బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు పతనంకాగా.. ఐడీబీఐ బ్యాంక్ కౌంటర్‌కు మాత్రం డిమాండ్ పెరిగింది. బ్యాంకులో మిగిలిన వాటాను విక్రయించనున్నట్లు బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించడంతో ఈ షేరు 10 శాతం దూసుకెళ్లింది. బీఎస్‌ఈలో శనివారం ఐడీబీఐ బ్యాంకు షేరు రూ. 3.4 ఎగసి రూ. 37.30 వద్ద ముగిసింది. ప్రమోటర్‌గా ప్రభుత్వం ఐడీబీఐ బ్యాంకులో 46.5 శాతం వాటాను కలిగి ఉంది. ఎల్‌ఐసీకి 51 శాతం వాటా ఉంది. గత సెప్టెంబర్‌లో ఎల్‌ఐసీ, ప్రభుత్వం సంయుక్తంగా బ్యాంకులో రూ. 9300 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. బ్యాంకు పెట్టుబడి అవసరాలకు తదుపరి ఎల్‌ఐసీ మరో రూ. 4743 కోట్లను పంప్‌చేసింది. కాగా.. ప్రభుత్వం స్టాక్ ఎక్సే్ఛంజీల ద్వారా ఐడీబీఐ బ్యాంకులో వాటాను విక్రయించేందుకు నిర్ణయించుకున్నట్లు తాజాగా వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment