Palaniswami government
-
తమిళనాడులో కీలకంగా మారిన ఉపఎన్నికలు
-
కరుణానిధి అంత్యక్రియలు.. ప్రోటోకాల్ కిరికిరి
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియల వ్యవహారంలో దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టులో వాడివేడి వాదనలు కొనసాగుతున్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసమే డీఎంకే పిటిషన్ దాఖలు చేసిందని ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించగా.. బీచ్‌లోనే అంత్యక్రియలకు అనుమతించాలని డీఎంకే తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. ఒకానోక తరుణంలో కోర్టు హాల్లో గందరగోళం నెలకొంది. ప్రభుత్వ న్యాయవాది.. ‘గతంలో జానకీ రామచంద్రన్(ఎంజీఆర్ భార్య, మాజీ సీఎం కూడా) అంత్యక్రియలకు సీఎం కరుణానిధి మెరీనా బీచ్‌లో అనుమతించలేదు. ప్రోట్‌కాల్(సీఎం పదవిలో ఉండి చనిపోయిన వాళ్లకు మాత్రమే మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించటం)ను చూపించి అప్పుడు ఆయన అడ్డుకున్నారు. మాజీ సీఎంలకు గాంధీ మండపంలోనే స్మారకాలకు అనుమతి ఉంది. కామరాజ్, భక్తవత్సలం, రాజాజీల అంత్యక్రియలకు గాంధీ మండపంలోనే స్థలం కేటాయించారు. ఇదంతా ప్రోటోకాల్ ప్రకారమే జరిగింది. ఇప్పుడు పొలిటికల్ ఎజెండా తోనే డీఎంకే కేసు వేసింది. ద్రవిడ ఉద్యమనేత పెరియార్ లాంటి వాళ్లకే మెరీనా బీచ్‌లో అంత్యక్రియలకు గౌరవం దక్కలేదన్న విషయం వారు గుర్తించాలి. రాత్రికి రాత్రే మేనేజ్ చేయించి డీఎంకే వాళ్లు ఐదు పిటిషన్లను ఉపసంహరించుకునేలా చేశారు’ అని వాదనలు వినిపించారు. డీఎంకే న్యాయవాది.. ‘ప్రభుత్వ వాదనలు అసంబద్ధంగా ఉన్నాయి. సిట్టింగ్ సీఎంల అంత్యక్రియలకు మాత్రమే మెరీనా బీచ్‌లో స్థలం కేటాయించాలన్న నిబంధన ఎక్కడా లేదు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వాలు నడుచుకోవాలి. లేకుంటే వారి మనోభావాలు దెబ్బతింటాయి. అన్నాదురైని తన ఆత్మ, జీవితంగా కరుణానిధి గతంలో పేర్కొనేవారు. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఓ వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా?.. అటువంటి నేతకు గాంధీ మండపంలో అంత్యక్రియలు నిర్వహించటం సముచితం కాదు. పైగా మేనేజ్ చేశారంటూ వాదిస్తారా? అంటూ ప్రభుత్వ న్యాయవాదిపై డీఎంకే న్యాయవాది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దశలో కోర్టు హాల్లో గందరగోళం చెలరేగగా.. సైలెంట్‌గా ఉండాలని ప్రధాన న్యాయమూర్తి అందరికీ సూచించారు. సంతాప దినాలు కావటంతో కోర్టుకు సెలవు అయినప్పటికీ.. ఈ పిటిషన్ కోసమే బెంచ్ ప్రత్యేకంగా విచారణ చేపట్టడం గమనార్హం. -
సర్కారును కూల్చడమే లక్ష్యం..!
అన్నాడీఎంకే సర్కారును కూల్చడమే లక్ష్యంగా అమ్మ శిబిరం నేత దినకరన్ దూకుడు పెంచేందుకు సిద్ధం అయ్యారు. ఆ కోవలో ఎమ్మెల్యేకు గాలం వేసే పనిలో పడ్డారు. ఇద్దరు ఎమ్మెల్యేలు అనుకూలమనే సంకేతాలు వెలువడ్డాయి. ఎమ్మెల్యేలను ఆకట్టుకునేందుకు మాజీ మంత్రులతో ఓ బృందం ఏర్పాటు చేసినట్లు సమాచారం. సాక్షి, చెన్నై: సీఎం పళనిస్వామి సర్కారును కూల్చడయే లక్ష్యంగా ఆది నుంచి అన్నాడీఎంకే అమ్మ శిబిరం నేత దినకరన్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆయనకు మద్దతుగా నిలిచిన 18 మంది ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడింది. కోర్టు తీర్పు వెలువడాల్సి ఉంది. కాగా, ఇంకొందరు ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకుని సీఎం పళని స్వామిని గద్దె దించాలనే లక్ష్యంగా దినకరన్ సాగుతున్నట్లు భావిస్తున్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో గెలుపుతో సత్తా చాటుకున్న దినకరన్ వెన్నంటి నడిచేందుకు ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు సంసిద్ధంగా ఉన్నట్లు ఆ ఆయన వర్గం చెబుతోంది. పలువురు ఎమ్మెల్యేలు కూడా దినకరన్‌తో కలిసి అడుగులు వేద్దామనే ఆలోచనలో ఉన్నా, అనర్హత వేటుకు జడిసి, వెనక్కు తగ్గారు. ఇలాంటి వారిని తమ వైపునకు తిప్పుకునేందుకు దినకరన్ నిర్ణయిం చుకున్నారు. సీఎం పళని స్వామిపై అసంతృప్తితో ఉన్న వారిని తమ వైపు తిప్పుకుని బడ్జెట్ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షం ద్వారా సీఎం పళని స్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చేందుకు తగ్గ ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. రంగంలోకి కమిటీ సీఎంకు వ్యతిరేకంగా, అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను , తటస్థంగా ఉన్న మిత్రపక్షానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు దినకరన్ ఓ కమిటీని రంగంలోకి దించారు. మాజీ మంత్రులు, అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు సెంథిల్ బాలాజీ, పళనియప్పన్ నేతృత్వంలో ఆ కమిటీ ఎమ్మెల్యేలకు గాలం వేసే పనిలో పడింది. నామక్కల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ప్రభును తమ వైపునకు తిప్పుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నించింది. ఆ ఎమ్మెల్యే దినకరన్‌తో భేటీ కావడం గమనార్హం. విల్లుపురం, కడలూరు జిల్లాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకున్నారు. ఇంకొందరు లక్ష్యంగా సాగుతున్నారు. వారంతట వారే వస్తున్నారు.. విషయంగా దినకరన్‌ను ప్రశ్నించగా, ఎమ్మెల్యేలు తమంతకు తాము తమ వెంట వస్తున్నారన్నారు. త్వరలో ప్రభుత్వం కూలడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. అమ్మ పేరు చెప్పుకుని అరాచకాలు సృష్టిస్తున్నారని, ప్రజల్ని అష్టకష్టాలు గురిచేస్తున్నారని మండి పడ్డారు. తాను ఎక్కడకు వెళ్లినా, త్వరితగతిన ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని కేడర్ విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. వారి ఆశ కొన్ని రోజుల్లో సాకారం కాబోతున్నదని వ్యాఖ్యానించారు. మంత్రి తంగమణి మాట్లాడుతూ, తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు దినకరన్ తీవ్రంగానే కష్టపడుతున్నట్టున్నాడని మండిపడ్డారు. వారికి అనుకూలంగా ఏ ఎమ్మెల్యే నిర్ణయం తీసుకోరనే ధీమాను వ్యక్తం చేశారు. -
ఎమ్మెల్యేల జీతాలు పెంచుతారు కానీ..
సాక్షి, చెన్నై: తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె ఏడో రోజుకు చేరింది. తమ సమస్యలు పరిష్కరించనిదే సమ్మె విరమించే ప్రసక్తే లేదని కార్మిక సంఘాలు తేల్చి చెప్పాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వేతనాలు పెంచాలని సమ్మెకు దిగిన కార్మికులు ఆందోళనను ఉద్రితం చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం చర్చలకు పిలిస్తే సమ్మె విరమణకు సిద్ధమని మంగళవారం కార్మిక సంఘాలు ప్రకటించాయి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పళనిస్వామి ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేల వేతనాలు పెంచుకుంటారు కానీ.. తమ వేతనాలు గురించి పట్టించుకోరా అంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. -
బ్రేకింగ్: దినకరన్ ప్రభంజనం.. బీజేపీ కన్నా నోటాకే అధికం!
సాక్షి, చెన్నై: ప్రతిష్టాత్మకంగా మారిన ఆర్కే నగర్ ఉప ఎన్నికలో టీటీవీ దినకరన్ ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్‌పై 40,707 ఓట్ల మెజారిటీతో దినకరన్ అఖండ విజయాన్ని సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన దినకరన్ ప్రభంజనం ముందు ప్రత్యర్థి పార్టీలు కొట్టుకుపోయాయి. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే సహా బీజేపీ, ఇతర చిన్న పార్టీలు డిపాజిట్ కోల్పోయాయి. దివంగత జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్.. హోరాహోరీగా సాగుతుందని అంతా భావించారు. కానీ, అధికార అన్నాడీఎంకే.. శశికళ వర్గం తరఫున బరిలోకి దిగిన టీటీవీ దినకరన్‌కు గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. ఉప ఎన్నికలో కుక్కర్ గుర్తుతో పోటీచేసిన దినకరన్ మొదటినుంచి లీడ్‌లో కొనసాగుతూ.. ఇటు అధికార అన్నాడీఎంకే, అటు ప్రతిపక్ష డీఎంకే ఊహించనిస్థాయిలో భారీ విజయాన్ని అందుకున్నారు. బీజేపీ కన్నా నోటాకే ఎక్కువ ఈ ఎన్నికల్లో దినకరన్‌కు 89,013 ఓట్లు రాగా, అన్నాడీఎంకేకు 48,306 ఓట్లు వచ్చాయి. డీఎంకేకు 24,651 ఓట్లు, నామ్ తమిళార్ పార్టీకి 3,802 వచ్చాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ బీజేపీకి ఈ ఉప ఎన్నిక ఏమాత్రం కలిసిరాలేదు. తమిళనాడు రాజకీయాల్లో మెరుగుపడాలని ఎంతగా తపిస్తున్నా.. కమళదళం ఆర్కేనగర్ ఉప ఎన్నికలో అతికష్టం వెయ్యిమార్కును దాటింది. బీజేపీ అభ్యర్థికి 1,368 ఓట్లు రాగా, బీజేపీ కన్నా ఎక్కువగా నోటా (పైవారెవరూ కారు)కు 2,203 ఓట్లు వచ్చాయి. ఆర్కే నగర్ ప్రజలకు ధన్యవాదాలు తనను గెలిపించిన ఆర్కే నగర్ ప్రజలకు దినకరన్ కృతజ్ఞతలు తెలిపారు. అమ్మ జయలలిత ఆశీస్సులు తనకు ఉన్నాయని, అందుకే ఆర్కే నగర్ తీర్పే నిదర్శమని అన్నారు. మూడు నెలల్లో అన్నాడీఎంకే ప్రభుత్వం కూలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. అమ్మ వారసురాలే చిన్నమ్మేనంటూ శశికళ వర్గం కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. -
దినకరన్ సంచలన వ్యాఖ్యలు... ఈ సర్కార్ కూలిపోతుంది
సాక్షి, చెన్నై : గెలుపు సంకేతాలు అందటంతో టీటీవీ దినకరన్ సీన్లోకి వచ్చేశారు. కాసేపటి క్రితం మధురై ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల్లో పళని స్వామి ప్రభుత్వం పడిపోవటం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్కే నగర్ తీర్పు.. తమిళనాడు ప్రజల తీర్పు అని ఆయన చెప్పారు. ఈ పోరాటంలో తనకు మద్దతుగా నిలిచిన కోటిన్నర మంది కార్యకర్తలకు, ఆర్కే నగర్ ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంజీఆర్ ఆశీస్సులు తనకు ఉన్నాయని.. అమ్మకి నిజమైన వారసుడిని తానేనని ఆయన ప్రకటించుకున్నారు. ఇక ఎన్నికల్లో గెలవటానికి గుర్తు ముఖ్యం కాదని.. అక్కడ నిలుచునే వ్యక్తి ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. మధ్యాహ్నాం 3 గంటల సమయంలో జయ సమాధి వద్దకు చేరుకుని ఆయన నివాళులు అర్పించనున్నారు. -
‘ఎన్డీఏ కూటమిలోకి ఏఐఏడీఎంకే’
-
‘ఎన్డీఏ కూటమిలోకి ఏఐఏడీఎంకే’
సాక్షి,చెన్నై: తమిళనాడు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. దినకరన్ వర్గ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన పళని సర్కార్ పనిలోపనిగా కేంద్రానికి దగ్గరయ్యేందుకు పావులు కదుపుతోంది. మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్‌లో ఏఐఏడీఎంకే భాగస్వామి అవుతుందని తమిళనాడు సీఎం పళనిస్వామి సంకేతాలు పంపారు.కేంద్రంలోని పాలక కూటమిలో చేరితే తమిళనాడు కోసం ఏఐఏడీఎంకే ప్రభుత్వం మరెంతో చేయగలిగేదని పళనిస్వామి వ్యాఖ్యానించారు. కేంద్రం సహకారంతో పలు నూతన పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేవారమని, తమిళనాడును అద్భుత రాష్ట్రంగా తీర్చిదిద్దుకునేవారమని అన్నారు. రాష్ట్రంలో సంపద వెల్లివిరిసేలా చర్యలు చేపట్టేవారమని చెప్పుకొచ్చారు. ఏఐఏడీఎంకేకు ఆ అవకాశం లేకున్నా రాష్ట్రనికి ప్రాజెక్టులు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. నమక్కల్‌లో జరిగిన ఎంజీఆర్ స్వర్ణోత్సవ వేడుకల్లో పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసింగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ముందు మోకరిల్లిందన్న డీఎంకే విమర్శలను పళనిస్వామి తోసిపుచ్చారు. తాము కేంద్రానికి తొత్తులం కాదు సేవకులం కాదని, కేంద్రంతో కేవలం సామరస్య సంబంధాలనే నెరుపుతున్నామని స్పష్టం చేశారు. కేంద్రంతో మెరుగైన సంబంధాలుంటేనే రాష్ట్ర ప్రాజెక్టును సాధించుకోవడంతో పాటు సంక్షేమ పథకాలకు అనుమతులు తెచ్చుకోగలుగుతామని చెప్పారు.తమిళనాడుకు పెద్దసంఖ్యలో పేదలకు గృహాలను కేంద్రం మంజూరు చేసిందని,రాష్ట్రానికి ఇండస్ర్టియల్ టౌన్‌షిప్‌ను మంజూరు చేసిందని వివరించారు. -
బడ్జెట్ సెషన్లో పళనికి చెక్
చెన్నై : తమిళనాడులో రాజకీయాలు మరింత హీటెక్కే దిశగా కదులుతున్నాయి.. ఎలాగైనా అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూలదోసి, తాజా ఎన్నికలు వెళ్లాలని డీఎంకే నిర్ణయించింది. మధ్యంతర ఎన్నికలతో మళ్లీ పవర్ లోకి వచ్చేయాలని తెగ ప్లాన్స్ వేసేస్తోంది. అసెంబ్లీలో తీవ్ర ఆందోళనల నేపథ్యంలో బలనిరూపణలో నెగ్గి, సీఎం పదవిలోకి వచ్చిన పళనికి మార్చిలో జరుగబోయే బడ్జెట్ సెషన్లో చెక్ పెట్టాలని డీఎంకే నిర్ణయించేసింది. ఫిబ్రవరి 22న రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపట్టి, అసెంబ్లీలో జరిగిన రాజకీయ హైడ్రామాను ప్రజలకు వివరిస్తామని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ సోమవారం పేర్కొన్నారు. విశ్వాస పరీక్ష సందర్భంగా అసెంబ్లీలో తీవ్ర అక్రమ పద్ధతులు చోటుచేసుకున్నాయని డీఎంకే ఎమ్మెల్యేలు చెబుతున్నారు. గత శనివారం జరిగిన అసెంబ్లీ సెషన్లో తీవ్ర ఆందోళనల నేపథ్యంలోనే పళని తన బలపరీక్షను నెగ్గి, తమిళ నాడు సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం సృష్టించిన భయానక వాతావరణం, అన్నాడీఎంకే తప్పుడు ధోరణిని ప్రజలోకి తీసుకెళ్తామని డీఎంకే హెచ్చరిస్తోంది.అంతేకాక బడ్జెట్ సెషన్లోనూ ప్రభుత్వాన్ని కూలదోయాలని పన్నాగాలు పన్నుతోంది. వచ్చే 90రోజుల్లో రాష్ట్ర వ్యయానికి సంబంధించి అన్నాడీఎంకే ప్రభుత్వం కనీసం 50 నుంచి 60 మనీ బిల్లులను అసెంబ్లీ ముందుకు తీసుకురాబోతుందని, కానీ ఒక్క బిల్లును కూడా తాము ఆమోదించమని డీఎంకే ఎమ్మెల్యేలు హెచ్చరిస్తున్నారు.