సాక్షి, సిటీబ్యూరో: ఈసారి ఎన్నికల్లో నూతన విధానాలు, వివిధ యాప్‌లు, విస్తృత ప్రచారంతో పాటు వివిధ కొత్త అంశాలను అమలు చేస్తోన్న ఎన్నికల సంఘం.. మరో అడుగు ముందుకువేసింది. మహిళా సాధికారతే లక్ష్యంగా వారికోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణ బాధ్యతనూ మహిళా అధికారులకే అప్పగించింది. దివ్యాంగుల కోసం భారీ ప్రచారంతో పాటు ఉచిత రవాణా, వారికోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం విదితమే.
ఇదే కోణంలో మహిళలకు తగిన ప్రాధాన్యమిచ్చే లక్ష్యంతో నియోజకవర్గానికి ఒకటి చొప్పున వీరికోసం పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణ బాధ్యతలను సైతం మహిళా అధికారులకే అప్పగించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇందుకనుగుణంగా హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ఒక్కో పోలింగ్ కేంద్రం (పీఎస్)లో పోలింగ్ బాధ్యతలు మొత్తం మహిళా అధికారులకే అప్పగించారు. ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి సహా సిబ్బంది మొత్తం మహిళలే ఉంటారని జీహెచ్‌ఎంసీ పేర్కొంది. నియోజకవర్గాల వారీగా ప్రత్యేక మహిళా పోలింగ్ కేంద్రాల వివరాలు ఇలా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment