ttv dinakaran
-
బీజేపీతో పొత్తు: లోక్‌సభ బరిలో దినకరన్ పార్టీ.. ఎన్ని సీట్లంటే?
చెన్నై: సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఈసారి బోణి చేసి.. అధిక సీట్లు గెలవాలనే లక్ష్యంతో ముందుకువెళ్తోంది. ఈనేపథ్యంలో ఎన్డీయే కూటమిలో భాగంగా.. తమిళనాడు పొత్తులపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే తమిళనాడులో పీఎంకే (పట్టాలి మక్కళ్ కట్చి) పార్టీతో బీజేపీ పొత్తు ఖరారైంది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో పీఎంకే పార్టీకి 10 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించిన విషయం తెలిసిందే. తాజాగా బీజేపీ.. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే)తో పొత్తులో భాగంగా సీట్ల పంపకం ఖరారు చేసింది. బీజేపీ ఏఎంఎంకేకు రెండు సీట్లు కేటాయించినట్లు ఆ పార్టీ చీఫ్ టీటీవీ దినకరన్ బుధవారం వెల్లడించారు. ‘బీజేపీ మా పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వడానికే మొగ్గు చూపింది. కానీ, మాకు కేవలం రెండు సీట్ల మాత్రమే కావాలని కోరాం. మా అభిప్రాయాన్ని పరిగణలోకి బీజేపీ మాకు రెండు సీట్లు కేటాయించింది. మాకు సీట్ల సంఖ్య పాధాన్యం కాదు.. మాకే ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించటమే ముఖ్యం’ అని టీటీవీ దినకరన్ అన్నారు. ఏయే పార్లమెంట్ నియోజకవర్గాలను తమకు కేటాయిస్తారమే విషయాన్ని బీజేపీ వెల్లడిస్తుందని తెలిపారు. తమిళనాడులో బీజేపీ గణనీయమైన ఎదుగుదలను కనబరుస్తోందని తెలిపారు. అయితే తమ పార్టీ గుర్తు కుక్కర్ కేటాయింపు విషయంలో ఎన్నికల సంఘం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఏడీఎంకే పార్టీపై దినకరన్ విమర్శలు చేశారు. ఆ పార్టీ రోజురోజుకుగా ప్రభావం కోల్పోతోందన్నారు. కేవలం కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం ఆ పార్టీ పనిచేస్తోందని అన్నారు. పరోక్షంగా ఏఐఏడీఎంకే పార్టీ జనరల్ సెక్రటరీ ఎడప్పాడి పళనిస్వామిపై విమర్శలు చేశారు. దినకరన్.. ఏఐఏడిఎంకే పార్టీ నుంచి 2017లో బయటకు వచ్చి ఏఎంఎంకే పార్టీన స్థాపించిన విషయం తెలిసిందే. ఇక.. తమిళానాడు ఇప్పటివరకు బీజేపీ ఒక్కస్థానంలో కూడా గెలుపొందకపోటం గమనార్హం. 2019లో లోకసభ ఎన్నికల్లో సైతం ఎన్డీయే మిత్రపక్ష పార్టీ ఏఐఏడిఎంకే పార్టీ ఒక సీటు గెలుచుకుంది. చదవండి: కాంగ్రెస్‌లో చేరిన బీఎస్పీ సస్పెండెడ్ ఎంపీ -
ప్రధాన పోటీ ఆ రెండింటి మధ్యే; ఆ ముగ్గురు ఫెయిల్!
సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశంలోనే తమిళనాడు ఎన్నికలు ప్రత్యేకం. బరిలో ఎన్నిపార్టీలున్నా డీఎంకే, అన్నాడీఎంకేల మధ్యనే ప్రధాన పోటీ. అధికారంలోకి వచ్చేది ఆ రెండింటిలో ఒకటి అనేది అనాదిగా వస్తున్న ఆనవాయితీ. అయితే ఎటొచ్చి ఎప్పటికప్పుడు మారేది ఏ పార్టీది మూడో స్థానం అనే. అయితే ఈసారి కూడా ఎప్పటి లాగానే ప్రత్యామ్నాయ ప్రయోగం మరోసారి విఫలమైంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, డీఎంకే అగ్రనేత కరుణానిధి మరణం తర్వాత వచ్చిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ పూర్వస్థితే కొనసాగడం, మూడో కూటమి నాల్గోసారి మునిగిపోవడం గమనార్హం. తమిళనాడులో కాంగ్రెస్ పతనమైన తర్వాత ద్రవిడ పార్టీలే ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. డీఎంకే లేదా అదే పార్టీ నుంచి పుట్టుకొచ్చిన అన్నాడీఎంకే మధ్యనే ప్రధాన పోటీ పరిపాటిగా మారింది. ఆ రెండు కూటములంటే గిట్టని బలమైన ఓటు బ్యాంకు ఒకటుందని విశ్వసిస్తూ గతంలో మూడుసార్లు మూడో కూటమి యత్నాలు జరిగాయి. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షులు ఎంజీ రామచంద్రన్ మరణం తరువాత 1988లో అప్పటి తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షులు జీకే మూప్పనార్ నేతృత్వంలో ఏర్పడిన మూడో కూటమి 26 సీట్లు, 20 శాతం ఓట్లు సాధించింది. 1996లో డీఎంకే నుంచి బయటకు వచ్చిన వైగో.. ఎండీఎంకేను స్థాపించి ముఖ్యమంత్రి అభ్యర్థిగా వామపక్ష పార్టీలతో కలిపి మూడో కూటమి ఏర్పాటు చేశారు. యథాప్రకారం ఇదీ విఫలమైంది. 2006 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నటుడు విజయకాంత్ డీఎండీకేను స్థాపించి అన్ని స్థానాల్లో పోటీచేసినా తానొక్కడే గెలిచాడు. 2011 ఎన్నికల్లో డీఎంకే 23 స్థానాలకే పరిమితం కాగా, అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకున్న డీఎండీకే 29 స్థానాల్లో గెలిచి మూడో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఆ తరువాత జయలలితతో విబేధించిన విజయకాంత్ విపక్షాలతో చేతులు కలిపాడు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో వైగో (ఎండీఎంకే) డీఎండీకే, వామపక్ష పార్టీలు, వీసీకే, తమకా పార్టీలతో కలిసి మరోసారి ‘ప్రజా సంక్షేమ కూటమి’పేరున ఏర్పడిన మూడో కూటమి కనీసం ఒక్క సీటూ గెలవలేక చేదు అనుభవాన్నే చవిచూసింది. మూడో కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్దిగా బరిలోకి దిగిన విజయకాంత్ సహా దాదాపుగా అందరూ జయలలిత ధాటికి డిపాజిట్లు కోల్పోయారు. మూడో కూటమి యత్నం ముచ్చటగా మూడుసార్లు విఫలమైనా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మరో ప్రయత్నం జరుగింది. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 80–90 శాతం స్థానాలను తమకు ఉంచుకుని మిగిలినవి మిత్రపక్షాలకు కేటాయించడాన్ని అన్నాడీఎంకే, డీఎంకే అనుసరిస్తున్నాయి. దీంతో కొన్ని పార్టీలు గత్యంతరం లేక సర్దుకుపోతుండగా, మరికొన్ని మూడో కూటమివైపు వచ్చేయడం జరుగుతోంది. సర్దుబాటు పరిస్థితి చిన్నపార్టీలకే కాదు, కాంగ్రెస్, బీజేపీ వంటి పెద్దపార్టీలకూ తప్పడం లేదు. ఇక తాజా విషయానికి వస్తే డీఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ 25, అన్నాడీఎంకే కూటమి నుంచి బీజేపీ 20 సీట్లు పొందాయి. ఈ రెండు జాతీయ పార్టీలకూ తమిళనాడులో పెద్ద బలం, బలగం లేదు. ఆశించిన స్థాయిలో సీట్లు దక్కినా దక్కకున్నా ఆయా కూటముల్లో కొనసాగక తప్పలేదు. అన్నాడీఎంకే కూటమిలోని సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షులు, నటుడు శరత్‌కుమార్ పార్టీ గుర్తు, పరిమిత సీట్ల కేటాయింపును నచ్చకే మూడో కూటమి ఐజేకేలో చేరారు. మక్కల్ నీది మయ్యం అధ్యక్షులు కమల్‌హాసన్ ఐజేకే కూటమిలో చేరి సీఎం అభ్యర్దిగా బరిలో నిలిచారు. అన్నాడీఎంకే కూటమిలో ఉండిన డీఎండీకే టీటీవీ దినకరన్ పంచన చేరింది. రాజకీయ సమీకరణలు మారినా అన్నాడీఎంకే, డీఎంకే ప్రత్యామ్నాయ ప్రయోగం నాల్గోసారి నగుబాటుగా మిగిలిపోయింది. పంచముఖ పోటీ తమిళనాట తాజా అసెంబ్లీ ఎన్నికల్లో పంచముఖ పోటీ నెలకొంది. డీఎంకే, అన్నాడీఎంకేతోపాటు మక్కల్ నీది మయ్యం (కమల్‌హాసన్), అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (టీటీవీ దినకరన్), నామ్ తమిళర్ కట్చి (సీమాన్) ఐదు కూటములకు సారథ్యం వహించాయి. అన్ని కూటముల సారథులు ముఖ్యమంత్రి అభ్యర్థులుగానే బరిలోకి దిగారు. పార్టీ పెట్టిన తరువాత కమల్‌హాసన్, టీటీవీ దినకరన్‌లు ఎదుర్కొన్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. అధికారంలోకి వచ్చేది డీఎంకే లేదా అన్నాడీఎంకే అనేది ఎన్నికలకు ముందే స్పష్టమై పోవడంతో మూడోస్థానం ఎవరిది అనేది చర్చనీయాంశమైంది. 2016లో పార్టీ స్థాపించిన సీమాన్ అప్పటి ఎన్నికల్లో అన్ని స్థానాల్లో ఒంటరి పోటీకి దిగి ఒక్కస్థానం కూడా గెలవకున్నా 1.07 శాతం ఓట్లు సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో కమల్ తన సినీ ఆకర్షణను జోడించి మూడో ప్రత్యామ్నాయంగానే ప్రచారం చేసుకున్నాడు. అన్నాడీఎంకే అసంతృప్తవాదులను టీటీవీ దినకరన్ నమ్ముకున్నారు. శ్రీలంక ఈలం తమిళం, మాతృ (తమిళ) భాషాభిమానిగా సీమాన్ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. సీమాన్‌కు యువత ఆదరణ ఒకింత ఉంది. అయితే ఓటమి పాలైన ముగ్గురు ముఖ్యమంత్రులు తమ కూటమి అభ్యర్థులను గెలిపించుకోలేక పోయినా, ఎంతవరకు ఓట్ల శాతం సాధించిపెట్టారనేది పూర్తి గణాంకాలు వచ్చాక తేలనుంది. చదవండి: తమిళనాడు: కమలనాథుల జేబులో కీలక సీటు -
పాపం శశికళ: ఓటర్ జాబితాలోనూ తొలగింపు?
చెన్నె: జైలు నుంచి విడుదలై రాజకీయాల్లో సంచలనం రేపుతారని అందరూ భావించే సమయంలో అకస్మాత్తుగా ‘రాజకీయాలకు స్వస్తి’ పలికిన వీకే శశికళకు మరో షాక్ తగిలింది. ఆమెను రాజకీయాల నుంచి తప్పించినట్టు.. ఓటేసే అవకాశం కూడా ఇవ్వలేదని తమిళనాడులో చర్చ నడుస్తోంది. శశికళ పేరు ఓటర్ జాబితాలో లేదు. దీంతో తమిళనాడులో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ‘రాజకీయాల్లోకి రానివ్వరు.. కనీసం ఓటు కూడా వేయనివ్వరా? అని ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఆమె మేనల్లుడు, ఏఎంఎంకే అధినేత టీవీవీ దినకరన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓటరు జాబితాలో శశికళ పేరు కనిపించకపోవడం ముఖ్యమంత్రి పళనిస్వామినే బాధ్యత వహించాలని డిమాండ్ చేశాడు. శశికళ ఓటేయకుండా అన్నాడీఎంకే చేసిందని మండిపడ్డాడు. 234 స్థానాలు ఉన్న తమిళనాడులో ఏప్రిల్ 6వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. చదవండి: మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా చదవండి: ముఖ్యమంత్రికి భారీ ఊరట -
టపాసులతో హత్యాయత్నం.. ఏడ్చేసిన మంత్రి
చెన్నె: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు హాట్‌హాట్‌గా మారాయి. ప్రధాన పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈ ప్రచార సమయంలో తమ ప్రత్యర్థులు తనను చంపేసేందుకు కుట్ర పన్నారని ఓ మంత్రి ఏడ్చేశారు. తనను ఒంటిరిని చేసి పటాకులు పేల్చి చంపేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ ఘటన తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఐటీ శాఖ మంత్రి కదంపూర్ రాజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవిల్పట్టిలో ఆదివారం పర్యటించారు. ప్రచారం చేస్తుండగా ప్రత్యర్థి పార్టీ వారు కూడా ప్రచారానికి వచ్చారు. ఈ సమయంలో వివాదం ఎందుకు అని చడీచప్పుడు లేకుండా వెళ్తుంటే పటాకులు పెద్ద ఎత్తున పేల్చి వాటిని తన కాన్వాయ్‌పై వదిలారని మంత్రి రాజు ఆరోపించారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కజగమ్ (ఏఎంఎంకే) పార్టీ నాయకులు తమ కార్లతో అడ్డగించి అనంతరం 5 వేల పటాకుల లడీ పేల్చారని చెప్పారు. మంటలు తనకు సమీపంలో వచ్చాయని వాపోయారు. కొద్దిలో నా ప్రాణం పోయేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అన్నాడీఎంకే జాతీయ కార్యదర్శి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. అయితే కోవైల్పట్టి నియోజకవర్గంలో శశికళ మేనల్లుడు, ఏఎంఎంకే పార్టీ అధినేత టీటీవీ దినకరన్ పోటీ చేస్తున్నారు. అందుకే ఇక్కడ ఏఎంఎంకే పార్టీ నాయకులు ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రిపై దాడి చేశారని ప్రచారం సాగుతోంది. ఈ ఘటనపై అన్నాడీఎంకే, ఏఎంఎంకే పార్టీల మధ్య వివాదం ఏర్పడింది. 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీకి ఒకేదశలో ఏప్రిల్ 6వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. వీటి ఫలితాలు మే 2వ తేదీన వెలువడనున్నాయి. -
చిన్నమ్మ మద్దతు మాకే!
సాక్షి, చెన్నై: చిన్నమ్మ శశికళ మానసిక ఆదరణ, మద్దతు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంకే అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దినకరన్ ధీమా వ్యక్తం చేశారు. దుష్టశక్తి డీఎంకేను, ద్రోహశక్తి అన్నాడీఎంకే పాలకుల్ని అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకుంటామన్నారు. దినకరన్ అమ్మమక్కల్ మున్నేట్ర కళగం, విజయకాంత్ డీఎండీకేతో పాటు ఎస్‌డీపీఐలు కూటమిగా ఎన్నికల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కూటమి ఒప్పందాలు జరిగిన రోజున దినకరన్ చెన్నైలో లేరు. కోవిల్పట్టిలో నామినేషన్ దాఖలు చేసి చెన్నైకు వచ్చిన ఆయన మంగళవారం ఎన్నికల ప్రచారం శ్రీకారం చుట్టారు. ఈ పరిస్థితుల్లో బుధవారం కోయంబేడులోని డీఎండీకే కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఆ పార్టీ నేత విజయకాంత్‌తో భేటీ అయ్యారు. అనంతరం దినకరన్ మీడియాతో మాట్లాడుతూ తమది విజయకూటమి అని ప్రకటించారు. దుష్టశక్తుల్ని రానివ్వం.. ఈ ఎన్నికల్లో డీఎండీకే 60, ఎస్డీపీఐ ఆరుచోట్ల పోటీ చేస్తున్నాయని దినకరన్ తెలిపారు. డీఎండీకే కూటమిలోకి రాగానే, ముందుగా తాను ప్రకటించిన 42 మంది పార్టీ అభ్యర్థులు స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్నారని వివరించారు. ఆ మేరకు ఆర్మీ కట్టుబాట్లతో తమ కేడర్ ఉన్నారని పేర్కొన్నారు. విజయకాంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశానని పేర్కొంటూ, తమ ఇద్దరి సిద్ధాంతం లక్ష్యం ఒక్కటే అన్నారు. డీఎంకే, అన్నాడీఎంకే అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకోవడమేనని స్పష్టం చేశారు. చదవండి: ఎన్నికలకు దూరంగా రజనీకాంత్ స్నేహితుడు కమల్ సీఎం కావడం ఖాయం.. -
టీటీవీ దినకరన్‌తో ఒవైసీ పొత్తు..
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మజ్లిస్ పార్టీ సిద్ధమైంది. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం(ఏఎమ్ఎమ్కే)తో జట్టుకట్టింది. కాగా ఏఎమ్ఎమ్కే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. అయితే స్థానాల పేర్లను మాత్రం వెల్లడించలేదు. ఇక ఓవైసీ నాయకత్వంలోని ఏఐఎంఐఎం, కూటమిలో చేరి కృష్ణగిరి, శంకరాపురం, వానియంబాడి నుంచి పోటీ చేస్తోంది. ఓవైసీ పార్టీకి సీట్ల కేటాయింపుపై హైదరాబాద్ నుంచి వచ్చిన ఐదుగురితో కూడిన బృందం సోమవారం చర్చలు చేపట్టింది. కమల్‌హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం, ఐజేకే, సమక ఒక కూటమిగా ఏర్పడింది. చెన్నై ఆలందూరు సీటును కమల్‌హాసన్ దాదాపు ఖరారు చేసుకున్నారు. తన వాగ్దానాలను డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కాపీ కొడుతున్నారని కమల్ ప్రచారాల్లో ఎద్దేవా చేస్తున్నారు. తమ కూటమి వివరాలను రెండు రోజుల్లో ప్రకటిస్తానని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ సోమవారం తెలిపారు. 178 స్థానాల్లో పోటీచేయనున్న డీఎంకే డీఎంకే కూటమిలో సీట్ల సర్దుబాటు దాదాపు పూర్తయింది. మొత్తం 234 స్థానాల్లో 178 నియోజకవర్గాల్లో డీఎంకే పోటీ చేయనుంది. మిగిలిన వాటిలో ఇండియన్ ముస్లిం లీగ్, మనిదనేయ మక్కల్ కట్చి– 2, సీపీఐ– 6, ఎండీంకే– 6, వీసీకే– 6 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. సుదీర్ఘ మంతనాల తర్వాత కాంగ్రెస్‌కు 25 సీట్లు కేటాయించారు. అలాగే కన్యాకుమారి లోక్‌సభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారు. మరోవైపు సీపీఐ నేతలతో స్టాలిన్ సోమవారం చర్చలు జరిపి ఆరు సీట్లను ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన అంగీకార పత్రాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్‌కు అందజేశారు. అలాగే తమిళగ వాళ్వురిమై కట్చికి ఒక సీటు ఖరారు చేశారు. డీఎంకేకు మద్దతిస్తున్నట్లు కరుణాస్ నాయకత్వంలోని ముకుల్తోర్ పులిపడై, తమీమున్ అన్సారీ నేతృత్వంలోని జననాయక కట్చి, అదిత తమిళర్ పేరవై, ఇండియ తవ్హీద్ జమాత్ ప్రకటించాయి. చదవండి: అన్నాడీఎంకే- బీజేపీ కూటమి నుంచి మిత్రపక్షం అవుట్! -
12 లక్షల విలువైన కుక్కర్లు.. తమిళనాడులో కలకలం
చెన్నె: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చి 24 గంటలు కూడా కాలేదు.. అప్పుడే ఓటర్లకు ప్రలోభాల పర్వం మొదలైంది. తమిళనాడులో ప్రెజర్ కుక్కర్లు పంచిపెట్టారు. అయితే వాటి సమాచారం అందుకున్న పోలీసులు స్పందించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ప్రెజర్ కుక్కర్లను స్వాధీనం చేసుకోవడంతో తమిళనాడులో కలకలం రేపింది. శశికళ వర్గానికి చెందిన వారు ఈ కుక్కర్లు పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడులోని అరియలూరు జిల్లాలో రెండు లారీల్లో భారీగా ప్రెజర్ కుక్కర్లు తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. మొదట వరణాసి సమీపంలోని సమతువపురం వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఒక లారీని తనిఖీ చేయగా డ్రైవర్లు ఖాళీ డబ్బాలు అని చెప్పడంతో పోలీసులు వదిలేశారు. అనంతరం రెండో లారీ కూడా వచ్చింది. అనుమానం వచ్చి తనిఖీ చేయగా 1,500 ప్రెజర్ కుక్కర్లు కనిపించాయి. వెంటనే మొదట లారీని కూడా ఆపేసి చూడగా అందులో 1,700 కుక్కర్లు ఉన్నాయి. మొత్తం 3,300 కుక్కర్లను (విలువ రూ.12 లక్షలు) పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ కుక్కర్లపై మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత, శశికళ, ఏఎఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్, ఆ పార్టీ నాయకుడు వేలు కార్తికేయన్ ఫొటోలతో ఆ కుక్కర్లు ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో తంజావూరుకు తీసుకెళ్తున్నారని తెలిసింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఈ కుక్కర్లు తరలిస్తున్నట్లు సమాచారం. అయితే దినకరన్ పార్టీ ఏఎఎంకే గుర్తు ప్రెజర్ కుక్కరే కావడం గమనార్హం. అందుకే ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఈ కుక్కర్లు తరలిస్తున్నారని గుర్తించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నేను కరుణానిధిని కాను.. కానీ...
‘‘నేను కరుణానిధిని కాను. కానీ నా తండ్రిలా మారేందుకు ప్రయత్నించే దమ్ము, ధైర్యం నాకున్నాయి’’ ఇదీ.. డీఎంకే అధిపతి స్టాలిన్ ఉద్వేగ పూరితంగా చేసిన తొలి ప్రసంగం. ఇదే ప్రసంగం... ఎనిమిదేళ్లుగా విజయదాహంతో పరితపిస్తున్న డీఎంకేని ఆయన గెలుపు తీరాలకు చేర్చేలా చేసింది. కరుణానిధి స్థానంలో డీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టినప్పడు ఎం.కె.స్టాలిన్ తన తండ్రి స్థానాన్ని భర్తీ చేయగలడా? అన్న రాజకీయ వర్గాల గుసగుసలకు స్వస్తిపలుకుతూ... పార్టీ శ్రేణుల విశ్వాసాన్ని చూరగొనడానికి స్టాలిన్‌కి 2019 సార్వత్రిక ఎన్నికలు మంచి అవకాశాన్నిచ్చాయి. గత ఎన్నికల్లో ఒక్క సీటు మినహా మిగిలిన అన్ని స్థానాలనూ కైవసం చేసుకొని విజయదుంధుభి మోగించి, తమిళ ప్రజల్లో కలైంజర్ కరుణానిధికి తగ్గ వారసుడన్న ముద్ర వేయటంలో స్టాలిన్ కృతకృత్యులయ్యారు. నిజానికి ప్రారంభంలో స్టాలిన్ సోదరుడు ఎంకే అళగిరి సైతం అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో సోదరులిద్దరినీ విభజించి పబ్బం గడుపుకోవాలని బీజేపీ తమిళనాట అడుగుపెట్టే ప్రయత్నాలు జోరుగానే చేసింది. ఇదంతా చూసి... అళగిరితో ఎన్నికలకు ముందే పొత్తుపెట్టుకొని ద్రవిడ భూమిలో పాదం మోపాలన్న బీజేపీ ప్రయత్నాన్ని స్టాలిన్ చిత్తుచేయగలిగారు. జయలలిత, కరుణానిధి లేని తమిళనాడులో ఏర్పడిన రాజకీయ శూన్యతను అత్యంత సమర్థవంతంగా భర్తీ చేసిన స్టాలిన్ అతి కొద్దికాలంలోనే తమిళ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. మోదీ గాలికి వ్యతిరేకంగా.. 2019 ఎన్నికల్లో బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన అతికొద్ది రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. ఒక్క లోక్‌సభ సీటు మినహా తమిళనాడు, పుదుచ్చేరిలలో అన్నిటికి అన్నింటినీ కైవసం చేసుకుని, డీఎంకే తన రాజకీయప్రస్థానాన్ని సుస్థిరపరుచుకుంది. అంతకు ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం డీఎంకే విజయం సాధిస్తుందని ఆకాంక్షించినా, ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ గెలవడం డీఎంకే ఉత్సాహాన్ని కొంత నీరుగార్చింది. తండ్రి నాయకత్వ లక్షణాలను పుణికి పుచ్చుకున్న స్టాలిన్ దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తున్నా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడి తమిళనాట చరిత్ర సృష్టించగలిగారు. కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తూ పార్లమెంటులో డీఎంకే ఎంపీలు అనుసరించిన వామపక్ష అనుకూల వైఖరి, రాజకీయవర్గాల్లో స్టాలిన్‌పై విశ్వాసాన్ని రెట్టింపు చేశాయి. అది రుజువైంది.. ఒకసారి డీఎంకే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక స్టాలిన్ తనని తాను సమర్థవంతంగా రుజువు చేసుకున్నారని స్టాలిన్ చిరకాల సహచరుడు, రాజ్యసభలో డీఎంకే పార్లమెంటరీ పార్టీ నాయకుడు తిరుచ్చి శివ వ్యాఖ్యానించారు. అయితే స్టాలిన్‌కీ అతని తండ్రి కరుణానిధికీ మధ్య ఉన్న విభేదాల విషయాన్ని చాలా మంది ప్రస్తావనకు తెస్తున్నారు. అయితే ఏ ఇద్దరూ ఒకేరకంగా ఉండరనీ, కశ్మీర్ విషయంలో స్టాలిన్ తీసుకున్న బీజేపీ వ్యతిరేక విధానం, కశ్మీర్లో అరెస్టు చేసిన రాజకీయ నాయకులను విడుదల చేయాలంటూ డీఎంకే ఎంపీలు ఢిల్లీలో నిరసనకు దిగడం స్టాలిన్‌కీ, కరుణానిధికీ ఉన్న సారూప్యతకు అద్దం పడుతోందనీ, సరిగ్గా కరుణానిధి ఇలాగే ఉండేవారని ఆయన చెప్పారు. అవకాశాలను అందిపుచ్చుకోలేదా? ఏఐడీఎంకేలోని లోపాలను స్టాలిన్ వాడుకోలేకపోయారన్న భావన పార్టీ వర్గాల్లో ఉంది. అయితే శత్రువు బలహీనతలను వాడుకొని, వారిని దెబ్బతీసే మనస్తత్వం ఆయనది కాదని కొందరి భావన. 2016లో జయలలిత మరణానంతరం ఏఐడీఎంకే లో విభేదాలను ఆయన నేర్పుగా ఉపయోగించుకొని ఉండాల్సిందన్న అభిప్రాయం వారిలో ఉంది. అలాగే దాదాపు 34 ఏళ్ళ పాటు డీఎంకే యువజన నాయకత్వ బాధ్యతలను నిర్వర్తించిన స్టాలిన్ తన కుమారుడు ఉదయనిధికి డీఎంకే యువజన కార్యదర్శి బాధ్యతలు అప్పజెప్పడం పట్ల సైతం కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే 2019 ఎన్నికల విజయోత్సాహాన్ని చేబూని, నాయకుడిగా తనని తాను నిలబెట్టుకుంటూనే, రాబోయే ఎన్నికల్లో పార్టీ స్థానాన్ని సుస్థిరపరుచుకునే వైపు స్టాలిన్ అడుగులు వేస్తున్నారు. దినకరన్, నటుడు కమల్‌హాసన్, డీఎంకేకి పెద్ద ప్రమాదకరం కాదని గత ఎన్నికలు రుజువు చేశాయి. రాబోయే ఎన్నికల్లో సైతం డీఎంకే, ఏఐడీఎంకేల మధ్యనే పోటీ ఉండనుంది. అయితే 2021 ఎన్నికల్లో రజనీకాంత్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది వేచి చూడాల్సి ఉంది. (చదవండి: వారసుడి ప్రజాయాత్ర) -
టీటీవీ దినకరన్‌కు పార్టీ పదవి
సాక్షి ప్రతినిధి, చెన్నై: అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే)ను రాజకీయ పార్టీగా ఎన్నికల కమిషన్‌లో రిజిస్టర్ చేసేందుకు రంగం సిద్ధమైంది. చెన్నైలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండేళ్ల క్రితం చెన్నై ఆర్కే నగర్ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోదిగిన దినకరన్ ఆనాడు కుక్కర్ చిహ్నంపై పోటీ చేసి గెలుపొందారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో సైతం తనకు కుక్కర్ గుర్తును కేటాయించాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. అయితే రాజకీయ పార్టీగా రిజిస్టర్ చేయనందున అదే గుర్తును కేటాయించలేమని ఈసీ నిరాకరించింది. కుక్కర్ గుర్తు కోసం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినపుడు రాజకీయ పార్టీగా ఈసీ వద్ద రిజిస్టర్ చేస్తానని కోర్టుకు చెప్పారు. తమిళనాడులో ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో గిఫ్ట్‌బాక్స్ గుర్తుపై స్వతంత్ర అభ్యర్థులుగా ఏఎంఎంకే నేతలు పోటీ చేశారు. ఈ మేరకు ముందుగా ఆయన ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. తదుపరి చర్యగా ఈసీకి దరఖాస్తు చేయనున్నారు. ఏఎంఎంకేను ఏర్పాటు చేసినపుడు ప్రధాన కార్యదర్శిగా శశికళ, ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్ వ్యవహరించారు. తాజా పరిణామం శశికళకు ఏఎంఎంకేలో స్థానం లేకుండా పోవడం గమనార్హం. -
దినకరన్‌కు ‘ప్రెషర్ కుక్కర్’ కేటాయించలేం
సాక్షి, చెన్నై: టీటీవీ దినకరన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ప్రెషర్ కుక్కర్ గుర్తును అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం(ఏఎంఎంకే)కు కేటాయించేలా ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం కోర్టు గురువారం స్పష్టం చేసింది. ప్రస్తుత తరుణంలో తాము ఆ పని చేయలేమని వెల్లడించింది. ఏఎంఎంకే పార్టీకీ ‘ప్రెషర్ కుక్కర్’ గుర్తు ఇవ్వాలని గత మార్చి 9న చెన్నై హైకోర్టు ఎన్నికల కమిషన్‌కు సూచించిన సంగతి తెలిసిందే. దీనిపై పళనిస్వామి వర్గం సుప్రీంకోర్టు తలుపు తట్టింది. అయితే, ఎమ్మెల్యేల అనర్హత కారణంగా ఖాళీ అయిన 18 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నాలుగు వారాల్లోగా ఈసీ నోటిఫికేషన్ ఇవ్వగలిగితే ముందుగా ఇచ్చిన తీర్పుకు లోబడి హైకోర్టు ఏఎంఎంకే పార్టీకి ప్రెషర్ కుక్కర్ గుర్తును కేటాయించాలని తెలిపింది. లేనిపక్షంలో ఏఎంఎంకే పార్టీకి ఎన్నికల కమిషన్ తన ఇష్టానుసారం ఎన్నికల గుర్తును కేటాయిస్తుందని జస్టిస్ ఏఎం ఖన్వికల్కర్, జస్టిస్ అజయ్ కస్తోగి ధర్మాసనం తీర్పునిచ్చింది. -
ఉప ఎన్నికల్లో సత్తా చాటుతాం: టీటీవీ దినకరన్
చెన్నై: ఉప ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం(ఏఎంఎంకే) పార్టీ అధ్యక్షుడు టీటీవీ దినకరన్ స్పష్టం చేశారు. అనర్హతకు గురైన ఎమ్మెల్యేల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్లబోమని వెల్లడించారు. రాబోయే ఉప ఎన్నికల్లో మా సత్తా చాటి ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని వ్యాఖ్యానించారు. టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమిళనాడు సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా గ్రూపు కట్టడంతో స్పీకర్ వారిపై అనర్హత వేటు వేశారు. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో వారికి చుక్కెదురైంది. అనర్హత సబబేనని హైకోర్టు తీర్పునివ్వడంతో సుప్రీంకోర్టుకు వెళ్లడానికి టీటీవీ దినకరన్ వర్గీయులు సంశయించారు. ఉప ఎన్నికలలోనే తేల్చుకోవాలని నిశ్చయించుకున్నారు. -
వారిపై అనర్హత సబబే
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో అధికార అన్నాడీఎంకేలోని టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ అనర్హులుగా ప్రకటించటాన్ని మద్రాసు హైకోర్టు సమర్థించింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన జస్టిస్ సత్యనారాయణన్ గురువారం ఈ తీర్పు వెలువరించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లుగా గత ఏడాది గవర్నర్‌కు 19 మంది ఎమ్మెల్యేలు లేఖ అందజేశారు. అయితే వారిలో ఒకరు తిరిగి పళనిస్వామి పక్షాన చేరగా మిగతా 18 మందిపై స్పీకర్ గత ఏడాది సెప్టెంబర్‌లో అనర్హత వేటు వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వేటుపడిన ఎమ్మెల్యేలు మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను ద్విసభ్య ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. స్పీకర్ నిర్ణయంలో న్యాయస్థానం జోక్యం చేసుకోజాలదని జూన్ 14వ తేదీన మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరాబెనర్జీ తీర్పు చెప్పగా, జస్టిస్ సుందర్ మాత్రం స్పీకర్ నిర్ణయం చెల్లదని పేర్కొన్నారు. భిన్నమైన తీర్పులు వెలువడడంతో ఈ కేసు జస్టిస్ సత్యనారాయణన్ ముందుకు వచ్చింది. ఇరుపక్షాల వాదనలను విన్న జస్టిస్ సత్యనారాయణన్ స్పీకర్ నిర్ణయాన్ని సమర్థిస్తూ గురువారం తీర్పు వెలువరించారు. స్పీకర్ తీసుకునే నిర్ణయాలపై న్యాయస్థానం జోక్యం చేసుకోవడం కుదరదని ఆయన స్పష్టం చేశారు. దినకరన్ వర్గానికి షాక్ కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వెలువడటంతో అధికార అన్నాడీఎంకే శ్రేణులు ఆనందంలో మునిగిపోగా, టీటీవీ దినకరన్ వర్గం షాక్‌కు గురైంది. హైకోర్టు తీర్పు వెలువడగానే ఏఐఏడీఎంకే పార్టీ నేతలు మిఠాయిలు పంచుకుని సందడి చేశారు. పలువురు నేతలు ముఖ్యమంత్రి పళనిస్వామిని కలిసి అభినందించారు. ఉప ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం, గెలుపు ఖాయమని సీఎం పళనిస్వామి ధీమా వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, మరో ఎమ్మెల్యే మరణంతో ఏర్పడిన రెండు అసెంబ్లీ స్థానాలను కలుపుకుని మొత్తం 20 నియోజకవర్గాల్లో వెంటనే ఉప ఎన్నికలు నిర్వహించాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలుచేసే విషయం, తదుపరి కార్యాచరణపై 18 మంది ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని టీటీవీ దినకరన్ తెలిపారు. ఉప ఎన్నికలు వస్తే పోటీకీ తాము సిద్ధమని దినకరన్ ప్రకటించారు. 2019లోనే అసెంబ్లీకి ఎన్నికలా? మద్రాస్ హైకోర్టు తీర్పు నేపథ్యంలో తమిళ రాజకీయాల్లో కీలక మార్పులు జరగనున్నాయి. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 234 కాగా, జయలలిత, కరుణానిధి మరణంతో సభ్యుల సంఖ్య 232కి పడిపోయింది. ఒక సభ్యుడిని స్పీకర్‌గా పక్కనపెడితే 231 అవుతుంది. 18 మంది అసమ్మతి ఎమ్మెల్యేలను కోర్టు అనర్హులుగా ప్రకటించడంతో మిగిలింది 213 మంది. 20 సీట్లకు ఎన్నికలు జరిగే వరకు బలనిరూపణకు కావాల్సిన ఎమ్మెల్యేలు 107 మంది. పళనిస్వామికి కచ్చితంగా మద్దతు పలికేది 102 మంది ఎమ్మెల్యేలే అని పరిశీలకుల అంచనా. ఏఐఏడీఎంకేలో ఎంతమంది తిరుగుబాటుదారులున్నారో స్పష్టత లేదు. ఇప్పటికిప్పుడు బలపరీక్ష జరిగితే పాలకపక్షం నెగ్గడంపైనా అనుమానాలున్నాయంటున్నారు. బలపరీక్షలో స్పష్టత రాని పరిస్థితుల్లో అసెంబ్లీ రద్దు ఖాయమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే రాష్ట్రంలోని చాలామంది నేతలు ఆశిస్తున్న విధంగా 2019 లోక్ సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అలాగే, తక్షణం బలనిరూపణలో పళని స్వామి ప్రభుత్వం నెగ్గినా ఖాళీ అయిన 20 అసెంబ్లీ స్థానాల ఎన్నికల తర్వాత బలాబలాలు మళ్లీ మారే అవకాశం ఉంది. ఉప ఎన్నికల అనంతరం అసెంబ్లీలో స్పీకర్‌ను మినహాయిస్తే 233 మంది సభ్యులుంటారు. అప్పుడు మెజారిటీకి 117 సీట్లు అవసరం ఉంటుంది. ప్రస్తుతం 97 మంది సభ్యుల బలమున్న డీఎంకే.. ఉప ఎన్నికల్లో అన్ని సీట్లనూ గెలుచుకోగలిగితే మెజారిటీ రావచ్చు. లేదంటే మెజారిటీకి దగ్గరిగా వెళ్లొచ్చు. ఆర్కే నగర్లో దినకరన్ విజయం ద్వారా జయలలితకు బలమైన వారసుడిగా ప్రజలు గుర్తించినట్టయింది. డీఎంకే గెలవకపోయినా లేదం టే దినకరన్, అతని అనుచరులు తమ సీట్లను దక్కించుకోగలిగినా పళని ప్రభుత్వం ప్రమాదంలో పడ్డట్టే. ఉప ఎన్నికలు జరిగే 20 సీట్లు అన్ని పార్టీల మధ్య చీలినా కూడా రాజకీయ అనిశ్చితి వెంటాడే ప్రమాదముంది. ఇది కూడా తమిళనాట సత్వర ఎన్నికలకు దారితీస్తుంది. 20 సీట్లకు జరిగే ఉప ఎన్నికలను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన రజనీకాంత్, కమల్‌హాసన్‌లు కూడా ప్రభావితం చేయనున్నారు. -
ఎమ్మెల్యేల అనర్హత వేటు.. హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత కేసులో పళనిస్వామి ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ విధించిన అనర్హత వేటును మద్రాస్ హైకోర్టు సమర్థించింది. ఈ మేరకు 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ.. హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 232 మంది సభ్యులు ఉండగా.. తాజా హైకోర్టు తీర్పుతో సభ్యుల సంఖ్య 214కు పడిపోయింది. ప్రస్తుతం పళనిస్వామి ప్రభుత్వానికి 110 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీంతో ప్రభుత్వ మనుగడకు కావాల్సిన మెజారిటీ పళని ప్రభుత్వానికి దక్కినట్టు అయింది. అయితే, ఈ 18 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే.. వాటి ఫలితాల ఆధారంగా సమీకరణాలు మారిపోయే అవకాశముంది. తన మద్దతుదారులైన 18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు టీటీవీ దినకరన్ స్పష్టం చేశారు. అన్నాడీఎంకే పార్టీ విప్‌కు వ్యతిరేకంగా వ్యవహరించటంతోపాటు.. ప్రభుత్వాన్ని కుప్పకూల్చే ఉద్దేశంతో గవర్నర్‌ను కలిశారన్న కారణంగా తమిళనాడు స్పీకర్ ధన్పాల్ గతేడాది 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. అయితే, వీరిపై అనర్హత వేటు కేసులో గతంలో ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం భిన్నాభిప్రాయాలతో తీర్పు వెలువరించింది. దీంతో విచారణను మూడో న్యాయమూర్తికి బదలాయించారు. దినకరన్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటు చెల్లుతుందని జస్టిస్ ఇంద్రాణి బెనర్జీ తీర్పునివ్వగా.. స్పీకర్ నిర్ణయం చెల్లబోదని జస్టిస్ సెల్వం తీర్పు వెలువరించారు. దీంతో మూడో న్యాయమూర్తి ఈ కేసును విచారించి.. అనర్హత వేటును సమర్థించడంతో ఎమ్మెల్యేల బహిష్కరణ ఖాయమైంది. -
తమిళ రాజ‘కీ’యం ఎవరి చేతుల్లో?
సాక్షి ప్రతినిధి, చెన్నై/ సాక్షి నాలెడ్జ్ సెంటర్: జయలలిత కన్నుమూతతో ‘రెండాకులు’ రాలిపోయాయి. కరుణ మరణంతో ‘ఉదయసూర్యుడు’ అస్తమించాడు. తమిళనాడు రాజకీయాల్లో భారీ రాజకీయ శూన్యత ఏర్పడింది. ఇక తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పేవారు ఎవరనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. తమిళనాడులో కామరాజ్ నాడార్ హయాంలోనే జాతీయ పార్టీలకు కాలం చెల్లింది. అన్నాదురై నేతృత్వంలో ఉదయించిన ద్రవిడ సిద్ధాంతాల డీఎంకే తిరుగులేని పార్టీగా మారింది. తర్వాత ప్రముఖ సినీ నటుడు ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) నాయకత్వంలో ఏర్పడిన అన్నాడీఎంకే తమిళనాట మరో బలీయమైన రాజకీయ పార్టీగా నిలిచింది. ఎంజీఆర్ జనాకర్షణ ధాటికి కరుణానిధి సైతం తల్లడిల్లిపోయారు. ఎంజీఆర్ మరణించిన తర్వాత ఇక తమకు తిరుగులేదని ఆశించిన డీఎంకేకు నిరాశే మిగిలింది. ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన జయలలిత పార్టీని పరుగులు పెట్టించారు. ఎంజీఆర్‌కు ధీటుగా కరుణకు గట్టిపోటీ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు డీఎంకే లేదా అన్నాడీఎంకే మాత్రమే చాయిస్. ఎంజీఆర్ హయాంలో రెండుసార్లు, జయ హయాంలో ఒకసారి మినహా ప్రతిసారీ ఈ రెండు పార్టీలూ ఐదేళ్లకొకసారి అధికారాన్ని పంచుకున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పేంత స్థాయి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు లేదు. రెండు ప్రధాన ద్రవిడ పార్టీల అధినేతలు జయలలిత, కరుణానిధి రెండేళ్ల వ్యవధిలోనే కన్నుమూశారు. దీంతో తమిళనాట వారిద్దరి స్థాయి ప్రజాకర్షణ, రాజకీయ చాతుర్యం కలిగిన నేతలు ఎవరు? రాష్ట్ర రాజకీయాల్లో ఏర్పడిన శూన్యతను పూడ్చే స్థాయి ఎవరికి ఉందనే చర్చ మొదలైంది. కమల్, రజనీకాంత్‌ల ప్రభావమెంత? పురచ్చితలైవి జయలలిత జీవించి ఉన్నంతకాలం రాజకీయ ప్రవేశానికి వెనకడుగు వేసిన నటులు.. కమల్‌హాసన్, రజనీకాంత్ జయ మరణం తర్వాత తామున్నామంటూ ముందుకు వచ్చారు. అన్నాడీఎంకే ఆస్తికత్వం, డీఎంకే నాస్తికత్వం సిద్ధాంతాలతో రాజకీయాలు నెరిపాయి. అలాగే ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి ముగ్గురూ సినీ నేపథ్యంతో ప్రాచుర్యం పొందినవారే. రజనీకాంత్, కమల్ సైతం సినీ క్రేజుపైనే ఆధారపడి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజాసేవలతో మమేకమైన సందర్భాలు ఇద్దరికీ లేవు. అంతేకాకుండా అన్నాడీఎంకే, డీఎంకే మాదిరిగానే రజనీ, కమల్ ఆస్తిక, నాస్తిక సిద్ధాంతాలను అనుసరిస్తున్నారు. తనది ఆధ్యాత్మిక పార్టీ అని రజనీకాంత్ ప్రకటించారు. ఇక కమల్ పూర్తిగా నాస్తికుడు అనేది ప్రజలందరికీ తెలిసిందే. ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ ఏర్పాటు, జిల్లాల్లో పర్యటనలతో కమల్ తన రాజకీయ ప్రయాణ వేగాన్ని పెంచగా, పార్టీ ఏర్పాటుపై రజనీకాంత్ 8 నెలలుగా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇటీవల ఒక ప్రముఖ దినపత్రిక తమిళనాడులో సర్వే చేసి కమల్, రజనీ ఇద్దరికీ అధికారంలోకి వచ్చేంత సామర్థ్యం లేదని తేల్చింది. ఇద్దరికీ కలిపి కనీసం పది శాతం మంది కూడా వారి పాలనను కోరుకోవడం లేదని స్పష్టం చేసింది. సినీనటులు రాజకీయాల్లో రాణించే రోజులు అంతరించిపోయాయని సర్వేలో పేర్కొంది. స్టాలిన్‌కి తిరుగులేనట్టే.. కరుణానిధి తన రాజకీయ వారసుడిగా మూడో కుమారుడు ఎంకే స్టాలిన్‌ను కిందటేడాది జనవరిలో ప్రకటించి పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. ఫలితంగా కరుణ రెండో కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి, చిన్న కూతురు, రాజ్యసభ ఎంపీ కనిమొళి, ఆయన మేనల్లుడి కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ డీఎంకే నాయకత్వం కోసం పోటీ పడే అవకాశాలు లేవు. 65 ఏళ్ల స్టాలిన్ 1973 నుంచీ డీఎంకే కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ, 1984 నుంచీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 45 ఏళ్లుగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఉన్న సంబంధాలు, పార్టీ విభాగాలపై ఉన్న పట్టు కారణంగా స్టాలిన్‌కు పార్టీని ముందుకు తీసుకెళ్లే అన్ని అవకాశాలూ ఉన్నాయి. స్టాలిన్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే రాష్ట్రవ్యాప్తంగా ‘నమక్కు నామే (మనకు మనమే)’ పేరుతో పాదయాత్ర చేసి ప్రజలకు మరింత చేరువయ్యారు. జయ మరణం తర్వాత అధికార అన్నాడీఎంకేలో ఏర్పడిన లుకలుకలను అవకాశంగా తీసుకుని ప్రభుత్వాన్ని కూల్చివేసి అధికారంలోకి రాకుండా సంయమనం పాటించారు. ఈ నిదానమే ప్రజలకు నచ్చిందో ఏమో ఇటీవల జరిగిన సర్వేలో రాబోయేది డీఎంకే ప్రభుత్వం.. కాబోయే సీఎం స్టాలిన్ అని తేలింది. రజనీ చేతుల్లోకి అన్నాడీఎంకే! అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు ఎంజీఆర్ మరణం తర్వాత ఆయన స్థాయిలో జయలలిత పార్టీని నడిపారు. ఆమె మరణం తర్వాత సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కలిసి పనిచేస్తున్నా వారిద్దరి నాయకత్వాన పార్టీలో రెండు గ్రూపులు నడుస్తున్నాయనేది బహిరంగ రహస్యమే. బీజేపీతో పన్నీర్‌సెల్వంకు సన్నిహిత సంబంధాలున్నందున రాబోయే ఎన్నికల్లో ఆయన వర్గం ఎన్డీఏకు దగ్గరైతే అన్నాడీఎంకే బలహీనపడే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితిలో శశికళ సోదరి కుమారుడు టీటీవీ దినకరన్ నాయకత్వంలోని ‘అమ్మా మక్కల్ మున్నేట్ర కజగం’ అన్నాడీఎంకేను చీల్చి కొంతమేరకు బలపడే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ఎన్ని ముక్కలవుతుందో చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జయలలిత తర్వాత జనాకర్షణ శక్తి ఉన్న నేతలెవరూ లేకపోవడం, అర్థబలం, అంగబలం సంపాదించిన శశికళ జైల్లో ఉండడంతో అన్నాడీఎంకే గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని తేల్చిచెబుతున్నారు. వాస్తవానికి ‘అమ్మ’ మరణంతో అనాథగా మారిన అన్నాడీఎంకేకు ఆసరాగా నిలవడం ద్వారా తమిళనాట వేళ్లూనుకోవాలని బీజేపీ తాపత్రయపడింది. అయితే అధికార పార్టీకి జనాకర్షణ కలిగిన నాయకులు లేకపోవడం వల్ల బీజేపి ప్రయత్నాలకు గండిపడింది. ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూసిన బీజేపీకి తన మిత్రుడు రజనీకాంత్ కంటపడ్డారు. బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు విముఖత ప్రదర్శించిన రజనీకాంత్‌ను అన్నాడీఎంకే అధినేతగా చేసి లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తోంది. అన్నాడీఎంకే శ్రేణుల్లోనూ అంతర్గతంగా ఈ చర్చ నడుస్తోంది. బీజేపీ ఆలోచనలకు అనుగుణంగా రజనీకాంత్ పార్టీ ప్రకటనలో జాప్యాన్ని కొనసాగిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. అదే జరిగితే రాబోయే ఎన్నికల్లో రజనీ నాయకత్వంలోని అన్నాడీఎంకే, స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రత్యర్థులుగా తలపడతాయి. షెడ్యూల్ ప్రకారం తమిళనాడు అసెంబ్లీకి 2021లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మూడేళ్ల కాలంలో తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి సమీకరణలు చోటుచేసుకుంటాయో వేచిచూడాలి. -
టీటీవీ దినకరన్ ఇంటిపై బాంబు దాడి సీసీటీవీ ఫుటేజ్
-
టీటీవీ దినకరన్ ఇంటిపై దాడి
-
దినకరన్ వాహనంపై పెట్రోల్ బాంబు దాడి
-
దినకరన్ ఇంటిపై బాంబుదాడికి యత్నం
సాక్షి, చెన్నై : శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ఇంటిపై బాంబు దాడి యత్నం జరిగింది. ఆదివారం ఉదయం పెట్రోల్ బాంబుతో ఓ వ్యక్తి దాడికి యత్నించాడు. ఈ క్రమంలో బాంబు అదే కారులో పేలిపోగా.. ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. దాడి సమయంలో దినకరన్ ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్కే నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన తర్వాత అమ్మ మక్కల్ మున్నేట్ర కజగమ్ పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. బుల్లెట్ పరిమళం అనే వ్యక్తిని ఇటీవలె దినకరన్ పార్టీ నుంచి తొలగించారు. దీంతో దినకరన్‌పై పగ పెంచుకున్న పరిమళం ఆయన ఇంటికి చేరుకుని బాంబు దాడికి యత్నించాడు. ఈ క్రమంలో కారులో బాంబును తీసుకుని ఆదివారం దినకరన్ ఇంటి వద్దకు పరిమళం చేరుకున్నాడు. ఆ సమయంలో బాంబు అదే కారులో పేలిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. దినకరన్ ఓ బచ్చా... దినకరన్ వాహనంపై రాళ్లదాడి -
దినకరన్ వాహనంపై రాళ్లదాడి.. తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, చెన్నై : శశికళ మేనల్లుడు, ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌కు సొంత నియోజకవర్గంలోనే చుక్కెదురైంది. ఆర్కే నగర్ నియోజకవర్గంలో బుధవారం ఆయన పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అధికార అన్నాడీఎంకే శ్రేణులు ఆయన వాహనంపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఘర్షణకు దారితీసింది. తన నియోజకవర్గమైన ఆర్కేనగర్లో మద్దతుదారులతో కలిసి టీటీవీ దినకరన్ పర్యటించారు. ఈ సమయంలో ఆయన తన కారులో వెళుతుండగా అదే ప్రాంతానికి చెందిన అన్నాడీఎంకే నేత మధుసూదన్ వర్గీయులు అడ్డుకున్నారు. తమ ప్రాంతంలోకి రావద్దని ఘర్షణకు దిగారు. దినకరన్ ప్రయాణిస్తున్న కారుపై రాళ్లతోదాడి చేశారు. దీనిని దినకరన్ వర్గం ప్రతిఘటించడంతో ఇరువర్గాల నడుమ ఘర్షణ చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు భారీగా బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అన్నాడీఎంకే శ్రేణులు, దినకరన్ వర్గీయులకు మధ్య చోటుచేసుకున్న ఈ ఘర్షణ తమిళనాట సంచలనం రేపుతోంది. -
దినకరన్‌కు చుక్కెదురు
-
రేపు మూడో జడ్జీ ముందుకు ఎమ్మెల్యేల అనర్హత!
సాక్షి, చెన్నై : తమిళనాడులో దినకరన్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసు బుధవారం మరోసారి విచారణకు రానుంది. ఈ కేసులో ఇద్దరు జడ్జీలు పరస్పరం వేర్వేరు తీర్పులు వెలువరించడంతో మూడో జడ్జి ముందుకు కేసు బదిలీ అయిన సంగతి తెలిసిందే. మూడో జడ్జి సత్యనారాయణ బుధవారం ఈ కేసును విచారించనున్నారు. దినకరన్ గూటికి ఫిరాయించిన 18మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత వేటు చెల్లుతుందా? లేదా అనే దానిపై న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ వెలువరించే తీర్పు కీలకం కానుంది. ఆయన తీర్పు ఆధారంగా తమిళనాడులో రాజకీయ పరిణామాలు మారనున్నాయి. గతంలో ఈ కేసును విచారించిన ఇద్దరు న్యాయమూర్తులు పరస్పరం భిన్నాభిప్రాయాలతో వేర్వేరు తీర్పులను వెలువరించిన్న సంగతి తెలిసిందే. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకాభిప్రాయంతో స్పష్టమైన తీర్పు వెలువరించకపోవడంతో ఈ కేసులో అనిశ్చితి తొలగిపోలేదు. దీంతో ఈ కేసు విచారణను మూడో జడ్జికి బదలాయించారు. ఇక గతంలో తీర్పు ఇచ్చిన జస్టిస్ ఇంద్రాణి బెనర్జీ.. దినకరన్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటు చెల్లుతుందని పేర్కొనగా.. స్పీకర్ నిర్ణయం చెల్లబోదని జస్టిస్ సెల్వం వేరుగా తీర్పునిచ్చారు. దీంతో పళనిస్వామి ప్రభుత్వానికి తాత్కాలికంగా ఊరట లభించినట్టు అయింది. 18 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసు పళనిస్వామి ప్రభుత్వ మనుగడకు విషమ పరీక్షగా మారిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు ఎలా వచ్చినా పళనిస్వామి ప్రభుత్వానికి సంకటం తప్పదన వాదన వినిపించింది. గత సెప్టెంబర్‌లో పళనిస్వామి ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా అధికార అన్నాడీఎంకేకు చెందిన 18మంది ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని స్పీకర్ రద్దుచేసిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే విప్‌కు వ్యతిరేకంగా శశికళ అక్క కొడుకైన దినకనర్‌కు మద్దతు తెలుపడంతో స్పీకర్ వారిపై అనర్హత వేటు వేశారు. వారి నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని స్పీకర్ ఎన్నికల సంఘాన్ని కోరారు. అయితే, స్పీకర్ నిర్ణయంపై వేటు పడిన ఎమ్మెల్యేలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. -
అనర్హత వేటు కేసు.. అనూహ్య పరిణామం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత వేటు కేసులో అనూహ్య పరిణామం నెలకొంది. ఈ వ్యవహారంలో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన దినకరన్ వర్గ ఎమ్మెల్యే ఒకరు.. ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో తమిళ రాజకీయాల్లో కలకలం రేగింది. రెబల్ ఎమ్మెల్యే తంగతమిళ్‌సెల్వన్ శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ...‘న్యాయస్థానంపై నమ్మకం పోయింది. న్యాయం చేకూరుతుందన్న ఆశలు ఆవిరయ్యాయి. అందుకే పిటిషన్‌ను విత్ డ్రా చేసుకోవాలని నిర్ణయించుకున్నా’ అని తెలిపారు. దీంతో దినకరన్ వర్గంలో చీలిక మొదలైందన్న కథనాలు మీడియాలో ప్రారంభం అయ్యాయి. అన్నాడీఎంకే పార్టీ విప్‌కు వ్యతిరేకంగా వ్యవహరించటంతోపాటు.. ప్రభుత్వాన్ని కుప్పకూల్చే ఉద్దేశంతో గవర్నర్‌ను కలిశారన్న కారణంగా తమిళనాడు స్పీకర్ ధన్పాల్ గతేడాది 18 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారు. వారిలో అండిపట్టి నియోజకవర్గ ఎమ్మెల్యే తంగతమిళ్‌సెల్వన్ కూడా ఒకరు. ఉప ఎన్నికలకు వెళ్లినా గెలుపు తనదే అన్న ధీమాలో ఆయన ఉన్నట్లు అనుచరులు చెబుతున్నారు. అయితే గ్రూప్‌లో చీలిక ప్రచారాన్ని దినకరన్ మాత్రం కొట్టిపారేశారు. ‘పిటిషన్ విషయంలో తంగతమిళ్‌సెల్వన్ అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమే. అయినా ఆయన మా వెంటే ఉన్నారు. మా వర్గం అంతా ఐక్యంగానే ఉంది. అంతా ఓకే’ ఆయన కాసేపటి క్రితం ప్రకటించారు. ఒకవేళ కేసులో హైకోర్టు తీర్పు అనుకూలంగా లేకపోతే మాత్రం.. సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని దినకరన్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తమిళనాడులో దినకనర్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో అనిశ్చితి నెలకొంది. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం భిన్నాభిప్రాయాలతో తీర్పు వెలువరించకపోవడంతో విచారణను విస్తృత ధర్మాసనానికి బదలాయించారు. దినకరన్ వర్గానికి చెందిన 18మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటు చెల్లుతుందని జస్టిస్ ఇంద్రాణి బెనర్జీ తీర్పునివ్వగా.. స్పీకర్ నిర్ణయం చెల్లబోదని జస్టిస్ సెల్వం... గురువారం విచారణ సందర్భంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. తీర్పుపై అనిశ్చితి నేపథ్యంలో పళనిస్వామి ప్రభుత్వానికి తాత్కాలిక ఊరట లభించింది. -
ఎమ్మెల్యేల అనర్హతపై భిన్నాభిప్రాయం
చెన్నై: తమిళనాడులో పళనిస్వామి ప్రభుత్వానికి తాత్కాలిక ఉపశమనం లభించింది. టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత వేటు కేసులో మద్రాసు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఏకాభిప్రాయానికి రాలేకపోయింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విధిస్తూ తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ పి.ధనపాల్ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ సమర్థించగా.. మరోజడ్జి జస్టిస్ ఎం.సుందర్ వ్యతిరేకించారు. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో తుది తీర్పు కోసం ఈ కేసు విచారణను మరో న్యాయమూర్తికి బదిలీ చేశారు. ఈ కేసును ఎవరు విచారించాలో ప్రధాన న్యాయమూర్తి తర్వాతి సీనియర్ న్యాయమూర్తి నిర్ణయిస్తారని చీఫ్ జస్టిస్ ఇందిరా బెనర్జీ తెలిపారు. మూడో జడ్జి తీర్పు వెలువరించేంత వరకు యథాతథస్థితి అంటే 18 మంది ఎమ్మెల్యేల అనర్హత కొనసాగుతుందన్నారు. జయలలిత మరణంతో అనిశ్చితి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో తమిళనాట రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. సీఎం పదవి నుంచి పన్నీర్ సెల్వంను తప్పించి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాలని జయలలిత నెచ్చెలి శశికళ భావించారు. దీన్ని పన్నీర్ సెల్వం వ్యతిరేకించారు. దీంతో అన్నాడీఎంకే పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. మరోవైపు అనూహ్యంగా శశికళ జైలుకెళ్లడంతో సీఎం పగ్గాలను పళనిస్వామికి అప్పగించారు. శశికళ సోదరి కుమారుడు దినకరన్ కూడా పళనిస్వామికి మద్దతిచ్చారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకు పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గాలు కలసిపోయి శశికళ, దినకరన్‌లను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచారు. పళనిస్వామి ముఖ్యమంత్రిగా, పన్నీర్ సెల్వం ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే పన్నీర్‌తో చేతులు కలపడాన్ని వ్యతిరేకించిన దినకరన్.. తన వర్గం ఎమ్మెల్యేలతో కలసి పళనిస్వామికి ఎదురుతిరిగారు. దీంతో ఫిరాయింపుల వ్యతిరేక చట్టం కింద ఆ 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ గత సెప్టెంబర్ 18న అనర్హత వేటు వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. అనర్హత రద్దై ఉంటే ప్రభుత్వానికి ముప్పే ప్రస్తుతానికైతే హైకోర్టు తీర్పు పళనిస్వామి ప్రభుత్వానికి ఊరటనిచ్చినట్టేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే 18 మంది అనర్హులైనందున ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని ప్రతిపక్ష డీఎంకే ఆరోపిస్తోంది. ఒకవేళ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు రద్దై ఉండి ఉంటే పళని ప్రభుత్వానికి చాలా చిక్కులు వచ్చేవి. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలకు స్పీకర్ మినహా అధికార పార్టీ అన్నాడీఎంకేకు 116 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడగా.. ప్రతిపక్ష డీఎంకే పార్టీకి 89 మంది, దాని మిత్రపక్షం కాంగ్రెస్‌కు 8 మంది, ఐయూఎంల్‌కు ఒకరు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. దినకరన్ స్వతంత్ర ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ మధ్యే మరో ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో దినకరన్ వర్గం ఎమ్మెల్యేల సంఖ్య 22 అయింది. వీరు డీఎంకే, కాంగ్రెస్ కూటమికున్న 98 ఎమ్మెల్యేలతో కలిస్తే వీరి బలం 120గా మారేది. అప్పుడు అధికార పార్టీ బలం స్పీకర్‌తో కలిపి 114గా ఉండేది. ప్రభుత్వం మైనారిటీలో పడిపోయేది. హైకోర్టు తీర్పుపై దినకరన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వ కొనసాగింపునకు వీలు కల్పిస్తోందని వ్యాఖ్యానించారు. -
దినకరన్‌కు రూ.20నోటుసెగ
టీ.నగర్: ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు వచ్చిన టీటీవీ దినకరన్‌కు ప్రజలు తీవ్ర వ్యతిరేకత తెలిపారు. ఆ సమయంలో అతని మద్దతుదారులకు దేహశుద్ధి జరిగింది. చెన్నై తండయార్‌పేట–ఎన్నూరు హైరోడ్డులో ఉన్న ప్రైవేటు పాఠశాల నుంచి గత 23వ తేదీ మహారాష్ట్ర రాష్ట్రం పుణెకు విహార యాత్రగా వెళ్లిన విద్యార్థులు ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతిచెందిన విద్యార్థులు ఆర్కేనగర్ నియోజకవర్గానికి చెందినందున ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ మంగళవారం ఉదయం అక్కడికి వెళ్లారు. ఇందిరానగర్‌కు చెందిన విద్యార్థి రజాక్, నేతాజి నగర్‌కు చెందిన శరవణకుమార్, నావలర్ ప్రాంతానికి చెందిన సంతోష్ కుటుంబాలకు తలా లక్ష రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో దినకరన్ మాట్లాడారు. ఇలావుండగా టీటీవీ దినకరన్ వస్తున్నట్లు తెలియగానే ఎన్నికల్లో గెలిస్తే నగదు అందిస్తానని తెలిపి అందజేసిన 20 రూపాయల నోట్లను చేతిలో ఉంచుకుని ప్రజలు నిరసన తెలిపారు. అక్కడ భద్రతకు ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆ సమయంలో టీటీవీ అనుచరులు అసభ్యంగా మాట్లాడడంతో ప్రజలు వారికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులు టీటీవీ అనుచరులను అరెస్టు చేసి వ్యానులో తీసుకెళ్లారు. -
న్యాయవ్యవస్థకే ఇది మచ్చవుతుంది
సాక్షి, న్యూఢిల్లీ : కోర్టు నియామకాల్లో కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం చేసుకోకుండా అడ్డుకున్నంత మాత్రాన న్యాయ వ్యవస్థ స్వతంత్రత నిలబడదు. ఎంత పటిష్టంగా, ఎంత వేగంగా తీర్పును వెలువరిస్తోంది అన్న అంశాలపై న్యాయ వ్యవస్థ స్వతంత్రత ఆధారపడి ఉంటుంది. రాజకీయ, పాలనాపరమైన ప్రాధాన్యత గల కేసుల విషయంలో కూడా అంతులేని కాలయాపన చేస్తున్నప్పుడే న్యాయ వ్యవస్థపై పలు అనుమానాలు తలెత్తుతాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. తమిళనాడులో 18 అసెంబ్లీ నియోజక వర్గాలు 2017, సెప్టెంబర్ 18వ తేదీ నుంచి ప్రాతినిధ్యం లేకుండా ఖాళీగా ఉన్నాయి. పాలకపక్ష అన్నాడీఎంకే పార్టీలో అధికార సంక్షోభం ఏర్పడి 18 మంది ఎమ్మెల్యేలు టీటీవీ దినకరన్‌తో జట్టుకట్టారన్న కారణంగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై వారిని అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. ఎడపాడి పళనిస్వామి అతి తక్కువ మెజారిటీతో సభా విశ్వాసాన్ని పొందిన నేపథ్యంలో 18 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ చెల్లదని ప్రతిపక్షం ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆ 18 మంది ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇందిరా బెనర్జీ తీర్పును వాయిదా వేస్తున్నట్టు జనవరి 23వ తేదీన ప్రకటించారు. అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం లేకుండా పోయిన సందర్భాల్లో ప్రజలకు, పాలనా వ్యవహారాలకు ఇబ్బందులు కలుగరాదన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహిస్తోంది. మరెందుకో 18 అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీ అయి ఎనిమిది నెలలు పూర్తవుతున్న తీర్పు వెలువడ లేదు. అదే ఓ పన్నీర్ సెల్వం వర్గానికి చెందిన 11 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ విషయంలో హైకోర్టు త్వరితగతిన కేసును విచారించి త్వరగానే తీర్పును వెలువరించింది. పళనిస్వామితో ఏర్పడిన విభేదాలను పక్కన పెట్టి మళ్లీ ఆయనతో పన్నీర్ సెల్వం వర్గంలోని 11 మంది ఎమ్మెల్యేలు కలిసిపోయారు. పార్టీ విప్‌ను ఉల్లంఘించి ఏఐఏడీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారన్న కారణంగా వాళ్లను సస్పెండ్ చేయాలంటూ విపక్షం కోర్టుకెక్కింది. 11 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై వేగంగా విచారణ పూర్తి చేసిన హైకోర్టు, ఇప్పటికీ పళనిస్వామి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ కేసులో తీర్పు వెలువరించక పోవడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. -
బీజేపీతో దోస్తీ యత్నం
సాక్షి, చెన్నై : బీజేపీకి దగ్గరయ్యేందుకు అమ్మ మక్కల్‌మున్నేట్ర కళగంనేత దినకరన్ మళ్లీ ప్రయత్నాల్లో పడ్డారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత ఒకరి సాయం ద్వారా ఢిల్లీ పెద్దల మన్ననల్ని అందుకునేందుకు మంతనాల్లో ఉన్నట్టు సమాచారం. అయితే, ఢిల్లీ పెద్దలు స్పందించే పరిస్థితుల్లో లేనట్టు›తెలిసింది.అన్నాడీఎంకేని చీల్చి అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంతో చిన్నమ్మ శశికళ ప్రతినిధి దినకరన్ రాజకీయంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. గతంలో ఓ మారు బీజేపీకి దగ్గరయ్యేందుకు దినకరన్ ప్రయత్నాలు చేశారు. ఢిల్లీలో తిష్ట వేసి మరీ ఆయన మంతనాలు సాగించి నా ప్రయోజనం శూన్యం. దీంతో ఆ ప్రయత్నాల్ని పక్కన పెట్టి రాజకీయంగా ఎదిగేందుకు కుస్తీలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో విదేశీ మారక ద్రవ్యం కేసులు, ఐటీ దాడులు దినకరన్ అండ్ బృం దాన్ని సంకట పరిస్థితుల్లోకి నెడుతున్న విషయం తెలిసిందే. చిన్నమ్మ ఫ్యామిలీ ని గురి పెట్టి సాగిన, సాగుతున్న వ్యవహారాలు కొత్త చిక్కుల్ని సృష్టిస్తుండడంతో మళ్లీ దోస్తి ప్రయత్నాల్లో పడ్డారు. కేసులు తమను చుట్టుముట్టకుండా, ఉక్కిరి బిక్కిరి చేయకుండా ఉండే రీతి లో బీజేపీ ప్రసన్నం పొందేందుకు దినకరన్ తీవ్రంగానే ప్రయత్నాల్లో ఉన్నారని తెలిసింది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నల్ల జెండాల ప్రదర్శనకు ప్రతి పక్షాలు పిలుపునిచ్చినా ఆయన స్పందించ లేదన్నది జగమెరిగిన సత్యం. కావేరికి వ్యతిరేకంగా తాను సాగిస్తున్న పోరాటాల్లో రాష్ట్రంలోని పళని సర్కారు మీదే తీవ్ర విమర్శలు ఆరోపణలు గుప్పిస్తున్న దినకరన్, ఎక్కడ కేంద్రాన్ని గానీ, బీజేపీని గానీ పల్లెత్తి మాట అనకపోవడం గమనార్హం. తాజా గా, ఢిల్లీలో పలుకుబడి కల్గిన రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత ద్వారా రాయబారాలు సాగించి, దోస్తీ లేదా, శరణు కోరేందుకు తగ్గట్టుగా ముందుకు సాగుతున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఆ నేత ఢిల్లీ వెళ్లి మరీ తమ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా, స్పందన కరువైనట్టు సమాచారం. దీంతో దినకరన్ ఢీలాపడ్డా, తన ప్రయత్నాన్ని మాత్రం విరమించబోయే ది లేదన్నట్టు ముందుకు సాగుతున్నట్టు ఆయన మద్దతుదారులే పేర్కొంటుండ డం గమనార్హం. ఇందుకు కారణం కేసు ల విచారణలు ముగింపు దశకు వస్తుండడంతో ఎక్కడ కట కటాల పాలు కావా ల్సి ఉంటుందోనన్న బెంగ చిన్నమ్మ ఫ్యామిలీ సభ్యులు పలువుర్ని వెంటాడుతుండడమేనట. -
దినకరన్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: అన్నాడీఎంకే బహిష్కృత నేత, చెన్నై ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌కు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆయన ఇటీవల స్థాపించిన కొత్త పార్టీ గుర్తు, పార్టీ పేరు ఉపయోగించొద్దని దినకరన్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. దినకరన్ పార్టీ గుర్తు, పేరుపై ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. మరోవైపు తాను స్థాపించింది రాజకీయ పార్టీ కాదని, తాత్కాలికంగా చేసుకున్న ఒక ఏర్పాటు మాత్రమేనని స్వయంగా దినకరన్ చెప్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’ అనే కొత్త రాజకీయ పార్టీని ఇటీవల స్థాపించారు. మదురై జిల్లా మేలూరులో నిర్వహించిన సభలో ఆయన పార్టీ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. పైన నలుపు, మధ్యలో తెలుపు, కింది భాగంలో ఎరుపు, మధ్యలో దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నాయకురాలు జయలలిత ఫొటోతో కూడిన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. పార్టీ తొలి సమావేశాన్ని ఈనెల 24వ తేదీన తిరుచ్చిరాపల్లిలో నిర్వహిస్తున్నట్లు దినకరన్ ప్రకటించారు. ఎంజీఆర్, జయలలిత సారథ్యం వహించిన అన్నాడీఎంకే పార్టీని, రెండాకుల చిహ్నాన్ని సాధించి తీరుతామని, అప్పటి వరకు ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’ పేరుతో రాబోయే అన్ని ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బహిష్కృతులైన 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు దినకరన్‌కు మద్దతుగా ఉండటం గమనార్హం. -
చిన్నమ్మ చిరాకు
సాక్షి, చెన్నై: టీటీవీ దినకరన్ కొత్తగా స్థాపించిన ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’పై శశికళ చిరాకు పడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఆవిర్బావ సభలో దినకరన్ తనను తాను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా శశికళను ప్రస్తావించడం, అడయారులోని దినకరన్ ఇంటినే పార్టీ చిరునామాగా చూపడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పెట్టే ఆలోచన లేదని ఈ ఏడాది జనవరి 17వ తేదీన నీలగిరిలో ప్రకటించిన దినకరన్ అకస్మాత్తుగా పార్టీని ప్రకటించడం వెనుక అంతరార్థం ఏమిటని చిన్నమ్మ సన్నిహితుల వద్ద ప్రశ్నించినట్టు సమాచారం. పార్టీ పెట్టడంతో ఎంజీఆర్ సినిమాల్లో విలన్లా అన్నాడీఎంకేను, పార్టీ చిహ్నాన్ని ఎడపాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గానికి దినకరన్ అప్పగించినట్లయిందని శశికళ కోపగించుకున్నట్టు తెలుస్తోంది. దినకరన్ పార్టీ పెట్టడం శశికళ కుటుంబంలోని పలువురు సభ్యులకు కూడా ఇష్టం లేదన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు దినకరన్ పార్టీలో అప్పుడే అసంతృప్తి చెలరేగింది. ద్రవిడ సిద్ధాంతాలను, అన్నాదురైకి తగిన స్థానం కల్పించలేదని ఆరోపిస్తూ సీనియర్ నేత నాంజిల్ సంపత్ శనివారం పార్టీ నుంచి తప్పుకున్నారు. -
దినకరన్‌కు సీనియర్ నేత ఝలక్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ కొత్తగా స్థాపించిన ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’లో ద్రవిడ సిద్ధాంతాలను, అన్నాదురైకి తగిన స్థానం కల్పించలేదని ఆరోపిస్తూ సీనియర్ నేత నాంజిల్ సంపత్ వైదొలిగారు. మరే పార్టీలో చేరనని, రాజకీయ సన్యాసం పుచ్చుకుంటునానని తెలిపారు. నాంజిల్తోపాటు మరికొందరు దినకరన్ అనుచర నేతలు సైతం అదేరకమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమిళ ప్రజలు ఎంతో ఆదరించి అభిమానించే ద్రవిడ సిద్ధాంతాలు, అన్నాదురైకి చోటు లేకుండా కేవలం జయలలిత బొమ్మతో నెగ్గుకురావడం అసాధ్యమని వ్యాఖ్యానిస్తున్నారు. అమ్మను అవమానిస్తున్నారు: దినకరన్ తన పార్టీ పతాకంలో జయలలిత బొమ్మవేయడాన్ని తప్పుపడుతూ పార్టీ నుంచి వైదొలగడం ద్వారా నాంజిల్ సంపత్ అమ్మను అవమానించాడని టీటీవీ దినకరన్ వ్యాఖ్యానించారు. రాజకీయంగా ఆయన ఎంతో సీనియర్ డీఎంకే, ఎండీఎంకేల నుంచి అన్నాడీఎంకేలో చేరినవారన్నారు. ఇపుడే తానేదో పచ్చి అబద్ధాలు చెబుతున్నానని చెప్పడాన్ని అంగీకరించనని అన్నారు. పార్టీ ఏర్పాటు, పేరు నిర్ణయాన్ని అందరితోనూ చర్చించలేనని స్పష్టం చేశారు. ప్రజలు ఏం కొరుకుంటున్నారో అదిమాత్రమే తాను చేయగలనని అన్నారు. పార్టీ తొలి సమావేశాన్ని ఈనెల 24వ తేదీన తిరుచ్చిరాపల్లిలో నిర్వహిస్తున్నట్లు దికరన్ ప్రకటించారు. -
తమిళనాడులో మరో రాజకీయ పార్టీ
-
కీలక నిర్ణయం వెల్లడించిన దినకరన్
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే పార్టీ బహిష్కృత నేత టీటీవీ దినకరన్ కీలక నిర్ణయం వెల్లడించారు. కొత్త పార్టీ లాంఛ్ తేదీని ప్రకటించాడు. గత కొంత కాలంగా దినకరన్ కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నాడంటూ తమిళ రాజకీయాల్లో చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీన కొత్త పార్టీ ప్రకటనతోపాటు పార్టీ గుర్తును కూడా ప్రకటించబోతున్నారు. మధురైలో బహిరంగ సభ ఏర్పాటు ద్వారా తన పార్టీ సిద్ధాంతాలను దినకరన్ వెల్లడించనున్నారు. కమల్, రజనీ రాజకీయ అరంగ్రేటం.. దీంతోపాటు పలువురు ప్రముఖులు రాజకీయాల్లో క్రియా శీలకంగా వ్యవహరించేందుకు సిద్ధమైతున్నారు. ఈ నేపథ్యంలోనే దినకరన్ త్వరపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి పళని సామి.. పన్నీర్‌సెల్వంతో కలిసి అన్నాడీఎంకే పార్టీపై పట్టుసాధించిన విషయం తెలిసిందే. శశికళ-దినకరన్ వర్గంపై వేటు వేసి, వారిని అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరించారు. అయినప్పటికీ ఆర్కే నగర్ ఉప ఎన్నికలో దినకరన్ స్వతంత్ర్యగా అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఓవైపు పార్టీలో సభ్యత్వం.. మరోవైపు రెండాకుల గుర్తును కూడా కోల్పోయిన నేపథ్యంలోనే దినకరన్ కొత్త పార్టీ ఆలోచన చేశారు. -
దినకరన్ రాజీ ఫార్ములా!
సాక్షి, చెన్నై: అధికార అన్నాడీఎంకేలో విలీనమయ్యేందుకు సిద్ధమని బహిష్కృత నేత టీటీవీ దినకరన్ ప్రకటించారు. తన డిమాండ్లను నెరవేరిస్తే అన్నాడీఎంకే ప్రభుత్వంలో చేరతానని తెలిపారు. తనకు ముఖ్యమంత్రి కావాలన్న ఆశ లేదని స్పష్టం చేశారు. పళనిస్వామి మంత్రివర్గంలో తాను సూచించిన ఆరుగురిని తొలగించాలన్నారు. అనర్హత వేటు వేసిన 18 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిని ముఖ్యమంత్రి చేస్తే అన్నాడీఎంకేలో విలీనం అయ్యేందుకు సిద్ధమని ప్రకటించారు. దినకరన్ డిమాండ్లపై పళనిస్వామి సర్కారు స్పందించాల్సివుంది. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన తర్వాత దినకరన్ దూకుడు పెంచారు. పళనిస్వామి ప్రభుత్వాన్ని పడగొడతానని శపథం చేశారు. పళనిస్వామిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తే అన్నాడీఎంకేలో విలీనమవుతామని ముందునుంచి ఆయన చెబుతున్నారు. తన వెంటవున్న 18 మంది ఎమ్మెల్యేలపై పళని సర్కారు అనర్హత వేటు వేయడంతో ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరించడంతో ఆర్కే నగర్ ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి దినకరన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలకు సమానదూరం పాటిస్తూ ఆయన తన గళం విన్పిస్తున్నారు. -
దినకరన్ కు పోటీగా కృష్ణప్రియ?
సాక్షి, చెన్నై : చెన్నై ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ గెలుపు శశికళ కుటుంబాలకు రాజకీయ లాభం చేకూర్చకపోగా విభేదాల చిచ్చుపెట్టింది. దినకరన్‌కు వ్యతిరేకంగా పలువురు కుటుంబ సభ్యులు రాజకీయబాటలు వేస్తుండగా, శశికళ అన్న కుమార్తె డాక్టర్ కృష్ణప్రియ (ఇళవరసి కుమార్తె) ఈనెల 24వ తేదీన జయలలిత జయంతి రోజున రాజకీయ ప్రవేశానికి ముహూర్తం పెట్టుకున్నట్లు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ జైలుకెళ్లడంతో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంలు ఏకమైన ఆర్కేనగర్ ఎమ్మెల్యే, శశికళ అక్క కుమారుడైన టీటీవీ దినకరన్‌ను పార్టీతో సంబంధం లేకుండా ఏకాకిని చేశారు. ఈపీఎస్, ఓపీఎస్లను లెక్కచేయకుండా 20 మందికి పైగా ఎమ్మెల్యేలు దినకరన్ పక్షాన నిలిచారు. ఆ తరువాత పార్టీ, రెండాకుల చిహ్నం ఎడపాడి వశం కావడంతో దినకరన్ వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ఎడపాడి వైపు వెళ్లిపోయారు. దీంతో దినకరన్ బలం 18 మంది ఎమ్మెల్యేలకు పడిపోయింది. ఈ 18 మందిపై కూడా స్పీకర్ చేత సీఎం అనర్హత వేటు వేయించారు. ఈ వేటు వివాదం కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ పరిణామాలను సవాలుగా తీసుకున్న దినకరన్ ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్య అభ్యర్దిగా పోటీచేసి వ్యూహాత్మకంగా గెలుపొందారు. దినకరన్ గెలుపు ఎడపాడిని బెంబేలుకు గురి చేసింది. అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం, అధికారం చేతిలో ఉన్నా దినకరన్ గెలుపొందడంతో ఎడపాడి, పన్నీరు కంగారుపడగా, జైల్లో ఉన్న శశికళకు అంతులేని ఆనందం కలిగింది. అంతేగాక కొత్తపార్టీ పెట్టాలనే ఆలోచన ఇద్దరిలోనూ మొలకెత్తింది. ఆర్కేనగర్లో గెలుపు తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో శాశ్వతంగా నిలబడాలనే ఆశ దినకరన్లో ఏర్పడింది. కొత్త పార్టీపై దినకరన్ తరచూ శశికళను కలుస్తున్నారు. అంతేగాక జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకుంటున్నారు. అయితే కుటుంబ సభ్యులు అప్పుడప్పుడూ దినకరన్ పట్ల వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. దినకరన్ రాజకీయ ఎదుగుదల, శశికళకు మరింత చేరువకావడం కుటుంబ సభ్యులకు కంటగింపుగా మారింది. పైగా శశికళ భద్రంగా దాచి ఉంచిన జయ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీడియో దృశ్యాలను ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో తన గెలుపుకోసం దినకరన్ వినియోగించుకోవడం మరింత మనస్పర్థలకు దారితీసింది. ఇదే అంశంపై కృష్ణప్రియ, దినకరన్‌ల మధ్య విభేధాలు తలెత్తాయి. కృష్ణప్రియ సైతం దినకరన్‌ను వ్యతిరేకంగా పావులు కదపడం ప్రారంభించారు. ఈనెల 24వ తేదీన దివంగత ముఖ్యమంత్రి జయలలిత జయంతి సందర్భంగా రాజకీయ ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ప్రధానంగా ఈ వివాదమే కృష్ణప్రియను రాజకీయ అరంగేట్రానికి పురిగొల్పినట్లు భావిస్తున్నారు. కాగా, శశికళ తమ్ముడు దివాకరన్, ఇళవరసి కుమారుడు వివేక్, కుమార్తె కృష్ణప్రియల అడుగు జాడలోనే దినకరన్ సోదరుడు భాస్కరన్ సైతం రాజకీయ ప్రవేశంపై తహతహలాడుతున్నారు. శశికళ మనస్తాపం.. 2015 డిసెంబరు 4వ తేదీనే జయ కన్నుమూసినట్లు దివాకరన్ ప్రకటించి వివాదం లేవనెత్తడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసి ఇకపై అలాంటి ప్రకటనలు చేయరాదని ఖండించారు. ఇలా ఒక్కొక్కరుగా దినకరన్‌కు దూరం జరిగిపోవడమేగాక కుటుంబ సభ్యుల మధ్య కీచులాటలతో శశికళ మనస్తాపానికి గురవుతున్నారని తెలుస్తోంది. విబేధాలు తీవ్రం.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 234 స్థానాల్లో పోటీచేస్తామని దినకరన్ సోదరుడు భాస్కరన్ ఇటీవల ప్రకటించారు. భాస్కరన్ చేసిన ప్రకటన దినకరన్ అనుచరుల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. దినకరన్ సోదరుడే రాజకీయాల్లోకి దిగితే ఎవరివైపు నిలవాలనే ఆలోచనలో పడ్డారు. కాగా తిరువళ్లూరు జిల్లా అన్నాడీఎంకే క్యాడర్లో కొంతవరకు శశికళ తమ్ముడు దివాకరన్ వైపు ఉండేది. అయితే జయ మరణం తరువాత కొందరు చేజారిపోగా మరి కొంతమంది దినకరన్ పక్షాన నిలిచి ఉన్నారు. వీరందరినీ తనవైపు తిప్పుకోవాలని దివాకరన్ ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఓపీఎస్, ఈపీఎస్ బండారం బట్టబయలు!
సాక్షి, చెన్నై: తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకవైపు సినీ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చేందుకు వేగంగా సన్నాహాలు చేస్తుండగా.. మరోవైపు శశికళ వర్గం కూడా సొంత కుంపటి పెట్టేదిశగా అడుగులు వేస్తోంది. ఇటీవల ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించిన టీటీవీ దినకరన్ సొంత పార్టీ పెట్టేదిశగా వేగంగా కదులుతున్నారు. మద్దతుదారులతో చర్చించి త్వరలోనే కొత్త పార్టీని ప్రకటిస్తానని తాజాగా బుధవారం దినకరన్ వెల్లడించారు. అన్నాడీఎంకేను, రెండాకుల గుర్తును కాపాడుకోవడానికే కొత్త పార్టీని పెట్టాలని భావిస్తున్నట్టు దినకరన్ తెలిపారు. రెండాకుల గుర్తును సొంతం చేసుకుంటామని అన్నారు. అన్నాడీఎంకేకు చెందిన 90శాతం కేడర్ తనవైపే ఉందని దినకరన్ ధీమా వ్యక్తం చేశారు. ఓపీఎస్, ఈపీఎస్‌లకు తప్ప అందరికీ తన పార్టీలో స్థానం ఉంటుందన్నారు. ఓపీఎస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే.. అన్నాడీఎంకేలోని స్లీపర్ సెల్స్ బయటకు వస్తారని తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలను ఉద్దేశించి అన్నారు. ఓపీఎస్ ప్రభుత్వం కూలిపోతుందని, ప్రభుత్వం పడిపోయాక ఓపీఎస్, ఈపీఎస్ బండారం బట్టబయలు చేస్తానని హెచ్చరించారు. సీఎం ఓపీఎస్ ఎంతటి అవినీతి తిమింగలమో త్వరలోనే బయటపెడతానని పేర్కొన్నారు. సినిమా వారు ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు అని రజనీ, కమల్ ఎంట్రీ గురించి కామెంట్ చేశారు. కానీ సినిమాలే కాక రాజకీయాల్లో అనేక విషయాలు ఉంటాయని, ఆ విషయాలు తమకు తెలుసునని అన్నారు. అందుకే రాబోయే రోజుల్లో తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. -
దినకరన్ సంచలన నిర్ణయం
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కొత్తపార్టీ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఈ మేరకు మంగళవారం పుదుచెర్రిలో మద్దతుదారులతో ఆయన మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం ఎంజీఆర్ జయంతి వేడుకల నేపథ్యంలో దినకరన్ కొత్త పార్టీ ప్రకటన చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్నీమధ్యే ఆర్కే నగర్ ఉప ఎన్నికలో దినకరన్ స్వతంత్ర్యగా అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. మూడు నెలలో ప్రభుత్వం కూలిపోతుందని.. అన్నాడీఎంకే నుంచి బయటకు రావాలంటూ ఆ సందర్భంలో దినకరన్ నేతలకు పిలుపునిచ్చాడు. శశికళ జైలుకెళ్లిన తర్వాత ముఖ్యమంత్రి పళని సామి.. పన్నీర్‌సెల్వంతో కలిసి అన్నాడీఎంకే పార్టీపై పట్టుసాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శశికళ-దినకరన్ వర్గంపై వేటు వేసి, వారిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఓవైపు పార్టీలో సభ్యత్వం.. మరోవైపు రెండాకుల గుర్తును కూడా కోల్పోయిన నేపథ్యంలోనే దినకరన్ కొత్త పార్టీ ఆలోచన చేసినట్లు స్పష్టమౌతోంది. -
తీవ్ర విమర్శలు.. వెనక్కి తగ్గేది లేదు!
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నిక, ఎమ్మెల్యే దినకరన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు కమల్ హాసన్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. కేసులు ఎదుర్కునేందుకైనా తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. ప్రస్తుతం మలేషియాలో ఉన్న ఆయనను మీడియా సంప్రదించింది. ‘‘నాపై కేసు నమోదైన ఫర్వాలేదు. వెనక్కి తగ్గను. న్యాయపరంగానే నేను వాటిని ఎదుర్కుంటా’’ అని మీడియాకు కమల్ బదులిచ్చారు. కాగా, ఆనంద వికటన్ కోసం రాసిన వ్యాసంలో కమల్ వ్యాసం ద్వారా దినకరన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఓటర్లను డబ్బుతో కొనుగోలు చేసి దినకరన్ గెలిచారని.. ఈ విషయంలో తనపై ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గబోనని కమల్ పేర్కొన్నారు. కాగా, ఆర్కేనగర్ ఓటర్లు ఓటుకు రూ. 20వేలు పుచ్చుకునేందుకు ఒక దొంగ వద్ద బిక్షమెత్తుకున్నారని కమల్ ఆ వ్యాసంలో రాశారు. కమల్ చేసిన ఈ విమర్శలు దినకరన్ అనుచరుల్లో ఆగ్రహాన్ని తెప్పించాయి. దినకరన్‌తోపాటు ఆర్కే నగర్ ఓటర్లను కమల్ అవమానించారని ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. దీంతో కమల్‌పై కేసు నమోదు అయ్యింది. జనవరి 12న ఈ కేసు విచారణకు రానుంది. ఇది కూడా చదవండి... తీవ్ర ఆరోపణలు.. కమల్ ఇంటి వద్ద బందోబస్తు -
రజనీ ఎంట్రీపై మరోసారి కమల్ కామెంట్
సాక్షి, చెన్నై: సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై నటుడు కమల్ హాసన్ మరోసారి స్పందించారు. రజనీకాంత్ రాజకీయాల్లో రావాడాన్ని స్వాగతిస్తున్నానట్టు తెలిపారు. నడిగర్ సంఘం స్టార్ నైట్ కార్యక్రమానికి మలేసియా వెళుతూ చెన్నై విమానాశ్రయంలో కమల్ హాసన్ మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లోకి వస్తున్నానని రజనీ ప్రకటన చేయగానే తాను స్వాగతించానని గుర్తుచేశారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ విజయంపై తాను వ్యాఖ్యలు చేయటంపై కూడా కమల్ స్పందించారు. ఈ విషయంలో తనపై ఏ ఫిర్యాదులు, కేసులు వచ్చినా చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమని అన్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో ధనప్రభావం కారణంగానే దినకరన్ గెలిచారని, ఈ విజయం భారత ప్రజాస్వామ్యానికి మచ్చ అని కమల్ హాసన్ తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ వ్యాఖ్యలపై దినకరన్ వర్గీయులు తీవ్రంగా మండిపడుతున్నారు. కమల్‌పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. -
దినకరన్‌తో మనకొద్దు..
అధికార అన్నాడీఎంకేకు కొరకరాని కొయ్యగా మారిన టీటీవీ దినకరన్ ఎమ్మెల్యేగా గెలుపొందడం సీఎం ఎడపాడి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వంను మరింత ఇరుకున పడేసింది. ఈనెల 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల సమయంలో దినకరన్ వలలో చిక్కుకోకుండా ఎడపాడి, పన్నీర్ ఎమ్మెల్యేలకు హితవచనాలు పలికారు. దినకరన్‌కు దూరంగా మెలగాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సాక్షి, చెన్నై: అసెంబ్లీ సమావేశాలు ఈనెల(జనవరి) 8వ తేదీన ప్రారంభం కానున్నాయి. బొటాబొటీ మెజారిటీ, ప్రతిపక్షాలు సంధించనున్న ప్రశ్నలు, ఎమ్మెల్యేగా దినకరన్ వంటి అనేక సవాళ్లు సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో అధికార పార్టీ సమావేశాన్ని నిర్వహించింది. పార్టీ కన్వీనర్, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, కో కన్వీనర్, ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి సమావేశానికి సంయుక్తంగా నాయకత్వం వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు నడుచుకోవాల్సిన తీరు, ప్రతిపక్షాల ప్రశ్నలను ఎదుర్కోవడం ఎలా తదితర అంశాలపై చర్చించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి పోటీచేసి గెలుపొందిన దినకరన్ వర్గంలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్న వారిని స్లీపర్‌సెల్ ఎమ్మెల్యేలుగా పిలుస్తున్నారు. బుధవారం నాటి సమావేశానికి పలువురు స్లీపర్‌సెల్ ఎమ్మెల్యేలు గైర్హాజరు అవుతారని ముందుగానే అంచనావేశారు. అంచనాకు తగినట్లుగానే ముగ్గురు మంత్రులు సహా ఏడుగురు ఎమ్మెల్యేలు హాజరుకాలేదని పార్టీ అధికారికంగా ప్రకటించింది. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలు శబరిమలైకి వెళ్లారు. మంత్రులు కడంబూరు రాజా, భాస్కరన్ శివగంగైలో ఒక ప్రయివేటు కార్యక్రమానికి హాజరుకావడంతో గైర్హాజరు అయినట్లు చెబుతున్నారు. అలాగే అన్నాడీఎంకే రెండాకుల చిహ్నంపై పోటీచేసిన మిత్రపక్షానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. గైర్హాజరైన ఏడుగురు ఎమ్మెల్యేలను మినహాస్తే 104 మంది హాజరుకావాల్సి ఉంది. దినకరన్‌ను చూసి నవ్వడం, మాట్లాడడం చేయరాదు.. అయితే మొత్తం 95 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరుకాగా మొత్తం మీద పది మంది ఎమ్మెల్యేల వరకు ముఖం చాటేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, అసెంబ్లీకి హాజరైన దినకరన్ చూసి నవ్వడం, మాట్లాడడం చేయరాదని ఆదేశించారు. ఆయనతో ఏమాత్రం సంబంధం లేనట్లుగా వ్యవహరించాలని సూచించారు. పన్నీర్, ఎడపాడి ఎమ్మెల్యేలకు ఇంకా అనేక హితవచనాలు పలికారు. పార్టీ, ప్రభుత్వానికి ద్రోహం, కుతంత్రం తలపెట్టే చర్యలకు పాల్పడరాదని, ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా సమాధానం చెప్పాలని, దినకరన్ గనుక ఏవైనా ప్రశ్నలు సంధిస్తే ఆయా శాఖలకు చెందిన మంత్రులు మాత్రమే సమాధానం చెబుతారని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు సిద్ధంగా ఉండాలి.. మార్చి లేదా ఏప్రిల్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉండాలని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కేకలు, ఆందోళనలకు దిగరాదని, విప్ ఆదేశాలను పాటించాలని కోరారు. పార్టీ మెతకవైఖరే ఆర్కేనగర్ ఎన్నికల్లో ఓటమికి కారణమని చెప్పారు. డీఎంకే, టీటీవీ దినకరన్‌లకు ప్రత్యేక ప్రసార మాధ్యమాలు ఉన్నాయి, అధికారంలో ఉన్న తమకు లేకుంటే ఎలా అని అన్నాడీఎంకే ఆలోచనలో పడింది. ప్రత్యేకంగా ఒక టీవీ చానల్, దినపత్రికను ప్రారంభించాలని భావిస్తోంది. ప్రత్యేకంగా ఒక టీవీ చానల్ అన్నాడీఎంకే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు విస్తృత ప్రచారం కోసం ప్రత్యేకంగా ఒక టీవీ చానల్, దినపత్రికను తీసుకురావాలనే అంశంపై చర్చించారు. పార్టీ, ప్రభుత్వం గురించి మీడియాతో మాట్లేడేందుకు 12 మంది అధికార ప్రతినిధులను ఈ సమావేశంలో ఎంపిక చేశారు. అధికార ప్రతినిధులు మినహా ఇతరులెవ్వరూ మీడీయాతో మాట్లాడరాదని స్పష్టం చేశారు. అసెంబ్లీకి దినకరన్ రాక వల్ల తమకు వచ్చిన నష్టమేమీ లేదని మంత్రి జయకుమార్ మీడియాతో అన్నారు. -
ఆ నలుగురు.. రంజుగా తమిళ రాజకీయం
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే తిరుగుబాటు నేత, ఆర్కే నగర్ ఎమ్మెల్యే దినకరన్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి పళనిస్వామి తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. మూడు నెలల్లో పళని ప్రభుత్వం కూలిపోతుందంటూ ఫలితాల రోజున దినకరన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం పళని, శనివారం ఊటీలో నిర్వహించిన ఎంజీఆర్ జయంతి ఉత్సవాల్లో స్పందించారు. ‘‘1974లో నేను అన్నాడీఎంకేలో చేరా. కార్యకర్త స్థాయి నుంచి పని చేసి ఆ స్థాయికి ఎదిగా. నాతోపాటు చాలా మంది అన్నాడీఎంకే కోసం అహర్శిశలు కృషి చేశాం. కానీ, దినకరన్ మాత్రం దొడ్డి దారిలో పార్టీలోకి ప్రవేశించారు అని అన్నారు. ఆర్కే నగర్ లో దినకరన్ విజయం సాధించడానికి కారణం హవాలా ఫార్ములానే అని పళని ఉద్ఘాటించారు. ఇదే సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న దినకరన్ ఎక్కడకు వెళ్లాలో అక్కడికే వెళతారంటూ వ్యాఖ్యలు చేశారు. తాము ప్రజల కోసం పాటుపడుతుంటే... దినకరన్ సొంత కుటుంబం కోసం పాకులాడుతున్నారని పళని విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలిచిన దినకరన్ ఆ పదవిని కొంత కాలం మాత్రమే అనుభవించగలరని.. భవిష్యత్తులో అతనికి గుణపాఠం చెప్పి తీరతామని పళని పేర్కొన్నారు. ఇక రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ అంశంపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. దినకరన్ ఓ బచ్చా... పన్నీర్ సెల్వం మరోవైపు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం కూడా దినకరన్ పై మండిపడ్డారు. అన్నాడీఎంకేలో తాను సీనియర్ నని, దినకరన్ ఓ బచ్చా.. ఎల్కేజీ స్టూడెంట్ అని ఎద్దేవా చేశారు. జయలలిత చేత పార్టీ నుంచి బహిష్కరింపబడిన వారు ఇప్పుడు పార్టీపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని మండిపడ్డారు. పార్టీని కూల్చాలని దినకరన్, డీఎంకేలు చేసే యత్నాలు ఫలించవని ఆయన చెప్పారు. రజనీ ఎంట్రీపై దినకరన్ స్పందన... రజనీకాంత్ రాజకీయ ప్రవేశ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ... దినకరన్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రకటన వెలువడటానికి ముందే నిన్న ఓ జాతీయ మీడియాతో దినకరన్ మాట్లాడుతూ.. తమిళనాడుకు ఒకే ఎంజీఆర్.. ఒకే అమ్మ(జయలలిత) ఉంటారు. వారి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అని తెలిపారు. అమ్మ విధేయులను తప్ప వేరే ఏ ముఖాన్ని ఆమె అభిమానులు అంగీకరించబోరని దినకరన్ చెప్పారు. తమిళ రాజకీయంలో ప్రస్తుతానికి ప్రతిపక్ష డీఎంకే ప్రేక్షక పాత్ర వహిస్తుండగా.. ఈ నలుగురు మాత్రం వార్తల్లో నిలుస్తూ ట్రెండింగ్‌గా మారారు. -
మా స్లీపర్ సెల్ బయటకు వస్తుంది: దినకరన్
చెన్నై : తమిళనాడు ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన టీటీవీ దినకరన్ శుక్రవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ సచివాలయంలో దినకరన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన దినకరన్ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం అనంతరం దినకరన్ మాట్లాడుతూ మూడు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని తెలిపారు. తమ స్లీపర్ సెల్ బయటకు వస్తుందని, మార్చిలో ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. ఇప్పటికైనా వెన్నపోటుదారులు, ద్రోహులు ...ప్రభుత్వాన్ని తమకు అప్పగించాలన్నారు. లేకుంటే తమ విశ్వరూపం చూపిస్తామని దినకరన్ హెచ్చరించారు. త్వరలోనే ఆయన ఆర్కేనగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. -
దినకరన్ వస్తే ఒక్క మాట మాట్లడలేదా?
సాక్షి, బెంగళూర్ : ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఘన విజయం తర్వాత ఆ ఆనందాన్ని తన అత్తతో పంచుకునేందుకు టీటీవీ దినకరన్ జైలుకు వెళ్లి కలిసొచ్చిన విషయం తెలిసిందే. బెంగళూర్ పరప్పన అగ్రహార జైలులో దాదాపు ఆర గంట సేపు వీరు భేటీ అయ్యారు. అయితే ఈ సందర్భంగా ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదని తెలుస్తోంది. అందుకు కారణం ఆమె మౌన వ్రతం పాటించటమేనంట. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత తొలి వర్థంతి సందర్భంగా ఆమె నెచ్చెలి అయిన శశికళ మౌనవ్రతాన్ని పాటిస్తున్నారు. డిసెంబర్ 5న జయలలిత తొలి వర్థంతి కాగా, ఆమెకు నివాళిగా నాటి నుంచి ఆమె ఈ వ్రతాన్ని ప్రారంభించారు. ఈ విషయాన్ని ఏఐఏడీఎంకే శశికళ వర్గం సెక్రెటరీ వీ పుహళెంది మీడియాకు వెల్లడించారు. దాదాపు అరగంట సేపు దినకరన్, తాను చెప్పాలనుకున్న విషయాలను శశికళకు చెప్పి, ఆమె అభిప్రాయాలను చూపులతోనే తెలుసుకుని వచ్చారని పుహళెంది చెప్పారు. కేవలం చూపులతోనే పలకరించారని, చిరునవ్వే ఆమె మాటలైనాయని ఆయన అన్నారు. జనవరిలో ఆమె తన మౌనవ్రతాన్ని విరమిస్తారని ఆయన అన్నారు. కాగా, ఈ సంవత్సరం ఫిబ్రవరి 15 నుంచి శశికళ జైలు జీవితాన్ని గడుపుతుండగా, మొత్తం నాలుగేళ్ల శిక్షను అనుభవించాల్సి వుందన్న సంగతి తెలిసిందే. జైలుకు వెళ్లే సమయంలో అమ్మ సమాధిపై చిన్నమ్మ తట్టి శపథం చేయటం గుర్తుంది కదా. -
దినకరన్‌కు నోటీసులు..!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆకస్మిక మరణం రాను రానూ అనుమానాస్పద మృతిగా మారిపోతున్న తరుణంలో జయ మరణ విచారణ కమిషన్ టీటీవీ దినకరన్‌కు బుధవారం నోటీసులు జారీచేసింది. అలాగే శశికళ మేనకోడలు, ఇళవరసి కుమారై్తన కృష్ణప్రియ, జయలలితకు అంతరంగిక కార్యదర్శిగా వ్యవహరించిన పూంగున్రన్లకు నోటీసులు జారీ అయినాయి. జయ మరణంపై అనేక అనుమానాలు తలెత్తడంతో సీఎం ఎడపాడి సెప్టెంబరు 25 వ తేదీన విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. రిటైర్డు న్యాయమూర్తి అరుముగస్వామి చైర్మన్‌గా నియమితులైనారు. గత నెల 22వ తేదీన విచారణ ప్రారంభం కాగా, డీఎంకే లీగల్‌సెల్ కార్యదర్శి డాక్టర్ శరవణన్, జయ మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్, దీప భర్త మాధవన్, తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు షీలా బాలకృష్ణన్, రామమోహన్‌రావు సహా ఇప్పటి వరకు 28 మంది కమిషన్ ముందు హాజరై వాంగ్మూలం ఇచ్చారు. వీరుగాక మరో 422 మంది కమిషన్‌కు వినతిపత్రాలు సమర్పించారు. అపోలో ఆసపత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి, వైస్ చైర్మన్ ప్రీతారెడ్డి, శశికళ సైతం విచారణ కమిషన్ నుండి నోటీసులు అందుకున్నారు. ఈ ముగ్గురు కమిషన్ ముందు హాజరుకావాల్సి ఉంది. ఇదిలా ఉండగా, అపోలో ఆసుపత్రిలో జయ చికిత్స దృశ్యాలను ఆర్కేనగర్ ఉప ఎన్నికల పోలింగ్ ముందు దినకరన్ అనుచరుడైన బహిషృత ఎమ్మెల్యే వెట్రివేల విడుదల చేయడాన్ని కమిషన్ తీవ్రంగా తప్పుపట్టింది. వీడియోల విడుదల నేరం: విచారణ జరుగుతున్న సమయంలో వీడియో విడుదల చేయడం నేరమని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కమిషన్ ఆదేశాల మేరకు వీడియో ఆధారాలను తన న్యాయవాది ద్వారా వెట్రివేల్ కమిషన్‌కు అందజేశాడు. జయలలిత చికిత్సకు సంబంధించి తన వద్ద మరిన్ని దృశ్యాలు ఉన్నాయని కృష్ణప్రియ మీడియాకు చెప్పడం కమిషన్ నుండి నోటీసులకు కారణమైంది. వచ్చేనెల 2వ తేదీన కృష్ణప్రియ కమిషన్ ముందు హాజరుకావాల్సి ఉంది. జయలలిత వీడియోకు సంబంధించి మరిన్ని ఆధారాలుంటే వారంలోగా అందజేయాలని పేర్కొంటూ దినకరన్‌కు నోటీసులు అందాయి. జయ చికిత్సకు సంబంధించిన వీడియోల విడుదలపై విచారణ కమిషన్ నిషేధం విధించింది. -
దినకరన్.. ఇలా గెలిచెన్!
సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత ఆకస్మిక మరణానికి శశికళే కారణమంటూ ప్రచారం ఓవైపు.. ఎన్నికల కమిషన్‌కి లంచం ఇవ్వజూపిన కేసులో జైలుకెళ్లిన అప్రతిష్ట మరోవైపు.. పళనిస్వామి ప్రభుత్వానికి పుష్కలంగా కేంద్రం అండదండలు, డీఎంకేకు సమర్థమైన నాయకత్వం.. ఇవేవీ ఆర్కే నగర్ ఉప ఎన్నికలో టీటీవీ దినకరన్ (శశికళ సోదరి కుమారుడు) విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. దీనికితోడు ‘అమ్మ’ కంటే దినకరన్‌కే అధిక మెజారిటీని ఆర్కేనగర్ ఓటర్లు కట్టబెట్టడం, నోటాకన్నా బీజేపీకి తక్కువ ఓట్లు రావటం విస్తుపోయేలా చేసింది. ‘ఆర్కేనగర్’కు ఆర్థిక సాయం అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తర్వాతే దినకరన్ పేరు తెరపైకి వచ్చింది. శశికళకు పాదాభివందనం చేసి పార్టీ పగ్గాలు ఇచ్చిన నేతలు ఆమె జైలుపాలు కాగానే తగిన కారణం చూపకుండానే దినకరన్‌పై బహిష్కరణ వేటు వేయడం ప్రజల్లో సానుభూతి కలిగించిందని విశ్లేషకులంటున్నారు. అదే సమయంలో తమ పదవులు కాపాడుకోవడమే ధ్యేయంగా పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గాలు విలీనం కావడం విమర్శలకు దారితీసింది. రెండాకుల గుర్తు కోసం ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపి జైలుకు వెళ్లిన దినకరన్.. తిరిగొచ్చిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటూ.. నేతలను, కార్యకర్తలను చేరదీశారు. ఆర్కే నగర్లో ఎక్కువ మంది పేద, మధ్య తరగతికి చెందిన వారే. దీంతో దినకరన్ తన సొంత డబ్బుతో స్థానిక ప్రజల రుణాలు తీర్చినట్లు తెలుస్తోంది. జయ మరణం తర్వాత ఓసారి ఉపఎన్నిక రద్దవటం, పెద్ద ఎత్తున డబ్బులు స్వాధీనం చేసుకున్నా.. దినకరన్ వెనుకంజ వేయలేదు. తన అనుచరుల ద్వారా అక్కడి పేదలకు సాయం చేస్తూ సంబంధాలు కొనసాగించినట్లు తెలిసింది. ఎన్నికకు ముందు రోజు వ్యూహాత్మకంగా ఓ వీడియో రిలీజ్ అయ్యింది. అందులో ఆస్పత్రిలోని బెడ్‌పై జయలలిత జ్యూస్ తాగుతున్నట్లు కనిపించారు. ఇది కూడా శశికళపై ఆగ్రహం తగ్గేందుకు కారణమైందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అటు, ఎన్నికకు ముందురోజు దినకరన్ భారీగా డబ్బులు పంపిణీ చేసినట్లు వార్తలొచ్చాయి. బీజేపీ పరోక్ష సాయం ప్రాంతీయ అభిమానం మెండుగా ఉన్న తమిళ ఓటర్లు రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ జోక్యాన్ని సహించలేకపోయారు. పళనిస్వామి, పన్నీర్‌సెల్వం కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా మారడాన్ని జీర్ణించుకోలేకపోయారు. అదే సమయంలో అధికార పార్టీ అభ్యర్థి మధుసూదనన్ ఓటమికి అసమర్థ నాయకత్వం కూడా ఓ కారణమని విశ్లేషకులు అంటున్నారు. అటు, ఆర్కేనగర్లో డీఎంకేకు చెక్కుచెదరని ఓటు బ్యాంకు ఉంది. అయినా కూడా ఆ పార్టీకి డిపాజిట్ రాకపోవడం గమనార్హం. దినకరన్ గెలిస్తే అన్నాడీఎంకే ప్రభుత్వం బలహీనపడుతుందనే వ్యూహంతోనే స్టాలిన్ మిన్నకుండిపోయారనే ప్రచారం జరుగుతోంది. డీఎంకే కూడా బీజేపీ గూటికి చేరుతుందనే అనుమానాలతో ప్రజలు ఆ పార్టీకి మొండిచేయి చూపారని భావిస్తున్నారు. కరుణానిధిని మోదీ పరామర్శించడం, కేంద్రానికి వ్యతిరేకంగా తలపెట్టిన కార్యక్రమాలను డీఎంకే విరమించుకోవడం, పోలింగ్ సమయంలోనే కనిమొళి, రాజా 2జీ కేసులో నిర్దోషులుగా తేలడం వంటివి ఆర్కే నగర్ ఓటర్లు డీఎంకేనూ పక్కన పెట్టేందుకు కారణమయ్యాయంటున్నారు. -
అన్నాడీఎంకేలో సంచలనం; ఆరుగురిపై వేటు
సాక్షి, చెన్నై: తమిళ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో ఓటమి నేపథ్యంలో అధికార అన్నాడీఎంకే పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరుగురు నాయకులను పార్టీ పదవుల నుంచి తొలగించింది. ఎస్. వెట్రివేల్, తంగ తమిళ సెల్వన్, రంగస్వామి, ముత్తయ్య, వీపీ కళైరాజన్, షోలింగుర్ పార్తీబన్ లను పార్టీ పదవుల నుంచి తప్పిస్తూ అన్నాడీఎంకే ఉన్నతస్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆర్కే నగర్లో శశికళ వర్గం అభ్యర్థి టీటీవీ దినకరన్ ఘన విజయం సాధించడంతో అధికార, విపక్ష పార్టీలు ఉలిక్కిపడ్డాయి. ఆర్కే నగర్లో ఊహించనివిధంగా ఓటమి పాలవడంతో అధికార అన్నాడీఎంకే ఉన్నతస్థాయి నాయకులు పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం అత్యవసరంగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ‘అమ్మ’ కంచుకోటలో పార్టీ పరాజయం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఓటమికి బాధ్యులైన వారిని పార్టీ పదవుల నుంచి తొలగించాలని సమావేశంలో నిర్ణయించారు. మరోవైపు తన వర్గం ఎమ్మెల్యేలతో ఈ మధ్యాహ్నం దినకరన్ భేటీకానున్నారు. రేపు బెంగళూరు వెళ్లి శశికళను కలిసేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారు. మూడు నెలల్లో ఈపీఎస్, ఓపీఎస్ ప్రభుత్వం పడిపోవడం ఖాయమని దినకరన్ నిన్న వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
అమ్మ కోటలో చిన్నమ్మ తడాఖా
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాట ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే, విపక్ష డీఎంకేలకు గట్టి షాక్ తగిలింది. శశికళ వర్గం అభ్యర్థి, ఆమె సోదరి కుమారుడు టీటీవీ దినకరన్.. ఆ రెండు పార్టీల అభ్యర్థుల్ని చిత్తుగా ఓడించి 40 వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో డీఎంకే, బీజేపీ సహా 58 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్కే నగర్ నుంచి తమిళనాడు మాజీ సీఎం జయలలిత సాధించిన 39,545 ఓట్ల మెజార్టీని కూడా దినకరన్ అధిగమించి సత్తా చాటారు. జయలలిత మరణంతో డిసెంబర్ 21న ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. తమిళనాడుకు భిన్నంగా.. పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్‌ల్లో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించింది. మొత్తం 19 రౌండ్లలోనూ దినకరన్ తన ఆధిక్యతను చాటుకుంటూ వచ్చారు. ప్రతి రౌండులోనూ కనీసం 2 వేల ఆధిక్యంతో ముందంజలో నిలిచారు. ఆర్కే నగర్ నియోజకవర్గంలో మొత్తం 2,28,234 ఓట్లు ఉండగా 1,76,885 ఓట్లు పోలయ్యాయి. పోలైన మొత్తం ఓట్లలో 89,013 (50.32 శాతం) ఓట్లను దినకరన్ గెలుచుకున్నారు. అన్నా డీఎంకే అభ్యర్థి మధుసూదనన్‌కు 48,306 (27.31శాతం), డీఎంకే అభ్యర్థి మరుదు గణేష్‌కు 24,651 (13.94శాతం) ఓట్లు పోలయ్యాయి. నామ్ తమిళర్ కట్చికి 3,860 ఓట్లు, బీజేపీకి 1,417 ఓట్లు దక్కాయి. బీజేపీ అభ్యర్థి కంటే నోటాకు 2,373 ఓట్లు దక్కడం విశేషం. ఉప ఎన్నికల్లో దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. రెండాకుల గుర్తును సీఎం కె.పళని స్వామి, డిప్యూటీ సీఎం ఓ పన్నీర్ సెల్వం వర్గానికి ఎన్నికల సంఘం కేటాయించడంతో ప్రెషర్ కుక్కర్ గుర్తుపై బరిలోకి దిగారు. ఫలితాల అనంతరం దినకరన్ మాట్లాడుతూ.. మరో మూడు నెలల్లో ప్రస్తుత తమిళనాడు ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. దినకరన్ గెలుపుతో అనుచరులు సంబరాలు చేసుకున్నారు. అధికార పక్షానికి చెందిన పదిమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మొదటి నుంచి పార్టీలో క్రియాశీలకంగా.. అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లే సమయంలో దినకరన్‌కు శశికళ అన్నాడీఎంకే నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఆయనను పార్టీ డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా నియమించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండాకుల గుర్తు కోసం ఈసీకి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు దినకరన్‌ను అరెస్టు చేశారు. అనంతర పరిణామాల్లో దినకరన్, శశికళను పక్కనపెట్టి పళని, పన్నీరు వర్గాలు ఈ ఏడాది ఆగస్టులో ఏకమయ్యారు. దీంతో 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో దినకరన్ తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. జయలలిత ఉన్న సమయంలో పార్టీ నియామకాలు, ఎన్నికల సమయంలో మిత్రపక్షాలతో చర్చల్లో దినకరన్ కీలక పాత్ర పోషించారు. 1999లో పెరియాకులం నుంచి లోక్‌సభకు, 2004లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. మిగతా రాష్ట్రాల్లో అధికార పార్టీలదే గెలుపు పశ్చిమ బెంగాల్‌లోని సబంగ్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 64 వేల ఓట్ల మెజార్టీతో తృణమూల్ అభ్యర్థి గీతా రాణి భునియా గెలుపొందారు. ఆమెకు మొత్తం 1,06,179 ఓట్లు రాగా.. సమీప ప్రత్యర్థి సీపీఎం అభ్యర్థి రీతా మండల్‌కు 41,987 ఓట్లు దక్కాయి. యూపీలో సికందర అసెంబ్లీ స్థానాన్ని అధికార బీజేపీ నిలబెట్టుకుంది. అక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి అజిత్ సింగ్ పాల్ 11 వేల ఓట్లతో సమాజ్‌వాదీ అభ్యర్థి సీమా సచన్‌పై విజయం సాధించారు. ఇక అరుణాచల్ ప్రదేశ్‌లోని పాక్‌కే–కసాంగ్, లికాబలీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లోను బీజేపీ గెలుపొందింది. ఈ రెండు స్థానాల్ని కాంగ్రెస్ నుంచి అధికార బీజేపీ సొంతం చేసుకుంది. అన్నాడీఎంకేపై పట్టు సాధిస్తారా? తమిళనాడు రాజకీయాలు ఆర్కే నగర్ ఉపఎన్నిక ఫలితాలతో మరో మలుపు తిరిగేలా కనిపిస్తున్నాయి. అధికార అన్నాడీఎంకే ఆగ్రహానికి గురై ఈ ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన దినకరన్ భారీ ఆధిక్యంతో గెలుపును సొంతం చేసుకున్నారు. «రాష్ట్ర రాజకీయాల్లో ఆయన సరికొత్త కేంద్రబిందువుగా మారనున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జయలలిత హయాంలో దినకరన్ పేరు పెద్దగా ఎవ్వరికీ తెలియదు. ఆమె మరణించాక, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ జైలుకెళ్లాల్సి వచ్చింది. ఆ సందర్భంలో తన అక్క కొడుకైన దినకరన్‌ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా శశికళ నియమించడంతో ఒక్కసారిగా ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. అన్నాడీఎంకే రెండు వర్గాలుగా చీలిన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆర్కే నగర్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. అప్పుడు తమ వర్గానికి రెండాకుల చిహ్నం రావడం కోసం దినకరన్ ఏకంగా ఎన్నికల సంఘం (ఈసీ)లోని ముఖ్యులకే రూ.50 కోట్లు లంచం ఇవ్వజూపారు. తీహార్ జైలుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత శశికళ వర్గం నుంచి సీఎం అయిన పళనిస్వామి కూడా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గంతో చేతులు కలిపి శశికళను, దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో ఆర్కే నగర్ ఉప ఎన్నికలో దినకరన్ స్వతంత్ర అభ్యర్థిగానే పోటీచేసి భారీ విజయం సాధించారు. దినకరన్ విజయంతో తమిళ రాజకీయ సమీకరణాలు మరోసారి మారే అవకాశం ఉంది. ప్రస్తుతం అన్నాడీఎంకేలోని ఎమ్మెల్యేలు దినకరన్ గూటికి చేరుతారా? ఆ పార్టీని శశికళ, దినకరన్‌లు మళ్లీ తమ చేతుల్లోకి తెచ్చుకుంటారా? దినకరన్ గెలుపుతో మరోసారి ముఖ్యమంత్రి మార్పు ఉంటుందా? అన్న విషయం చర్చనీయాంశమైంది. దినకరన్ డీఎంకేతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని ఎన్నికలో గెలిచారని అన్నాడీఎంకే ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను స్టాలిన్ ఖండిస్తునప్పటికీ ఒకవేళ అదే నిజమైతే దినకరన్ డీఎంకేలో చేరుతారా? లేదా ఆ పార్టీకి అనుబంధంగా ఉంటారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం మరికొంత కాలం వేచిచూడాల్సిందే. చెన్నైలో దినకరన్ మద్దతుదారుల సంబరాలు -
బ్రేకింగ్: దినకరన్ ప్రభంజనం.. బీజేపీ కన్నా నోటాకే అధికం!
సాక్షి, చెన్నై: ప్రతిష్టాత్మకంగా మారిన ఆర్కే నగర్ ఉప ఎన్నికలో టీటీవీ దినకరన్ ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్‌పై 40,707 ఓట్ల మెజారిటీతో దినకరన్ అఖండ విజయాన్ని సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన దినకరన్ ప్రభంజనం ముందు ప్రత్యర్థి పార్టీలు కొట్టుకుపోయాయి. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సహా బీజేపీ, ఇతర చిన్న పార్టీలు డిపాజిట్ కోల్పోయాయి. దివంగత జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్.. హోరాహోరీగా సాగుతుందని అంతా భావించారు. కానీ, అధికార అన్నాడీఎంకే.. శశికళ వర్గం తరఫున బరిలోకి దిగిన టీటీవీ దినకరన్‌కు గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. ఉప ఎన్నికలో కుక్కర్ గుర్తుతో పోటీచేసిన దినకరన్ మొదటినుంచి లీడ్‌లో కొనసాగుతూ.. ఇటు అధికార అన్నాడీఎంకే, అటు ప్రతిపక్ష డీఎంకే ఊహించనిస్థాయిలో భారీ విజయాన్ని అందుకున్నారు. బీజేపీ కన్నా నోటాకే ఎక్కువ ఈ ఎన్నికల్లో దినకరన్‌కు 89,013 ఓట్లు రాగా, అన్నాడీఎంకేకు 48,306 ఓట్లు వచ్చాయి. డీఎంకేకు 24,651 ఓట్లు, నామ్ తమిళార్ పార్టీకి 3,802 వచ్చాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ బీజేపీకి ఈ ఉప ఎన్నిక ఏమాత్రం కలిసిరాలేదు. తమిళనాడు రాజకీయాల్లో మెరుగుపడాలని ఎంతగా తపిస్తున్నా.. కమళదళం ఆర్కేనగర్ ఉప ఎన్నికలో అతికష్టం వెయ్యిమార్కును దాటింది. బీజేపీ అభ్యర్థికి 1,368 ఓట్లు రాగా, బీజేపీ కన్నా ఎక్కువగా నోటా (పైవారెవరూ కారు)కు 2,203 ఓట్లు వచ్చాయి. ఆర్కే నగర్ ప్రజలకు ధన్యవాదాలు తనను గెలిపించిన ఆర్కే నగర్ ప్రజలకు దినకరన్ కృతజ్ఞతలు తెలిపారు. అమ్మ జయలలిత ఆశీస్సులు తనకు ఉన్నాయని, అందుకే ఆర్కే నగర్ తీర్పే నిదర్శమని అన్నారు. మూడు నెలల్లో అన్నాడీఎంకే ప్రభుత్వం కూలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. అమ్మ వారసురాలే చిన్నమ్మేనంటూ శశికళ వర్గం కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. -
దినకరన్ సంచలన వ్యాఖ్యలు... ఈ సర్కార్ కూలిపోతుంది
సాక్షి, చెన్నై : గెలుపు సంకేతాలు అందటంతో టీటీవీ దినకరన్ సీన్లోకి వచ్చేశారు. కాసేపటి క్రితం మధురై ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల్లో పళని స్వామి ప్రభుత్వం పడిపోవటం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్కే నగర్ తీర్పు.. తమిళనాడు ప్రజల తీర్పు అని ఆయన చెప్పారు. ఈ పోరాటంలో తనకు మద్దతుగా నిలిచిన కోటిన్నర మంది కార్యకర్తలకు, ఆర్కే నగర్ ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంజీఆర్ ఆశీస్సులు తనకు ఉన్నాయని.. అమ్మకి నిజమైన వారసుడిని తానేనని ఆయన ప్రకటించుకున్నారు. ఇక ఎన్నికల్లో గెలవటానికి గుర్తు ముఖ్యం కాదని.. అక్కడ నిలుచునే వ్యక్తి ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. మధ్యాహ్నాం 3 గంటల సమయంలో జయ సమాధి వద్దకు చేరుకుని ఆయన నివాళులు అర్పించనున్నారు. -
దినకరన్‌పై శశికళ మేనకోడలు ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళ మేనకోడలు డాక్టర్ కృష్ణప్రియ తాను వచ్చేఏడాది రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఆర్కేనగర్లో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు శశికళ అక్క కుమారుడు టీటీవీ దినకరన్ జయ వీడియో దృశ్యాలను విడుదల చేయడం వారి కుటుంబాల్లో మనస్పర్ధలకు దారితీసింది. శశికళ వదిన ఇళవరసి కుమార్తె కృష్ణప్రియ దీనిపై తీవ్రంగా స్పందించారు. ఒక తమిళ వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘జయలలిత, శశికళ మాట్లాడుకునే దృశ్యాలను కత్తిరించి కొన్ని సెకన్ల వీడియోనే విడుదల చేశారు. జయ వీడియో విడుదలైన సంగతి శశికళకే తెలియదు. ఆమెపై హత్యానేరం ఆరోపణలు వచ్చినపుడు విడుదల చేయడం ఇష్టంలేని వీడియోను దినకరన్ కోసం విడుదల చేయడాన్ని శశికళ అంగీకరించి ఉండదు. ఒకే ఒక నియోజకవర్గంలో గెలుపుకోసం, పార్టీ చిహ్నం తమవద్ద లేనప్పుడు వీడియో విడుదల చేయడానికి దినకరన్‌కు ఎలా బుద్ధిపుట్టిందో..’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జయ వీడియోపై ఎన్నికల కమిషన్ సీరియస్
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా తీసిన వీడియో బయటకు రావడంపై కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ) సీరియస్ అయింది. గురువారం ఆర్కే నగర్ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈ వీడియో విడుదల కావడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. వీడియో విడుదల అంశంపై పూర్తి నివేదికను అందజేయాలని తమిళనాడు ఎన్నికల కమిషన్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. కాగా, జయలలిత వీడియో ప్రసారాలను నిలిపివేయాలని ఆర్కే నగర్ ఉప ఎన్నిక రిటర్నింగ్ ఆఫీసర్ పత్రికలు, చానెళ్లను కోరారు. మరోవైపు జయ వీడియోపై ఓ పన్నీర్‌సెల్వం వర్గీయులు స్పందించారు. ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే దినకరన్ వర్గం వీడియోను విడుదల చేసిందని ఆరోపించారు. ఇన్ని రోజులుగా వీడియోను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. -
అపోలో ఆసుపత్రిలో జయ వీడియో
-
ఆసక్తికరంగా ఆర్కే నగర్ ఉప ఎన్నిక!
సాక్షి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్లో ఉప ఎన్నిక వేడి రాజుకుంటోంది. ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. దీంతో ఈ ఉప ఎన్నిక హోరాహోరీగా జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అధికార అన్నాడీఎంకే అభ్యర్థిగా మధుసూదనన్ బరిలోకి దిగుతుండగా డీఎంకే నుంచి మరుదు గణేశ్, శశికళ వర్గం నుంచి టీటీవీ దినకరన్ పోటీ చేస్తున్నారు. జయలలిత నియోజకవర్గంలో గెలిచి.. ఆమె వారసులం తామేనని నిరూపించుకోవాలని ఇటు అధికా అన్నాడీఎంకే, అటు శశికళ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. డీఎంకే కూడా ఈ ఎన్నికలో గట్టి పోటీ ఇచ్చి.. ప్రత్యర్థులకు షాక్ ఇవ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 21న జరిగే ఆర్కే నగర్ ఉప ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. -
ఆర్కేనగర్ నుంచి పోటీచేస్తా
సాక్షి, చెన్నై, కొయంబత్తూర్: ఆర్కేనగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ప్రకటించారు. జయలలిత మరణంతో ఖాళీగా ఉన్న ఆర్కేనగర్ నియోజకవర్గంలో డిసెంబర్ 21న ఉపఎన్నికలు నిర్వహిస్తామని శుక్రవారం ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అనంతరం తిరుపూర్‌లో దినకరన్ మాట్లాడుతూ.. రెండాకుల గుర్తు కోసం సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలు బీజేపీతో కుమ్మక్కై కుట్ర చేశారని ఆరోపించారు. కాగా డిసెంబర్ 21న ఎన్నికలు నిర్వహించి, 24న ఫలితాల్ని విడుదల చేస్తామని, డిసెంబర్ 26 నాటికి మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని తమిళనాడు ముఖ్య ఎన్నికల అధికారి లఖోనీ తెలిపారు. వేలిముద్రల్ని సరిపోల్చాలని నిర్ణయం గతేడాది ఉప ఎన్నికలవేళ బీ–ఫారాలపై జయలలిత వేలిముద్రల్ని.. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో అందుబాటులో ఉన్న జయ వేలిముద్రలతో సరిచూడాలని మద్రాసు హైకోర్టు నిర్ణయించింది. జయ వేలిముద్రల వివరాల్ని సమర్పించాలని ఆధార్ నియంత్రణ సంస్థ యూఐడీఏఐని కూడా హైకోర్టు కోరింది. మరోవైపు రెండాకుల గుర్తుపై తమ వాదనలు వినకుండా ఉత్తర్వులు జారీచేయరాదని కోరుతూ పన్నీర్ సెల్వం సుప్రీం కోర్టులో కెవియట్ దాఖలు చేశారు. -
శశికళను 20 ఏళ్లపాటు జైల్లో పెట్టినా..
-
ఐటీ దాడుల షాక్.. శశికళను 20 ఏళ్లపాటు జైల్లో పెట్టినా..
సాక్షి, చెన్నై: ఆదాయపన్న శాఖ (ఐటీ) పెద్ద ఎత్తున జరిపిన దాడులతో శశికళ వర్గం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శశికళ ఆర్థిక సామ్రాజ్యం లక్ష్యంగా, ఆమె బంధువులు, కుటుంబసభ్యుల ఆస్తులపై ఐటీ అధికారులు గురువారం తెల్లవారుజాము నుంచి ఏకంగా 30 చోట్ల ఐటీ దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఉరుములేని పిడుగులా విరుచుకుపడ్డ ఐటీ దాడులపై శశికళ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఐటీ దాడుల వెనుక కేంద్ర ప్రభుత్వం కుట్ర ఉందని, రాష్ట్రంలోని అన్నాడీఎంకే సర్కారుకు మద్దతుగా కేంద్రం తమ ఆస్తులపై ఐటీ దాడులు చేయించిందని శశికళ వర్గం ఆరోపించింది. ఐటీ సోదాల నేపథ్యంలో శశికళ మేనల్లుడు దినకరన్ మీడియాతో మాట్లాడారు. శశికళను 20 ఏళ్లపాటు జైల్లో పెట్టినా.. బయటకు వచ్చిన అనంతరం తిరిగి రాజకీయాల్లో పాల్గొంటారని దినకరన్ అన్నారు. దాడులు తమకు కొత్త కాదని, అన్నింటినీ ఎదుర్కొంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితోనే తమపై ఐటీ దాడులు జరిగాయని, ఎవరి బెదిరింపులకు లొంగబోమని దినకరన్ అన్నారు. పడిలేచిన కెరటంలో మళ్లీ విజృంభిస్తామని పేర్కొన్నారు. పెద్దనోట్ల రద్దుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని, శశికళ వర్గాన్ని రాజకీయాల నుంచి తొలగించడానికే ఈ కుట్ర జరుగుతోందని దినకరన్ ఆరోపించారు. -
దొరికేశాడు
అన్నాడీఎంకే రెండాకుల గుర్తుకోసం అక్రమమార్గాన్ని ఎంచుకున్నటీటీవీ దినకరన్ సాక్ష్యాధారాలతో సహా దొరికేశారు. ఎన్నికల కమిషన్‌కు లంచం ఇవ్వజూపేందుకు హవాలా బ్రోకర్‌తో దినకరన్ జరిపిన సంభాషణలపై స్వర పరీక్షలు చేసి ఆ గొంతు టీటీవీ దినకరన్దేనని ఢిల్లీ పోలీసులు తేల్చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: రెండాకుల గుర్తుకోసం లంచం కేసులో టీటీవీ దినకరన్‌పై పోలీసులు బలమైన సాక్ష్యాధారాలను సేకరించే పనిలో పడ్డారు. హవాలా బ్రోకర్‌తో సంభాషణ దినకరన్ స్వరమే అని నిర్ధారించారు. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే వర్గాలుగా చీలిపోయిన తరుణంలో ఆర్కేనగర్ ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో చీలిక వర్గాలన్నీ పోటీకి దిగి రెండాకుల గుర్తు తమదంటే తమదని వాదించుకున్నాయి. దీంతో అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం ఎవరికీ దక్కకుండా ఎన్నికల కమిషన్ వాటిపై తాత్కాలిక నిషేధం విధించింది. దీంతో తలా ఒక పార్టీని పెట్టుకుని, స్వతంత్ర అభ్యర్థులుగా తలా ఒక చిహ్నాన్ని పొందారు. అయితే రెండాకుల గుర్తు లేకుండా ప్రజలను ఆకర్షించడం అసాధ్యమనే సత్యాన్ని చీలికవర్గ నేతలంతా తెలుసుకున్నారు. పార్టీ సభ్యుల సంతకాల సేకరణతో సంఖ్యా బలం నిరూపించుకోవడం ద్వారా రెండాకుల చిహ్నం కోసం పోటీపడడం ప్రారంభించారు. అయితే, రూ.50 కోట్ల లంచం ఇచ్చి ప్రధాన ఎన్నికల కమిషన్ కార్యాలయ అధికారులను లోబరుచుకోవడం ద్వారా రెండాకుల చిహ్నాన్ని దక్కించుకోవాలని దినకరన్ ప్రయత్నించారు. ఈ వ్యవహారంలో బెంగళూరుకు చెందిన హవాలా బ్రోకర్ సుఖేష్ చంద్రశేఖర్ సహాయాన్ని ఆశ్రయించారు. ఈ లావాదేవీలు జరుగుతున్న తరుణంలో బ్రోకర్ సుఖేష్ ఢిల్లీ పోలీసులకు పట్టుబడ్డాడు. అతనిచ్చిన వాంగ్మూలంతో దినకరన్‌ను సైతం అరెస్ట్ చేశారు. కొన్ని నెలలు ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్న దినకరన్ బెయిల్‌పై బయటకు వచ్చారు. సాక్ష్యాధారాల సేకరణ బ్రోకర్ సుఖేష్‌కు తనకు సంబంధం లేదని దినకరన్ బుకాయించడంతో పోలీసులు బలమైన సాక్ష్యాధారాలను సేకరించేపనిలో పడ్డారు. ఒక టీవీ చానల్‌కు దినకరన్ ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను సంపాదించి దినకరన్ గొంతును నిర్ధారించుకున్నారు. ముడుపుల వ్యవహరంలో హవాలా బ్రోకర్ సుకేష్, దినకరన్ మధ్య సాగిన సెల్‌ఫోన్ సంభాషణలను పోల్చిచూస్తూ జరిపిన స్వరపరీక్షలో ఈ గొంతు దినకరన్దేనని నిర్ధారణ అయినట్లు ఢిల్లీ పోలీసులు శనివారం ప్రకటించారు. తీవ్రంగా పరిగణించి.. దినకరన్ ఏకంగా ఎన్నికల కమిషన్‌కే లంచం ఇవ్వజూపిన ప్రయత్నాన్ని ఢిల్లీ పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఈ కేసులో ఆయన ప్రమేయం రుజువుకావడంతో ఆయనను మళ్లీ అరెస్ట్‌చేసి చార్జిషీటు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
చెన్నై చేరుకున్న శశికళ.. సంబరాలు
సాక్షి, చెన్నై : అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ శుక్రవారం రాత్రి చెన్నైకి చేరుకున్నారు. అనారోగ్యంతో ఉన్న తన భర్త నటరాజన్‌ను బాగోగులు చూసేందుకు పదిహేను రోజులపాటు తనకు పెరోల్ మంజూరు చేయాలంటూ విజ్ఞప్తి చేసుకోగా ఐదు రోజుల పెరోల్ రావడంతో కర్ణాటక పరప్పణ అగ్రహార జైలు నుంచి ఆమె విడుదలయ్యారు. బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చిన శశికళ తన బంధువు కృష్ణప్రియ నివాసానికి చేరుకున్నారు. ఆమెతో పాటు టీటీవీ దినకరన్, పలువురు బంధువులు ఆ నివాసానికి వచ్చారు. చిన్నమ్మ శశికళ రావడంతో కృష్ణప్రియ నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. శశికళకు హారతి ఇచ్చి ఆమె మద్ధతుదారులు ఘన స్వాగతం పలికారు. చాలా రోజుల తర్వాత తమిళనాడుకు రావడంతో శశికళను చూసేందుకు భారీగా మద్దతుదారులు తరలి వచ్చారు. శశికళ జిందాబాద్ అంటూ నినాదాలతో ఆమె మద్దతుదారులు హోరెత్తించారు. లివర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్న నటరాజన్‌కు ప్రస్తుతం డయాలసిస్, ఇతర ఇంటెన్సివ్ కేర్ థెరఫీస్‌ను వైద్యులు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో భర్తను చూసేందుకు అనుమతించాలని, పదిహేను రోజులపాటు తనకు పెరోల్ మంజూరు చేయాలంటూ జైలు శాఖకు విజ్ఞప్తి చేసుకోగా నిరాకరించింది. ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వ వైఖరి ఏమిటని కోర్టు ప్రశ్నించింది. పెరోల్ ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో శశికళకు నేడు ఐదు రోజుల పెరోల్ లభించింది. ఈ క్రమంలో బెంగళూరు నుంచి శశికళ చెన్నైకి వచ్చారు. -
పన్నీర్ సెల్వం.. ఓ కట్టప్ప!
తమిళనాడులో సంక్షోభానికి మోదీ సర్కారే కారణం ఓపీఎస్, ఈపీఎస్‌పై మండిపడ్డ దినకరన్ సాక్షి, చెన్నై: తన వర్గం ఎమ్మెల్యేలపై తాజాగా స్పీకర్ అనర్హత వేటు వేయడంతో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై దినకరన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తన వర్గం ఎమ్మెల్యేలపై వేటు వెనుక కేంద్రం హస్తముందని ఆయన ఆరోపించారు. తమిళనాడులో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి కేంద్రమే కారణమని, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉందని మండిపడ్డారు. చిన్నమ్మను అన్నాడీఎంకే నుంచి తొలగించిన ఈ పళనిస్వామి (ఈపీఎస్), ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్) మోసగాళ్లని అభివర్ణించారు. పన్నీర్ సెల్వం 'బాహుబలి'లో కట్టప్పలాగా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. తన వర్గం ఎమ్మెల్యేలపై వేటువిషయంలో న్యాయస్థానంపై నమ్మకముందని, హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 'తమిళ ప్రజలను దెబ్బతీసే ఏ అంశాన్నైనా మేం లేవనెత్తుతాం. తమిళనాడు ప్రజలు అంతా చూస్తున్నారు. తమిళనాడు సంక్షోభం వెనుక కేంద్రమే ఉంది. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ఈపీఎస్, ఓపీఎస్ మోసగాళ్లుగా గుర్తుండిపోతారు. ఈపీఎస్ ప్రజల చేత ఎన్నుకోబడలేదు. అతన్ని శశికళే సీఎంను చేసింది. ఓపీఎస్ ఓ కట్టప్పలాంటి వాడు. పోలీసులు ఉగ్రవాదులను వెంటాడినట్టు మా ఎమ్మెల్యేలను వెంటాడుతున్నారు' అని ఆయన 'న్యూస్18' చానెల్‌తో పేర్కొన్నారు. -
దినకరన్ ఎమ్మెల్యేలపై వేటు
-
దినకరన్ ఎమ్మెల్యేలపై వేటు
18 మందిని అనర్హులుగా ప్రకటించిన స్పీకర్ ► అనర్హతపై కోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యేలు ► డీఎంకే ఎమ్మెల్యేలతో నేడు స్టాలిన్ అత్యవసర సమావేశం ► మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవుతున్న విపక్షం? ► ఆసక్తికరంగా మారిన తమిళ రాజకీయాలు చెన్నై: తమిళనాట రాజకీయం ఆసక్తికరంగా మారింది. అన్నాడీఎంకే రాజకీయాలపై శశికళ పెత్తనానికి చెక్ పడింది. తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామిపై కాలుదువ్విన టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది. స్పీకర్ ధనపాల్ సోమవారం అనర్హులుగా ప్రకటిస్తూ ఉత్తర్వులను జారీచేశారు. సీఎం పళనిస్వామిని గద్దె దించేందుకు పార్టీ బహిష్కృత నేత టీటీవీ దినకరన్ ప్రయత్నించిన నేపథ్యంలో.. దినకరన్ వర్గానికి చెందిన 18 మంది అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ అనర్హత నిర్ణయం తీసుకున్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ చేశారంటూ దినకరన్ మండిపడ్డారు. ఈ ఎమ్మెల్యేలు సోమవారం సాయంత్రం హైకోర్టులో అనర్హతను వ్యతిరేకిస్తూ పిటిషన్ వేశారు. మరోవైపు, మారుతున్న తాజా పరిస్థితులపై చర్చించేందుకు డీఎంకే ఎమ్మెల్యేలంతా చెన్నై రావాలని ఆ పార్టీ అధిష్టానం ఆదేశించింది. వివాదానికి కారణమేంటి? జయలలిత మరణం, శశికళ జైలుకు పయనం తరువాత పార్టీ, ప్రభుత్వాలపై పెత్తనం విషయంలో టీటీవీ దినకరన్, సీఎం ఎడపాడి మధ్య రాజకీయ వైరంతో వివాదం రాజుకుంది. పన్నీర్‌సెల్వంను దరిచేర్చుకునేందుకు శశికళ కుటుంబాన్ని పళనిస్వామి దూరం పెట్టారు. దినకరన్‌ను కట్టడి చేశారు. దీంతో ఆగ్రహించిన దినకరన్ 19 మంది ఎమ్మెల్యేల చేత మద్దతు ఉపసంహరింపజేసి ప్రభుత్వాన్ని మైనార్టీలో పడవేయటంతో విపక్షాలన్నీ విశ్వాస పరీక్ష పెట్టాలని డిమాండ్ చేశాయి. అటు, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న 19 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ప్రభుత్వ ప్రధాన విప్ రాజేంద్రన్ స్పీకర్‌ను కోరారు. ఆ ఎమ్మెల్యేలు వివరణ ఇవ్వాలని స్పీకర్ ఆదేశించారు. జక్కయ్యన్ అనే ఎమ్మెల్యే ఒక్కరే స్పీకర్ ముందు హాజరై పళనిస్వామివర్గంలో చేరగా.. మిగిలిన వారిపై స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళ, బుధవారాల్లో ఈ పిటిషన్ హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. డీఎంకే మదిలో ఏముంది? తమిళనాట రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మంగళవారం డీఎంకే ఎమ్మెల్యేలు అత్యవసరంగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. పళని సర్కారుపై ప్రజల్లోనూ అసంతృప్తి పెరిగిన నేపథ్యంలో మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. 89 మంది డీఎంకే ఎమ్మెల్యేలు, ఒక ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎమ్మెల్యే, 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలచే మూకుమ్మడిగా రాజీనామా చేయించి.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పరిస్థితులు కల్పించాలని స్టాలిన్ భావిస్తున్నట్లు సమాచారం. ఎవరి బలమెంత? ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ విశ్వాస పరీక్షకు అనుమతిస్తే.. పళనిస్వామి మరోసారి సీఎంగా నెగ్గటం సులువే. మొత్తం 233 మంది ఎమ్మెల్యేలున్న ప్రస్తుత తమిళ అసెంబ్లీలో (జయ మరణంతో ఆర్కేనగర్ ఖాళీగా ఉంది) విజయానికి 117 సీట్లు అవసరం. అయితే.. పళనిస్వామి వర్గంలో 113 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు మిత్రపక్షాలున్నారు. ఈ నేపథ్యంలో 18మందిపై అనర్హత వేటు పడితే.. 215 సభ్యులు మాత్రమే విశ్వాస పరీక్షలో పాల్గొంటారు. అప్పుడు గెలిచేందుకు 109 సీట్లు అవసరం. ఈ మేజిక్ ఫిగర్‌ను సీఎం వర్గం సులభంగానే చేరుకుంటుంది. అయితే.. రెండ్రోజుల్లో ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు, రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కడంతో తాత్కాలిక గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు.. సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, హోం మంత్రి రాజ్నా«థ్ సింగ్‌తో వేర్వేరుగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని వివరించారు. -
ఆ ఎమ్మెల్యేలపై ‘వేటు’ వాయిదా
సాక్షి, చెన్నై: టీటీవీ దినకరన్ వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విషయాన్ని ఈనెల 20వ తేదీ వరకు వాయిదా వేసినట్లు తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ శుక్రవారం ప్రకటించారు. ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం నుంచి గట్టేక్కేందుకే తమపై కుట్రపూరితంగా వేటు వేస్తున్నారని కోర్టులో దినకరన్ వర్గ ఎమ్మెల్యే వెట్రివేల్ దాఖలు చేసిన పిటిషన్ గురువారం విచారణకు రాగా ఈ కేసు 20వ తేదీకి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆరోజున కోర్టు తీర్పును అనుసరించి నిర్ణయం తీసుకోవచ్చని ప్రభుత్వ న్యాయవాది చేసిన సూచన మేరకు స్పీకర్ వెనక్కుతగ్గారు. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి నేతృత్వంలో కుట్రపూరితంగా నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశం చెల్లదని, తాము మరలా సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తామని అన్నాడీఎంకే (అమ్మ) బహిష్కృత నేత టీటీవీ దినకరన్ శుక్రవారం చెన్నైలో వెల్లడించారు. ప్రధాన కార్యదర్శి శశికళ నుంచి ఆదేశాలు పొంది త్వరలో సమావేశం కానున్నట్లు చెప్పారు. ఎడపాడి ప్రభుత్వాన్ని వచ్చేవారం కూల్చివేయడం ఖాయమని డీఎంకేతో కూటమి లేకుండానే ఎడపాడిని సాగనంపుతామని పేర్కొన్నారు. ఇక మైసూరులోని రిసార్టులో ఉన్న దినకరన్‌వర్గ ఎమ్మెల్యేలకు తమిళనాడు పోలీసుల నుంచి ఇబ్బందులు ఏర్పడకుండా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతో గట్టి బందోబస్తు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఎట్టకేలకు ఓకే!
► నేటి అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి లైన్‌క్లియర్ ► బెంగళూరు, మద్రాసు హై కోర్టుల భిన్నమైన తీర్పులతో సందిగ్ధత ► మద్రాసు హైకోర్టు ద్విసభ్య బెంచ్ తీర్పుతో మార్గం సుగమం ► ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని ప్రకటించిన దినకరన్ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి మంగళవారం తలపెట్టిన అన్నాడీఎంకేసర్వసభ్య సమావేశానికి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. మద్రాసు,బెంగళూరు కోర్టులు భిన్నమైన తీర్పును చెప్పడంతో కొన్నిగంటలపాటూ నెలకొన్న సందిగ్ధతపై సోమవారం రాత్రి 9.30 గంటలకు స్పష్టత చేకూరింది. సాక్షి ప్రతినిధి, చెన్నై: పార్టీ, ప్రభుత్వాలకు తలనొప్పిగా తయారైన టీటీవీ దినకరన్‌ను వదిలించుకోవాలని సీఎం ఎడపాడి తీర్మానించుకున్నారు. ఈనెల 12వ తేదీన పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి శశికళ స్థానంలో కొత్త ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటే ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా దినకరన్ కూడా దెబ్బతీయవచ్చని ఎడపాడి అంచనావేశారు. సర్వసభ్య సమావేశానికి అవసరమైన 3,200 మంది కార్యవర్గ సభ్యుల బలాన్ని కూడగట్టారు. ఇదిలా ఉండగా పార్టీ సమావేశం జరపకుండా స్టే విధించాలని కోరుతూ దినకరన్ వర్గ పెరంబూరు ఎమ్మెల్యే వెట్రివేల్ మద్రాసు హైకోర్టులో ఇటీవల పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి సీవీ కార్తికేయన్ ముందుకు సోమవారం విచారణకు వచ్చింది. పార్టీ సమావేశం ఏర్పాటుకు ఉప ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న దినకరన్‌కు మాత్రమే అధికారం ఉందని వెట్రివేల్ తరపు న్యాయవాది టీవీ రామానుజం వాదించారు. న్యాయమూర్తి స్పందిస్తూ వెట్రివేల్ తన పిటిషన్‌ను ఎమ్మెల్యే హోదాలో వేయలేదని, పైగా దినకరన్‌ను కూడా ఇందులో చేర్చారని అన్నారు. అంతేగాక ప్రత్యేక పరిస్థితుల్లో ఈ పిటిషన్ వేసినట్లు కూడా ఆయన అంగీకరించినందున ఇటువంటి చర్యలను కోర్టు ఉపేక్షించదని చెప్పారు. ‘‘ఇష్టమైతే మీరు పార్టీ సమావేశంలో పాల్గొనవచ్చు, లేకుంటే మధ్యలోనే లేచివెళ్లిపోయి భోజనం చేయవచ్చు, అదీ ఇష్టకాకుంటే హాయిగా ఇంటిలోనే కూర్చుండిపోవచ్చు..’’ అంటూ చమత్కారంగా మాట్లాడిన న్యాయమూర్తి స్టే కోరుతూ వేసిన పిటిషన్‌ను కొట్టివేశారు. అంతేగాక అవగాహన లేని పిటిషన్ వేసి కోర్టు సమయం వృధా చేశారన్న విమర్శతో వెట్రివేల్‌కు రూ.1లక్షల జరిమానా విధించారు. అయితే ఈతీర్పుపై మద్రాసు హైకోర్టులోనే ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌కు వెట్రివేల్ అప్పీలు చేసుకున్నారు. అప్పీలు పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు రాత్రి 7.15 తీర్పు చెబుతానని వెల్లడించింది. మరో 24 గంటల్లో సర్వసభ్య సమావేశం జరుగనుండగా బెంగళూరు కోర్టు స్టే ఇస్తూ సోమవారం రాత్రి ఇచ్చిన తీర్పుతో ఎడపాడి వర్గీయుల్లో మరో బాంబు పేలింది. వెట్రివేల్ అప్పీలు పిటిషన్‌పై ఎటువంటి తీర్పు వెలువడుతుందో అనే ఉత్కంఠ బయలుదేరింది. గంటకోసారి మారుతున్న పరిణామాలపై సీఎం ఎడపాడి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం సోమవారం రాత్రి తన వర్గంతో సమావేశమయ్యారు. అయితే అన్నాడీఎంకే (అమ్మ) వర్గం, అన్నాడీఎంకే పురట్చి తలైవి అమ్మ వర్గం కలిసి చెన్నైలో నిర్వహించే సర్వసభ్య సమావేశానికి స్టే విధించే అధికారం బెంగళూరు కోర్టుకు లేదని ఎడపాడి వర్గ పార్లమెంటు సభ్యులు అన్వర్‌రాజా వాదన లేవనెత్తారు. నిర్ణయించిన ప్రకారం మంగళవారం సర్వసభ్య సమావేశం జరిగితీరుతుందని ఆయన స్పష్టం చేశారు. ఎట్టకేలకు ఎడపాడికి అనుకూలం సోమవారం రాత్రి 9.30 గంటలకు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు ఎట్టకేలకూ ఎడపాడికి అనుకూలంగా వెలువడింది. ఏకసభ్య బెంచ్ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును కొట్టివేయలేమని, స్టే మంజూరు కుదరదని న్యాయమూర్తులు రాజీవ్ అక్తర్, అబ్దుల్ ఖుద్దూస్ స్పష్టం చేశారు. అయితే అప్పీల్ పిటిషన్‌లోని అంశాలపై సమగ్ర విచారణ కోసం ఈనెల 24వ తేదీకి కేసును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో ఎడపాడి వర్గం ఊపిరి పీల్చుకుంది. మారుస్తా.. లేకుంటే కూలుస్తా : దినకరన్ తమ వల్ల సీఎం అయిన ఎడపాడిని ఆ పదవి నుంచి దింపివేసి మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటామని, వీలుకాని పక్షంలో ప్రభుత్వాన్ని కూల్చివేస్తానని టీటీవీ దినకరన్ వ్యాఖ్యానించారు. మదురైలో సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ, మీకే ద్రోహం చేసిన వారిని మాకు ఏం మేలు చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ధర్మ యుద్ధమని డిప్యూటీ సీఎం పదవిని తీసుకున్నారు పన్నీర్‌సెల్వం, ఆయనకు పదవి లేకుంటే ఊపిరి ఆడదని ఎద్దేవా చేశారు. గతంలో తమ వల్ల ప్రభుత్వానికి ముప్పులేదని చెబుతూ వచ్చిన దినకరన్ నేడు స్పష్టంగా కూల్చివేస్తామని ప్రకటించారు. -
ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు దినకరన్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ గురువారం గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిశారు. పుదుచ్చేరి క్యాంపులో ఉన్న తిరుగుబాటు శాసనసభ్యులు వెంటబెట్టుకుని ఆయన ఇవాళ రాజ్‌భవన్‌కు వచ్చారు. తగిన సంఖ్యాబలం లేని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రభుత్వాన్ని బలపరీక్షకు ఆదేశించాలని దినకరన్ ఈ సందర్భంగా గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం దినకరన్ మాట్లాడుతూ...పళనిస్వామిని విశ్వాస పరీక్షకు ఆదేశించాలని కోరామన్నారు. ప్రభుత్వం మెజార్టీ కోల్పోయిందని, పదవిలో కొనసాగే నైతికత పళనిస్వామికి లేదని అన్నారు. ఈపీఎస్, ఓపీఎస్లను తక్షణమే పదవుల నుంచి తొలగించాలన్నారు. కాగా రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని, తదుపరి చర్యలకు సమయం కావాలని గవర్నర్ అన్నారని దినకరన్ తెలిపారు. కాగా గత నెలలో గవర్నర్ వద్దకు ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్లగా ఈసారి దినకరనే వారిని వెంటపెట్టుకుని వెళ్లారు. గవర్నర్‌ను తొలిసారి కలిసినపుడు కంటే ఈసారి ఆయన ఎమ్మెల్యేల సంఖ్యా బలం 19 నుంచి 21కి పెరిగింది. అంతేగాక తన మద్దతుదారులైన ఆరుగురు ఎంపీలను కూడా తీసుకెళ్లారు. -
హైదరాబాద్‌కు దినకరన్ ఎమ్మెల్యేల క్యాంప్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎడపాడి పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుని పుదుచ్చేరి రిసార్టులో గడుపుతున్న దినకరన్ వర్గం 21 మంది ఎమ్మెల్యేలు తమ రాజకీయ మకాంను హైదరాబాద్‌కు మార్చనున్నట్లు తెలిసింది. సీఎంకు వ్యతిరేకంగా గత నెల 22వ తేదీన గవర్నర్‌కు లేఖలు అందజేసిన ఎమ్మెల్యేలు.. అప్పటి నుంచి పుదుచ్చేరిలోని ఒక రిసార్టులో ఉంటున్నారు. కొద్దిరోజుల కిందటే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తోడవడంతో దినకరన్ బలం 21కి పెరిగింది. సీఎం వర్గం నుంచి ప్రలోభాలకు గురికాకుండా తన వర్గ ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ వస్తున్న దినకరన్ ఈ మకాంను శని లేదా ఆదివారం హైదరాబాద్‌కు మార్చనున్నారు. అనర్హత వేటుపై షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వడంలో భాగంగా ఈనెల 5వ తేదీన 19 మంది ఎమ్మెల్యేలమంతా స్పీకర్‌ను విడివిడిగా కలుస్తామని దినకరన్ వర్గ ఎమ్మెల్యే తంగతమిళ్‌సెల్వన్ తెలిపారు. -
రాజకీయాల్లోకి రా!
సాక్షి, చెన్నై: తమిళ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తిని కలిగిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అన్నాడీఎంకే పార్టీలో నెలకొన్న సందిగ్ధ పరిస్థితి ఆ పార్టీ నేతలను, కార్యకర్తలను కలవరపెడుతోందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి వర్గం, పన్నీర్‌సెల్వం వర్గం ఏకమవడం శశికళ వర్గానికి మింగుడుపడని పరిస్థితి. అదే విధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తప్పించడంతో ఆమె సోదరుడు, ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయడానికి సమాయత్తం అవుతున్నారు. మరో ప్రక్క ప్రధాన ప్రతి ప్రక్షపార్టీ నేత స్టాలిన్ అన్నాడీఎంకే బల నిరూపణకు పట్టుపడుతున్న వైనం, ఇలా తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారుతున్న తరుణంలో ప్రముఖ నటుడు, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, దక్షిణ భారత నటీనటుల సంఘ ప్రధాన కార్యదర్శి విశాల్ సోదరి వివాహం ఈ నెల 27వ తేదీన చెన్నైలో జరిగింది. ఈ వేడుకకు డీఎంకే నేత స్టాలిన్‌తో పాటు పలువురు రాజకీయనాయకులు, నటుడు రజనీకాంత్, విజయ్ మొదలగు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని నవ వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి శుభాకాంక్షలు అందించారు. అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ బుధవారం విశాల్ నివాసానికి వెళ్లి ఆయన చెల్లెలు ఐశ్వర్యరెడ్డి, ఉమ్మడి క్రిష దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దినకరన్ మాట్లాడుతూ నటుడు విశాల్‌లో నాయకత్వం లక్షణాలు ఉన్నాయని, ఆయన రాజకీయాల్లోకి వస్తే తాను సంతోషిస్తానని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే దక్షిణ భారత నటీనటుల సంఘం ఎన్నికల్లోనూ, తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లోనే గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధించిన విశాల్ రాజకీయ మోహం పుట్టిందనే విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే తనకు రాజకీయ రంగప్రవేశంపై ఆసక్తి లేదని ఆయన స్పష్టం చేసినా, తాజాగా టీటీవీ దినకరన్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీయవచ్చనే భావన చాలా మందిలో వ్యక్తం అవుతోంది. -
రొంబ సస్పెన్స్ !
-
దినకరన్ వర్గానికి గవర్నర్ ఝలక్!
-
దినకరన్ వర్గానికి గవర్నర్ ఝలక్!
ఆ వర్గం ఎమ్మెల్యేలు ఇంకా అన్నాడీఎంకేలోనే ఉన్నారు వారి డిమాండ్ మేరకు బలపరీక్ష నిర్వహించలేం ప్రతిపక్షాల డిమాండ్‌ను తోసిపుచ్చిన గవర్నర్ విద్యాసాగర్‌రావు సాక్షి, చెన్నై: తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో చెలరేగిన సంక్షోభం ఇంకా ప్రకంపలను రేపుతూనే ఉంది. దాదాపు 20మందికిపైగా దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంతో అసెంబ్లీలో వెంటనే బలపరీక్ష నిర్వహించాలంటూ ప్రతిపక్ష నేతలు గురువారం మరోసారి గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిశారు. వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి.. సీఎం పళనిస్వామిపై విశ్వాసపరీక్షకు అనుమతించాలని ప్రతిపక్ష సభ్యులు గవర్నర్ కోరారు. అయితే, ప్రతిపక్షాల విజ్ఞప్తిని గవర్నర్ తోసిపుచ్చారు. సీఎం పళనిస్వామిపై ఎదురుతిరిగిన దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు ఇంకా అన్నాడీఎంకేలోనే కొనసాగుతున్నారని, కాబట్టి రెబల్స్ డిమాండ్ మేరకు తాను నడుచుకోలేనని ఆయన షాక్ ఇచ్చారు. పళనిస్వామిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను గవర్నర్ సున్నితంగా తిరస్కరించారని ప్రతిపక్ష వీసీకే పార్టీ నేత తిరుమవలవాన్ తెలిపారు. ప్రస్తుతం దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు రిసార్ట్‌లో గడుపుతూ క్యాంపు రాజకీయాలు నడుపుతున్న సంగతి తెలిసిందే. గవర్నర్ విద్యాసాగర్‌రావు అసెంబ్లీని సమావేశపరిచి.. బలపరీక్షను ఎప్పుడు నిర్వహిస్తారా అని వారు ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పట్లో సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా బలపరీక్ష ఉండబోదనే సంకేతాలు తాజాగా గవర్నర్ ఇచ్చినట్టయిందని, ఇది దినకరన్ వర్గానికి ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
పళనికి కొత్త టెన్షన్.. 40 మంది ఎమ్మెల్యేలు జంప్?
చెన్నై: వర్గ పోరులకు చెక్ పెడుతూ ముఖ్యమంత్రి పళని సామి, పన్నీర్ సెల్వంలు విలీన నిర్ణయం తీసుకోగానే తమిళనాట రాజకీయాలు అస్తవ్యస్తంగా మారాయి. శశికళ మరియు ఆమె వర్గీయులపై వేటు వేయటమే ప్రధాన ఉద్ధేశ్యంగా రొయపెట్టాలో సోమవారం నిర్వహిస్తున్న కీలక సమావేశానికి 40 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. దీంతో పళని, పన్నీర్లలో కొత్త టెన్షన్ మొదలుకాగా, పార్టీలో సంక్షోభం తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. శశికళ బంధువు దినకరన్ టీవీవీ దినకరన్ తన వర్గ ఎమ్మెల్యేలతో తిరుగుబాటు జెండాను ఎగరవేయగా ప్రస్తుతం సుమారు 22 మంది ఎమ్మెల్యేలు పుదుచ్చేరిలోని విండ్‌ఫ్లవర్ రిసార్ట్‌లో సేదతీరుతున్నారు. రొయపెట్టాలో జరిగే పార్టీ సర్వ సభ్య సమావేశానికి తమకు ఆహ్వానం అందలేదని, తామంతా దినకరన్ వెంటే నడుస్తామని ఎమ్మెల్యే తంగ తమిళసెల్వన్ స్పష్టం చేశారు. డీఎంకేకు మద్ధతుగా వ్యవహరించబోతున్నారన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పళని-పన్నీర్ వర్గంలో మరింత మంది స్లీపర్ సెల్స్ ఉన్నారని, వారంతా త్వరలో దినకరన్ గూటికి చేరతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ పారదర్శకంగా వ్యవహరించి అసెంబ్లీలో బలనిరూపణ పరీక్ష నిర్వహిస్తారని ఆశిస్తున్నామని, అలాకానీ పక్షంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని సెల్వన్ కోరారు. ఇక పళని స్వామి సహా నేతలంతా కీలక బాధ్యతల నుంచి తొలగిస్తూ వస్తున్న దినకరన్ నేడు మరోకరిపై వేటు వేశారు. విద్యుత్ శాఖ మంత్రి పి తంగమణిని నమక్కల్ జిల్లా సెక్రటరీ పదవి నుంచి తొలగిస్తూ ఆ స్థానంలో అనబఝన్‌ను నియమించారు. అన్నాడీఎంకే సమావేశంలో నాలుగు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. శశికళ, దినకరన్ లను వెలివేయటంతోపాటు, దినకరన్ చేపట్టిన నియామకాలన్నీ చెల్లవంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దినకరన్ చేతల్లో ఉన్న పార్టీ అధికారిక మీడియాలు నమదు ఎంజీఆర్, జయ టీవీల పునరుద్ధరణ చేపట్టాలని నిర్ణయించుకుంది. ఇక త్వరలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి పూర్తి స్థాయి నియామకాలు చేపట్టాలని తీర్మానాలు చేసింది. డీఎంకే-దినకరన్‌ల కాంబోలో ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్ష డీఎంకే పార్టీతో టీవీవీ దినకరన్ చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుంచి కొందరు శకునిలు పళని-పన్నీర్‌లను ఒక్కటి చేసేందుకు తీవ్రంగా యత్నించాయని, కానీ వారి ఆటలు సాగకపోవచ్చని ఆయన ట్వీట్ చేశారు. ఇంకోవైపు దినకరన్‌కు మద్ధతు ఇస్తున్న 19 మంది ఎమ్మెల్యేలతోపాటు గుట్కా స్కాం అంశాన్ని వెలుగులోకి తెస్తూ డీఎంకేలోని 20 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ పళని ప్రభుత్వం స్పీకర్‌ను కోరే అవకాశం ఉందని, తద్వారా సభలో కోరంను తగ్గించవచ్చనే ఆలోచన చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. -
దూకుడుగా దినకరన్
సీఎం పళని, విప్ రాజేంద్రన్‌పై వేటు సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే నాయకురాలు శశికళను పార్టీ నుంచి సాగనంపేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి ప్రయత్నాలు వేగవంతం చేసిన నేపథ్యంలో పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ మరో అడుగు ముందుకు వేశారు. సేలం రూరల్ జిల్లా పార్టీ కార్యదర్శి పదవి నుంచి సీఎం పళనిని తొలగిస్తూ ఆదేశాలు జారీచేశారు. అలాగే తన వర్గం ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన విప్ రాజేంద్రన్‌ను కూడా ఆ పదవి నుంచి తొలగిస్తూ ప్రకటన జారీచేశారు. దీంతో దినకరన్ తీరును నిరసిస్తూ పలుచోట్ల సీఎం మద్దతుదారులు ఆందోళనలకు దిగారు. మరోవైపు తనకు ఎవరెవరు మద్దతుగా ఉన్నారో తెలుసుకునేందుకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సోమవారం ప్రత్యేక సమావేశానికి సీఎం పళని పిలుపునిచ్చారు. -
నన్ను ఎవరూ బెదిరించలేరు.. దేవుడు తప్ప
► ఏమవుతుందో వేచి చూడండంటున్న దినకరన్ ► 21కు పెరిగిన ఎమ్మెల్యేల బలం ► స్పీకర్ సంజాయిషీ నోటీసులకు బదులివ్వబోమన్న వెట్రివేల్ ► చెన్నైకి చేరుకున్న గవర్నర్ ‘‘ఆపరేషన్ ఆరంభం.. ఏమవుతుందో వేచి చూడండి’’ అంటూ టీటీవీ దినకరన్ ధీమా వ్యక్తంచేశారు. మైనార్టీలో పడిపోయిన ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న సీఎం ఎడపాడికి లేని భయం తమ కెందుకని శనివారం ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేల చేరికతో దినకరన్ బలం 21కు పెరిగింది. రాష్ట్ర రాజకీయాలు రంజుగా సాగుతున్న వేళ శనివారం సాయంత్రం ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు చెన్నైకి చేరుకున్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: తీహార్ జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన నాటినుంచి దినకరన్, సీఎం ఎడపాడి మధ్య ఆధిపత్య యుద్ధం నడుస్తోంది. పన్నీర్ సెల్వంను కలుపుకోవడం ద్వారా దినకరన్‌ను దెబ్బతీసేందుకు ఎడపాడి సిద్ధమయ్యారు. పన్నీర్‌సెల్వం, ఎడపాడి ఏకం కావడాన్ని సహించలేని దినకరన్ తనవర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలతో మద్దతు ఉపసంహరింపజేసి ప్రభుత్వం మైనార్టీలో పడేలా చేశారు. దినకరన్ ఎత్తుకు ఎడపాడి పైఎత్తు వేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించిన నేరంపై అనర్హత వేటు ఎందుకు వేయకూడదని 19 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ ద్వారా ఈనెల 24వ తేదీన నోటీసులు జారీచేయించారు. ఎమ్మెల్యేలు తమ నుంచి ఎడపాడి వైపునకు చేజారిపోకుండా పుదుచ్చేరిలోని ఒక రిసార్టులో క్యాంపు పెట్టడం ద్వారా దినకరన్ జాగ్రత్తలు తీసుకున్నారు. అధికార పార్టీలో అంతర్గత పోరు సాగుతుండగానే గవర్నర్ విద్యాసాగర్‌రావు ముంబయి వెళ్లిపోయారు. మైనార్టీ ప్రభుత్వం వివరాలను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నా«థ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లాలన్న గవర్నర్ ప్రయత్నం వాయిదాపడింది. పెరుగుతున్న దినకరన్ బలం ఇదిలా ఉండగా, దినకరన్ శిబిరంలోకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు చేరడంతో బలం 21కి పెరిగింది. తటస్త వైఖరి అవలంభిస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేలు దినకరన్ వైపే మొగ్గు చూపుతున్నారు. 8మంది మంత్రులు, 60 మంది ఎమ్మెల్యేలు తమకు అండగా ఉన్నారని, మరో రెండు రోజుల్లో తమకు మద్దతు ప్రకటించనున్నారని శశికళ తమ్ముడు దివాకరన్ శనివారం ప్రకటించారు. స్పీకర్ నోటీసులు తమకు అందలేదు, ఒకవేళ అందినా తాము బదులిచ్చేది లేదని ఎమ్మెల్యే వెట్రివేల్ స్పష్టంచేశారు. రెండు రోజుల్లోగా గవర్నర్ నిర్ణయం తీసుకోకుంటే రాష్ట్రపతిని కలుస్తామని పుదుచ్చేరి క్యాంప్‌లోని ఎమ్మెల్యే తంగతమిళ్ సెల్వన్ శనివారం అల్టిమేటం ఇచ్చారు. రోజురోజుకూ మారుతున్న బలాబలాలు అసెంబ్లీలో బలాబలాలు రోజురోజుకూ మారిపోతూ అంకెల గారడిని తలపిస్తున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో అన్నాడీఎంకేకి 134మంది ఎమ్మెల్యేలున్నారు. దినకరన్ వైపు 21 మంది నిలవడం వల్ల ఎడపాడి బలం 122 నుంచి 113కి పడిపోయింది. బలపరీక్ష నుంచి గట్టెక్కాలంటే మరో నలుగురు అవసరం. నోటీసుల జారీ ప్రకారం 19 మందిపై స్పీకర్ అనర్హత వేటు వేస్తే అసెంబ్లీలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సంఖ్య 134 నుంచి 115కు పడిపోతుంది. డీఎంకేకి మిత్రపక్షాలను కలుపుకుని 98 మంది ఉన్నారు. ఈ లెక్కన మ్యాజిక్ ఫిగర్ 117 లేకున్నా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎడపాడి ప్రభుత్వం గట్టెక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. నన్ను ఎవరూ బెదిరించలేరు.. ‘‘నన్ను ఎవరూ బెదిరించలేరు.. ఒక్క దేవుడు తప్ప..’’ అని దినకరన్ శనివారం వ్యాఖ్యానించారు. గవర్నర్ మంచి నిర్ణయం తీసుకుంటారని నమ్ముతున్నట్లు తెలిపారు. అన్నాడీఎంకే పార్టీలో ఆపరేషన్ మొదలైంది, వేచి చూడండి ఫలితాలు ఎలా ఉంటాయో అని దీమా వ్యక్తంచేశారు. కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు పుదుచ్చేరిలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి చేరవేస్తున్నారు. ఉప ఎన్నికలు వస్తే డీఎంకేతో ముప్పు ఎడపాడి ఎత్తుగడ అసలుకే ముప్పులా మారుతుందనే అనుమానాలు కూడా నెలకొన్నాయి. ఎమ్మెల్యేలపై అనర్హత వేటుతో అన్నాడీఎంకేలోని అంతర్గత కుమ్ములాటలు డీఎంకే లాభించేలా మారగలదు. అసెంబ్లీలో డీఎంకేకి 89, మిత్రపక్ష కాంగ్రెస్‌కు 8, ఇండియన్ ముస్లిం లీగ్‌కు ఒకటి కలుపుకుంటే ప్రతిపక్షానికి మొత్తం 98 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. 19 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలు ఖాళీ అయితే 6 నెలల్లోగా ఉపఎన్నికలు నిర్వహించాలి. జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్కేనగర్ కూడా ఖాళీగా ఉంది. ముఠా కుమ్ములాటలతో అన్నాడీఎంకే ప్రతిష్ట దిగజారిన పరిస్థితుల్లో డీఎంకే వైపు ఓటర్లు మొగ్గుచూపే అవకాశం ఉంది. ఉప ఎన్నికలు జరిగే 20 స్థానాలు డీఎంకే ఖాతాలోకి చేరితే ప్రతిపక్ష బలం 118కి చేరుకుంటుంది. సీఎం ఎడపాడి కంటే బలమైన పక్షంగా ప్రతిపక్షం ఎదుగుతుంది. ఏ కోణంలో చూసినా ఎడపాడి ప్రభుత్వానికి ముప్పు పొంచి ఉందనే అనుమానాలు నెలకొన్నాయి. -
గురి మార్చిన సీఎం పళని.. కళ్లుచెదిరే ఎత్తుగడ
-
గురి మార్చిన సీఎం పళని.. కళ్లుచెదిరే ఎత్తుగడ
సాక్షి, చెన్నై : టీవీవీ దినకరన్ ఎమ్మెల్యేలను చీల్చడంతో మైనారిటీలో పడిపోయిన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సీఎం ఎడపాడి పళనిస్వామి కళ్లుచెదిరే ఎత్తుగడలు సిద్ధంచేశారు. ఇందులో భాగంగా ఆయన డీఎంకే ఎమ్మెల్యేలను గురి పెట్టారు. దినకరన్ రూపంలో సీఎం పళని స్వామి ప్రభుత్వం సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. సీఎంకు వ్యతిరేకంగా 21 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటుతో ముందుకు సాగుతున్నారు. వీరితో పాటుగా ప్రధాన ప్రతి పక్షం సైతం బల నిరూపణకు పట్టుబడుతుండటంతో పళని సర్కారు ఇరకాటంలో పడింది. బల నిరూపణ తప్పని సరిగా మారిన పక్షంలో గట్టెక్కేందుకు తగ్గ మార్గాల్ని పళని అన్వేషిస్తున్నారు. ఇప్పటికే తిరుగుబాటు ఎమ్మెల్యేలకు స్పీకర్ ధనపాల్ ద్వారా నోటీసులు ఇప్పించారు. పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న వారిపై ఎందుకు అనర్హత వేటు వేయకూడదు అన్న ప్రశ్నతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఇందుకు వారి నుంచి ఎలాంటి సమాధానం వస్తుందోనన్నది పక్కన పెడితే, సీఎం పళని కొత్త ఎత్తుగడతో బలపరీక్షలో నెగ్గేందుకు వ్యూహరచన చేసి ఉండటం వెలుగులోకి వచ్చింది. కొత్త వ్యూహం : కేంద్రంలోని ఢిల్లీ పెద్దలు రచించిన వ్యూహమా? అన్నాడీఎంకే సీనియర్లు ఇచ్చిన సలహానా? అన్నది పక్కన బెడితే, డీఎంకే సభ్యుల్ని గురి పెట్టి ఈ వ్యహ రచన సాగడం గమనించాల్సిన విషయం. ఇది కూడా నెల రోజుల క్రితం సాగిన ఘటనను ఆసరాగా చేసుకుని కొత్త ఎత్తుగడకు సిద్ధం అవుతున్నారు. అసెంబ్లీ వేదికగా గత నెల నిషేధిత గుట్కాల వ్యవహారంపై తీవ్ర రగడ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నిషేధిత వస్తువులు యథేచ్ఛగా దొరుకుతున్నాయంటూ సభలో గుట్కా ప్యాకెట్లను డిఎంకే సభ్యులు ప్రదర్శించడం వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారాన్ని ఆ సమయంలో అధికార పక్షం పెద్దగా పట్టించుకోలేదు. అయితే, ఇప్పుడు దీనినే వాడుకుని క్రమ శిక్షణా సంఘం ముందు ఉంచేందుకు సిద్ధం కావడం ఆలోచించాల్సిందే. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై వేటుకు కసరత్తు : శాననసభలో 20 మంది డీఎంకే సభ్యులు గుట్కా ప్యాకెట్లను ప్రదర్శించినట్టుగా వీడియో ఆధారాల్ని ప్రస్తుతం సేకరించారు. గుట్కా వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించి, ఆ సభ్యులపై చర్యకు ప్రస్తుతం క్రమ శిక్షణా సంఘానికి సిఫారసు చేయడంతో డీఎంకే వర్గాలు అగ్గి మీద గుగ్గిలంలా మండి పడుతున్నారు. తిరుగుబాటు దారులపై అనర్హత వేటు, 20 మంది డీఎంకే సభ్యుల సస్పెండ్ వెరసి సభలో సభ్యుల సంఖ్య తగ్గించినట్టు అవుతుందన్న వ్యూహంతోనే పళని ఈ ఎత్తుగడ వేసినట్టు సంకేతాలు వెలువడుతున్నాయ. సంఖ్య తగ్గిన పక్షంలో మెజారిటీ వ్యవహారంలోనూ సంఖ్యా బలం తగ్గేందుకు ఆస్కారం ఉందని, ఆ సమయంలో తమకు ఉన్న ఎమ్మెల్యే బలంతో పరీక్షలో నెగ్గవచ్చన్న వ్యూహాన్ని రచించినట్టు అన్నాడిఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది సాధ్యమా?: డీఎంకే సభ్యుల్ని గురి పెట్టి పళని కొత్త వ్యూహాన్ని రచించడం బాగానే ఉన్నా, ఆచరణలో సాధ్యమా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 40 రోజుల క్రితం జరిగిన సంఘటనను ఇప్పుడు తెర మీదకు తీసుకురావడాన్ని డిఎంకే సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈనెల 28వ(సోమవారం) తేదిన జరగనున్న క్రమ శిక్షణా సంఘం సమావేశంలో తేల్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమ శిక్షణా సంఘంలో సీఎం, స్పీకర్‌తో పాటుగా 17 మంది సభ్యులు ఉన్నారు. ఇందులో 10 మంది అన్నాడీఎంకే, ఆరుగురు డీఎంకే, ఒకరు కాంగ్రెస్‌కు చెందిన వాళ్లు ఉన్నారు. అన్నాడీఎంకేకు చెందిన పది మందిలో ముగ్గురు దినకరన్ మద్దతు ఎమ్మెల్యే ఉన్నారు. ఈ దృష్ట్యా, నిర్ణయంపై సంఖ్యా బలం సమానంగానే ఉందని చెప్పవచ్చు. అన్నాడీఎంకే తరపున ఏడుగురు, డీఎంకే కాంగ్రెస్ తరపున ఏడుగురు సమానంగా ఉన్న దృష్ట్యా, చర్యల విషయంగా ఎలాంటి వివాదం సాగనున్నదో అన్నది వేచి చూడాల్సిందే. నేడు గవర్నర్‌తో భేటీ: నిన్నటి వరకు దినకరన్ వర్సెస్ పళని అన్నట్టుగా సాగిన బల పరీక్ష రచ్చ, ప్రస్తుతం స్టాలిన్ వర్సెస్ పళని అన్నట్టుగా మారి ఉంది. తమ ఎమ్మెల్యేను గురి పెట్టి సస్పెండ్ కార్యాచరణ సిద్ధం అవుతోండటాన్ని డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్ తీవ్రంగా పరిగణించారు. ఆదివారం రాష్ట్రగవర్నర్(ఇన్) విద్యాసాగర్‌రావును కలిసేందుకు నిర్ణయించారు. పదిన్నర గంటలకు డిఎంకే ఎమ్మెల్యేలు అందరూ గవర్నర్‌ను కలవనున్నారు. ఈ విషయంగా తిరువారూర్‌లో స్టాలిన్మీడియాతో మాట్లాడుతూ,క్రమ శిక్షణా సంఘాన్ని సమావేశ పరచి, తమ సభ్యులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు. -
టీవీవీ ట్విస్ట్: మరో ఇద్దరు ఎమ్మెల్యేలు జంప్
- దినకరన్ శిబిరంలోకి రత్నసభాపతి, కలైసెల్వన్ - త్వరలో మరింత మంది వస్తారన్న శశి సోదరుడు - చైన్నైకి గవర్నర్.. నిర్ణయంపై ఉత్కంఠ చెన్నై: తమిళనాడులో అధికార పార్టీ రాజకీయాలు ఊహించని విధంగా మారిపోతున్నాయి. పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు కంకణం కట్టుకున్న టీవీవీ దినకరన్ మళ్లీ ట్విస్ట్ ఇచ్చారు. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలను తనవైపునకు లాగేసుకున్నారు. ఎమ్మెల్యేలు రత్నసభాపతి, కలైసెల్వన్‌లు శనివారం టీవీవీ శిబిరంలో చేరిపోవడంతో వైరివర్గం బలం 21కి పెరిగింది. ఇప్పటికి వచ్చినవాళ్లే కాకుండా.. రెండు రోజుల్లో 8 మంది మంత్రులు, 60 మంది ఎమ్మెల్యేలు తమవైపునకు రానున్నట్లు శశికళ తమ్ముడు దివాకరన్ శనివారం మీడియాకు చెప్పారు. అనర్హతనూ లెక్కచేయని ఎమ్మెల్యేలు: శుక్రవారం వరకు దినకరన్‌తో ఉన్న 19 మంది ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ ధన్పాల్ నోటీసులు జారీచేశారు. అయితే స్పీకర్ ఇచ్చిన నోటీసులు తమకు అందలేదని, ఒకవేళ అందినా బదులిచ్చేది లేదని దినకరన్ వర్గం ఎమ్మెల్యే వెట్రివేల్ తేల్చిచెప్పారు. రెండు రోజుల్లోగా గవర్నర్ ఏదైనా నిర్ణయం తీసుకోని పక్షంలో రాష్ట్రపతిని కలుస్తామని అదే వర్గానికి చెందిన మరో ఎమ్మెల్యే తంగతమిళ్ సెల్వన్ చెప్పారు. అసెంబ్లీలో అన్నాడీఎంకేకు 134 మంది ఎమ్మెల్యేలు ఉండగా వీరిలో 21 మంది దినకరన్ వైపు ఉన్నారు. దీంతో ఎడపాడి బలం 122 నుండి 113కి పడిపోయింది. ప్రభుత్వం నిలబడేందుకు మరో నలుగురు ఎమ్మెల్యేలు అవసరం. అన్నాడీఎంకే మద్దతుతో గెలిచిన మిత్రపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు తాత్కాలికంగా తటస్థవైఖరి అవలంబిస్తున్నా వారు దినకరన్వైÐఽపే మొగ్గుచూపుతున్నారు. చెన్నైకి గవర్నర్.. నిర్ణయంపై ఉత్కంఠ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిన స్థితిలో ఎలాంటి నిర్ణయం ప్రకటించకుండా ముంబయికి వెళ్లిన తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్‌రావు శనివారం సాయంత్రం తిరిగి చెన్నైకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎడపాడి ప్రభుత్వంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించిన పక్షంలో ఎడపాడి ఇరుకునపడక తప్పదు. ఇదిలా ఉండగా, ఉప రాష్ట్రపతి హోదాలో ఎం వెంకయ్యనాయుడు ఆదివారం తొలిసారిగా చెన్నైకి వస్తున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకే గవర్నర్ వస్తున్నారని, ఇతరత్రా మరే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండబోదని కొందరు అంటున్నారు. -
రొంబ సస్పెన్స్ థ్రిల్లర్
-
తమిళ డ్రామా మళ్లీ మొదలు..!
-
తమిళ డ్రామా మళ్లీ మొదలు..!
పళని, పన్నీర్ వర్గాల విలీనంతో అన్నాడీఎంకేలో తాజా సంక్షోభం - పళనిస్వామికి మద్దతు ఉపసంహరించిన దినకరన్ వర్గం - గవర్నర్‌ను కలసిన 19 మంది ఎమ్మెల్యేలు.. - ముఖ్యమంత్రిపై విశ్వాసం లేదంటూ లేఖల సమర్పణ - విశ్వాస పరీక్షకు ఆదేశించాలని గవర్నర్‌కు డీఎంకే లేఖ సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గాలు విలీనం పూరై్త 24 గంటలు గడవకముందే అధికార అన్నాడీఎంకే పార్టీలో మరో సంక్షోభం తలెత్తింది. పళనిస్వామి నిర్ణయంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేశారు. ముఖ్యమంత్రి పళనిస్వామిపై తమకు విశ్వాసం లేదని ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం 19 మంది దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావును చెన్నైలోని రాజ్‌భవన్‌లో కలసి లిఖితపూర్వకంగా తమ నిర్ణయాన్ని తెలియజేశారు. కాగా, తాజా పరిణామాల నేపథ్యంలో పళనిస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని డీఎంకే డిమాండ్ చేసింది. పళనిస్వామిపై విశ్వాసం లేదు.. తన వర్గం ఎమ్మెల్యేలతో దినకరన్ మంగళవారం ఉదయం 8 గంటలకు సమావేశమయ్యారు. 9.30 గంటలకు ఏడు కార్లలో 19 మంది ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు వెళ్లి 10 గంటలకు గవర్నర్‌ను కలుసుకున్నారు. ఎమ్మెల్యేలంతా విడివిడిగా మద్దతు ఉపసంహరణ లేఖలను గవర్నర్‌కు సమర్పించారు. వాటిని పరిశీలించి తగిన చర్య తీసుకుంటానని గవర్నర్ వారికి హామీ ఇచ్చారు. ‘‘మా వర్గం ఎమ్మెల్యేల మద్దతుతో కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకునేందుకు చర్యలు ప్రారంభించాం’’అని దినకరన్ మద్దతుదారు, అండిపత్తి ఎమ్మెల్యే తంగ తమిళ్ సెల్వన్ గవర్నర్‌ను కలసిన అనంతరం ప్రకటించారు. పళనిస్వామి ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోవాలని కోరుకుంటున్నారా అని ప్రశ్నించగా.. తమ ఉద్దేశం అదే అని సెల్వన్ చెప్పారు. పార్టీ నుంచి శశికళను తొలగించే ప్రయత్నాలను ఆయన తప్పుబట్టారు. విలీనం కాదు.. వెన్నుపోటు.. పళని–పన్నీర్ వర్గాల విలీనం పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళను వెన్నుపోటు పొడవడమేనని దినకరన్ అభివర్ణించారు. ఇది విలీనం కాదని వ్యక్తిగత ప్రయోజనాలు, పదవీకాంక్ష, పదవులను కాపాడుకోవడం కోసమే ఈ పని చేశారని ట్వీటర్లో మండిపడ్డారు. శశికళకు వెన్నుపోటు పొడిచిన పళనిస్వామి, పన్నీర్‌సెల్వంను పార్టీ కార్యకర్తలు, ప్రజలు క్షమించబోరని చెప్పారు. కాగా, అన్నాడీఎంకే నుంచి శశికళను తొలగించేందుకు చర్యలు ప్రారంభిస్తామని ప్రకటించిన రాజ్యసభ సభ్యుడు ఆర్. వైద్యలింగమ్ను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు దినకరన్ ప్రకటించారు. వైద్యలింగమ్ పళనిస్వామికి సన్నిహితుడు. విశ్వాస పరీక్ష పెట్టండి.. తాజా పరిణామాల నేపథ్యంలో పళనిస్వామిని సభలో బలం నిరూపించుకునేలా ఆదేశించాలని కోరుతూ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ గవర్నర్‌కు లేఖ రాశారు. 22 మంది ఎమ్మెల్యేలు సీఎంపై విశ్వాసం లేదని ప్రకటించారని, దీంతో రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందన్నారు. పీఎంకే నేత అన్బుమణిరామ్దాస్ కూడా పళనిస్వామి బలం నిరూపించుకోవాలని కోరారు. బలాబలాలు ఇవీ.. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 234 కాగా.. జయలలిత మరణంతో ప్రస్తుతం ఒక స్థానం ఖాళీగా ఉంది. అన్నాడీఎంకేకు 135, ప్రధాన ప్రతిపక్షం డీఎంకేకు 89 సీట్లు, ఆ పార్టీ మిత్రపక్షాలైన కాంగ్రెస్‌కు 8, ఐయూఎంఎల్‌కు ఒక సీటు ఉన్నాయి. ప్రస్తుతం 233 మంది సభ్యులకు గాను అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలంటే పళని స్వామికి 117 మంది మద్దతు అవసరం. తాజా లెక్కల ప్రకారం ఆయన బలం 122 నుంచి 112కు పడిపోయింది. గవర్నర్ బలపరీక్షకు ఆదేశిస్తే మరో ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో తమిళనాడులో మళ్లీ క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయి. తన వర్గంలోని 19 మంది ఎమ్మెల్యేలు చేజారిపోకుండా దినకరన్ పుదుచ్చేరిలో క్యాంప్ పెట్టారు. ప్రత్యేక బస్సులో మంగళవారం మధ్యాహ్నం ఎమ్మెల్యేల్ని పుదుచ్చేరికి పంపారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఎలాంటి ఇబ్బంది ఉండదని దినకరన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకేలో ఏ వర్గంలో ఎంతమంది.. పళని వర్గం : 112 మంది దినకరన్ వర్గం : 19 మంది దినకరన్‌కు మద్దతిస్తున్న మరో వర్గం 3 (కరుణాస్, తనియరసు, తమీమ్ అన్సారీ) తటస్థ ఎమ్మెల్యే : 1 (తోప్పు వెంకటాచలం) -
మైనారిటీలో పళని.. రంగంలోకి స్టాలిన్!
చెన్నై: తమిళనాట రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. అధికార అన్నాడీఎంకే సర్కారు మళ్లీ సంక్షోభంలో పడే అవకాశం కనిపిస్తోంది. తాజాగా అన్నాడీఎంకేలోని వైరివర్గాలైన ఈపీఎస్-ఓపీఎస్ వర్గాలు విలీనం కావడంతో అధికార పార్టీ బలోపేతమై.. సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తుందని రాజకీయ పరిశీలకులు భావించారు. అయితే, ఈ విలీనానికి వ్యతిరేకంగా శశికళ వర్గం ఎదురుతిరగడంతో పళనిస్వామి సర్కారు ఆత్మరక్షణలో పడినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే 19మంది శశికళ వర్గం ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిసి పళని సర్కారుకు మద్దతు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. అసెంబ్లీలో తగినంత సంఖ్యాబలం లేని పళనిని సీఎం పదవి నుంచి తొలగించాలని గవర్నర్‌ను కోరారు. ఇదే అదనుగా ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ రంగంలోకి దిగారు. పళనిస్వామి సర్కారు వెంటనే అసెంబ్లీ వేదికగా బలపరీక్ష సిద్ధపడాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే 19మంది ఎమ్మెల్యేలు పళని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోగా, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం ఇందుకు సిద్ధంగా ఉన్నారని, మొత్తం 22మంది ఎమ్మెల్యేలు పళనిస్వామికి వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో విశ్వాస పరీక్షలో పళని సర్కారు కూలడం ఖాయమని ఆయన ఆశిస్తున్నారు. ఇక, గవర్నర్‌ను కలిసిన అనంతరం శశికళ వర్గం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. సీఎం పళనిస్వామిపై తమకు విశ్వాసం లేదని గవర్నర్‌కు తెలిపామని, వెంటనే అసెంబ్లీని సమావేశపరిచి.. విశ్వాసపరీక్ష నిర్వహించాల్సిందిగా కోరామని అన్నాడీఎంకే ఎమ్మెల్యే థంగ తమిళ్ సెల్వన్ తెలిపారు. -
దినకరన్ అస్త్రం..పళనికి పదవీగండం!
-
దినకరన్ అస్త్రం.. పళనికి పదవీగండం!
గవర్నర్‌కు 19 మంది ఎమ్మెల్యేల ఫిర్యాదు చెన్నై: తమిళనాడులో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. నిన్నటికి నిన్న అన్నాడీఎంకేలో బద్ధవిరోధులుగా ముద్రపడిన ఓ. పన్నీర్ సెల్వం (ఓపీఎస్), ఎడపాటి పళనిస్వామి (ఈపీఎస్) వర్గాలు విలీనం కాగా.. ఈ విలీనానికి వ్యతిరేకంగా శశికళ వర్గం పావులు కదుతుపుతోంది. తమను పక్కనబెట్టి మరీ ఓపీఎస్, ఈపీఎస్ గ్రూపులు ఏకంకావడంతో.. పళని సర్కారును కూల్చి బుద్ధి చెప్పాలని శశికళ వర్గం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే శశికళ అక్క కొడుకు దినకరన్ నేతృత్వంలో 19మంది ఎమ్మెల్యేలు మంగళవారం గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావును కలిశారు. పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వానికి తమ మద్దతు లేదని వెల్లడించారు. పళనిస్వామిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని గవర్నర్‌ను కోరారు. తాజా పరిణామంతో పళని-పన్నీర్ సర్కారు మైనారిటీలో పడే అవకాశముందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. అయితే, పళని సర్కారుకు పూర్తి సంఖ్యాబలం ఉందని అన్నాడీఎంకే సీనియర్ నేత మైత్రేయేన్ చెప్తున్నారు. మరికాసేపట్లో ఆయన గవర్నర్‌ను కలిసి పళని ప్రభుత్వానికి ఉన్న సంఖ్యాబలాన్ని వివరించనున్నారు. దినకరన్ వర్గం రాజీనామా చేస్తే! తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తుత ఎమ్మెల్యేల సంఖ్య 234 (జయలలిత మరణంతో ఆర్కేనగర్ ఖాళీగా ఉంది). ఇందులో ప్రభుత్వాన్ని నిలుపుకునేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. జయ మరణం తర్వాత పన్నీర్ వర్గం విడిపోవటంతో జరిగిన విశ్వాస పరీక్షలో పళనిస్వామి 122 సీట్లతో గట్టెక్కారు. ఇందులో పళనిస్వామి వద్ద 94 మంది ఎమ్మెల్యేలుండగా.. దినకరన్ మద్దతుదారులైన 28మంది సభ్యులు అండగా నిలిచారు. అయితే తాజా విలీనం, శశికళను పార్టీనుంచి బహిష్కరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలతో దినకరన్ అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో 19మంది తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో దినకరన్ గవర్నర్‌ను కలిశారు. ఒకవేళ వీరందరితో దినకరన్ రాజీనామా చేయిస్తే.. (చెన్నైలో ఈ చర్చ జరగుతోంది) మ్యాజిక్ ఫిగర్ తగ్గి.. పన్నీర్, పళనిలకు మేలు జరుగుతుంది. అయితే, ఇన్నిరోజులు కష్టపడీ దినకరన్ ఇంత సులువుగా పళనికి అవకాశమిస్తారా అనేది ప్రశ్నార్థకమే. మద్దతు వెనక్కి తీసుకుంటే? ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ఈ 19 మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌కు వెల్లడిస్తే.. పళని సర్కారు మైనారిటీలో పడే అవకాశముంది. అప్పుడు స్టాలిన్ పెట్టే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా వీరు ఓటేస్తే.. ప్రభుత్వం కూలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీలో డీఎంకేకు 89, కాంగ్రెస్‌కు 8 మంది ఎమ్మెల్యేలుండగా ముస్లింలీగ్‌కు ఒక సభ్యుడున్నాడు. స్టాలిన్‌కు దినకరన్ వర్గం మద్దతిచ్చినట్లయితే.. ఈ కూటమి బలం (89+8+1+19) 117కు చేరుతుంది. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా శశికళ వర్గంతో చేతులు కలిపితే.. పళని సర్కారు బలపరీక్షలో ఓడిపోతుంది. -
తమిళనాట పళని ప్రభుత్వం నిలిచేనా?