ఆదాయపన్న శాఖ (ఐటీ) పెద్ద ఎత్తున జరిపిన దాడులతో శశికళ వర్గం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. శశికళ ఆర్థిక సామ్రాజ్యం లక్ష్యంగా, ఆమె బంధువులు, కుటుంబసభ్యుల ఆస్తులపై ఐటీ అధికారులు గురువారం తెల్లవారుజాము నుంచి ఏకంగా 30 చోట్ల ఐటీ దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఉరుములేని పిడుగులా విరుచుకుపడ్డ ఐటీ దాడులపై శశికళ వర్గం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఐటీ దాడుల వెనుక కేంద్ర ప్రభుత్వం కుట్ర ఉందని, రాష్ట్రంలోని అన్నాడీఎంకే సర్కారుకు మద్దతుగా కేంద్రం తమ ఆస్తులపై ఐటీ దాడులు చేయించిందని శశికళ వర్గం ఆరోపించింది.