సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నిక, ఎమ్మెల్యే దినకరన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు కమల్ హాసన్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. కేసులు ఎదుర్కునేందుకైనా తాను సిద్ధమని ఆయన ప్రకటించారు.
ప్రస్తుతం మలేషియాలో ఉన్న ఆయనను మీడియా సంప్రదించింది. ‘‘నాపై కేసు నమోదైన ఫర్వాలేదు. వెనక్కి తగ్గను. న్యాయపరంగానే నేను వాటిని ఎదుర్కుంటా’’ అని మీడియాకు కమల్ బదులిచ్చారు. కాగా, ఆనంద వికటన్ కోసం రాసిన వ్యాసంలో కమల్ వ్యాసం ద్వారా దినకరన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఓటర్లను డబ్బుతో కొనుగోలు చేసి దినకరన్ గెలిచారని.. ఈ విషయంలో తనపై ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గబోనని కమల్ పేర్కొన్నారు.
కాగా, ఆర్కేనగర్ ఓటర్లు ఓటుకు రూ. 20వేలు పుచ్చుకునేందుకు ఒక దొంగ వద్ద బిక్షమెత్తుకున్నారని కమల్ ఆ వ్యాసంలో రాశారు. కమల్ చేసిన ఈ విమర్శలు దినకరన్ అనుచరుల్లో ఆగ్రహాన్ని తెప్పించాయి. దినకరన్‌తోపాటు ఆర్కే నగర్ ఓటర్లను కమల్ అవమానించారని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. దీంతో కమల్‌పై కేసు నమోదు అయ్యింది. జనవరి 12న ఈ కేసు విచారణకు రానుంది.
ఇది కూడా చదవండి... తీవ్ర ఆరోపణలు.. కమల్ ఇంటి వద్ద బందోబస్తు
Comments
Please login to add a commentAdd a comment