బాలికలదే పైచేయి | girls are top in intermediate results | Sakshi
Sakshi News home page

బాలికలదే పైచేయి

Published Tue, Apr 29 2014 2:03 AM | Last Updated on Sun, Sep 2 2018 3:39 PM

బాలికలదే పైచేయి - Sakshi

బాలికలదే పైచేయి

జూనియర్ ఇంటర్‌లో 51 శాతం ఉత్తీర్ణత
- గత యేడాది కంటే  తగ్గిన ఫలితాలు
- సత్తాచాటిన ప్రైవేట్ కళాశాలలు

 
 కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో జిల్లా 51 శాతం ఉత్తీర్ణత సాధించింది. గత యేడాది కంటే ఇది ఒక శాతం తక్కువ. ప్రధానంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లోనూ ఉత్తీర్ణత శాతం తగ్గింది. ఎప్పటిలానే ఈసారి కూడా బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. సోమవారం ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లాలో 35,147 మంది పరీక్ష రాయగా 17,818 మంది ఉత్తీర్ణత (51 శాతం) సాధించారు.

ఇందులో బాలురు 19,428 మందికి గాను 8,762 మంది (45 శాతం), బాలికలు 15,712 మందికి గాను 9,056 (58 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాలల్లో 2,312 మందికి గాను 894 మంది ఉత్తీర్ణత (39 శాతం) సాధించారు. ఇందులో బాలురు 1,833 మందికి గాను 658 (36 శాతం), బాలికలు 479 మందికి గాను 236 (49 శాతం) మంది పాసయ్యారు. రాష్ట్రంలో జిల్లా 11వ స్థానంలో నిలిచింది. గత యేడాది సైతం జిల్లా ఇదే స్థానంలో ఉండటం గమనార్హం.


పాములపాడు జూనియర్ కళాశాల టాప్
జిల్లాలోని 40 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 7,872 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,993 మంది ఉత్తీర్ణత (38.02శాతం) సాధించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో పాములపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల (90.67 శాతం), డోన్‌లోని ఏపీఎస్‌డబ్ల్యుఆర్ జూనియర్ బాలికల కళాశాల (77.33 శాతం), గోనెగండ్లలోని ప్రభుత్వ జూనియృుర్ కళాశాల (73.44 శాతం) నిలిచాయి.

గత సంవత్సరం 84.28 శాతం ఉత్తీర్ణత సాధించిన కోవెలకుంట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఈసారి 55.38 శాతంతో సరిపెట్టుకుంది. చివరి స్థానాల్లో చిప్పగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల(10.14 శాతం), ఓర్వకల్లు ప్రభుత్వ జూనియర్ కళాశాల(14.29  శాతం) నిలిచాయి. కాగా కర్నూలులోని ఏపీ ఉర్దూ రెసిడెన్సియల్ జూనియర్ కళాశాల 74.32 శాతం, బనవాసిలోని ఏపీ రెసిడెన్సియల్  బాలికల కళాశాల 95.31 శాతం, మహానందిలోని ఏపీటీడబ్ల్యుఆర్ ఎస్టీ బాలికల క ళాశాల 86.55 శాతం, శ్రీశైలం డ్యామ్ ఏపీటీడబ్ల్యుఆర్‌జేసీ 45.90, ఏపీటీడబ్ల్యుఆర్ ఇన్సిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ 89.55 శాతం ఉత్తీర్ణత సాధించాయి.
 

ఎయిడెడ్‌లో 29.11 శాతం ఉత్తీర్ణత
జిల్లాలోని మొత్తం 9 ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో 2,027 మందికి గాను 590 మంది (29.11 శాతం) ఉత్తీర్ణత సాధించారు. చాగలమర్రిలోని ఎస్‌వీఎంవీఎస్‌ఆర్ జూనియర్ కళాశాల(48.25 శాతం), కర్నూలులోని సెయింట్ మెరీస్ జూనియర్ కళాశాల(34.90 శాతం), నంద్యాలలోని నేషనల్ జూనియర్ కళాశాల (35.41 శాతం)తో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. కర్నూలులోని కోల్స్‌మెమోరియల్ జూనియర్ కళాశాల (6.88 శాతం), శ్రీబాలశివ జూనియర్ కళాశాల (9.25శాతం), ఆదోనిలోని టీజీ ప్రహ్లాదచెట్టి జూనియర్ కళాశాల (16.43 శాతం) చివరి స్థానాల్లో నిలిచాయి.

మోడల్ స్కూళ్లలో 51.77 శాతం ఉత్తీర్ణత
 జిల్లాలో ఈ యేడాది కొత్తగా ప్రారంభమైన 30 మోడల్ స్కూళ్ల (ఆదర్శ పాఠశాలలు)లో 1,273 మందికి గాను 659 మంది(51.77 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఇందులో పాములపాడు 97.78 శాతం, ఆత్మకూరు 94.74 శాతం, గోనెగండ్ల 88.46 శాతంతో టాప్‌లో నిలిచాయి. జూపాడుబంగ్లా 12.50 శాతం, బనగానపల్లి 15.38 శాతం, కొలిమిగుండ్ల 16.67 శాతంతో చివిరి స్థానాలతో సరిపెట్టుకున్నాయి.

ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలల హవా
జూనియర్ ఇంటర్ ఫలితాల్లో కర్నూలులోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థిని నిఖిల యాదవ్ ఎంపీసీలో 464 మార్కులు, సాయిప్రియాంక బైపీసీలో 435 మార్కులు సాధించారు. కర్నూలులోని నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంపీసీలో అఫ్రోజ్ షేక్, పి.చిత్ర 465 మార్కులు, ఇండ్ల వెంకటసాయి శ్రీనిత్య, వి.భార్గవి, యు.ప్రశాంతి, ఇ.సాయిఅనురాగసుధ, హెచ్. సౌమ్య, డి.స్వాతిరెడ్డి, ఐ.వెంకటసాయిశ్రీనిత, షేక్ హజీరా తబస్సుమ్ 464 మార్కులు సాధించారు. బైపీసీలో ఎస్.మెహనాజ్ షర్ఫా 434, షేక్ జొహరా ఫాతిమా 433 మార్కులు సాధించారు.

శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంపీసీలో ఎం. గురుప్రియాంక 462, బైపీసీలో పి.ప్రణీత్ 430, శ్రీ సాయియుక్త జూనియర్ కళాశాల విద్యార్థి ఎంపీసీలో ఎస్. వినోద్‌కుమార్ 462, రవీంద్ర, శ్రీ కృష్ణ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ విభాగంలో ఎస్.షాహినా 458, బైపీసీలో ఇ.షీమా ఈరమ్ 430 మార్కులు, నలందలో ఎంపీసీ విభాగంలో డి.నుజహత్ ఫర్హానా 461, శ్రీ సాయియుక్త జూనియర్ కళాశాల విద్యార్థి ఎస్.వినోద్‌కుమార్ ఎంపీసీలో 462, మాస్టర్ మైండ్స్ విద్యార్థి ఎంఈసీలో బమ్మిడి పృథ్వీరాజ్ 491 మార్కులు సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement