Government dismissed
-
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ రద్దు.. తాత్కాలిక ప్రధాని ఎవరు?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ అసెంబ్లీని రద్దు చేసే ముందు ప్రధాని షెబాజ్ షరీఫ్ ప్రతిపక్ష నాయకుడు రజా రియాజ్ తో ఈరోజు సమావేశం కానున్నారు. వీరిద్దరూ కలిసి ఈ సమావేశంలో అసెంబ్లీ రద్దు తర్వాత పాక్ ఆపద్ధర్మ ప్రధాని ఎవరనేది నిర్ణయిస్తారు. ఆగస్టు 11న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీని రద్దు చేయనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ రద్దు విషయాన్ని రాష్ట్రపతి అరిఫ్ అల్వి దృష్టికి తీసుకెళ్తూ ఆయనకు లేఖ రాయనున్నారు ప్రస్తుత ప్రధాని షెబాజ్ షరీఫ్. అంతకు ముందే అసెంబ్లీ రద్దయిన తర్వాత ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించడానికి, ఎన్నికలు నిర్వహించడానికి తాత్కాలిక ప్రధానిని నియమించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ఇందులో భాగంగా ఆయన ప్రతిపక్ష నేత రజా రియాజ్ తో ఈరోజు చర్చించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తైన వెంటనే షెబాజ్ షరీఫ్ ప్రధాని పదవికి రాజీనామా చేస్తారు. తాత్కాలిక ప్రధాని రేసులో ఉన్నవారిలో మాజీ ఆర్ధిక శాఖ మంత్రి హఫీజ్ షేక్, నవాజ్ షరీఫ్ వద్ద ఆర్ధిక కార్యదర్శిగా పనిచేసిన తరీక్ బజ్వా, 2018లో తాతకాలిక ప్రధానిగా పని చేసిన మాజీ విదేశీ వ్యవహారాల కార్యదర్శి జలీల్ అబ్బాస్ జిలానీ, పాకిస్తాన్ మాజీ ప్రధాన న్యాయమూర్తి తస్సాదక్ హుస్సేన్ జిలాని, మాజీ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి మాకేబుల్ బఖీర్, నవాజ్ షరీఫ్ వ్యక్తిగత సహాయకుడు ఫవాద్ హాసన్ ఫవాద్, మాజీ విదేశాంగ శాఖమంత్రి హుస్సేన్ హరూన్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. డిసెంబరులో పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఎన్నికల ఏర్పాటుకు కొంత సమయం దొరుకుతుందన్న ఉద్దేశ్యంతో అసెంబ్లీని రద్దు చేయాలన్న నిర్ణయానికి వచ్చింది షెబాజ్ షరీఫ్ ప్రభుత్వం. ప్రభుత్వం రద్దైన మరుక్షణమే పాకిస్తాన్ ఎలక్షన్ కమీషన్ రంగంలోకి దిగి తదుపరి ప్రభుత్వ ఎన్నిక కార్యక్రమానికి శ్రీకారం చుడుతుంది. పూర్తి పదవీకాలం పూర్తైన తర్వాత అయితే ఎన్నికలు 60 రోజుల్లోనే నిర్వహిచాల్సి ఉంటుంది. అలా కాకుండా ముందస్తుగా ఎన్నికలకు వెళ్తే మాత్రం పాక్షితం ఎన్నికల కమిషన్ కు 90 రోజుల గడువు ఉంటుంది. ఈలోపే వారు ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇది కూడా చదవండి: 27 ఏళ్ల తర్వాత థాయ్ యువరాజు రీఎంట్రీ.. అందు కోసమేనా? -
దినకరన్ సంచలన వ్యాఖ్యలు... ఈ సర్కార్ కూలిపోతుంది
సాక్షి, చెన్నై : గెలుపు సంకేతాలు అందటంతో టీటీవీ దినకరన్ సీన్లోకి వచ్చేశారు. కాసేపటి క్రితం మధురై ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల్లో పళని స్వామి ప్రభుత్వం పడిపోవటం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్కే నగర్ తీర్పు.. తమిళనాడు ప్రజల తీర్పు అని ఆయన చెప్పారు. ఈ పోరాటంలో తనకు మద్దతుగా నిలిచిన కోటిన్నర మంది కార్యకర్తలకు, ఆర్కే నగర్ ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంజీఆర్ ఆశీస్సులు తనకు ఉన్నాయని.. అమ్మకి నిజమైన వారసుడిని తానేనని ఆయన ప్రకటించుకున్నారు. ఇక ఎన్నికల్లో గెలవటానికి గుర్తు ముఖ్యం కాదని.. అక్కడ నిలుచునే వ్యక్తి ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. మధ్యాహ్నాం 3 గంటల సమయంలో జయ సమాధి వద్దకు చేరుకుని ఆయన నివాళులు అర్పించనున్నారు. -
ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయండి
టీనగర్:రాష్ట్ర మంత్రుల అవినీతిపై చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ గవర్నర్‌ను కోరింది. ఈ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలంటూ టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రులు భారీ ఎత్తున అవినీతికి పాల్పడడంతో వారిపై చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని కోరుతూ కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్షుడు ఇలంగోవన్ నాయకత్వంలో శనివారం భారీ ర్యాలీ జరిపి గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర మంత్రుల అవినీతి గురించి ఇలంగోవన్ పూర్తి ఆధారాలతో ఆరోపణలు గుప్పిస్తూ వచ్చారు. ఆయన ఫిర్యాదుతో అగ్రి కృష్ణమూర్తిపై మాత్రమే చర్యలు తీసుకోబడ్డాయి. మిగతా మంత్రులపై ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు. ఇలావుండగా అవినీతికి పాల్పడిన మంత్రులను తొలగించాలని, వారిని అరెస్టు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఈ సందర్భంగా చెన్నైలో మధ్యాహ్నం మూడు గంటలకు భారీ ర్యాలీ ప్రారంభించారు. ఎగ్మూరు రాజరత్నం స్టేడియం సమీపాన ఇలంగోవన్ ఈ ర్యాలీని ప్రారంభించారు. ఇందులో మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం, నాసే రామచంద్రన్, రాజేష్, కార్తీ చిదంబరం, విఎస్జె దినకరన్, తదితర నేతలు పాల్గొన్నారు. కరాటే త్యాగరాజన్, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. చివరిగా ఎగ్మూరులో ర్యాలీ ముగిసింది. తర్వాత సాయంత్రం గవర్నర్ రోశయ్యను కలిసి అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా ర్యాలీకి భారీ పోలీసు భద్రత కల్పించారు.