టీనగర్:రాష్ట్ర మంత్రుల అవినీతిపై చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ గవర్నర్‌ను కోరింది. ఈ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలంటూ టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్ డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రులు భారీ ఎత్తున అవినీతికి పాల్పడడంతో వారిపై చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని కోరుతూ కాంగ్రెస్ రాష్ట్రాధ్యక్షుడు ఇలంగోవన్ నాయకత్వంలో శనివారం భారీ ర్యాలీ జరిపి గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు.
రాష్ట్ర మంత్రుల అవినీతి గురించి ఇలంగోవన్ పూర్తి ఆధారాలతో ఆరోపణలు గుప్పిస్తూ వచ్చారు. ఆయన ఫిర్యాదుతో అగ్రి కృష్ణమూర్తిపై మాత్రమే చర్యలు తీసుకోబడ్డాయి. మిగతా మంత్రులపై ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు. ఇలావుండగా అవినీతికి పాల్పడిన మంత్రులను తొలగించాలని, వారిని అరెస్టు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు.
ఈ సందర్భంగా చెన్నైలో మధ్యాహ్నం మూడు గంటలకు భారీ ర్యాలీ ప్రారంభించారు. ఎగ్మూరు రాజరత్నం స్టేడియం సమీపాన ఇలంగోవన్ ఈ ర్యాలీని ప్రారంభించారు. ఇందులో మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం, నాసే రామచంద్రన్, రాజేష్, కార్తీ చిదంబరం, విఎస్‌జె దినకరన్, తదితర నేతలు పాల్గొన్నారు. కరాటే త్యాగరాజన్, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. చివరిగా ఎగ్మూరులో ర్యాలీ ముగిసింది. తర్వాత సాయంత్రం గవర్నర్ రోశయ్యను కలిసి అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా ర్యాలీకి భారీ పోలీసు భద్రత కల్పించారు.
ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయండి
Published Sun, May 3 2015 4:24 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement