presedent
-
చంద్రునిపై నీటి జాడ.. మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయి..?
ప్రస్తుతం మనం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుని దక్షిణ ధృవం మీదకు చేరబోతోంది. చంద్రుని దక్షిణ ధృవం లో ఎలాంటి కొత్త విషయాలు అన్వేషించ బోతున్నాము? , అక్కడ నీటి లభ్యత ఎలా ఉంటుంది?, దాని లక్షణాలు. అలాగే చంద్రుని పై మట్టి పొరలు వాటి లక్షణాలు, సాంకేతికంగా, మానవాళికి వాటి వలన ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయి? వంటి అంశాలను తెలుసుకుంటాం. చారిత్రకంగా చూస్తే , ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు పంపిన చంద్రయాన్ ఉపగ్రహాలన్నీ చంద్రుని ఉత్తర ధృవం మీదకు మాత్రమే చేరగలిగాయి . దక్షిణ ధృవం మీదకు కొన్ని ఉపగ్రహాలు పంపగలిగినా అక్కడ పరిశోధనలేమీ జరగలేదు. ఇప్పుడు మనం పంపిన చంద్రయాన్-3.. దక్షిణ ధృవం మీద దిగుతూ, రోవర్ సహాయంతో 14 రోజుల పాటు జరపబోయే ప్రయోగాల మీద ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్నది. మన భారతీయ వేద విజ్ఞానం, పురాణాలూ ఇతిహాసాలు , యజ్ఞ యాగాదులలో కూడా ఖగోళ రహస్యాలను, గ్రహగతులు, లక్షణాల గురించిన విషయాలను ప్రస్తావించారు. ఉదాహరణకు మన భారతీయ సాంప్రదాయంలో జరుపుకునే యజ్ఞ యాగాదులలో , సత్యనారాయణ స్వామి వ్రతంలో నవగ్రహ పూజ జరుపుతాము . ఆ సందర్భంలో చంద్రుని గురించి ఈ క్రింద మంత్రం చెబుతాం (నవ గ్రహ సూక్తం). ప్రస్తుతం మన ఆసక్తి అంతా చంద్రుడు కావున, దాని గురించి ఏమి చెప్పారో పరిశీలిద్దాం నవ గ్రహ సూక్తం లో చంద్రుని గురించిన శ్లోకం యిలా ఉంటుంది • ఓం ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ । భవా॒ వాజ॑స్య సంగ॒థే ॥ సూర్య గ్రహస్య ఆగ్నేయ దిగ్భాగే చంద్ర గ్రహ మావాహయామి స్థాపయామి పూజయామి • అ॒ప్సుమే॒ సోమో॑ అబ్రవీదం॒తర్విశ్వా॑ని భేష॒జా । అ॒గ్నించ॑ వి॒శ్వశం॑భువ॒మాప॑శ్చ వి॒శ్వభే॑షజీః ॥ చంద్ర గ్రహస్య దక్షిణతః అధి దేవతాం ఆపః సాంగం సవాహనం సాయుధం సశక్తి పత్నీపుత్ర పరివార సమేతం ఆపః ఆవాహయామి స్థాపయామి పూజయామి • గౌ॒రీ మి॑మాయ సలి॒లాని॒ తక్ష॒త్యేక॑పదీ ద్వి॒పదీ॒ సా చతు॑ష్పదీ । అ॒ష్టాప॑దీ॒ నవ॑పదీ బభూ॒వుషీ॑ స॒హస్రా᳚క్షరా పర॒మే వ్యో॑మన్న్ ॥ చంద్ర గ్రహస్య ఉత్తరతః ప్రత్యధి దేవతా గౌరి సాంగం సవాహనం సాయుధం సశక్తి , సపతి, పుత్ర పరివార సమేతం గౌరి ఆవాహయామి స్థాపయామి పూజయామి ఓం అధిదేవతా ప్రత్యధిదేవతా సహితాయ సోమా॑య॒ నమః॑ ॥ 2 ॥ ఈ క్రింద యిచ్చిన చిత్రాన్ని పరిశీలిస్తే , సూర్యునికి ఆగ్నేయ దిక్కులో చంద్ర గ్రహాన్ని చూడగలము . ప్రతి గ్రహానికి దేవత మూడు ప్రధాన స్థాయిలు ఉన్నాయి. గ్రహ దేవత, అధి దేవత, ప్రత్యధి దేవత. గ్రహం ప్రాథమిక స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి అధి దేవత మీకు సహాయం చేస్తుంది. అవేమిటో ఒక్కక్కటి ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాము. ముందుగా గ్రహ దేవత అయిన చంద్రుని గురించి ఏమి చెప్పారంటే • ఓం ఆప్యా॑యస్వ॒ సమే॑తు తే వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ । భవా॒ వాజ॑స్య సంగ॒థే ॥ ఆప్యా॑యస్వ (దయచేయండి ), సమే॑తు (ఒక చోటికి చేర్చు ) , తే (మీరు) , వి॒శ్వత॑స్సోమ॒ వృష్ణి॑యమ్ (విశ్వ వ్యాప్తంగా వరాలను దీవెనలను అందించి ప్రయోజనం కలిగించే చంద్రుడు ), భవా॒ వాజ॑స్య సంగ॒థే (మీరే మా బలంగా మారండి ) చంద్రుని అధి దేవత - ఆపః (నీరు), యిది చంద్రునికి దక్షిణ దిక్కులో ఉంటుంది, ఈ నీటి గురించి ఇంకేమి చెప్పారంటే • అ॒ప్సుమే॒ సోమో॑ అబ్రవీదం॒తర్విశ్వా॑ని భేష॒జా । అ॒గ్నించ॑ వి॒శ్వశం॑భువ॒మాప॑శ్చ వి॒శ్వభే॑షజీః ॥ అప్సుమే (ఈ నీటిలో ), సోమో॑ (చంద్రుని అంశ ) , అబ్రవీదం (చెప్పబడినది ), అంతర్విశ్వా॑ని (సమస్త - యూనివర్సల్ ) భేషజా (నివారణ ) ఈ ప్రకారం చంద్రునికి దక్షిణ దిక్కులో నీరు వున్నది, ఆ నీటి మీద జరిపే పరిశోధనల మూలంగా చంద్రుడి స్వభావాన్ని, పూర్వోత్తరాలను అర్థం చేసుకోగలం అని స్పష్ట మవుతుంది ఈ నీటి కి ఔషధ లక్షణాలు ఉండటం వలన ఇది వైద్య రంగంలో సర్వ రోగ నివారిణిగా ఉపయోగపడుతుంది అని చెప్పారు. తరువాత చంద్రుని ప్రత్యధి దేవత గౌరి, ఉత్తర దిక్కులో వున్న ప్రత్యధి దేవత గౌరి గురించి ఏమి చెప్పారంటే • గౌ॒రీ మి॑మాయ సలి॒లాని॒ తక్ష॒త్యేక॑పదీ ద్వి॒పదీ॒ సా చతు॑ష్పదీ । అ॒ష్టాప॑దీ॒ నవ॑పదీ బభూ॒వుషీ॑ స॒హస్రా᳚క్షరా పర॒మే వ్యో॑మన్న్ మిమాయ (సృష్టించు), సలి॒లాని (నీళ్లు , ద్రవాలు), తక్ష॒తి (ఆధారం ) , ఏక॑పదీ (ఒక పాదం )... నవ॑పదీ (9 పాదాలు) , బభూ॒వుషీ (ఆమె అవుతుంది ), స॒హస్రా᳚క్షరా (అనంత నేత్రాలు కలది ), పరమే (సుప్రీం ), వ్యో॑మన్ (ఆకాశం, అంతరిక్షం ) ఈ శ్లోకం గౌరీ దేవత వైవిధ్యమైన రూపాలను వివరిస్తుంది, అలాగే సృష్టి, విశ్వం వివిధ అంశాలలో ఆమె ఉనికిని ప్రతీకాత్మకంగా సూచిస్తుంది. ఇప్పటి వరకు చంద్రుని మీదకు చేరిన వివిధ దేశాల ఉపగ్రహాలను ఈ క్రింది చిత్రంలో చూడగలరు. దాదాపు అన్నీ చంద్రుని ముందు భాగం, పై అర్థ భాగంలోనే ఉన్నాయి. చైనా 2019 లో ప్రయోగించిన చేంజ్-4 మాత్రమే చంద్రుని వెనుక భాగం వైపు దించారు. చంద్రునిపై నీటి ఆనవాళ్లు: చంద్రునిపై నీరు ఉందని సూచించడానికి ఆధారాలు ఉన్నాయి, ఆ నీరు భూమిపై మనకు కనిపించే నీటికి భిన్నంగా ఉండే రూపాల్లో ఉంది. NASA వాళ్ళు 2018 లో విడుదలచేసిన మ్యాప్‌లు చంద్రుని నీడ ఉన్న ప్రాంతాలలో చాలా చల్లగా ఉంటాయి. గడ్డ కట్టడానికి (-157 డిగ్రీల సెల్సియస్) వీలు కల్పిస్తాయి. అలానే 2020 లో NASA విడుదల చేసిన మ్యాప్‌లు , సూర్యరశ్మి ఉన్న ప్రాంతాలలో కూడా నీరు ఉన్నట్లు ధృవీకరించింది. ఇప్పటికి వరకు చంద్రుని పైన లభించిన ప్రకారం Lunar Regolith (లూనార్ రెగోలిత్) లో ఘనమైన శిలలను కప్పి ఉంచే వదులుగా ఉండే పొరల లోపల నీరు చిక్కుకుపోవచ్చని ఇటీవలి పరిశోధనలు సూచించాయి. చంద్రుని ఉపరితలంపై హైడ్రాక్సిల్ అణువులు (హైడ్రోజన్, ఆక్సిజన్ కలయిక) కనుగొనబడ్డాయి. ఇలాంటి నీరు భవిష్యతుల్లో మంచి వనరులుగా ఉపయోగమున్నప్పటికీ వీటి వెలికితీత సవాళ్లు తో కూడుకున్న పని. అలాగే ఈ చంద్రుని నీటిని అధ్యయనం చేయడం వలన చంద్రుని నిర్మాణం, సౌర వ్యవస్థ రహస్యాలను, అస్థిరతలను తెలుసుకునే గొప్ప అవకాశం లభిస్తుంది . ఈ రకంగా మన ఋషులు ద్రష్టలు వేదవాఙ్మయం ద్వారా అందించిన ఖగోళ శాస్త్ర రహస్యాలను, ఇప్పటి ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిశోధనలతో క్రోడీకరించి , ప్రపంచ మానవాళి మనుగడకు ఉపయోగపడే నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతారని ఆశిద్దాం. -Dr. Y. Hanumantha Rao, email: hanuyr@gmail.com ఇదీ చదవండి: Chandrayaan 3 Mission Details: చంద్రయాన్–3.. త్రీ ఇన్ వన్ -
తెలంగాణాలో రాష్ట్రపతి పర్యటన
-
కశ్మీరీలకు భారీ ప్రయోజనాలు
న్యూఢిల్లీ: రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేయడం, జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టడం వల్ల ఆ రాష్ట్ర ప్రజలు అత్యంత భారీ ప్రయోజనాలను పొందుతారని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం 73వ స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకుంటున్న సందర్భంగా రాష్ట్రపతి జాతినుద్దేశించి ప్రసంగించారు. మిగతా దేశ పౌరులంతా ఏయే హక్కులు, ప్రయోజనాలు, సౌకర్యాలను పొందుతున్నారో.. ఆ లాభాలను ఇకపై జమ్మూ కశ్మీర్, లదాఖ్ ప్రజలు కూడా పొందగలరని కోవింద్ అన్నారు. తక్షణ ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ ఇటీవలే పార్లమెంటు ఆమోదం పొందిన చట్టం తదితరాలు జమ్మూ కశ్మీర్‌లోని ఆడబిడ్డలకు కూడా న్యాయం అందిస్తాయని కోవింద్ తెలిపారు. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యాంగంలో ఉన్న 370వ అధికరణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పది రోజుల క్రితమే తొలగించి, జమ్మూ కశ్మీర్‌ను అసెంబ్లీ సహిత కేంద్రపాలిత ప్రాంతంగాను, లదాఖ్‌ను ఆ రాష్ట్రం నుంచి విడదీసి అసెంబ్లీ రహిత కేంద్రపాలిత ప్రాంతంగాను మార్చాలని ప్రతిపాదించడం తెలిసిందే. దేశ తొలి హోం మంత్రి సర్దార్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31 నుంచి ఈ కొత్త కేంద్రపాలిత ప్రాంతాలు ఉనికిలోకి వస్తాయి. స్వాతంత్య్రమంటే అధికార మార్పిడి కాదు.. స్వాతంత్య్రం కోసం పోరాడిన పాత తరాన్ని కోవింద్ గుర్తు చేసుకుంటూ ‘స్వాతంత్య్రమంటే కేవలం అధికార మార్పిడేనని పెద్దలు అనుకోలేదు. జాతి నిర్మాణమనే సుదీర్ఘ, విస్తృత ప్రక్రియలో అదో మెట్టు మాత్రమేనని ఆ మహోన్నత వ్యక్తులు భావించారు. ప్రతీ వ్యక్తి, ప్రతీ కుటుంబం.. అలా మొత్తంగా సమాజ జీవితం బాగుండాలనేది వారి ఆశయం’ అని అన్నారు. ఒకరి జీవన విధానాన్ని లేదా పద్ధతులను చాలా తక్కువ సందర్భాల్లోనే భారత్ వేలెత్తి చూపిందనీ, ఇక్కడ అంతా అన్నింటినీ తేలిగ్గా తీసుకుంటూ, ‘మనం బతుకుదాం, ఇతరులను బతకనిద్దాం’ అనే సూత్రాన్ని అనుసరిస్తారన్నారు. అత్యంత దుర్బలమైన వ్యక్తుల గొంతుకను వినగలిగే సామర్థ్యాన్ని భారత్ ఎన్నటికీ కోల్పోదని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొన్న ప్రజలను కోవింద్ అభినందిస్తూ, ప్రతీ ఎన్నిక ఓ కొత్త ప్రారంభాన్ని తెస్తుందని, భారత ప్రజల ఉమ్మడి ఆశలకు ఊపిరి పోస్తుందని అన్నారు. -
వెనెజులా అధ్యక్షుడిగా మళ్లీ మదురో
కారకస్: వెనెజులా అధ్యక్షుడిగా నికోలస్ మదురో రెండోసారి బాధ్యతలు చేపట్టారు. దేశంలో పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థ, క్షీణిస్తున్న శాంతిభద్రతల నేపథ్యంలో అధికారం నుంచి దిగిపోవాలని అంతర్జాతీయ సమాజం సూచించినా పదవి చేపట్టడానికే ఆయన మొగ్గు చూపారు. రాజధాని కారకస్‌లో జరిగిన మదురో ప్రమాణస్వీకార కార్యక్రమానికి 94 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. మదురో బాధ్యతలు చేపట్టడాన్ని అమెరికా, కెనడా సహా డజను లాటిన్ అమెరికా దేశాలు వ్యతిరేకించాయి. ప్రముఖ ప్రతిపక్ష నాయకులు ఎన్నికల్లో నిషేధానికి గురవడం, కొన్ని పార్టీలు పోటీకి దూరం కావడంతో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినట్లు మదురో మేలో ప్రకటించారు. -
వియత్నాం అధ్యక్షుడు క్వాంగ్ కన్నుమూత
హనొయి/న్యూఢిల్లీ: వియత్నాం అధ్యక్షుడు ట్రాన్ డాయ్ క్వాంగ్ (61) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచినట్లు వియత్నాం అధికారిక మీడియా తెలిపింది. క్వాంగ్ 2016 ఏప్రిల్‌లో అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకంటే ముందు 4 దశాబ్దాల పాటు కీలకమైన ప్రజా భద్రత మంత్రిగా చేశారు. శక్తిమంతమైన నేతగా క్వాంగ్‌కు మంచి పేరుంది. దేశ అధ్యక్ష పదవితో పాటు మరో నాలుగు దేశ అత్యున్నత పదవుల బాధ్యతలను క్వాంగ్ నిర్వర్తిస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్న క్వాంగ్.. పార్టీ అంతర్గత వర్గాల్లో మంచి ప్రభావవంతమైన, గట్టి నేతగా పేరు సంపాదించుకున్నారు. వియత్నాం అధ్యక్షుడు క్వాంగ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. -
మెక్సికోకు వామపక్ష అధ్యక్షుడు
మెక్సికో సిటీ: ఆధునిక మెక్సికో చరిత్రలో తొలిసారిగా ఓ వామపక్ష నాయకుడు ఆ దేశ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. దాదాపు గత శతాబ్ద కాలంగా మెక్సికోను పాలిస్తున్న రెండు పార్టీ లను కాదని ఆ దేశ ప్రజలు ఈసారి వామపక్ష పార్టీకి పట్టంగట్టారు. 2014లో మొరెనా పార్టీని స్థాపించిన ఆమ్లో (ఆండ్రస్ మ్యాన్యువల్ లోపెజ్ ఆబ్రడార్)కు తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా 53 శాతం ఓట్లు వచ్చాయి. ఆధునిక కాలపు మెక్సికో ఎన్నికల్లో ఓ అభ్యర్థికి 50 శాతానికి మించి ఓట్లు రావడం ఇదే తొలిసారి. ఇన్నేళ్లూ పాలించిన నేషనల్ యాక్షన్ పార్టీ (పీఏఎన్), ఇన్స్టిట్యూషనల్ రివల్యూషనరీ పార్టీ (పీఆర్ఐ)లు వరుసగా రెండో, మూడో స్థానాల్లో నిలిచాయి. తీవ్ర అవినీతి, మితిమీరిన హింస, మత్తుపదార్థాలు తదితర సమస్యలతో విసిగిపోయిన మెక్సికన్లు తాజా ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను తిరస్కరించారు. విజయానంతరం ఆమ్లో ప్రసంగిస్తూ ‘ఇదో చరిత్రాత్మకమైన రోజు. ఈ రాత్రి ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అని అన్నారు. వెనుజులా అనుసరిస్తున్న విధానాలనే ఆమ్లో మెక్సికోలో అమలుచేసి ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తారంటూ విమర్శకులు వ్యక్తం చేసిన భయాలను ఆయన కొట్టిపారేశారు. అవినీతిని నిర్మూలించడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని ఆయన చెప్పగా, మత్తు పదార్థాల వ్యాపారులకు ప్రభుత్వంలోని పెద్దలు, సైన్యంతో సంబంధాలు ఉన్నందున అవినీతిని రూపుమాపడమనేది ఆమ్లో ముందున్న అతిపెద్ద సవాలని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆమ్లో డిసెంబరులో అధ్యక్షపదవి చేపట్టనున్నారు. పార్టీ స్థాపించాక తొలి ఎన్నికలోనే గెలుపు ఆమ్లో గతంలోనూ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. 2006, 2012 అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. 2014లో తన సొంత పార్టీ మొరెనా (నేషనల్ రీజనరేషన్ మూవ్మెంట్)ను స్థాపించిన అనంతరం తొలిసారి పోటీచేసిన ఎన్నికల్లోనే గెలుపొందడం గమనార్హం. 1953లో జన్మించిన ఆమ్లోకు దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. మెక్సికోలో ప్రస్తుత అధికార పార్టీ పీఆర్‌ఐలో 1976లో చేరి ఆయన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1980ల చివర్లో ఆయన మరో పార్టీలో చేరి గవర్నర్ సహా పలు ఎన్నికల్లో పోటీచేశారు. 2000లో మెక్సికో సిటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2006, 2012 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కాగా, మంచి వక్తగా ఆమ్లో పేరుతెచ్చుకున్నారు. -
బీఏఐ అధ్యక్షుడిగా పులహండి
న్యూఢిల్లీ: ప్రభుత్వ గుర్తింపు పొందిన భారత నిర్మాణదారుల సంఘం(బీఏఐ) అధ్యక్షుడిగా తమిళనాడుకు చెందిన పులహండి ఎన్నికయ్యారు. ఐదుగురు వైస్‌ప్రెసిడెంట్లు ఉండే ఈ సంఘానికి ఉపాధ్యక్షుడిగా చెరువు రామకోటయ్య ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రామకోటయ్య అన్నారు. దేశవ్యాప్తంగా బీఏఐకి 165 శాఖలున్నాయనీ, వీటిలో 18,000 మంది సభ్యులుగా ఉన్నారన్నారు. ప్రస్తుతం తాను ఆంధ్రప్రదేశ్ ఎయిర్‌ట్రావెలర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఈఎస్ఐ కార్పొరేషన్ మెంబర్‌గా సేవలందిస్తున్నట్లు తెలిపారు. -
నాలుగోసారి అధ్యక్షుడిగా పుతిన్!
మాస్కో: రష్యా అధ్యక్ష పదవిని వ్లాదిమిర్ పుతిన్ నాలుగోసారి చేపట్టడం లాంఛనమేనని తెలుస్తోంది. రష్యాలో అధ్యక్ష ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఈ దేశంలో ఏకంగా 11 టైమ్ జోన్లు ఉండటంతో పోలింగ్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయంలో మొదలైంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి 1.30 గంటలకు మొదలైన పోలింగ్ ఆదివారం అర్ధరాత్రి 11.30 గంటలకు ముగిసింది. 2000 నుంచి 2008 వరకు రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత నాలుగేళ్లు ప్రధానిగా ఉన్నారు. 2012లో మూడోసారి అధ్యక్షుడయ్యారు. తాజాగా రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండగా పుతిన్‌పై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆయనకు ప్రత్యామ్నాయంగా మరో బలమైన నేత లేరు. పుతిన్ ప్రధాన ప్రత్యర్థి అలెక్సీ నావల్నీని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించారు. -
మన్మోహన్‌ను రాష్ట్రపతి చేస్తారనుకున్నా
న్యూఢిల్లీ: 2012లో రాష్ట్రపతి అభ్యర్థిగా తనను కాకుండా.. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రతిపాదిస్తారని భావించానని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. తాజా పుస్తకం ‘కొలిషన్ ఇయర్స్’లో 2012లో రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను ఆయన ప్రస్తావించారు. యూపీఏ ప్రభుత్వంలో, పార్లమెంట్లో తాను పోషిస్తున్న కీలక పాత్రను దృష్టిలో పెట్టుకుని, రాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎంపిక చేయకపోవచ్చని భావించానని ప్రణబ్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. 2007లోనూ ఆ కారణంగానే తనను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించలేదన్నారు. ‘2012 జూన్ 2న సోనియాగాంధీతో సమావేశమయ్యాను. ప్రణబ్‌జీ.. రాష్ట్రపతి పదవికి మిమ్మల్ని మించిన అభ్యర్థి వేరెవరూ లేరు. కానీ మన ప్రభుత్వంలో మీరు పోషిస్తున్న కీలక పాత్రనూ విస్మరించలేం. అందువల్ల రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి వేరెవరి పేరునైనా మీరు చెప్పగలరా? అని సోనియా నన్ను ప్రశ్నించారు. మీరు తీసుకునే ఏ నిర్ణయానికైనా బద్ధుడినై ఉంటానని జవాబిచ్చి వచ్చేశాను. అయితే, ఆ సమావేశం తరువాత ఇంటికి వెళ్లాక.. యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా నాటి ప్రధాని మన్మోహన్‌ను ఎంపిక చేసి, నన్ను ప్రధానిగా నియమిస్తారేమోనన్న ఆలోచన నాకు వచ్చింది. ఈ విషయంపై ఆమె తీవ్రంగా ఆలోచించారని కూడా నాకు తరువాత తెలిసింది’ అని ప్రణబ్ పేర్కొన్నారు. ఒక సందర్భంలో.. పార్లమెంట్లో విపక్షాల ఆరోపణలకు దీటుగా బదులిచ్చిన తరువాత.. ‘అందుకే మిమ్మల్ని రాష్ట్రపతి చేయలేను’ అని సోనియా అనడాన్ని ప్రణబ్ ఆ పుస్తకంలో ప్రస్తావించారు. జూన్‌లో యూపీఏ అభ్యర్థిగా ప్రణబ్‌ను ప్రకటించారు. ఆ తర్వాతి ఘటనలను ప్రణబ్ వివరిస్తూ.. ‘రాష్ట్రపతి అభ్యర్థిగా నన్ను ప్రకటించాక సోనియా నాకు ఉద్వేగభరిత వీడ్కోలునిచ్చారు. తర్వాత నావైపు చిరునవ్వుతో చూస్తూ.. మీ శక్తిసామర్థ్యాలనే కాదు, మీ ఆగ్రహావేశాలనూ ఇక మిస్ అవుతాం అన్నారు’ అని పేర్కొన్నారు. -
రాష్ట్రపతి భద్రతకు 155 కోట్ల ఖర్చు
ఆగ్రా: రాష్ట్రపతి భద్రతా సిబ్బంది జీతభత్యాల కోసం గత నాలుగేళ్లలో రూ.155.4కోట్లు ఖర్చు చేసినట్లు రాష్ట్రపతి భవన్ వెల్లడించింది. లక్నోకు చెందిన నూతన్ ఠాకూర్ అనే హక్కుల కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు బదులిచ్చింది. భద్రతా సిబ్బంది జీతభత్యాల కింద 2014–15లో 38.17కోట్లు, 2015–16లో 41.77కోట్లు, 2016–17లో 48.35కోట్లు, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 27.11కోట్లు చెల్లించారు.భద్రతా వాహనాల నిర్వహణకు నాలుగేళ్లలో 64.9లక్షలు ఖర్చు చేశారు. వాహనాల్లో ప్రభుత్వం నిర్వహించే బంకుల్లోని పెట్రోల్‌ను వాడుతున్నందున ఆ ఖర్చును లెక్కల్లో చూపలేదంది. భద్రతా కారణాల రీత్యా మొత్తం సిబ్బంది, వాహనాల సంఖ్యను వెల్లడించలేమని పేర్కొంది. -
‘డమ్మీ’ లీడర్లు
ఇక మజీ మంత్రిగా వూరిపోయూరు. నిజానికి జనవరిలోనే ఆయున తన మంత్రి పదవికి రాజీనావూ చేశారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరిగే వుుందు సీఎం కిరణ్ శ్రీధర్‌బాబును శాసనసభా వ్యవహారాల శాఖ నుంచి తప్పించి వాణిజ్య పన్నుల శాఖను అప్పగించారు. తెలంగాణ ప్రజలను అవవూనించేందుకు ఈ నిర్ణయుం తీసుకున్నారని, ఇది ఆత్మగౌరవ సవుస్య అని ఆగ్రహించిన శ్రీధర్‌బాబు తన వుంత్రి పదవికి రాజీనావూ చేస్తున్నట్లు ప్రకటించారు. జనవరి 2న తన రాజీనావూ లేఖను నేరుగా సీఎం కిరణ్‌కు పంపించారు. దీనిపై కిరణ్ స్పందిస్తూ.. ప్రేవులేఖ అందింది.. తర్వాత బస్పందిస్తా’ అంటూ తేలిగ్గా తీసుకున్నారు. మంత్రి రాజీనామాను గవర్నర్ ఆమోదానికి పంపించకుండా పక్కనబెట్టారు. దీంతో పదవికి దూరంగా ఉన్నప్పటికీ వుంత్రి హోదా మాత్రం శ్రీధర్‌బాబును వీడలేదు. ఇటీవల తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కిరణ్ రాజీనావూ చేయుటంతో అందరు వుంత్రుల్లాగే శ్రీధర్ బాబు తాత్కాలిక హోదాలో ఉన్నారు. రాష్ట్రపతి పాలన అవుల్లోకి రావటంతో ఆయున వూజీ మంత్రి అయ్యారు. వుంథని నుంచి వుూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రీధర్‌బాబుకు 2009లో తొలిసారిగా వైఎస్ వుంత్రివర్గంలో చోటుదక్కింది. ఉన్నత విద్యతో పాటు ప్రవాసాంధ్రుల శాఖ బాధ్యతలను ఆయన చేపట్టారు. వైఎస్ వురణానంతరం రోశయ్యు సీఎంగా ఉన్న కాలంలోనూ అవే శాఖలకు వుంత్రిగా కొనసాగారు. అనంతరం కిరణ్ సీఎం అయ్యూక శ్రీధర్‌బాబు హవా పెరిగింది. పౌరసరఫరాలు, తూనికలు, కొలతల శాఖతో పాటు శాసనసభా వ్యవహారాల బాధ్యతలు చేపట్టారు. అనూహ్య పరిణావూల్లో అరుుదేళ్లకు వుుందే ఆయున వుంత్రిత్వ శాఖకు దూరం కావడంతో ఎమ్మెల్యేగానే ఎన్నికలకు వెళ్లనున్నారు. ఎమ్మెల్యేలు ఉన్నా లేనట్టే.. వుంత్రి, ప్రభుత్వ విప్‌తో పాటు జిల్లాలో మొత్తం 13 వుంది ఎమ్మెల్యేలున్నారు. జూన్ 2లోగా ఎప్పుడైనా సరే అసెంబ్లీని పునరుద్ధరించి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉండటంతో వీరందరూ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు. ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ అదే పదవిలో కొనసాగుతారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు వూత్రం తవు హోదాలోనే ఉంటారు. కానీ.. పరిపాలనలో వీరి ప్రమేయుం తగ్గిపోతుంది. బదిలీలు, నియూవుకాలు మొదలు ప్రజల కష్టనష్టాలన్నింటినీ పట్టించుకోవాల్సిన బాధ్యత అధికారుల చేతిలో కేంద్రీకృతవువుతుంది. జిల్లా అధికారయుంత్రాంగం గవర్నర్‌కు బాధ్యత వహిస్తుంది. బంద్‌లు, ధర్నాలు, సభలు, సవూవేశాలు, ఆందోళనలన్నింటిపై కఠినమైన ఆంక్షలు అవులవుతారుు. పోలీసు యుంత్రాంగం తవు అధికారాలన్నింటినీ కట్టుదిట్టంగా ప్రయోగించే పరిస్థితి ఉత్పన్నవువుతుంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో వూర్చి మొదటి వారంలో షెడ్యూలు వెలువడుతుందనే సంకేతాలున్నారుు. ఈ తరుణంలో రాష్ట్రపతి పాలనతో ఒరిగే నష్టమేమీ లేదని, ఇంచుమించుగా ఎన్నికల కోడ్ అవుల్లో ఉన్నప్పటి పరిస్థితి ఉంటుందని ఎమ్మెల్యేలు అభిప్రాయుపడుతున్నారు