
సాక్షి , చెన్నై: చెన్నై ఆర్ కేనగర్ ఉప ఎన్నికల్లో భాగంగా గురువారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. 258 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ కొనసాగుతుంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండే ప్రాతినిథ్యం వహించారు.
ఆమె మరణంతో ఏర్పడిన ఖాళీని ఆరు నెలల్లోగా భర్తీ చేయాల్సి ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన ఉప ఎన్నికల షెడ్యూలు విడుదలై నామినేషన్లు కూడా పూర్తయ్యాయి. అయితే ఓటర్లకు నగదు బట్వాడా జరగడంతో ఆ ఎన్నిక రద్దయింది. ప్రస్తుతం అన్నాడీఎంకే, డీఎంకే, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థిగా టీటీవీ దినకరన్ సహా మొత్తం 59 మంది రంగంలో ఉన్నారు. సహజంగా తమిళనాడులో ఏ ఎన్నికలు వచ్చినా ప్రధాన పోటీ అన్నాడీఎంకే, డీఎంకేల మధ్యనే ఉంటుంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే బహిష్కృతనేత దినకరన్ పోటీకి దిగడంతో త్రిముఖ పోటీ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment