
చెన్నై : తమిళనాడు ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన టీటీవీ దినకరన్ శుక్రవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ సచివాలయంలో దినకరన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన దినకరన్ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం అనంతరం దినకరన్ మాట్లాడుతూ మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని తెలిపారు. తమ స్లీపర్ సెల్ బయటకు వస్తుందని, మార్చిలో ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. ఇప్పటికైనా వెన్నపోటుదారులు, ద్రోహులు ...ప్రభుత్వాన్ని తమకు అప్పగించాలన్నారు. లేకుంటే తమ విశ్వరూపం చూపిస్తామని దినకరన్ హెచ్చరించారు. త్వరలోనే ఆయన ఆర్కేనగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు.