EC bribery case
-
చెన్నై చేరుకున్న దినకరన్
చెన్నై: ఈసీకి లంచం ఇవ్వజూపిన కేసులో బెయిల్ మంజూరు అయిన అన్నాడీఎంకే బహిష్కృత నేత టీటీవీ దినకరన్ శనివారం చెన్నై చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు ఘనంగా స్వాగతం పలికారు. దినకరన్ విడుదల సందర్భంగా అడయార్‌లోని ఆయన నివాసం వద్ద శనివారం టపాసులు, డప్పుల మోతతో హోరెత్తించారు. అంతేకాకుండా పూలు, పళ్లు, పూలదండలతో అక్కడకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ కేసులో దినకరన్‌తో పాటు ఆయన మద్దతుదారులకు ఢిల్లీ కోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కాగా దినకరన్ అనుచరుడు మల్లిఖార్జున్ కూడా న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. అన్నాడీఎంకే పార్టీ చిహ్నం ‘రెండాకుల’ కోసం ఈసీకి లంచం ఇవ్వచూపినట్టు దినకరన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మధ్యవర్తి సుఖేశ్ చంద్రశేఖర్‌ను ఢిల్లీ క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. -
దినకరన్ లంచం కేసు, మరొకరి అరెస్ట్
-
దినకరన్ లంచం కేసు, మరొకరి అరెస్ట్
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే గుర్తు ‘రెండాకుల’ కోసం టీటీవీ దినకరన్ లంచం ఇచ్చిన కేసులో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ కేసులో మరొకరిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. థాయ్‌లాండ్ నుంచి వచ్చిన నరేశ్ అనే హవాలా ఆపరేటర్ ను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అతడి అరెస్ట్‌ను ఢిల్లీ పోలీసు జాయింట్ కమిషనర్(క్రైమ్) ప్రవీర్ రాజన్ ధ్రువీకరించారు. మరోవైపు దర్యాప్తులో భాగంగా చెన్నైకు తీసుకెళ్లిన దినకరన్ ను ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. గురువారం ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. బెంగళూరులోనూ తనిఖీలు నిర్వహించనున్నారని సమాచారం. దినకరన్ భార్యను ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. ఈ కేసులో మధ్యవర్తి సుఖేశ్ చంద్రశేఖర్‌తో పాటు దినకరన్ సన్నిహితుడు మల్లిఖార్జున్ కూడా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. రెండాకుల గుర్తు కోసం ఈసీ అధికారికి రూ. 50 కోట్లు లంచం ఇవ్వచూపినట్టు దినకరన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.