దినకరన్ వర్గం 21 మంది ఎమ్మెల్యేలు తమ రాజకీయ మకాంను హైదరాబాద్‌కు మార్చనున్నట్లు తెలిసింది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎడపాడి పళనిస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుని పుదుచ్చేరి రిసార్టులో గడుపుతున్న దినకరన్ వర్గం 21 మంది ఎమ్మెల్యేలు తమ రాజకీయ మకాంను హైదరాబాద్‌కు మార్చనున్నట్లు తెలిసింది.
సీఎంకు వ్యతిరేకంగా గత నెల 22వ తేదీన గవర్నర్‌కు లేఖలు అందజేసిన ఎమ్మెల్యేలు.. అప్పటి నుంచి పుదుచ్చేరిలోని ఒక రిసార్టులో ఉంటున్నారు. కొద్దిరోజుల కిందటే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తోడవడంతో దినకరన్ బలం 21కి పెరిగింది.
సీఎం వర్గం నుంచి ప్రలోభాలకు గురికాకుండా తన వర్గ ఎమ్మెల్యేలను కాపాడుకుంటూ వస్తున్న దినకరన్ ఈ మకాంను శని లేదా ఆదివారం హైదరాబాద్‌కు మార్చనున్నారు. అనర్హత వేటుపై షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వడంలో భాగంగా ఈనెల 5వ తేదీన 19 మంది ఎమ్మెల్యేలమంతా స్పీకర్‌ను విడివిడిగా కలుస్తామని దినకరన్ వర్గ ఎమ్మెల్యే తంగతమిళ్‌సెల్వన్ తెలిపారు.