దినకరన్‌ లంచం కేసు, మరొకరి అరెస్ట్‌ | Alleged hawala operator arrested in EC bribery case | Sakshi

దినకరన్‌ లంచం కేసు, మరొకరి అరెస్ట్‌

Published Fri, Apr 28 2017 12:54 PM | Last Updated on Tue, Sep 5 2017 9:55 AM

దినకరన్‌ లంచం కేసు, మరొకరి అరెస్ట్‌

దినకరన్‌ లంచం కేసు, మరొకరి అరెస్ట్‌

అన్నాడీఎంకే గుర్తు ‘రెండాకుల’ కోసం టీటీవీ దినకరన్‌ లంచం ఇచ్చిన కేసులో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది.

న్యూఢిల్లీ: అన్నాడీఎంకే గుర్తు ‘రెండాకుల’ కోసం టీటీవీ దినకరన్‌ లంచం ఇచ్చిన కేసులో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ కేసులో మరొకరిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. థాయ్‌లాండ్‌ నుంచి వచ్చిన నరేశ్‌ అనే హవాలా ఆపరేటర్‌ ను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అతడి అరెస్ట్‌ను ఢిల్లీ పోలీసు జాయింట్‌ కమిషనర్‌(క్రైమ్‌) ప్రవీర్‌ రాజన్‌ ధ్రువీకరించారు.     

మరోవైపు దర్యాప్తులో భాగంగా చెన్నైకు తీసుకెళ్లిన దినకరన్‌ ను ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. గురువారం ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. బెంగళూరులోనూ తనిఖీలు నిర్వహించనున్నారని సమాచారం. దినకరన్‌ భార్యను ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. ఈ కేసులో మధ్యవర్తి సుఖేశ్‌ చంద్రశేఖర్‌తో పాటు దినకరన్‌ సన్నిహితుడు మల్లిఖార్జున్‌ కూడా పోలీసులు ఇప్పటికే అరెస్ట్‌ చేశారు. రెండాకుల గుర్తు కోసం ఈసీ అధికారికి రూ. 50 కోట్లు లంచం ఇవ్వచూపినట్టు దినకరన్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement