
సాక్షి, చెన్నై : గెలుపు సంకేతాలు అందటంతో టీటీవీ దినకరన్ సీన్‌లోకి వచ్చేశారు. కాసేపటి క్రితం మధురై ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మూడు నెలల్లో పళని స్వామి ప్రభుత్వం పడిపోవటం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్కే నగర్ తీర్పు.. తమిళనాడు ప్రజల తీర్పు అని ఆయన చెప్పారు. ఈ పోరాటంలో తనకు మద్దతుగా నిలిచిన కోటిన్నర మంది కార్యకర్తలకు, ఆర్కే నగర్ ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంజీఆర్ ఆశీస్సులు తనకు ఉన్నాయని.. అమ్మకి నిజమైన వారసుడిని తానేనని ఆయన ప్రకటించుకున్నారు. ఇక ఎన్నికల్లో గెలవటానికి గుర్తు ముఖ్యం కాదని.. అక్కడ నిలుచునే వ్యక్తి ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. మధ్యాహ్నాం 3 గంటల సమయంలో జయ సమాధి వద్దకు చేరుకుని ఆయన నివాళులు అర్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment