![AIADMK Workers Attack on TTV Dinakaran Vehicle - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/18/AIADMK-Workers-Attack1.jpg.webp?itok=Nob3DMFQ)
సాక్షి, చెన్నై : శశికళ మేనల్లుడు, ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌కు సొంత నియోజకవర్గంలోనే చుక్కెదురైంది. ఆర్కే నగర్ నియోజకవర్గంలో బుధవారం ఆయన పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అధికార అన్నాడీఎంకే శ్రేణులు ఆయన వాహనంపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఘర్షణకు దారితీసింది.
తన నియోజకవర్గమైన ఆర్కేనగర్‌లో మద్దతుదారులతో కలిసి టీటీవీ దినకరన్ పర్యటించారు. ఈ సమయంలో ఆయన తన కారులో వెళుతుండగా అదే ప్రాంతానికి చెందిన అన్నాడీఎంకే నేత మధుసూదన్ వర్గీయులు అడ్డుకున్నారు. తమ ప్రాంతంలోకి రావద్దని ఘర్షణకు దిగారు. దినకరన్ ప్రయాణిస్తున్న కారుపై రాళ్లతోదాడి చేశారు. దీనిని దినకరన్ వర్గం ప్రతిఘటించడంతో ఇరువర్గాల నడుమ ఘర్షణ చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు భారీగా బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అన్నాడీఎంకే శ్రేణులు, దినకరన్ వర్గీయులకు మధ్య చోటుచేసుకున్న ఈ ఘర్షణ తమిళనాట సంచలనం రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment