జరిగిన ఘటనపై క్షేత్ర స్థాయికి వెళ్లి విచారించాలని రైల్వే జీఎంను మంత్రి సురేశ్ ప్రభు ఆదేశించినట్లు సమాచారం. -
పర్సంటేజ్ ఫీజును తగ్గించాలి
గుంటూరు (నెహ్రూనగర్) : రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ పర్సంటేజ్ పెంచి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేసే విధంగా చర్యలు తీసుకుంటోందని, ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ‘అప్రెడా’ గుంటూరు చాప్టర్ అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతిరావు డిమాండ్ చేశారు. నగరంలో ఆదివారం జరిగిన విలే కర్ల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 6.5 శాతంగా ఉన్న రిజిస్ట్రేషన్ పర్సంటేజ్ ఫీజును టీడీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక 7.5 శాతానికి పెంచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి కీలకంగా ఉన్న నిర్మాణ రంగానికి రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లిస్తూనే మరో పక్క వ్యాట్, జీఎస్టీ, లేబర్ ట్యాక్స్‌లు చెల్లిస్తున్నా అదనంగా 35 శాతం ఫీజులు చెల్లించాలని ప్రభుత్వం ప్రకటించడం సామాన్యుడిపై భారం మోపడమేనన్నారు. ఇలాంటి నిర్ణయాల వలన పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలకు నిర్మాణ రంగం అనుకూలంగా మారుతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని పరిశీలించి నిర్మాణ రంగాన్ని ఆదుకొవాలని కోరారు. ఈ సమావేశంలో అప్రెడా సభ్యులు సిద్ధవరపు మధుసూదనరెడ్డి, మామిడి సీతారామయ్య, మద్దిరాల సాంబశివరావు, చుక్కపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్ పర్సంటేజ్ ఫీజును తగ్గించాలి
గుంటూరు (నెహ్రూనగర్) : రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ పర్సంటేజ్ పెంచి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేసే విధంగా చర్యలు తీసుకుంటోందని, ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ‘అప్రెడా’ గుంటూరు చాప్టర్ అధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతిరావు డిమాండ్ చేశారు. నగరంలో ఆదివారం జరిగిన విలే కర్ల సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 6.5 శాతంగా ఉన్న రిజిస్ట్రేషన్ పర్సంటేజ్ ఫీజును టీడీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక 7.5 శాతానికి పెంచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి కీలకంగా ఉన్న నిర్మాణ రంగానికి రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లిస్తూనే మరో పక్క వ్యాట్, జీఎస్టీ, లేబర్ ట్యాక్స్‌లు చెల్లిస్తున్నా అదనంగా 35 శాతం ఫీజులు చెల్లించాలని ప్రభుత్వం ప్రకటించడం సామాన్యుడిపై భారం మోపడమేనన్నారు. ఇలాంటి నిర్ణయాల వలన పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకలకు నిర్మాణ రంగం అనుకూలంగా మారుతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని పరిశీలించి నిర్మాణ రంగాన్ని ఆదుకొవాలని కోరారు. ఈ సమావేశంలో అప్రెడా సభ్యులు సిద్ధవరపు మధుసూదనరెడ్డి, మామిడి సీతారామయ్య, మద్దిరాల సాంబశివరావు, చుక్కపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
నవ్విపోదురుగాక..!
♦ కాసులవర్షం కురిపిస్తున్న నీరు-చెట్టు పథకం ♦ వాగుల్లో పూడికతీత పనులకు ఎగబడుతున్న నేతలు ♦ రూ.5లక్షల్లోపు పనులు నామినేషన్‌పై కేటాయింపు ♦ 15శాతం మొత్తంతో పనులు ముగిస్తున్న వైనం ♦ మిగతా దాంట్లో అధికారులకు 30శాతం పర్సంటేజీ సాక్షి ప్రతినిధి, కడప: నవ్విపోదురుగాక...నాకేటి సిగ్గు అన్నట్లుగా అధికారపార్టీ నేతలు, అధికారులు కుమ్మక్కై నీరు-చెట్టు పథకాన్ని దోచుకుంటున్నారు. కాంట్రాక్టర్లకు కాసులవర్షం కురిపించడమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి. భూగర్భజల సంరక్షణ చర్యలు అటుంచితే, పైసల కోసమే పనులు చేస్తున్నట్లుగా తేటతెల్లమౌతోంది. నీరు-చెట్టు పనుల ద్వారా కాస్తయిన ప్రయోజనం ఉండేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ కాంట్రాక్టర్ల కోసమే పనులు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. బుగ్గవంక మధ్యలో చేసిన పనులే ఇందుకు నిదర్శనం. చట్టానికి లోబడే పాలకపక్షం తెలివిగా జేబులు నింపుకొంటున్న వైనమిది. కడప నగరంలో బుగ్గవంక గురించి తెలియని వారుండరు. కడపను రెండు భాగాలుగా ఆ వంక చీల్చింది. గతంలోనే బుగ్గవంక సుందరీకరణ పనులు చేపట్టారు. ఆ కారణంగా ప్రస్తుతం 80 మీటర్లు నుంచి 100 మీటర్లు వెడల్పుతో వంక విస్తరించి ఉంది. ఈ వంకపై తమ్ముళ్ల కన్నుపడింది. వంక మధ్యలో నీరు-చెట్టు పనులు మొదలుపెట్టారు. భూగర్భ జలసంరక్షణ చర్యలు చేపట్టే క్రమంలో ప్రభుత్వం ఆ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే తెలుగుతమ్ముళ్లు ‘నీరు-చెట్టు’ పథకాన్ని కల్పతరువుగా మల్చుకుంటున్నారు. వారికి అధికారులు పక్కాగా సహకరిస్తున్నారు. వంద మీటర్లు వెడల్పు ఉన్న బుగ్గవంక మధ్యలో ఓ కాలువ తీస్తూ ప్రజాధనం లూఠీ చేస్తున్నారు. ఇదివరకే జమ్ముతో పేరుకుపోయిన ప్రాంతాన్ని జేసీబీతో బాగుచేయడం, కాలువగా రూపురేఖలు తేవడంతో పనిముగుస్తోంది. అయితే తూతూమంత్రపు వ్యవహారం కోసం దాదాపు రూ.69 లక్షలు ఖర్చుపెట్టి బుగ్గవంకలో తొలివిడతగా పనులు చేపట్టారు. నామినేషన్‌పై చేజిక్కించుకుంటూ.. నీరు-చెట్టు పనులను అధిక శాతం నామినేషన్‌పై తెలుగుతమ్ముళ్లకు అప్పగిస్తున్నారు. రూ.5 లక్షలు వరకూ నామినేషన్‌పై కేటాయిస్తూ పనులు సంఖ్యను పెంచుతున్నారు. ఈక్రమంలో చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు పడుతునే కాంట్రాక్టర్లకు నాలుగు రూకలు మిగిలిస్తూ తద్వారా లబ్ధి పొందేందుకు అధికారులు యత్నిస్తున్నారు. రూ.5లక్షల పనిని జెసీబీ ద్వారా రూ.75వేలతో కాంట్రాక్టర్ పూర్తిచేస్తున్నారు. తక్కిన మొత్తం అటు అధికారులకు 30శాతం పర్శేంటేజీలకు, ఇటు కాంట్రాక్టర్లు జేబుల్లోకి వెళ్తుతోంది. మునుపెన్నడూ ఇంతటి అధ్వానపు పనులు చేపట్టలేదని ప్రజలు వాపోతున్నారు. వర్షమొస్తే బుగ్గవంకలో నిలిచి ఉన్న నీర ంతా కొట్టుకుపోతుంది. అలాంటిది నిలిచిన నీటిని తరలించే క్రమంలో బుగ్గవంకలో ప్రత్యేక కాలువ ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవానికి దిగువ వైపు నుంచి పనులు చేస్తే కనీసం నిలిచిన నీరైనా వెళ్లిపోయేది. ఎర్రముక్కపల్లె ఎగువ భాగాన నీరు నిలిచే అవకాశమే లేదు. అలాంటి చోట కాలువ తీయడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. రవీంద్రనగర్ దిగువన పనులు చేసిఉంటే మురికి నీరు నిల్వ లేకుండా వెళ్లిపోయి, కాస్తయిన ప్రయోజనం ఉండేదని స్థానికులు పేర్కొంటున్నారు కొనసాగుతోన్న దోపిడీ.... జిల్లాలో 1,776 పనులు రూ.100 కోట్లతో నీరు-చెట్టు కింద ప్రస్తుతం పనులు చేపడుతున్నారు. ఇప్పటికే 536 పనులు పూర్తయ్యాయి. పేరుకే జలసంరక్షణ పనులు, నాయకుల దోపిడీకే అధిక ప్రాధాన్యం దక్కుతోంది. నాడు కాంగ్రెస్ పార్టీ నేతలుగా మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సాన్నిహిత్యంతో లబ్ధి పొంది, నేడుటీడీపీ నేతలుగా కొనసాగుతోన్న ఆ సోదరులు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. వారి కనుసన్నల్లోనే నీరు-చెట్టు దోపిడీ సాగుతున్నట్లు సమాచారం. అధికారులు వారి సిఫార్సులకు తలొగ్గి ఇష్టానుసారంగా పనులు కేటాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలుగు తమ్ముళ్ల జేబులు నింపేందుకే... బుగ్గవంకలో తీసే మధ్య కాలువ తమ్ము ళ్ల జేబులు నింపేందుకే. ఎక్కడైన చెరువులు, కుంటల్లో పూడిక తొలగిస్తే ఉపయోగం ఉంటుంది. ఎందుకు పనిరాని పనులు చేస్తూ కోట్లు దోపిడీ చేయడం దారుణం. ఆ నిధులను బుగ్గవంక సైడుగోడల కోసం ఖర్చుపెడితే కొంతవరకన్నా మేలు చేకూరేది. బుగ్గవంకలోని గుర్రపు డెక్క తొలగింపు చేయాల్సిన పనిలేదు. వర్షం వస్తే ఆ నీళ్లకు కొట్టుకుపోతుంది. ఇలా నిధులు స్వాహా చేస్తుంటే అధికారులు నిద్రపోతున్నారా? అని ప్రశ్నిస్తున్నాం. - జి చంద్ర, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఇది దోపిడీ పథకం నీరు-చెట్టు పూర్తిగా దోపిడీ పథకం. దీ నిని టీడీపీ నేతలే తప్పుబడుతున్నారు. బుగ్గవంకలో పూడికతీయాలని సీపీఎం తరపున పోరాటాలు చేస్తే స్పందించని అధికారులు, ఇలా నిధులు దండుకునేం దుకు అనుమత్విడంలోని మతలబు ఏమి టో అర్థం కావడంలేదు. గుర్రపు డెక్క తొలగింపునకు కోట్లు ఖర్చుచేస్తారా? ఈ నిధులు మరొకదానికి ఖర్చు చేసి ఉంటే ప్రయోజనం ఉండేది. ప్రజాధనం దుబారా తప్ప ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడని కార్యక్రమం. - ఒ శివశంకర్, నగర కార్యదర్శి,సీపీఎం తాత్కాలిక పనుల వల్ల ఒరిగేది శూన్యం... బుగ్గవంకలో నీరు-చెట్టు కింద చేసే తాత్కాలిక పనుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. తెలుగు తమ్ముళ్ల జేబులు నింపడానికే ఈ పనులు చేస్తున్నారు తప్పా ప్రజలకు ఉపయోగం లేదు. మళ్లీ నీళ్లు వచ్చి చెత్తాచెదారం పేరుకుపోతుంది. చెరువుల్లో పూడికతీసి, ఆనకట్టలను అభివృద్ధి చేస్తే భూగర్భజలాలు పెరుగుతాయి. చెరువుల్లో తవ్విన మట్టిని కూడా టీడీపీ నాయకులు అమ్ముకోవడం దారుణం. - బి. నిత్యానందరెడ్డి, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు. -
మంత్రులే కమీషన్లు అడుగుతున్నారు
సీఎం ముందు వాపోయిన స్వపక్ష ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోని పనులకు కూడా ఇవ్వాలంటా! పర్సెంటేజ్‌లు నిర్ణయించి మరీ డిమాండ్ చేస్తున్నారు రామనాథ్ రై వైఖరిపై ఎమ్మెల్యే శకుంతలా శెట్టి కన్నీరు సువర్ణసౌధ సాక్షిగా కాంగ్రెస్ పార్టీలో బయటపడ్డ లుకలుకలు బెంగళూరు : అధికార పార్టీ, మంత్రులపై ప్రతిపక్షాలు విమర్శలు, ఆరోపణలు చేయడం సహజం. అయితే మంత్రులపై సొంత పార్టీ ఎమ్మెల్యేలే విమర్శలు గుప్పించడం అరుదు. ఈ విషయంలో కాంగ్రెస్ టాప్‌ని చెప్పవచ్చు. ఈ విషయం మరోసారి రుజువైంది. ‘మా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి కూడా మంత్రులు కమీషన్లు అడుగుతున్నారు. కొందరైతే ఏకంగా పర్సెంటేజ్‌లు నిర్ణయించి మరీ కమీషన్లు అడుగుతున్నారు. అంతేకాదు అధికారుల బదిలీలు, నిధుల విడుదల ఇలా అన్ని విషయాల్లోనూ మంత్రులకు కమీషన్లు చెల్లించాల్సి వస్తోంది. ఇక మా నియోజకవర్గ పరిధిలోని కార్యక్రమాల్లో కూడా ఎక్కువగా మంత్రులే కలగజేసుకుంటుంటే ఇక మేమెందుకు?’ అని బెళగావిలోని సువర్ణసౌధలో బుధవారం నిర్వహించిన కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ముందు వాపోయారు. బెళగావిలో జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు గాను బుధవారం కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశాన్ని (సీఎల్పీ) ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న అనేక మంది ఎమ్మెల్యేలు మంత్రుల వైఖరిపై తమకు ఉన్న అసంతృప్తిని వెళ్లగక్కారు. ఇక ఈ సందర్భంలో ఎమ్మెల్యే సోమశేఖర్ మంత్రుల పనితీరుపై భగ్గుమన్నట్లు సమాచారం. ‘ఈ మంత్రులకు కాంగ్రెస్ సంస్కృతి తెలియడం లేదు. అందుకే వీరికి కాస్తంత కాంగ్రెస్ సంస్కృతి నేర్పండి. ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయడం నేర్పండి’ అని పేర్కొన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక మరో ఎమ్మెల్యే మాలికయ్య గుత్తేదార్ కూడా మంత్రుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘ప్రభుత్వ ఇంజిన్(సీఎం) బాగానే ఉంది. అయితే ఇందులోని కొన్ని పెట్టెలు(మంత్రులు) సరిగా పనిచేయడం లేదు. వీటిని మార్చేంతవరకు ప్రభుత్వానికి మంచి పేరు రాదు’ అని పేర్కొన్నట్లు తెలుస్తోంది. కన్నీరుపెట్టిన శకుంతలా శెట్టి... ఇక శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యే శకుంతలా శెట్టి కన్నీరుపెట్టినట్లు సమాచారం. ‘నా నియోజకవర్గ పరిధిలోని అన్ని విషయాల్లోనూ మంత్రి రామనాథ్ రై జోక్యం చేసుకుంటున్నారు. ఈ కారణంగా అధికారులెవరూ అసలు నా మాట వినడం లేదు. ఇలాంటి సందర్భంలో మేమెలా పనిచేయగలం’ అంటూ శకుంతలాశెట్టి కన్నీరుపెట్టుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. -
శివారు ముందుకు..సిటీ వెనక్కి..
ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో హైదరాబాద్‌కు పదో స్థానం మూడో స్థానానికి చేరిన రంగారెడ్డి జిల్లా ఉత్తీర్ణతలో బాలికలదే హవా ప్రభుత్వ కళాశాలల్లో మరింత అధ్వానం సాక్షి, సిటీబ్యూరో : ఇంటర్ విద్యలో హైదరాబాద్ జిల్లా మరోమారు చతికిలబడింది. శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో హైదరాబాద్ జిల్లా మరింత వెనకబడింది. ఏడేళ్లుగా అంతంత మాత్రంగానే ఉన్న జిల్లా ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది మరింత తగ్గింది. గతేడాది ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా చూస్తే హైదరాబాద్ జిల్లా 9వ స్థానంలో నిలవగా, తాజా ఫలితాల్లో ఒక మెట్టు దిగి 10వ స్థానానికి దిగజారింది. గతేడాది నాలుగో స్థానంలో ఉన్న రంగారెడ్డి జిల్లా ఈ ఏడాది ఒక స్థానం మెరుగుపడి మూడో స్థానానికి ఎగబాకింది. ఉత్తీర్ణత విషయంలో హైదరాబాద్ జిల్లా గతేడాది కన్నా ఒకశాతం తగ్గగా, రంగారెడ్డి జిల్లాలో మాత్రం పరిస్థితి యథాతథంగా ఉంది. రెండు జిల్లాల్లోనూ ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి కావడం విశేషం. దూసుకుపోయిన బాలికలు ఇంటర్ సెకండియర్ ఫలితాల సరళిని చూస్తే.. హైదరాబాద్ జిల్లాలో 64 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 66 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రెండు జిల్లాల్లోనూ ఉత్తీర్ణత విషయంలో బాలికలే హవా కొనసాగించారు. హైదరాబాద్ జిల్లా నుంచి ఈ ఏడాది 59,377 మంది పరీక్షలు రాయగా 38,322 మంది పాసయ్యారు. పాసైన వారిలో బాలురు 56 శాతం ఉండగా, బాలికలు 73 శాతం ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది మొత్తం 88,691మంది రాయగా 64,958మంది ఉత్తీర్ణులయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో బాలురు 70 శాతం మంది, బాలికలు 77 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు అధికారులు తెలిపారు. సర్కారీ కాలేజీల్లో ఉత్తీర్ణత అంతంతే.. జంట జిల్లాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో ఉత్తీర్ణత మరీ అధ్వానంగా తయారైంది. హైదరాబాద్ జిల్లాలో ఈ ఏడాది కేవలం 51 శాతం ఉత్తీర్ణతే లభించింది. రంగారెడ్డి జిల్లాలో లభించిన ఉత్తీర్ణత 56.26 శాతమే. హైదరాబాద్ జిల్లాలోని మైసారం ప్రభుత్వ జూనియర్ కళాశాల 71 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా, విద్యానగర్‌లోని వివేకానంద ప్రభుత్వ జూనియర్ కళాశాల కేవలం 12 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో ఉంది. రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ కళాశాలల పరిస్థితి చూస్తే.. సరూర్‌నగర్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల 89.39 శాతం ఉత్తీర్ణత సాధించి ముందువరసలో నిలవగా.. హయత్‌నగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల 41 శాతం ఉత్తీర్ణతతో చివరి వరుసలో నిలిచింది. ఎయిడెడ్ కళాశాలల విషయానికి వస్తే.. హైదరాబాద్ జిల్లాలో 51 శాతం ఉత్తీర్ణత సాధించగా.. రంగారెడ్డి జిల్లాలో 60 శాతం ఉత్తీర్ణత లభించింది. ఒకేషనల్ కోర్సుల్లో మెరుగైన ఫలితాలు వృత్తి విద్యా కోర్సుల్లో మాత్రం గతంలో కన్నా ఈ ఏడాది మెరుగైన ఉత్తీర్ణత లభించింది. హైదరాబాద్ జిల్లాలో ఈ ఏడాది 3,380మంది పరీక్ష రాయగా 2,197మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాది 55 శాతం పాసవగా ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం 65 శాతానికి పెరిగింది. రంగారెడ్డి జిల్లాలో 2,687 మంది రాయగా 1,567 మంది పాసయ్యారు. గతేడాది 51 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈ ఏడాది ఏకంగా ఏడు శాతం పెరిగి 58 శాతం ఉత్తీర్ణత లభించింది. -
బాలికలదే పైచేయి
జూనియర్ ఇంటర్లో 51 శాతం ఉత్తీర్ణత - గత యేడాది కంటే తగ్గిన ఫలితాలు - సత్తాచాటిన ప్రైవేట్ కళాశాలలు కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో జిల్లా 51 శాతం ఉత్తీర్ణత సాధించింది. గత యేడాది కంటే ఇది ఒక శాతం తక్కువ. ప్రధానంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లోనూ ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఎప్పటిలానే ఈసారి కూడా బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. సోమవారం ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లాలో 35,147 మంది పరీక్ష రాయగా 17,818 మంది ఉత్తీర్ణత (51 శాతం) సాధించారు. ఇందులో బాలురు 19,428 మందికి గాను 8,762 మంది (45 శాతం), బాలికలు 15,712 మందికి గాను 9,056 (58 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాలల్లో 2,312 మందికి గాను 894 మంది ఉత్తీర్ణత (39 శాతం) సాధించారు. ఇందులో బాలురు 1,833 మందికి గాను 658 (36 శాతం), బాలికలు 479 మందికి గాను 236 (49 శాతం) మంది పాసయ్యారు. రాష్ట్రంలో జిల్లా 11వ స్థానంలో నిలిచింది. గత యేడాది సైతం జిల్లా ఇదే స్థానంలో ఉండటం గమనార్హం. పాములపాడు జూనియర్ కళాశాల టాప్ జిల్లాలోని 40 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 7,872 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,993 మంది ఉత్తీర్ణత (38.02శాతం) సాధించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో పాములపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల (90.67 శాతం), డోన్‌లోని ఏపీఎస్డబ్ల్యుఆర్ జూనియర్ బాలికల కళాశాల (77.33 శాతం), గోనెగండ్లలోని ప్రభుత్వ జూనియృుర్ కళాశాల (73.44 శాతం) నిలిచాయి. గత సంవత్సరం 84.28 శాతం ఉత్తీర్ణత సాధించిన కోవెలకుంట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఈసారి 55.38 శాతంతో సరిపెట్టుకుంది. చివరి స్థానాల్లో చిప్పగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల(10.14 శాతం), ఓర్వకల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల(14.29 శాతం) నిలిచాయి. కాగా కర్నూలులోని ఏపీ ఉర్దూ రెసిడెన్సియల్ జూనియర్ కళాశాల 74.32 శాతం, బనవాసిలోని ఏపీ రెసిడెన్సియల్ బాలికల కళాశాల 95.31 శాతం, మహానందిలోని ఏపీటీడబ్ల్యుఆర్ ఎస్టీ బాలికల క ళాశాల 86.55 శాతం, శ్రీశైలం డ్యామ్ ఏపీటీడబ్ల్యుఆర్‌జేసీ 45.90, ఏపీటీడబ్ల్యుఆర్ ఇన్సిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ 89.55 శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఎయిడెడ్‌లో 29.11 శాతం ఉత్తీర్ణత జిల్లాలోని మొత్తం 9 ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో 2,027 మందికి గాను 590 మంది (29.11 శాతం) ఉత్తీర్ణత సాధించారు. చాగలమర్రిలోని ఎస్వీఎంవీఎస్ఆర్ జూనియర్ కళాశాల(48.25 శాతం), కర్నూలులోని సెయింట్ మెరీస్ జూనియర్ కళాశాల(34.90 శాతం), నంద్యాలలోని నేషనల్ జూనియర్ కళాశాల (35.41 శాతం)తో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. కర్నూలులోని కోల్స్మెమోరియల్ జూనియర్ కళాశాల (6.88 శాతం), శ్రీబాలశివ జూనియర్ కళాశాల (9.25శాతం), ఆదోనిలోని టీజీ ప్రహ్లాదచెట్టి జూనియర్ కళాశాల (16.43 శాతం) చివరి స్థానాల్లో నిలిచాయి. మోడల్ స్కూళ్లలో 51.77 శాతం ఉత్తీర్ణత జిల్లాలో ఈ యేడాది కొత్తగా ప్రారంభమైన 30 మోడల్ స్కూళ్ల (ఆదర్శ పాఠశాలలు)లో 1,273 మందికి గాను 659 మంది(51.77 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇందులో పాములపాడు 97.78 శాతం, ఆత్మకూరు 94.74 శాతం, గోనెగండ్ల 88.46 శాతంతో టాప్‌లో నిలిచాయి. జూపాడుబంగ్లా 12.50 శాతం, బనగానపల్లి 15.38 శాతం, కొలిమిగుండ్ల 16.67 శాతంతో చివిరి స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల హవా జూనియర్ ఇంటర్ ఫలితాల్లో కర్నూలులోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థిని నిఖిల యాదవ్ ఎంపీసీలో 464 మార్కులు, సాయిప్రియాంక బైపీసీలో 435 మార్కులు సాధించారు. కర్నూలులోని నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంపీసీలో అఫ్రోజ్ షేక్, పి.చిత్ర 465 మార్కులు, ఇండ్ల వెంకటసాయి శ్రీనిత్య, వి.భార్గవి, యు.ప్రశాంతి, ఇ.సాయిఅనురాగసుధ, హెచ్. సౌమ్య, డి.స్వాతిరెడ్డి, ఐ.వెంకటసాయిశ్రీనిత, షేక్ హజీరా తబస్సుమ్ 464 మార్కులు సాధించారు. బైపీసీలో ఎస్.మెహనాజ్ షర్ఫా 434, షేక్ జొహరా ఫాతిమా 433 మార్కులు సాధించారు. శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంపీసీలో ఎం. గురుప్రియాంక 462, బైపీసీలో పి.ప్రణీత్ 430, శ్రీ సాయియుక్త జూనియర్ కళాశాల విద్యార్థి ఎంపీసీలో ఎస్. వినోద్‌కుమార్ 462, రవీంద్ర, శ్రీ కృష్ణ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ విభాగంలో ఎస్.షాహినా 458, బైపీసీలో ఇ.షీమా ఈరమ్ 430 మార్కులు, నలందలో ఎంపీసీ విభాగంలో డి.నుజహత్ ఫర్హానా 461, శ్రీ సాయియుక్త జూనియర్ కళాశాల విద్యార్థి ఎస్.వినోద్‌కుమార్ ఎంపీసీలో 462, మాస్టర్ మైండ్స్ విద్యార్థి ఎంఈసీలో బమ్మిడి పృథ్వీరాజ్ 491 మార్కులు సాధించారు. -
దర్జాగా చూచిరాతలు
పాఠశాలల యాజమాన్యాల ప్రోత్సాహం ఉత్తీర్ణత శాతం పెంపునకు అడ్డదారులు నర్సీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : పదో తరగతి పరీక్షల్లో పెద్ద ఎత్తున మాస్‌కాపీయింగ్ జరుగుతోంది. ఒకపక్క పరీక్షలు, మరోపక్క ఎన్నికలు రావడంతో ఈ పరీక్షలపై అధికారులు దృష్టిసారించకపోవడాన్ని అవకాశంగా చేసుకుని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల యాజమాన్యాలు చూచిరాతలను ప్రోత్సహిస్తున్నాయి. పరీక్ష ప్రారంభమైన అర్ధగంటలోపే ప్రశ్నపత్రం బయటకు వస్తోంది. వెనువెంటనే జవాబుపత్రాన్ని తయారుచేసి విద్యార్థులకు అందజేస్తున్నారు. ఈ ప్రక్రియ నడపడానికి ప్రైవేటు పాఠశాలల యాజమాన్య ప్రతినిధులు బృందంగాఏర్పడి వాహనంలో పలు సెంటర్లకు తిరుగుతూ వీటిని చేరవేస్తున్నారు. ఈ తతంగం జరగడానికి విద్యాశాఖాధికారులు, ఆయా కేంద్రాల పరీక్ష నిర్వాహకులు ప్రధానభూమిక పోషిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టణంలో ఏడు కేంద్రాలతో పాటు వేములపూడిలోని రెండు కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల్లో 1600మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ప్రధానంగా పట్టణంలో ఏడు కేంద్రాల్లో ఈ తతంగం జరుగుతోంది. ఎన్నికల హడావిడిలో అధికారులు, పోలీసులు, మీడియా నిమగ్నమై ఉండడంతో ఇదే అదనుగా ప్రైవేటు యాజమాన్యాలు తమ ఉత్తీర్ణత శాతాలను పెంచుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. పర్యవేక్షణాధికారులకు, ఇన్విజిలేటర్లకు ప్రైవేటు, ప్రభుత్వ యాజమాన్యాలు పెద్ద మొత్తంలో ముట్టజెప్పడం వల్లే ఈ తతంగం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల కాసుల కక్కుర్తి కారణంగా కష్టపడి చదివిన విద్యార్థులు పరీక్ష కేంద్రంలో జరుగుతున్న ఈ విషయాన్ని జీర్ణించుకోలేక తల్లిదండ్రుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లావిద్యాశాఖాధికారి దృష్టిసారించి నర్సీపట్నంలో జరుగుతున్న మాస్‌కాపీయింగ్‌కు అడ్డుకట్ట వేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై డీఈవో బి.లింగేశ్వరరెడ్డిని సంప్రదించగా ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ జరగకుండా ఫ్లయింగ్స్క్వాడ్లు, సిట్టింగ్‌స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఏ కేంద్రం నుంచైనా ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్టు తెలిస్తే సంబంధిత కేంద్ర నిర్వాహకులపై చర్యలు చేపడతామన్నారు. -
పర్సెంటేజీలకు టెండర్!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : ఎన్నికల్లోనే కాదు.. కాంట్రాక్టు పనుల్లోనూ కాంగ్రెస్, టీడీపీ నేతలు కుమ్మక్కవుతున్నారు. కాంట్రాక్టర్లను బెదరగొట్టి.. అధికారులను అదరగొట్టి పర్శంటేజీలు పిండుకుంటున్నారు. ముక్కుపట్టి వసూలు చేసిన పర్శంటేజీలను పంచుకుతింటున్నారు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.. ఉరవకొండ తాగునీటి పథకం టెండరే. ఉరవకొండ నియోజకవర్గంలో ఉరవకొండ, కూడేరు, విడపనకల్లు మండలాల్లోని 112 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం రూ.56 కోట్లను మంజూరు చేసింది. పెన్నఅహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోసి 112 గ్రామాలకు నీళ్లందించే ఈ పథకానికి రెండు నెలల క్రితం టెండర్ పిలిచారు. ఈ టెండర్‌పై ఆ నియోజకవర్గానికి చెందిన అధికార, విపక్ష ‘కీలక’ నేతల కళ్లు పడ్డాయి. ఇటీవల జరిగిన సహకార, పంచాయతీ ఎన్నికల్లో కుమ్మక్కైనట్లుగానే తాగునీటి పథకం టెండర్లోనూ అధికార, విపక్ష కీలక నేతలు కుమ్మక్కయ్యారు. టెండర్ విలువలో పది శాతం కమీషన్ ముట్టచెప్పిన కాంట్రాక్టర్‌కే పనులు అప్పగించాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్డబ్ల్యూఎస్) అధికారులపై ఒత్తిడి తెచ్చారు. కమీషన్ ముట్టచెప్పకపోతే పనులు జరగనివ్వమని తెగేసి చెప్పారు. అధికార, విపక్షాల కీలక నేతలు ఏకమవడంతో చేసేదిలేక కమీషన్ ముట్టచెప్పే కాంట్రాక్టర్‌ను మీరే వెతకాలని సూచించారు. ఆ మేరకు రంగంలోకి దిగిన అధికార, విపక్ష నేతలు భూపాల్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థకు టెండర్ దక్కితే అంచనా విలువలో పది శాతం ముట్టచెప్పేలా ముందస్తుగా ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం మేరకు భూపాల్ కన్స్ట్రక్షన్స్కు పనులు దక్కేలా నిబంధనలు రూపొందించి.. టెండర్ పిలవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు హుకుం జారీ చేశారు. ఆ మేరకు అధికారులు టెండర్ పిలిచారు. భూపాల్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ ఐదు శాతం అధిక ధరలకు.. వైఎస్సార్ జిల్లాకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి సంస్థ ఐదు శాతం తక్కువ ధరలకు, నల్గొండ జిల్లాకు చెందిన అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి సంస్థ 8.5 శాతం తక్కువ ధరలకు టెండర్లు కోట్ చేశాయి. భూపాల్ కన్స్ట్రక్షన్స్తో పోలిస్తే ఆ రెండు సంస్థలకు అనుభవం ఎక్కువ. భారీ కాంట్రాక్టు సంస్థలు కూడా. కానీ.. అధికార, విపక్ష కీలక నేతలతో కుదిరిన ఒప్పందం మేరకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అవేవీ పట్టించుకోలేదు. తక్కువ ధరలకు కోట్ చేసిన కాంట్రాక్టు సంస్థలపై అనర్హత వేటు వేసి.. ఐదు శాతం అధిక ధరకు కోట్ చేసిన సంస్థకు టెండర్‌ను నాలుగు రోజుల క్రితం ఖరారు చేశారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.2.80 కోట్ల భారం పడినట్లయింది. రూ.56 కోట్ల విలువైన పనిని దక్కేలా చేసిన ఉరవకొండ నియోజకవర్గ అధికార, విపక్ష కీలక నేతలకు సదరు కాంట్రాక్టు సంస్థ రూ.5.6 కోట్లను పర్శంటేజీల రూపంలో ఇప్పటికే ముట్టచెప్పినట్లు సమాచారం. ఉరవకొండ తాగునీటి పథకంలో చోటుచేసుకున్న అక్రమాలపై హైకోర్టును ఆశ్రయించడానికి ప్రజా సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇదే అంశంపై ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రభాకర్‌రావును ‘సాక్షి ప్రతినిధి’ సంప్రదించగా.. ఆ టెండర్‌ను ఇంజనీర్ ఇన్ చీఫ్ పర్యవేక్షించారని చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలు తనకేమీ తెలియవని స్పష్టం చేశారు. -
అవి‘నీటి’ పథకం
సిరిసిల్ల, న్యూస్‌లైన్ : అధికారులు, ప్రజాప్రతినిధుల అవినీతి దాహానికి ప్రజల గొంతు తడిపే నీటి పథకం వట్టిపోతోంది. నిర్మా ణ సమయంలో పర్సంటేజీలు దండుకుని మొక్కుబడి పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సిరిసిల్ల పట్టణ ప్రజల దాహార్తిని తీర్చాల్సిన రూ.36.50 కోట్ల నీటి పథకం నీరుగారిపోతోంది. 15 రోజుల క్రితం లీకేజీ కాగా, ఇప్పటివరకు అది ఎక్కడ పగిలిపోయిందో తెలియక మున్సిపల్ అధికారులు తల పట్టుకుంటున్నారు. దీంతో పట్టణ ప్రజలకు దిగువ మానేరు నీరు అంద డం లేదు. కరువు కాలంలో... ఎండిన ఎగువ మానేరు.. అడుగంటిన భూగర్భజలాలు.. ఎంత తవ్వినా పడని నీరు. మానేరు వాగులో జలసిరి ఇంకిపోయిన రోజులవి. పట్టణ ప్రజల తాగునీటికి ఎప్పుడూ ఇబ్బందులే. ప్రజల దాహార్తిని శాశ్వతంగా తీర్చాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.36.50 కోట్లను గ్రాంటు రూపంలో మంజూరు చేశారు. 2007లో నీటి పథకాన్ని చేపట్టారు. కరీంనగర్ ఎల్ఎండీ నుంచి నలభై కిలోమీటర్ల మేర పైపులైన్ ద్వారా నీటిని సిరిసిల్లకు పంపింగ్ చేసి.. రగుడు శివారులో ఫిల్టర్ చేసి పట్టణ ప్రజలకు తాగునీరు అందించడం ఆ పథకం లక్ష్యం. నిర్మాణంలో జాప్యం.. నాణ్యత లోపం ఈ పథకం నిర్మాణ బాధ్యతను చేపట్టిన కాంట్రాక్టర్ ఇంజినీర్లకు, ప్రజాప్రతినిధులకు పర్సంటేజీలు ఇచ్చి పనిలో నాణ్యతను ప్రశ్నించకుండా కట్టడి చేశారనే విమర్శలున్నారుు. దీంతో పనిలో జాప్యం జరిగింది. 2009లో నీటి పథకం పూర్తి కావాల్సి ఉండగా.. రెండేళ్లు ఆలస్యంగా 2011లో పూర్తయింది. కరీంనగర్ డ్యామ్ నుంచి సిరిసిల్ల వరకు పైపులైన్ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా పనిని ముగించారు. ఏడాదిపాటు నిర్వహణ బాధ్యత కాంట్రాక్టరే చేపట్టగా.. 2012 మార్చి వరకు కాంట్రాక్టర్ లీకేజీలను మరమ్మతు చేస్తూ మొత్తంగా నీటి సరఫరాను ఏడాదిపాటు కొనసాగించాడు. ప్రస్తుతం నిర్వహణ బాధ్యత మున్సిపాలిటీదే కావడంతో ఆర్థికంగా భారంగా మారింది. ఒక్కసారి లీకేజీ వస్తే పైపులైన్‌లోని నీటిని తొలగించి మరమ్మతు చేయడానికి రూ.ఇరవై వేల వరకు ఖర్చవుతోంది. ప్రతినెలలో కనీసం రెండుసార్లు లీకేజీ కావడంతో మున్సిపాలిటీకి ఈ నీటి పథకం గుదిబండగా మారింది. కాంట్రాక్టర్ నిర్మాణ సమయంలో పైపులైన్ కింద ఇసుక పోసి లైన్ వేయాల్సి ఉండగా.. పట్టించుకోకుండా పర్సంటేజీలు అందించి బిల్లు పొందాడన్న ఆరోపణలున్నాయి. అప్పట్లో సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్లోనూ పర్సంటేజీల గొడవ తెరపైకి వచ్చింది. అప్పటి అధికారులు, నాయకుల పట్టింపులేనితనమే ప్రస్తుతం నీటి పథకం దుస్థితికి కారణమనే వాదన ఉంది. చిక్కని దొరకని లీకేజీలు పక్షం రోజులుగా కరీంనగర్ నుంచి సిరిసిల్లకు నీటి సరఫరా నిలిచిపోయింది. 60 హెచ్‌పీ మోటారు ఎల్ఎండీ వద్ద నీటిని పంపింగ్ చేస్తుండగా ఆ నీరు సిరిసిల్లకు రావడం లేదు. మూడురోజులపాటు మోటారు రన్చేసినా నీరు రాకపోవడంతో మున్సిపల్ సిబ్బంది పైపులైన్ వెంట కరీంనగర్‌వరకు పరిశీలించారు. కరీంనగర్ మండలం శ్రీరాములపల్లె వద్ద చెరువులో పైపులైన్ పగిలిపోయినట్లు అనుమానిస్తున్నారు. కమాన్‌పూర్ గేట్వాల్వ్వరకు నీరు వస్తుండగా, చెరువులో ప్రస్తుతం నీరు ఉండడంతో పైపులైన్ పగిలిందీ.. లేనిది పరిశీలించే అవకాశం లేకుండాపోయింది. పంపింగ్ అవుతున్న నీరు చెరువులోనే పోతున్నాయని భావిస్తున్నారు. మళ్లీ మా‘నీరే’ దిక్కు.. సిరిసిల్ల ప్రజలకు మానేరు వాగునీటిని ప్రస్తు తం సరఫరా చేస్తున్నారు. ఎల్ఎండీ నీటి సరఫరాకు లీకేజీ అడ్డంకిగా మారడంతో ప్రత్యామ్నాయంగా మూడు మోటార్ల ద్వారా మానేరువాగు నీటిని అందిస్తున్నారు. 22 హెచ్‌పీల సామర్థ్యం గల మోటార్లు ఉండడంతో పూర్తిస్థాయిలో వాటర్‌ట్యాంకులు నిండడం లేదు. వాగులోని బావుల్లో పుష్కలంగా నీరు ఉండగా నీటి సరఫరాకు చెడిపోయిన మోటార్లు ఇబ్బందిగా మారా యి. మానేరు ప్రవహిస్తుండడంతో ప్రస్తుతం నీటి ఇబ్బందులు పెద్దగా లేవు. 60 హెచ్‌పీ మోటార్లు బిగిస్తాం.. సిరిసిల్ల పట్టణంలో ప్రస్తుతం నీటి ఇబ్బందులేమీ లేవు. కరీంనగర్ డ్యామ్ నీరు లీకేజీతో రావడం లేదు. వాగులో నుంచి సరఫరా చేస్తున్నాం. చెరువులో నీరు తగ్గగానే లీకేజీ ఆపివేస్తాం. సాయినగర్ పంప్‌హౌస్ వద్ద 60 హెచ్‌పీ మోటారును బిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. - బి.సుమన్‌రావు, మున్సిపల్ కమిషనర్