
వ్లాదిమిర్ పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్ష పదవిని వ్లాదిమిర్ పుతిన్ నాలుగోసారి చేపట్టడం లాంఛనమేనని తెలుస్తోంది. రష్యాలో అధ్యక్ష ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఈ దేశంలో ఏకంగా 11 టైమ్ జోన్‌లు ఉండటంతో పోలింగ్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో మొదలైంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి 1.30 గంటలకు మొదలైన పోలింగ్ ఆదివారం అర్ధరాత్రి 11.30 గంటలకు ముగిసింది.
2000 నుంచి 2008 వరకు రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత నాలుగేళ్లు ప్రధానిగా ఉన్నారు. 2012లో మూడోసారి అధ్యక్షుడయ్యారు. తాజాగా రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండగా పుతిన్‌పై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయనకు ప్రత్యామ్నాయంగా మరో బలమైన నేత లేరు. పుతిన్ ప్రధాన ప్రత్యర్థి అలెక్సీ నావల్నీని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించారు.
Comments
Please login to add a commentAdd a comment