rk nagar
-
దినకరన్ వాహనంపై రాళ్లదాడి.. తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, చెన్నై : శశికళ మేనల్లుడు, ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌కు సొంత నియోజకవర్గంలోనే చుక్కెదురైంది. ఆర్కే నగర్ నియోజకవర్గంలో బుధవారం ఆయన పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. అధికార అన్నాడీఎంకే శ్రేణులు ఆయన వాహనంపై రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి ఘర్షణకు దారితీసింది. తన నియోజకవర్గమైన ఆర్కేనగర్లో మద్దతుదారులతో కలిసి టీటీవీ దినకరన్ పర్యటించారు. ఈ సమయంలో ఆయన తన కారులో వెళుతుండగా అదే ప్రాంతానికి చెందిన అన్నాడీఎంకే నేత మధుసూదన్ వర్గీయులు అడ్డుకున్నారు. తమ ప్రాంతంలోకి రావద్దని ఘర్షణకు దిగారు. దినకరన్ ప్రయాణిస్తున్న కారుపై రాళ్లతోదాడి చేశారు. దీనిని దినకరన్ వర్గం ప్రతిఘటించడంతో ఇరువర్గాల నడుమ ఘర్షణ చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు భారీగా బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అన్నాడీఎంకే శ్రేణులు, దినకరన్ వర్గీయులకు మధ్య చోటుచేసుకున్న ఈ ఘర్షణ తమిళనాట సంచలనం రేపుతోంది. -
రూ. 20 పట్టు...పది వేలు కొట్టు
సాక్షి, చెన్నై : దినకరన్‌కు బ్రహ్మరథం పట్టిన ఆర్కేనగర్ ఓటరు ప్రస్తుతం తిరగబడే పనిలో పడ్డారు. రూ.20 నోట్లను చేత పట్టి.. రూ. పది వేలు కొట్టు అన్న నినాదంతో ఆదివారం దినకరన్‌ను మహిళలు చుట్టుముట్టారు. తన నియోజకవర్గ ప్రజలు ఘోరావ్ చేయడంతో ఎమ్మెల్యే ఉక్కిరి బిక్కిరయ్యారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో చిన్నమ్మ శశికళ ప్రతినిధి దినకరన్‌కు ఓటర్లు బ్రహ్మరథం పట్టిన విషయం తెలిసిందే. డీఎంకే డిపాజిట్లు గల్లంతు కాగా, అన్నాడీఎంకేను ఢీ కొడుతూ భారీ ఆధిక్యంతోనే అసెంబ్లీ మెట్లు ఎక్కారు. ఓటుకు నోటు తాండవం గుట్టు రట్టుతో గతంలో ఉప ఎన్నిక రద్దును పరిగణించిన దినకరన్ ఈసారి కొత్త బాణి అనుసరించారని ఆరోపణలున్నాయి. కొన్నిచోట్ల నోట్లు చల్లినా, మరికొన్ని చోట్ల గెలుపు తదుపరి నోటు అంటూ కొత్త మార్గాన్ని అనుసరించారని ప్రచారం. ఓటుకు నోటుకు చిహ్నంగా రూ. 20 నోటును ఎన్నికల సమయంలో అందించినట్టు సంకేతాలు వెలువడ్డాయి. తామిచ్చిన రూ. 20 నోటు ఎవరి వద్ద ఉందో వారందరికి గెలుపు తదుపరి రూ.10 వేలు ఇస్తామని నమ్మ బలికినట్టు సమాచారాలు ఉన్నాయి. అయితే, గెలుపు తదుపరి ఆయన ఆ రూ.20 నోటు గురించి పట్టించుకోలేదని ఆగ్రహిస్తూ అనేకచోట్ల ఆందోళనలు సైతం సాగాయి. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఆర్కేనగర్ పర్యటనకు వచ్చిన దినకరన్ మీద బ్రహ్మరథం పట్టిన వాళ్లే తిరగబడడం గమనార్హం. రూ.20 పట్టు.. రూ. పది వేలు కొట్టు ఆర్కేనగర్ ఎమ్మెల్యే, అమ్మ మక్కల్ కళగం నే త టీటీవీ దినకరన్ ఆదివారం ఉదయం ఆర్కేనగర్ పరిధిలోని నేతాజీ నగర్‌లోని మురుగన్ ఆలయానికి వచ్చారు. అక్కడ జరిగిన చిత్రా పౌర్ణమి ఉత్సవాలకు ఆయన వస్తున్న సమాచారంతో ఓటర్లు తిరగబడేందుకు సిద్ధం అయ్యారు. పెద్ద సంఖ్యలో ఓ వర్గానికి చెందిన వారు చుట్టుముట్టారు. ఘోరావ్ చేస్తూ, ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించినా ఫలితం శూన్యం. పెద్ద సంఖ్యలో మహిళలు రూ. 20 నోట్లు ఇదిగో.. హామీ ఇచ్చినట్టుగా రూ.పదివేలు ఇవ్వు.. అంటూ ఆయన్ను నిలదీస్తూ నినాదాల్ని హోరెత్తించారు. అదే సమయంలో దినకరన్ మద్దతుదారులు ఆందోళనకారుల మీద తిరగబడడంతో ఉద్రిక్తత తప్పలేదు. పోలీసులు ఇరువర్గాల్ని బుజ్జగించేందుకు శ్రమించాల్సి వచ్చింది. ఎలాగోలా అక్కడి నుంచి జారుకున్న దినకరన్ ఆలయం వద్దకు వెళ్లి ఆగమేఘాలపై పూజలు చేసి మరో మార్గంలో దూసుకెళ్లారు. మరోచోట దినకరన్ చలివేంద్రం ఏర్పాటుకు వచ్చి తీరాల్సి ఉండడంతో, అక్కడే ఆందోళనకారులు బైఠాయించారు. చివరకు అటు వైపు రాకుండానే దినకరన్ జారుకున్నారు. కాగా, దినకరన్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన వారంతా అన్నాడీఎంకే పార్టీకి చెందిన వారేనని, పని గట్టుకుని మరీ రాద్దాంతం చేసినట్టుగా దినకరన్ మద్దతుదారుడు వెట్రివేల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలే మేనమామ రూపంలో ఫ్యామిలీ వార్ ను ఎదుర్కొంటున్న దినకరన్‌కు తాజాగా రూ.20 నోటు రూపంలో ఓటరు తిరగబడే పనిలో పడడం మరింత శిరోభారంగా మారింది. -
సర్కారును కూల్చడమే లక్ష్యం..!
అన్నాడీఎంకే సర్కారును కూల్చడమే లక్ష్యంగా అమ్మ శిబిరం నేత దినకరన్ దూకుడు పెంచేందుకు సిద్ధం అయ్యారు. ఆ కోవలో ఎమ్మెల్యేకు గాలం వేసే పనిలో పడ్డారు. ఇద్దరు ఎమ్మెల్యేలు అనుకూలమనే సంకేతాలు వెలువడ్డాయి. ఎమ్మెల్యేలను ఆకట్టుకునేందుకు మాజీ మంత్రులతో ఓ బృందం ఏర్పాటు చేసినట్లు సమాచారం. సాక్షి, చెన్నై: సీఎం పళనిస్వామి సర్కారును కూల్చడయే లక్ష్యంగా ఆది నుంచి అన్నాడీఎంకే అమ్మ శిబిరం నేత దినకరన్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆయనకు మద్దతుగా నిలిచిన 18 మంది ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడింది. కోర్టు తీర్పు వెలువడాల్సి ఉంది. కాగా, ఇంకొందరు ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకుని సీఎం పళని స్వామిని గద్దె దించాలనే లక్ష్యంగా దినకరన్ సాగుతున్నట్లు భావిస్తున్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో గెలుపుతో సత్తా చాటుకున్న దినకరన్ వెన్నంటి నడిచేందుకు ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు సంసిద్ధంగా ఉన్నట్లు ఆ ఆయన వర్గం చెబుతోంది. పలువురు ఎమ్మెల్యేలు కూడా దినకరన్‌తో కలిసి అడుగులు వేద్దామనే ఆలోచనలో ఉన్నా, అనర్హత వేటుకు జడిసి, వెనక్కు తగ్గారు. ఇలాంటి వారిని తమ వైపునకు తిప్పుకునేందుకు దినకరన్ నిర్ణయిం చుకున్నారు. సీఎం పళని స్వామిపై అసంతృప్తితో ఉన్న వారిని తమ వైపు తిప్పుకుని బడ్జెట్ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్షం ద్వారా సీఎం పళని స్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చేందుకు తగ్గ ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. రంగంలోకి కమిటీ సీఎంకు వ్యతిరేకంగా, అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలను , తటస్థంగా ఉన్న మిత్రపక్షానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు దినకరన్ ఓ కమిటీని రంగంలోకి దించారు. మాజీ మంత్రులు, అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు సెంథిల్ బాలాజీ, పళనియప్పన్ నేతృత్వంలో ఆ కమిటీ ఎమ్మెల్యేలకు గాలం వేసే పనిలో పడింది. నామక్కల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ప్రభును తమ వైపునకు తిప్పుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నించింది. ఆ ఎమ్మెల్యే దినకరన్‌తో భేటీ కావడం గమనార్హం. విల్లుపురం, కడలూరు జిల్లాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకున్నారు. ఇంకొందరు లక్ష్యంగా సాగుతున్నారు. వారంతట వారే వస్తున్నారు.. విషయంగా దినకరన్‌ను ప్రశ్నించగా, ఎమ్మెల్యేలు తమంతకు తాము తమ వెంట వస్తున్నారన్నారు. త్వరలో ప్రభుత్వం కూలడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. అమ్మ పేరు చెప్పుకుని అరాచకాలు సృష్టిస్తున్నారని, ప్రజల్ని అష్టకష్టాలు గురిచేస్తున్నారని మండి పడ్డారు. తాను ఎక్కడకు వెళ్లినా, త్వరితగతిన ఈ ప్రభుత్వాన్ని కూల్చాలని కేడర్ విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. వారి ఆశ కొన్ని రోజుల్లో సాకారం కాబోతున్నదని వ్యాఖ్యానించారు. మంత్రి తంగమణి మాట్లాడుతూ, తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు దినకరన్ తీవ్రంగానే కష్టపడుతున్నట్టున్నాడని మండిపడ్డారు. వారికి అనుకూలంగా ఏ ఎమ్మెల్యే నిర్ణయం తీసుకోరనే ధీమాను వ్యక్తం చేశారు. -
రానున్న ఎన్నికల్లో పెనుమార్పు తథ్యం: హీరో
సాక్షి, చెన్నై: తాను కూడా రాజకీయాల్లోకి వస్తున్నానని హీరో, దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యదర్శి, తమిళ నిర్మాతల మండలి ఆధ్యక్షుడు విశాల్ వెల్లడించారు. ఆయన ఇంతకు ముందు ఆర్కే.నగర్ ఉప ఎన్నికల్లో పోటీకి నామినేషన్ దాఖలు చేసి, ఆ తరువాత నామినేషన్ తిరస్కరణకు గురికావడంతో భంగపడ్డ విషయం తెలిసిందే. విశాల్ గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. తానూ రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. ఇటీవల ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తన నామినేషన్ విషయంలో జరిగిన అన్యాయం, అవకతవకలే తానీ నిర్ణయం తీసుకోవడానికి కారణంగా ఆయన పేర్కొన్నారు. తానా ఎన్నికల్లో ఒక రాజకీయవాదిగా పోటీ చేయలేదని, ఆ ప్రాంత ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఎన్నికల బరిలోకి దిగానని తెలిపారు. తన రాజకీయ నిర్ణయానికి కారణం అయిన వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో పెను మార్పు తథ్యం అని విశాల్ పేర్కొన్నారు. తాను ఒక రాజకీయవాదిగా ఈ విషయాన్ని చెప్పడం లేదని, ప్రజల ప్రతినిధిగా చెబుతున్నానని ఆయన అన్నారు. -
బీజేపీతో పొత్తుపై భిన్నాభిప్రాయాలు
సాక్షి, టీ.నగర్: అన్నాడీఎంకే, బీజేపీ సంబంధాలపై మంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం అన్నాడీఎంకే వర్గాల్లో కలకలానికి దారితీసింది. భారతీయ జనతా పార్టీతో జయలలిత ఆధ్వర్యంలోని అన్నాడీఎంకే 1998లో పొత్తు కుదుర్చుకుని గెలుపొందింది. అయితే కొన్ని నెలల్లోనే బీజేపీ కూటమి నుంచి జయలలిత వైదొలగారు. ఆ తర్వాత అన్నాడీఎంకే, బీజేపీ కూటమి ఏర్పడలేదు. జయలలిత 2001, 2011, 2016లో గెలుపొంది అధికారాన్ని కైవసం చేసుకున్న స్థితిలో బీజేపీ నేతలతో సుముఖంగా వ్యవహరిస్తూ వచ్చారు. సుమారు 20 ఏళ్లుగా ఆమె నాయకత్వంలోని అన్నాడీఎంకే బీజేపీతో కూటమి ఏర్పాటు చేసుకోలేదు. 2014లో కేంద్రంలో గెలుపొంది ప్రధాని పదవి చేపట్టిన నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వర్గంలో అన్నాడీఎంకేకు ముఖ్య స్థానం కల్పిస్తానని తెలిపినప్పటికీ పొత్తుకు జయలలిత అంగీకరించలేదు. అయితే జయలలిత మృతి తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో అన్నాడీఎంకే సన్నిహిత సంబంధాలు అధికమయ్యాయి. అన్నాడీఎంకేలో చీలిక, అభిప్రాయభేదాలు ఏర్పడిన స్థితిలో ప్రధాని మోదీ చలవతో ఎడపాడి పళనిస్వామి, ఓ.పన్నీర్‌సెల్వం మధ్య విభేదాలు తొలగిపోయాయి. అభిప్రాయభేదాలు: బీజేపీతో కూటమిపై అన్నాడీఎంకే సీనియర్ నేతల మధ్య ఇప్పుడే అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయి. అన్నాడీఎంకేలో ఒక వర్గం బీజేపీ పొత్తుతోనే గట్టెక్కగలమని భావిస్తున్నారు. అయితే మరో వర్గం ఈ వ్యవహారంలో జయలలిత ఎటువంటి వైఖరి అవలంభించారో దాన్నే కొనసాగించాలంటున్నారు. సహకారశాఖ మంత్రి సెల్లూర్రాజు దీనిగురించి మాట్లాడుతూ.. బీజేపీతో ఎలాంటి సంబంధాలు ఉండరాదని జయలలిత ఇదివరకే గట్టి నిర్ణయం తీసుకున్నారని, బీజేపీ మతతత్వ పార్టీ అయినందున ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీన్నే తాము అనుసరించాలనుకుంటున్నట్టు తెలిపారు. మంత్రి రాజేంద్రబాలాజీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో అన్నాడీఎంకే ఓటమికి బీజేపీతో సయోధ్యే కారణమని చెప్పలేమని, ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. వైఫల్యం అనేది యాక్సిడెంటల్ అని, అది విజయానికి మెట్టుగా మారవచ్చన్నారు. అందువల్ల బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడం తప్పుకాదన్నారు. బీజేపీతో కూటమి గురించి మంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం అన్నాడీఎంకే వర్గాల్లో గందరగోళం సృష్టించింది. -
‘ఆయన ఉన్నంత వరకు ఆ పార్టీ గెలవదు’
సాక్షి, చెన్నై: జయలలిత మరణంతో తమిళనాట రాజకీయాలు రోజుకో మలువు తిరుగుతున్నాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో శశికళ వర్గం అభ్యర్థి టీటీవీ దినకరన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి డీఎంకే నేత స్టాలిన్‌పై నిప్పులు చెరిగారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీలో స్టాలిన్ ఉన్నంత వరకు డీఎంకే గెలవదని జోస్యం చెప్పారు. ఆర్కే నగర్ ఓటమిపై వెంటనే సమీక్ష జరపాలని అళగిరి డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో డీఎంకే విఫలమవుతోందని ఆయన విమర్శించారు. అంతేకాక క్షేత్రస్థాయిలో పార్టీ ప్రక్షాళన జరగాలని అళగిరి అభిప్రాయపడ్డారు. ఆర్కే నగర్లో టీటీవీ దినకరన్ విజయం సాధించడంతో అధికార, విపక్ష పార్టీలు ఉలిక్కిపడ్డాయి. ఈ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ఇంతకీ గుండు గీయించుకుంటారా..?
ఆర్కేనగర్లో గెలుపుతో దినకరన్ మరింతగా దూకుడు పెంచేందుకు సిద్ధం అయ్యారు. గొంతు నొప్పితో బాధ పడుతున్నా, తన వ్యూహాలకు పదును పెట్టడం లక్ష్యంగా సోమవారం మద్దతు దారులతో ఆయన మంతనాల్లో మునిగారు. ప్రధానంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతల్ని తన వైపునకు తిప్పుకునేందుకు పథకం రచించారు. దీన్ని అమలుచేయడానికి చిన్నమ్మ సోదరుడు దివాకరన్ రంగంలోకి దిగనున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. సాక్షి, చెన్నై : ఈపీఎస్, ఓపీఎస్ వైపు ఉన్న తన స్లీపర్ సెల్స్ ద్వారా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు గాలం వేయడానికి దినకరన్ వ్యూహ రచన చేసినట్టు సమాచారం. తిరువారూర్, పుదుకోట్టై, తంజావూరు, తదితర డెల్టా జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీల్ని తమ వైపునకు తిప్పుకునే బాధ్యతల్ని చిన్నమ్మ శశికళ సోదరుడు దివాకరన్ తన భూజాన వేసుకున్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. వ్యూహాలకు పదును పెట్టే విధంగా దూకుడు పెంచేందుకు సిద్ధమైన దినకరన్ సోమవారం కూడా తన మద్దతు నేతలతో బిజీగా గడిపారు. సూలూరు ఎమ్మెల్యే కనకరాజ్ తనకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ఉండడంతో ఆయన ద్వారా మరి కొందరు ఎమ్మెల్యేల్ని తిప్పుకోవడంతో పాటు జిల్లాల కార్యదర్శుల్ని గురిపెట్టి మద్దతుదారులతో సంప్రదింపుల్లో మునిగి ఉండడం గమనార్హం. ఓవైపు గొంతు నొప్పి ఉన్నా, మరోవైపు ఏ మాత్రం తగ్గకుండా విజయోత్సాహంతో రెట్టింపు దూకుడుతో ప్రజలు తమ వైపే ఉన్నారని అన్నాడీఎంకే కేడర్‌లోకి విస్తృతంగా తీసుకు వెళ్లడానికి నిర్ణయించారు. ఇక, దినకరన్‌కు సాయంగా కుటుంబానికి చెందిన కృష్ణప్రియ, జయానంద్ సైతం ఇక, చురుగ్గా దూసుకెళ్లేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం. స్వరం పెంచిన మద్దతు దారులు ఆర్కే నగర్ గెలుపుతో ఈపీఎస్, ఓపీఎస్‌లకు వ్యతిరేకంగా దినకరన్ మద్దతుదారులు స్వరాన్ని పెంచుతున్నారు. మీడియాతో అనర్హత వేటు పడ్డ ఎమ్మెల్యే తంగ తమిళ్ సెల్వన్ మాట్లాడుతూ, ఆర్కేనగర్ ఎన్నికల్లో తామేదో మాయ చేశామని ఈపీఎస్, ఓపీఎస్ వ్యాఖ్యానించడం సిగ్గు చేటని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ సహాకారాన్ని, ఎన్నికల యంత్రాంగాన్ని, పోలీసుల్ని తన గుప్పెట్లో పెట్టుకుని నియోజకవర్గంలో ఓటర్లకు తలా రూ.ఆరు వేలు ఇవ్వలేదా..? అని ప్రశ్నించారు. ఓటమిని అంగీకరించబోమని వ్యాఖ్యానించడం శోచనీయమని, వాస్తవానికి చెప్పాలంటే, ఇకనైనా ఈపీఎస్, ఓపీఎస్‌తో పాటు అక్కడున్న మంత్రులు దమ్ముంటే పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ చేశారు. దినకరన్ గెలిస్తే గుండు గీయించుకుంటానని ఓ మాజీ మంత్రి సవాల్ చేశారని, ఇంతకీ గుండు గీయించుకుంటారా..? అని వలర్మతిని ఉద్దేశించి పరోక్షంగా ప్రశ్నించారు. అమ్మ గురించి మాట్లాడే అర్హత లేని వాళ్లు, ప్రస్తుతం చిన్న పిల్లల చేష్టలతో నిందల్ని తమ మీద మోపే పనిలో పడ్డారని ధ్వజమెత్తారు. తమను పార్టీ నుంచి తొలగించే అధికారం వాళ్లకు లేదని స్పష్టంచేశారు. ఓపీఎస్ ఒకప్పుడు దినకరన్, తన ముందుకు చేతులు కట్టుకుని నిలబడ్డ కార్యకర్త అని, ఇప్పుడు తమ మీదే నిందలు వేసే స్థాయికి చేరాడని మండిపడ్డారు. స్లీపర్ సెల్స్ రంగంలోకి దిగాయని, ఇక రోజుకో ఎపిసోడ్ అన్నట్టుగా పరిస్థితులు ఉంటాయని ఆయన ముగించడం గమనార్హం. ఇక, దినకరన్ మద్దతు మహిళా నాయకురాలు, నటి సీఆర్ సరస్వతి అయితే, ఆర్కేనగర్లో ఓటుకు తాము ఒక్క నోటు కూడా ఖర్చు పెట్టలేదని, వచ్చిన మెజారిటీ అంతా ప్రజాదరణే అని వ్యాఖ్యానిస్తున్నారు. అభినందనలు.. విమర్శలు ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో భారీ ఓట్ల ఆధిక్యంతో గెలుపును సొంతం చేసుకున్న దినకరన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సినీ నటుడు విశాల్, శరత్‌కుమార్ వంటి వారే కాదు, వీసీకే నేత తిరుమావళవన్‌తో పాటు పలు పార్టీలు అభినందిస్తున్నాయి. అలాగే, ఆరుగురు మంత్రులు, పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఫోన్ ద్వారా దినకరన్‌కు శుభాకాంక్షలు తెలిపినట్టు సమాచారం. అదే సమయంలో ఈ గెలుపును వ్యతిరేకించే విధంగా, విమర్శలు గుప్పించే రీతిలో స్పందించే వాళ్లూ ఉన్నారు. ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై ముందంజలో ఉన్నారు. అసలు ఇది కూడా ఒక గెలుపేనా అని ఆమె మండిపడుతున్నారు. అలాగే, డీఎండీకే అధినేత విజయకాంత్ అయితే, గెలిచారు.. అంతే.. అంటూ ముందుకు సాగారు. శుభాకాంక్షలు, విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నా, వాటితో సంబంధం లేదన్నట్టుగా దినకరన్ మరింతగా దూకుడు పెంచేందుకు సిద్ధం అయ్యారు. తన లక్ష్యం ఈపీఎస్, ఓపీఎస్‌ల వద్ద ఉన్న పార్టీ, రెండాకుల చిహ్నం కైవశం లక్ష్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీల్ని తవైపునకు తిప్పుకునేందుకు కసరత్తుల్లో ఉన్నారు. నమ్మకంతో ఓటు వేశారు : దినకరన్ తన మీద నమ్మకంతో ఆర్కేనగర్ ఓటర్లు ఓటు వేశారేగానీ, తాయిలాలకో, నోట్ల మీదున్న ఆశతో మాత్రం కాదు అని దినకరన్ స్పష్టంచేశారు. సోమవారం రాత్రి మీడియాతో దినకరన్ మాట్లాడుతూ, తనకు ఫ్రెషర్ కుక్కర్ చిహ్నం వచ్చినప్పుడే అందరికీ ఫ్రెషర్ తెప్తిసానని చెప్పినట్టు గుర్తుచేశారు. అనేకమంది డిపాజిట్లు సైతం గల్లంతు కాబోతున్నాయని తాను ముందే చెప్పినట్టు పేర్కొన్నారు. దీన్నిబట్టి చూస్తే, ఎన్నికలకు ముందే తాను అక్కడి ఓటర్లతో ఏ విధంగా మమేకం అయ్యానో అన్నది గుర్తు చేసుకోవాలని సూచించారు. అక్కడి ఓటర్లు తమ మీద అపార నమ్మకాన్ని కల్గి ఉన్నారని, అందుకే తనకు పట్టం కట్టారని తెలిపారు. అంతేగానీ, తానేదో నోట్లు, తాయిలాలు వెదజల్లినట్టుగా ఆరోపించడాన్ని ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. తాను కాదు, అన్నాడీఎంకే పాలకులు రూ.120 కోట్లను నియోజకవర్గంలో చల్లారని, ఒక్కో ఓటుకు రూ.ఆరు వేలు ఇచ్చారని, దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. డీఎంకేతో తానేదో కుమ్మకైన్నట్టు చెబుతున్నారని, డీఎంకే ఎంత పెద్ద పార్టీ అని, ఆ పార్టీ ఓట్లు తనకు ఎవరైనా వేయమని ఆదేశిస్తారా..? అని ప్రశ్నించారు. -
దినకరన్‌పై శశికళ మేనకోడలు ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళ మేనకోడలు డాక్టర్ కృష్ణప్రియ తాను వచ్చేఏడాది రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఆర్కేనగర్లో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు శశికళ అక్క కుమారుడు టీటీవీ దినకరన్ జయ వీడియో దృశ్యాలను విడుదల చేయడం వారి కుటుంబాల్లో మనస్పర్ధలకు దారితీసింది. శశికళ వదిన ఇళవరసి కుమార్తె కృష్ణప్రియ దీనిపై తీవ్రంగా స్పందించారు. ఒక తమిళ వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘జయలలిత, శశికళ మాట్లాడుకునే దృశ్యాలను కత్తిరించి కొన్ని సెకన్ల వీడియోనే విడుదల చేశారు. జయ వీడియో విడుదలైన సంగతి శశికళకే తెలియదు. ఆమెపై హత్యానేరం ఆరోపణలు వచ్చినపుడు విడుదల చేయడం ఇష్టంలేని వీడియోను దినకరన్ కోసం విడుదల చేయడాన్ని శశికళ అంగీకరించి ఉండదు. ఒకే ఒక నియోజకవర్గంలో గెలుపుకోసం, పార్టీ చిహ్నం తమవద్ద లేనప్పుడు వీడియో విడుదల చేయడానికి దినకరన్‌కు ఎలా బుద్ధిపుట్టిందో..’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విశాల్ నామినేషన్ తిరస్కరణ
-
‘డిసెంబర్ 31లోపు ఆర్కే నగర్ ఉప ఎన్నిక’
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నైలోని ఆర్కే నగర్లో డిసెంబర్ 31లోపు ఉప ఎన్నిక నిర్వహించాలని మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘా(ఈసీ)న్ని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. తమిళనాడు సీఎం జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్లో గత ఏప్రిల్‌లో ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. దీనిపై నోటిఫికేషన్ కూడా గతంలో విడుదలైంది. అప్పుడు అన్నాడీఎంకే (అమ్మ) అభ్యర్థిగా పోటీచేసిన టీటీవీ దినకరన్ ఎన్నికల సమయంలో రూ.89 కోట్లు పంపిణీ చేసినట్లు తేలడంతో ఎన్నిక రద్దయింది. -
దినకరన్‌కు మరిన్ని కష్టాలు...
ఢిల్లీ: అన్నాడీఎంకే నేత టీటీవీ దినకరన్‌కు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. అన్నాడీఎంకే అధికారిక గుర్తు కోసం ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపినట్టు ఇప్పటికే కేసు ఎదుర్కొంటున్న ఆ పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌పై ఎన్నికల కమిషన్ ఎఫ్ఐఆర్ నమోదుకు నిర్ణయం తీసుకుంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో డబ్బు పంపిణీ వ్యవహారం కేసులో దినకరన్‌తో పాటుగా తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, మంత్రి విజయ్భాస్కర్పైనా కేసు నమోదు అయింది. మరోవైపు దినకరన్‌పై ఈడీ కూడా కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్ స్థానానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగాల్సి ఉండగా అధికార పార్టీ నేతలు ఇప్పటికే ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు పంచారు. ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో ఈ పంపకాల వ్యవహారం గుట్టురట్టైంది. ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, నటుడు శరత్ కుమార్, ఇంకొందరికి చెందిన 32 ప్రాంతాల్లో ఐటీ సోదాలు జరుపగా రూ.90 కోట్ల వరకూ ఓటర్లకు సరఫరా చేసినట్లు వెల్లడైంది. విచ్చలవిడిగా సాగిన ధనప్రవాహంపై ఐటీ శాఖ ఎన్నికల సంఘానికి ఒక రిపోర్టు పంపింది. సమగ్ర పరిశీలన అనంతరం ఈసీ ఉప ఎన్నికను రద్దుచేస్తున్నట్లు నిర్ణయాన్ని ప్రకటించింది. తాజాగా ఆర్కే నగర్లో చోటుచేసుకున్నట్లే గత ఏడాది తంజావురు, అరవకురిచి నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ విచ్చలవిడి ధనప్రవాహాన్ని గుర్తించిన ఈసీ.. ఆయా ఎన్నికలను వాయిదావేసిన సంగతి తెలిసిందే. -
ఆర్కేనగరం విచిత్రం
► నిన్నటి వరకు జాతర ► నేడు నిర్మానుష్యం ► సమస్యల పునరావృతం ► ప్రజలకు తప్పని పాట్లు సాక్షి, చెన్నై : ఆదివారం వరకు ఆ నియోజకవర్గంలో పండుగ సందడి. అక్కడి ప్రజలకు నిత్యం విందే. చిన్న సమస్యకు చిటికెలో పరిష్కారం. ఇళ్ల వద్దకే వాటార్ ట్యాంకర్లు. సంపూర్ణంగా విద్యుత్ సరఫరా. ఓటుకు నోటు, తాయిలాల పంపిణీ, నేతల ప్రచారంతో నెల రోజులుగా హడావుడిలో మునిగిన ఆర్కేనగర్ ఇప్పుడు నిర్మానుష్యమైంది. జనం ఆనందం ఆవిరి అయింది. మళ్లీ పాత కష్టాలు మొదలయ్యాయి.. ఎన్నికలు వస్తే చాలు నియోజకవర్గాల్లో నేతల హడావుడి, వాగ్దానాలు హోరెత్తుతాయి. ఎన్నికలు అయ్యాక అదే నేతలు ముఖం చాటేస్తారు. ఎన్నికల సమయంలో అన్ని ప్రజలకు దరి చేరుతాయి. ఆ తర్వాత అధికారుల చుట్టు ప్రదక్షణలు తప్పదు. అయితే, అమ్మ జయలలిత మరణంతో ఖాళీ ఏర్పడ్డ ఆర్కేనగర్ నియోజకవర్గం ప్రజలకు మాత్రం ఎన్నికల సమయంలో పండుగే. గత రెండున్నరేళ్లలో మూడు సార్లు ఇక్కడి ప్రజల ముందుకు ఎన్నికలు వచ్చాయి. జైలు జీవితానంతరం అమ్మ కోసం ఓ మారు, అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరో మారు, తాజాగా అమ్మ మరణంతో ఎన్నికలు తప్పలేదు. అయితే, ఈ నియోజకవర్గాన్ని కైవశం చేసుకునేందుకు తీవ్ర సమరమే సాగింది. అన్నాడిఎంకేను దక్కించుకునే రీతిలో సాగిన ఈ సమరంలో నోట్ల కట్టలు తాండవం చేశాయి. అధికార పక్షం, అన్నాడిఎంకే అమ్మ అభ్యర్థి టీటీవీ దినకరన్ రేసులో దిగడంతో అనేక ప్రాంతాల్లోని ఓటర్లకు నిత్యం పండుగే. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు నుంచే ఇక్కడ ప్రజలకు కావాల్సిన పథకాలన్నీ దరి చేరాయి. ఇదీ విచిత్రం: అమ్మ అభ్యర్థి అడుగు పెట్టిన చోటంతా అధికారుల హడావుడి తప్పలేదు. ఇందుకు కారణం వెన్నంటి సీఎం, మంత్రులు ఉండటమే. ప్రజలు చిన్న సమస్యను ప్రస్తావించినా క్షణాల్లో పరిష్కరించేంతగా చర్యలు సాగాయి. నియోజకవర్గం పరిధిల్లోని వార్డుల్లో తమ నేతల కంటే తమ నేతలకు ఆహ్వానం పలుకుతూ తోరణాలు, అరటి గెలలు అబ్బో చెప్పాలంటే, అక్కడ పండుగ వాతావరణం మిన్నంటì నట్టుగా పరిస్థితి కనిపించాయి. అయితే, ఒక్క ఉత్తర్వుతో అన్నీ తలకిందులు అయ్యాయి. ఓటుకు నోటు తాండవం ధృవీకరణతో ఎన్నికల్ని సీఈసీ రద్దు చేసిందో ఏమోగానీ, ఆ నియోజకవర్గం వైపుగా ప్రస్తుతం తొంగి చూసే వారు లేదని చెప్పవచ్చు. ఎన్నికల రద్దు విషయంగా పోస్టర్లు వెలిసినా, ప్రజా సమస్యలు మాత్రం మళ్లీ పునరావృతమే. ఈ నియోజకవర్గం పరిధిలో సాధారణంగా వంద వరకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు.ఇందుకు కారణం ఇక్కడ నీటి ఎద్దడి అధికమే. ఎన్నికల ప్రచార సమయాల్లో ఆ సంఖ్య 500 వందలకు చేరిందని చెప్పవచ్చు. నీళ్లు సంవృద్ధిగా దక్కాయి.ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా సాగింది. ఇదంతా ఆదివారం అర్థరాత్రితో కనుమరుగు అయ్యాయి. సోమవారం కాలం నెట్టుకు వచ్చినా, మంగళవారం , బుధవారం నుంచి సమస్యలు మళ్లీ పునరావృతం కాక తప్పలేదు. నియోజకవర్గంలో గతంలో వచ్చే ట్యాంకర్లు మాత్రమే బుధవారం రావడంతో నీటి కోసం క్యూ కట్టక తప్పలేదు. తాగు నీటి కోసం అన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ల వద్ద జనం క్యూ కట్టి నీటిని పట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి. ఇక, పవర్ కట్ సమస్య మళ్లీ మొదలు కావడంతో ఉక్క పోత అనుభవించక తప్పడం లేదు. ఆదివారం వరకు క్లీన్ అండ్ గ్రీన్ గా ఉన్న రోడ్లు, కాలువల్లో మళ్లీ చెత్తా చెదారం చేరుతున్నాయి. ఏ అధికారి, ఏ నాయకుడు అటు వైపుగా తొంగి చూడని దృష్ట్యా, ఇక తమకు ఎన్నికలు వచ్చే వరకు పాత కష్టాలు తప్పదన్నట్టుగా మనస్సు ఓదార్చుకుంటూ ఆర్కేనగర్ వాసులు ముందుకు సాగుతున్నారు. -
ఆర్కేనగర్ ఉప ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ
-
ఆర్కేనగర్లో విజయశాంతి
► దినకరన్ కు మద్దతు ► కొనసాగుతున్న ఘర్షణలు ► వాహనాల తనిఖీలో 12 మంది అరెస్ట్ సాక్షి ప్రతినిధి, చెన్నై : ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న దినకరన్ తాజాగా ప్రముఖ సినీ నటి విజయశాంతిని ప్రచారంలోకి దించారు. అన్ని పార్టీల అభ్యర్థులు తమ నేతలతో శుక్రవారం ప్రచారం నిర్వహించగా, దినకరన్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్న విజయశాంతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమిళనాడు ఎన్నికల్లో సహజంగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్యనే ప్రధాన పోటీ. అయితే జయలలిత మరణం, అన్నాడీఎంకే రెండుగా చీలిపోవడంతో సహజస్థితి మాయమై కొత్త పోటీలు పొద్దుపొడిచాయి. ఆర్కేనగర్లో డీఎంకే అభ్యర్థి పోటీచేస్తున్నా అన్నాడీఎంకే నుంచి రెండు వైరి వర్గాలే ఒకరిపై ఒకరు పట్టుదలతో ఉన్నారు. ఆర్కేనగర్లో గెలుపు జీవన్మరణ సమస్యగా భావిస్తున్న దినకరన్ తమిళ సినీ రంగానికి చెందిన ఎందరో తారలను ప్రచారంలోకి దించారు. తాజాగా దినకరన్ తరఫున విజయశాంతి రంగ ప్రవేశం చేశారు. ఆర్కేనగర్ నియోజకవర్గ పరిధిలో తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే కొరుక్కుపేట, శాస్త్రినగర్, కామరాజనగర్, తదితర ప్రాంతాల్లో విజయశాంతి ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట తిరువళ్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి బీవీ.రమణ, అన్నాడీఎంకే కార్యదర్శి బలరామన్, గుమ్మిడిపూండి జిల్లా కార్యదర్శి విజయకుమార్, పూందమల్లి ఎమ్మెల్యే ఏలుమలై ఉన్నారు. ప్రచార సమయంలో తెలుగు ప్రజలు తమ అభిమాన నటి విజయశాంతికి ఘన స్వాగతం పలకడంతో పాటూ ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. ఘర్షణల నగర్:ఆర్కేనగర్లో ఎన్నికల ప్రచారం రానురాను ఘర్షణలకు దారితీస్తోంది. ధన వర్షం కురిపించైనా గెలుపొందాలని ఒక అభ్యర్థి, ధన ప్రవాహాన్ని అడ్డుకోవాలని ప్రత్యర్థుల ప్రయత్నాలతో పలువురు గాయపడుతున్నారు. ఓ వర్గం వ్యక్తులు రెండు రోజుల కిందట నగదు పంచుతుండగా అడ్డుకున్న ఇద్దరు డీఎంకే కార్యకర్తలపై దాడి చేసి గాయపరిచారు. కొరుక్కుపేట 41వ వార్డులో డీఎంకే కార్యకర్తలు తమ అభ్యర్థి మరుదు గణేష్‌కు మద్దతుగా ప్రచారం చేస్తుండగా అన్నాడీఎంకే ఆర్కేనగర్ కార్యదర్శి సంతానం, వార్డు కార్యదర్శి రవి నేతృత్వంలో 50 మంది యువకులు దాడులు చేశారు. ఈ దాడుల్లో తంగరాజ్(29), బాబు(31) గాయపడ్డారు. అలాగే, నేతాజీ నగర్లో గురువారం రాత్రి పన్నీర్‌సెల్వం, దినకరన్ వర్గీయులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడుల్లో మాజీ ఎమ్మెల్యే కరుప్పయ్యా తదితర 8మందితో పాటు పోలీసులు గాయపడ్డారు. ఇందుకు సంబంధించి పన్నీర్ వర్గానికి చెందిన వారిపై కేసులు నమోదయ్యాయి. తమది ధర్మయుద్ధం, గెలిచే తీరుతామని ఈ సందర్భంగా పన్నీర్‌సెల్వం ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నుంచి దోచుకున్న సొమ్మును దినకరన్ పంచుతున్నారని దీప ఎద్దేవా చేశారు. డీఎంకే అభ్యర్థి తరఫున స్టాలిన్ వీధి వీధిన తిరుగుతూ ప్రచారం చేశారు. పన్నీర్ వర్గీయులు జయలలిత భౌతిక కాయాన్ని పోలిన నమూనా శవపేటికతో ప్రచారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల కమిషన్ సైతం ఈ తరహా ప్రచారాన్ని ఆక్షేపించింది. దినకరన్ ఓపెన్ టాప్ జీపులో తిరుగుతూ ఓటర్లను ఆకర్శించే ప్రయత్నం చేస్తున్నారు. మధుసూధనన్ తరఫున పన్నీర్‌సెల్వం ప్రచారం చేయగా, ఆర్కేనగర్లో పోటీచేస్తున్న నలుగురు స్వతంత్ర అభ్యర్థులు పన్నీర్‌సెల్వంకు మద్దతు తెలిపారు. మధుసూధనన్ గెలుపునకు పాటుపడతామని వారు చెప్పారు. వాహనాల తనిఖీలో 12 మంది అరెస్ట్: ఆర్కేనగర్ ప్రజలను మభ్యపెట్టేందకు అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారనే సమాచారంతో ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు వాహనాల తనిఖీ ముమ్మురం చేశారు. శుక్రవారం ఉదయం పుదువన్నార్పేట్టై, దేశీయనగర్, ఇందిరానగర్, శివన్ నగర్ తదితర ప్రాంతాల్లో ఓటర్లకు నగదు పంచుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు, పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఓటర్లకు నోట్లు పంచుతున్న తిరుపూరుకు చెందిన తంగరాజ్, బాబు, ముసిరి సెంథిల్, జయశీలన్, పుదూర్ రామచంద్రన్ తదితర 9మందిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.1.15 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే తండయార్‌పేట తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి డీఎంకేకు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేసి రూ.27వేలు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా, తనిఖీ అధికారులను ఇంట్లోకి రాకుండా నిలువరించేందుకు ఒక మహిళ బహిరంగంగా వివస్త్రగా మారగా అందరూ కంగారుపడ్డారు. ఆ మహిళ నోటిమాటల ధాటికి అధికారులు వెళ్లిపోయారు. ఆర్కేనగర్లో అక్రమమార్గంలో గెలవాలని ప్రయత్నిస్తున్న దినకరన్ ను ఎన్నికల్లో పోటీచేయకండా అనర్హత వేటు వేయాల్సిందిగా అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప ఢిల్లీలో ఎన్నికల కమిషన్ కు వినతిపత్రం సమర్పించారు. -
ఓటర్లకు ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్లు!
► ఆర్కేనగర్లో అభ్యర్థుల లీలలు ► నగదు ముట్టిందా అనేందుకు కోడ్ భాష.. స్వామికి దండం పెట్టుకున్నారా! ► అమ్మ భౌతికకాయం బొమ్మతో ప్రచారం ► పన్నీర్‌కు వాసన్ మద్దతు సాక్షి ప్రతినిధి, చెన్నై: సవాలక్ష నిబంధనల అతిక్రమణకు అనంతకోటి ఉపాయాలు ఉన్నాయని ఆర్కేనగర్ ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. నగదు పంపిణీని అడ్డుకునేందుకు అధికారులు అవస్థలు పడుతుండగా కోడ్ భాషతో అభ్యర్థులు తమ పనికానిచ్చేస్తున్నారు. ఆర్కేనగర్లో సుమారు రెండు లక్షల ఓటర్లుండగా, ఒక్కో ఓటుకు రూ.4వేలు నుంచి రూ.10వేల వరకు చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నగదు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు 35 మంది పరిశీలకులు, 10 ప్లయింగ్ స్క్వాడ్ల ను, ఆదాయ పన్ను శాఖ అధికారులను ఎన్నికల కమిషన్ నియమించింది. వీరుగాక పెద్ద సంఖ్యలో పోలీసులు, పారా మిలటరీ దళాలు తిరుగుతున్నాయి. అయినా బుధవారం ఒక్కరోజునే లక్ష మంది ఓటర్లకు నగదు పంపిణీ సాగినట్లు తెలుస్తోంది. అయితే నోటు తీసుకున్నా తమకే ఓటు వేస్తారని గ్యారంటీ ఎముందని అభ్యర్థులకు అనుమానం పట్టుకుంది. ఆధ్యాత్మిక భావాలు అధికంగా ఉండే తమిళ ప్రజలు సెంటిమెంట్‌కు కట్టుబడి ఉంటారు. అందుకే నగదును అందజేసే ముందు భగవంతుని బొమ్మలపై ప్రమాణం చేయించుకుంటున్నారు. వారి వారి మతాలను అనుసరించి ఓటు కోసం ఒట్టు వేయించుకుంటున్నారు. నగదు పంపిణీ సక్రమంగా జరిగిందా లేక కార్యకర్తలు నొక్కేసారా అనే అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు మరో బృందం పర్యటిస్తోంది. వీరు ఓటర్ల వద్దకు, టీ దుకాణాల వద్ద గుంపులుగా ఉండేవారి వద్దకు వెళ్లి ‘స్వామికి దండం పెట్టుకున్నారా’ అని ప్రశ్నించగా పెట్టుకున్నాం అని బదులిస్తే నగదు ముట్టినట్లు. డబ్బులు అందనివారు ‘ ఎక్కడయ్యా స్వామి...ఎలా దండం పెట్టుకునేది’అని సమాధానం చెబుతున్నారు. ఇదిలా ఉండగా, కొందరు ఓటర్లకు వాషింగ్ మెషీన్, ఫ్రిజ్ తదితర వస్తువుల కూపన్లు పంచుతున్నారు. నియోజకవర్గంలో ఎక్కడ చూసినా ఇదే మాటలు వినపడడంతో అధికారులు కోడ్ భాషను కనుగొన్నారు. శీర్కాళి నియోజకవర్గ అన్నాడీఎంకే ఎమ్మె ల్యే భారతి తన అనుచరులతో వస్తుండగా అధికారులు ఆయన కారును ఆపి తనిఖీలు చేశారు. అయితే ఏమీ దొరకలేదు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ధన ప్రవాహం ఎన్నికల కమిషన్‌ను ఊపిరి తీసుకోనివ్వడం లేదు. ఇప్పటికే అధికారుల బృందాలతో ఆర్కేనగర్ నిండిపోగా, తాజాగా మరో ఉన్నతాధికారి ఢిల్లీ నుంచి చెన్నైకి చేరుకున్నారు. అమ్మ భౌతికకాయం బొమ్మ, శవపేటిక ప్రచారం ఇదిలా ఉండగా, అమ్మ మరణానికి శశికళ, ఆమె కుటుంబీకులే కారణమని ప్రజలు అనుమానిస్తుండగా, దీన్ని అవకాశంగా తీసుకున్న పన్నీర్‌సెల్వం వర్గం ఆర్కేనగర్లో చిత్రమైన ప్రచారం చేసింది. ఒక జీపుపై అమ్మ భౌతికకాయాన్ని పోలిన బొమ్మను శవపేటిలో ఉంచి ప్రచారం నిర్వహించడం కలకలం రేపింది. ఈనెల 12వ తేదీన ఆర్కేనగర్లో పోలింగ్ జరగనుండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచార వేగం పెంచారు. అయితే అన్నాడీఎంకేలోని రెండు చీలిక వర్గాల అభ్యర్థులు దినకరన్, మధుసూదనన్ ఒకరి కొకరు గట్టిపోటీ ఇస్తున్నారు. అయితే విచ్చలవిడిగా నగదును వెదజల్లుతూ ఓటర్లను ప్రలోభపెట్టడంలో దినకరన్ ముందున్నరానే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలకు తగ్గట్లుగా నగదు బట్వాడా చేస్తూ అన్నాడీఎంకే, డీఎంకే కార్యకర్తలు పట్టుపడుతున్నారు. భారీ మొత్తం నగదు స్వాధీనమైంది. ఈ పరిస్థితిలో ఢిల్లీలోని ప్రధాన ఎన్నికల కమిషన్ కార్యాలయం ఆదాయపన్ను శాఖకు చెందిన ఐఆర్ఎస్ అధికారి విక్రమ్ భాద్రాను ప్రత్యేక అధి కారిని నియమించగా ఆయన గురువారం ఉదయం చెన్నైకి చేరుకున్నారు. ఈ అధికారి అభ్యర్థులపైనే గాక ఆర్కేనగర్లో పనిచేసే అధికారులపై కూడా నిఘాపెట్టే అధికారాలను ఈసీ కల్పించింది. ఆర్కేనగర్లో ఎన్నికల విధులు నిర్వహించే అన్నిశాఖల అధికారులు విక్రమ్ బాద్రా కనుసన్నల్లో నడుచుకోవాల్సి ఉంది. ప్రజలు, పార్టీ నుంచి వచ్చే ఫిర్యాదులను సైతం స్వీకరించి నేరుగా ఢిల్లీకి పంపి వాటిపై ఆయనే నిర్ణయం తీసుకుంటారు. ఇదిలా ఉండగా, ఎన్నికల అధికారులతో కూడిన ఫ్ల్లయింగ్ స్క్వాడ్ బృందాల్లో రాజకీయ పార్టీల ప్రతి నిధులను కూడా చేర్చాలని ఆలోచిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి రాజేష్ లఖానీ చెప్పారు. నగదు బట్వాడాపై మారుమూల సందుల్లో సైతం నిఘా పెంచేందుకు ద్విచక్రవాహనాల పోలీసు దళాలు గురువారం రం గంలోకి దించినట్లు చెన్నై పోలీసు కమిషనర్ కార్తికేయన్ తెలిపారు. కాశిమేడు ప్రాంతంలో ఓటర్లకు నగదు పంచుతున్న డీఎంకే కార్యకర్త కరుణానిధిని అరెస్ట్ చేశారు. దినకరన్ ఓటమికి ఏడపాడి కుట్ర: స్టాలిన్ ఆర్కేనగర్ ఎన్నికల్లో దినకరన్ గెలిచినట్లయితే తన సీఎం సీటుకు ముప్పు తప్పదని సీఎం ఎడపాడి పళనిస్వామి భయపడుతున్నారని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షులు స్టాలిన్ అన్నారు. ఆర్కేనగర్ పార్టీ నేతలతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీఎం సీటును కాపాడుకునేందుకు దినకరన్ ఓటమికి ఎడపాడి పాటుపడుతున్నారని వ్యాఖ్యానించారు. తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకేవాసన్ గురువారం పన్నీర్‌సెల్వం అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. -
‘మందుకు సైడ్ డిష్‌గా ఆపిల్ తినాలి’
చెన్నై: తమిళనాడులోని ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆర్ముగం మద్యపానానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ పలువురిని ఆకర్షిస్తున్నారు. 49 ఏళ్ల వయసు గల ఆర్ముగం కోట్టూరుపురంలో నివసిస్తున్నారు. మద్యపాన ప్రియుల అవగాహన పార్టీ అనే సంస్థలో నిర్వాహకులుగా ఉండి ఆ సంస్థ తరఫున పోటీ చేస్తున్నారు. వెల్డింగ్ పని చేస్తున్న తన వద్ద డిపాజిట్ సొమ్ము రూ.5 వేలు కూడా లేకపోవడం గమనార్హం. ఈ కారణంగా ఆర్ముగం గత 13 నుంచి 21వ తేదీ వరకు రోడ్డు పక్కన పడేసిన ఖాళీ మద్యం బాటిళ్లను, ప్లాస్టిక్ వస్తువులను సేకరించి వచ్చిన సొమ్ముతో డిపాజిట్ కట్టి నామినేషన్ దాఖలు చేశారు. ఈయన గతంలో శ్రీరంగం, అంబత్తూర్, తంజావూరు మూడు నియోజకవర్గాలలో పోటీ చేసి ఓటమి చవి చూశారు. ప్రస్తుతం తాజాగా ఆర్కే నగర్ ఎన్నికల బరిలో దిగారు. మద్యం సేవించేందుకు సైడ్ డిష్‌గా ఊరగాయను నంజుకోవడం అలవాటని, అయితే ఊరగాయ బదులు వారిని ఆపిల్, కూరగాయలను తినమని సూచించారు. తాను పోటీ చేస్తున్న ఆర్కేనగర్లో 25 మద్యం దుకాణాలు ఉన్నాయని, మద్యపానం వలన కలిగే నష్టాలను తెలియజేస్తూ పోటీ చేస్తున్నందున తమకు మహిళల నుంచి ఆదరణ తప్పక లభిస్తుందని ఆర్ముగం ఆశాభావం వ్యక్తం చేశారు. -
అత్త నియోజకవర్గంలో దీప బోటు తేలుతుందా?
చెన్నై: తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఆర్కే నగర్ ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నియోజకవర్గమైన ఆర్కే నగర్లో ఆమె మృతితో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. జయలలిత రాజకీయ వారసత్వం తమదేనంటూ వాదిస్తున్న పలు పార్టీలు, పలువురు నేతలు కూడా ఆర్కే నగర్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. జయలలిత వారసత్వం తనదేనంటూ ఒకవైపు ఆమె నెచ్చెలి శశికళ, నమ్మినబంటు పన్నీర్ సెల్వం పోట్లాడుతుండగా.. మరోవైపు అసలైన వారసురాలిని తానేనంటూ జయ మేనకోడలు దీపాజయకుమార్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో స్వయంగా బరిలోకి దిగిన దీపాజయకుమార్కు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా 'బోటు' గుర్తును కేటాయించింది. జయలలిత నాయకత్వం వహించిన అన్నాడీఎంకే పార్టీ ఎవరికీ చెందాలనే దానిపై ఇటు శశికళ వర్గం, అటు పన్నీర్ వర్గం ఎన్నికల సంఘం గడపను తొక్కడంతో ఇప్పటికిప్పుడే ఎవరిదో తేల్చడం కష్టమంటూ.. ఆ ఇద్దరికీ కొత్త గుర్తులను ఈసీ కేటాయించిన సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే రెండాకుల గుర్తును స్తంభింపజేసిన ఈసీ.. శశికళ వర్గానికి 'టోపీ' గుర్తును, పన్నీర్ వర్గానికి 'రెండు విద్యుత్ దీపాల' గుర్తును కేటాయించింది. తాజాగా ఆర్కే నగర్లో అదృష్టం పరీక్షించుకుంటున్న దీపాజయకుమార్కు 'బోటు' (పడవ) గుర్తును ఖరారుచేసింది. దీంతో అత్త స్థానంలో సత్తా చాటి రాజకీయంగా ఎదగాలనుకుంటున్న దీపాజయకుమార్ పడవ మునుగుందా? తేలుతుందా? అన్నది త్వరలో తేలనుంది. -
దినకరన్ కలవరం
► కేడర్‌తో రహస్య మంతనాలు ► గెలుపు కోసం తీవ్ర కుస్తీ ► దూసుకెళ్తోన్న మధుసూదనన్ ఆర్కేనగర్ రేసులో దిగిన అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ లో అప్పుడే కలవరం బయల్దేరింది. ఇందుకు కారణం, తన కోసం రంగంలోకి దిగి పనిచేసే ఆర్కేనగర్కు చెందిన స్థానిక నాయకులు ఒక్కొక్కరుగా పన్నీరు శిబిరం వైపుగా జంప్ అవుతోండడమే. సాక్షి, చెన్నై: అమ్మ జయలలిత మరణంతో ఖాళీగా ఉన్న ఆర్కేనగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల సందడి రాజుకున్న విషయం తెలిసిందే. ఈ సీటును కైవసం చేసుకునేందుకు ఓ వైపు డీఎంకే తీవ్రంగానే ప్రయత్నాలు, వ్యూహ రచనల్లో నిమగ్నమైంది. అన్నాడీఎంకేలో సాగుతున్న కుమ్ములాటల నేపథ్యంలో తమ సిట్టింగ్ స్థానం మళ్లీ ఖాతాలో పడేనా అన్న ఉత్కంఠ ఆ పార్టీ వర్గాల్లో బయల్దేరింది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ శిబిరానికి చెందిన ఆ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ స్వయంగా రేసులో దిగారు. ఆయన్ను ఢీ కొట్టేందుకు మాజీ సీఎం పన్నీరు శిబిరంలో బలమైన వ్యక్తిగా మధుసూదనన్ బరిలో ఉన్నారు. అన్నాడీఎంకే ఓట్లను చీల్చేందుకు జయలలిత మేన కోడలు దీప సిద్ధం అవుతున్నారు. ఈ పరిణామాలు తమకు కలిసి వచ్చే అంశంగా డీఎంకే వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఓట్లు చీలకుండా, అధికార బలాన్ని అడ్డం పెట్టుకుని తన గెలుపు లక్ష్యంగా ముందుకు సాగేందుకు టీటీవీ వ్యూహ రచనల్లో ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఇందుకు తగ్గట్టుగా దీప కుటుంబంలో చిచ్చు రగిల్చారని చెప్పవచ్చు. అయితే అసలు చిక్కు అంతా మధుసూదనన్ రూపంలో దినకరన్ కు ముచ్చెమటలు పట్టే అవకాశాలు ఎక్కువే. దినకరన్ లో కలవరం: మధుసూదనన్ దివంగత ఎంజీయార్ కాలం నుంచి ఆర్కేనగర్ ఓటర్లకు సుపరిచితుడే. గతంలో ఓ మారు ఇక్కడి నుంచే ఆయన అసెంబ్లీ మెట్లు ఎక్కారు. నియోజకవర్గంలో ప్రతి వీధి, ప్రతి నాయకుడితో సంబంధాలు ఉండడం మధుసూదనన్ కు కలిసి వచ్చే అంశం. ముందుగా ఆయన ఆ నియోజకవర్గంలోని నాయకుల్ని గురి పెట్టి వారి ఇంటి గడప తొక్కి వస్తున్నారు. దీంతో స్థానికంగా ఎన్నికల బరిలో దిగి పనిచేసే ముఖ్య నాయకులు అనేక మంది మధుసూదనన్ కు మద్దతుగా పన్నీరు శిబిరం వైపుగా కదులుతుండడం టీటీవీ దినకరన్ ను కలవరంలో పడేసింది. స్థానికంగా ఉన్న రాజేష్, జనార్దన్, అంజులక్ష్మి, లలిత, శశి వంటి నాయకులు పన్నీరు వైపుగా వెళ్లినా, కార్యకర్తలు మాత్రం తనకు అండగా ఉంటారన్న ఎదురు చూపుల్లో దినకరన్ ఉన్నారు. ఒక్కో ప్రాంతం నుంచి నాయకుల్ని పక్కన పెట్టి కార్యకర్తల్ని పార్టీ కార్యాలయానికి పిలిపించి దినకరన్ రహస్య మంతనాలు సాగిస్తుండడం గమనించాల్సిన విషయం. కార్యకర్తల్లో ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపే విధంగా ఈ మంతనాలు సాగుతున్నట్టు సమాచారం. స్థానిక నాయకులు హ్యాండిచ్చినా, కార్యకర్త తనకు అండగా ఉంటే, వారి ద్వారా ఎన్నికల పనుల్ని వేగవంతం చేయించవచ్చన్న ఆశాభావంతో దినకరన్ అడుగులు ముందుకు కదులుతున్నట్టు ఆర్కేనగర్లోని అన్నాడీఎంకే కార్యకర్తలు పేర్కొంటున్నారు. -
కొండెక్కనున్న దీపం
సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత మేనకోడలు దీప నేతృత్వంలోని ‘ఎంజీఆర్ అమ్మ దీప పేరవై’ మూణ్ణాళ్ల్ల ముచ్చటగా మారిపోతోంది. అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని దీపపై కార్యకర్తలు పెట్టుకున్న ఆశలు ఆవిరైపోతున్నాయి. దీప పేరవైని ఎత్తివేసి పన్నీర్ పంచన చేరే ప్రయత్నాల్లో భాగంగా ఈనెల 19వ తేదీన పేరవై నేతలు తిరుచ్చిలో సమావేశం అవుతున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం రాష్ట్ర రాజకీయాల్లోనే పెనుమార్పులు తెచ్చింది. శశికళ, పన్నీర్ సెల్వం వర్గాలుగా అన్నాడీఎంకే రెండుగా చీలిపోగా, జయలలిత రాజకీయ వారసురాలిగా దీప రాజకీయ అరంగేట్రం చేశారు. జయ మరణించిన నాటి నుంచి తండోపతండాలుగా వస్తున్న అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేలు, కార్యకర్తల అండదండలతో గత నెల 24వ తేదీన ‘ఎంజీఆర్ అమ్మ దీప పేరవై’ని స్థాపించారు. కార్యవర్గ నిర్మాణంలో దీప కారు డ్రైవర్‌కు ప్రముఖ స్థానం కల్పించడంతో పేరవై ముసలం మొదలైంది. ఇదే సమయంలో ఆర్కేనగర్ నుంచి స్వతంత్య అభ్యర్థిగా పోటీచేయనున్నట్లు దీప ప్రకటించి ఎన్నికల ప్రచారం కూడా ప్రారంభించారు. దీపతో పాటు ఆమె భర్త మాధవన్ సైతం ఈనెల 16వ తేదీన ఆర్కేనగర్లో వేదికెక్కి ప్రచారంలో పాల్గొన్నారు. జయలలితకు రెండుసార్లు అఖండ విజయాన్ని కట్టబెట్టిన ఆర్కేనగర్ ప్రజలు దీపకు సైతం పట్టకడుతారని పేరవై నేతలు విశ్వసించారు. దీపకు షాకిచ్చిన భర్త మాధవన్: ఇదిలా ఉండగా భర్త మాధవన్ అకస్మాత్తుగా భార్య దీపకు గట్టి షాకిచ్చారు. శుక్రవారం రాత్రి చెన్నై మెరీనాబీచ్‌లోని అమ్మ సమాధి వద్దకు వెళ్లి కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. అంతేగాక తన భార్య దీప పెట్టింది కేవలం ఒక సంఘం మాత్రమే రాజకీయ పార్టీ కాదని వ్యాఖ్యానించారు. దీప పేరవైలో దుష్టశక్తులు ప్రవేశించాయని విమర్శలు గుప్పించారు. ఈ పరిణామం అటు దీపను, ఇటు దీప పేరవై నేతలను ఆందోళనకు గురిచేసింది. దీప వ్యవహారశైలి అంటే భర్తకే గిట్టనపుడు పేరవై నేతలతో ఎలా మెలుగుతారని సందేహం మొదలైంది. జయలలిత స్థానంలో దీపను ప్రోత్సహించాలని భావించిన వారిలో ముఖ్యుడైన తిరుచ్చిరాపల్లి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సుందరరాజన్ తీవ్రంగా స్పందించారు. దీప పేరవైని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్న ఆయన తాజా పరిణామాలతో తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రాష్ట్రంలోని పేరవై నేతలతో మాట్లాడి దీప పేరవైని ఎత్తివేయాలని సంకల్పించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నిర్ణయంలో భాగంగానే ఆదివారం నాడు తిరుచ్చిలో పేరవై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీప వ్యవహారశైలి తీవ్ర అసంతృప్తికరమని, కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలతో పేరవై కార్యకర్తలకు ఉత్తరాలు రాశారు. దీపపై నమ్మకంతో ఆమె చుట్టూ తిరిగిన వారంతా తనపై ఒత్తిడి తెస్తున్నందున వారికి తగిన పరిహారం, ప్రత్యామ్నాయ మార్గం చూపాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని ఉత్తరంలో పేర్కొన్నారు. ఈ పరిస్థితిపై తగిన నిర్ణయం తీసుకునేందుకు ఈనెల 19వ తేదీన తిరుచ్చిలో జరిగే సమావేశానికి రాష్ట్రంలోని పేరవై నేతలు, కార్యకర్తలంతా కదలిరావాలని ఉత్తరం ద్వారా ఆహ్వానించారు. విశ్వసనీయ సమాచారాన్ని బట్టి దీప పేరవైని ఎత్తివేసి సుందరరాజన్ నేతృత్వంలో మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం వర్గంలో చేరిపోతారని తెలుస్తోంది. ఆమోమయంలో దీప: ఒకవైపు భర్త, మరోవైపు పేరవై తనకు దూరమైపోతున్న పరిస్థితిలో దీప ఆయోమయంలో పడిపోయారు. ఆర్కేనగర్లో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ తనకు అండగా నిలవాల్సిన పేరవై కార్యకర్తలు ప్రత్యర్థి వర్గంలో చేరిపోతే దిక్కెవరని ఆందోళన చెందుతున్నారు. ఈనెల 19వ తేదీన తిరుచ్చీలో జరిగే దీప పేరవై సమావేశంలో తీసుకునే నిర్ణయంపై ఆమె ఆందోళనకు గురవుతున్నారు. -
ఆర్కేనగర్ బరిలో డీఎండీకే
► అభ్యర్థిగా మదివానన్ ► పన్నీరు శిబిరంలో తిలకవతి ► దీప పూజలు ► ఏర్పాట్లలో ఈసీ సాక్షి, చెన్నై: ఆర్కే నగర్ బరిలో డీఎండీకే అభ్యర్థిగా మదివానన్ పోటీ చేయనున్నారు. ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొంటామని ఆ పార్టీ అధినేత విజయకాంత్ ప్రకటించారు. అవకాశం ఇస్తే, పన్నీరుసెల్వం శిబిరం నుంచి ఆర్కే నగర్ నుంచి పోటీకి సిద్ధమని మాజీ డీపీజీ తిలకవతి సంకేతాన్ని ఇచ్చారు. ఇక, వేంకటేశ్వరుని సన్నిధిలో పూజల అనంతరం ఆర్కేనగర్పై దీప దృష్టి పెట్టారు. అమ్మ జయలలిత మరణంతో ఖాళీ ఏర్పడ్డ ఆర్కేనగర్ నియోజకవర్గానికి ఏప్రిల్ 12న ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. దీంతో ఆ నియోజకవర్గంలో ఎన్నికల సందడి మొదలైంది. ఆ సీటును కైవసం చేసుకోవడం లక్ష్యంగా డీఎంకే పావులు కదిపే పనిలో పడింది. జయలలిత చేతిలో స్వల్ప ఓట్లతో ఓటమి చవిచూసిన సిమ్లా ముత్తు చోళన్‌ను మళ్లీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. సోమవారం అభ్యర్థి విషయంగా డీఎంకే కార్యాలయం ప్రకటన చేయనున్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక, తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కమ్యూనిస్టులకు డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ విన్నవించుకున్నారు. డీఎండీకే అభ్యర్థిగా : అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు, ఓటింగ్ శాతం గల్లంతు చేసుకున్న డీఎండీకే, తాజాగా ఆర్కేనగర్ ఎన్నికల్ని ఒంటరిగా ఎదుర్కొనేందుకు నిర్ణయించింది. ఆ పార్టీ అభ్యర్థిగా ఉత్తర చెన్నై జిల్లా పార్టీ కార్యదర్శి మదివానన్ పేరును విజయకాంత్ ఖరారు చేశారు. అయితే, పలువురు నాయకులు విజయకాంత్ సతీమణి ప్రేమలత పోటీ చేయాలని నినదిస్తున్నారు. పోటీకి సిద్ధం : మాజీ డీజీపీ తిలకవతి ఎన్నికల్లో పోటీకి సిద్ధమన్న సంకేతాన్ని పంపించారు. మాజీ సీఎం పన్నీరుశిబిరం నుంచి ఆర్కేనగర్ బరిలో దిగేందుకు తాను రెడీ అని, అయితే, అవకాశం దక్కేనా అన్న ఎదురు చూపుల్లో ఉన్నారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూ్యలో ఆమె ఈ ప్రకటన చేశారు. దీప పూజలు: ఆర్కే నగర్ నుంచి ఎన్నికల్లో పోటీకి జయలలిత మేన కోడలు దీప సిద్ధమయ్యారు. టీనగర్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో పూజల అనంతరం ఆమె ఆర్కేనగర్ ఎన్నికల పనుల మీద దృష్టి పెట్టారు. అలాగే, ఎంజీఆర్, అమ్మ, దీపా పేరవై సభ్యత్వ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఏర్పాట్లలో ఈసీ: రాజకీయ పక్షాలు అభ్యర్థుల ఎంపిక , గెలుపు పావులు కదిపేందుకు తగ్గ వ్యూహ రచనల్లో ఉంటే, ఎన్నికల ఏర్పాట్ల మీద ఎన్నికల యంత్రాంగం దృష్టి పెట్టింది. అభ్యర్థుల ఖర్చుల పరిశీలనకు మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించింది. నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లు, భద్రత చర్యల మీద దృష్టి పెట్టింది. డీఎంకే ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగర పోలీసు కమిషనర్ జార్జ్ బదిలీకి రంగం సిద్ధం అయింది. సోమవారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి. -
'శశికళ మాకొద్దు.. అస్సలు రావొద్దు'
-
'శశికళ మాకొద్దు.. అస్సలు రావొద్దు'
చెన్నై: 'చిన్నమ్మ(శశికళ) ఆశలు పెట్టుకొని పెద్దగా ఊహించుకోద్దు. మా వద్దకు వచ్చి ఓట్లు అడగొద్దు. మేం ఇక్కడ ఉన్నామంటే అది అమ్మకోసమే' అంటూ ఆర్కే నగర్ వాసులు అంటున్నారు. ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత పోటీ చేసేవారు. అక్కడి ప్రజలకు జయమ్మ అంటే ఎక్కడ లేని అభిమానం. ఆమె చనిపోవడంతో ప్రస్తుతం అదే చోటు నుంచి ప్రస్తుతం పార్టీ పగ్గాలు చేతబట్టి ముఖ్యమంత్రి పదవికై సాగుతున్న శశికళ పోటీ చేయాలనుకుంటున్నారు. కానీ, ఇక్కడి ప్రజల నుంచి శశికళకు తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అక్కడి వారంతా శశికళను తమ నియోజకవర్గం నుంచి పోటీ చేయవద్దని అంటున్నారు. ఇది జయమ్మ చోటని శశికళను అనుమతించం అంటున్నారు. 'మా అమ్మ (జయలలిత) 77 రోజులు ఆస్పత్రిలో ఉన్నారు. ఒక్కరోజైనా శశికళ మాకు చూపించారా. జయ మేనకోడలు దీపా జయకుమార్ మాత్రమే మా దగ్గర నుంచి పోటీ చేయాలి. ఆమె మాత్రం మా జయలలిత వారసత్వాన్ని కొనసాగించాల్సింది' అంటూ ఆర్కే నగర్ వాసులు అంటున్నారు. ఇప్పటి కొంతమంది గ్రూపులుగా వెళ్లి శశికళ ఆర్కే నగర్ నుంచి పోటీ చేసేందుకు రావొద్దని, తమను ఓట్లు అడగవద్దని ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధురై నియోజవర్గం నుంచి పోటీ చేయాల్సిందిగా ఇప్పటికే శశికళకు కొందరు పార్టీ సీనియర్లు సూచించారు. ఏదేమైనా ఆర్కే నగర్ ప్రజలు శశికళపై తీవ్ర వ్యతిరేకతను పెంచుకోవడం కొంత ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఆర్కేనగర్ నుంచి శశికళ పోటీ!
-
ఆర్కేనగర్ నుంచి శశికళ పోటీ!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని దక్కించుకునేందుకు జయ లలిత నెచ్చెలి శశికళ రంగం సిద్ధం చేసుకుం టున్నట్లు సమాచారం. దీనికి ముందే దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహిం చిన చెన్నై ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందాలని కూడా ఆమె భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. శశికళతో పన్నీర్ మంతనాలు: సీఎం పన్నీర్ సెల్వం, సీనియర్ మంత్రి ఎడపాడి పళనిస్వామి తదితరులు గురువారం ప్రస్తుతం శశికళ బంగ్లా గా మారిపోయిన పోయెస్ గార్డెన్ వెళ్లారు. సుమారు రెండున్నర గంటలపాటు ఆమెతో చర్చలు జరిపారు. ఆర్కేనగర్ ఉప ఎన్నిక, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి, భారతీయ జనతా పార్టీ జోక్యం అంశాలు చర్చకు వచ్చినట్లు విశ్వస నీయ వర్గాల సమాచారం. పార్టీనే కాదు ప్రభుత్వం కూడా శశికళ కనుసన్నల్లోనే నడుస్తున్న వాస్తవాన్ని పోయెస్ గార్డెన్‌కు రావడం ద్వారా పన్నీర్ సెల్వం ధ్రువీకరించారని అంటున్నారు. -
జయ ఎన్నిక కేసు విచారణ 4కు వాయిదా
చెన్నైలోని ఆర్కే నగర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జయలలిత గెలుపు అక్రమం అంటూ దాఖలయిన పిటిషన్ విచారణను అక్టోబరు 4వ తేదీకి వాయిదా వేస్తూ మద్రాస్ హైకోర్టు శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. జయలలితకు ప్రత్యర్థిగా పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి ప్రవీణ ఈ కేసు వేశారు. ఇందులో రాష్ట్ర అసెంబ్లీకి గత మే 16వ తేదీన ఎన్నికలు జరిగాయని, ఆర్కే నగర్ నియోజకవర్గంలో అన్నాడీఎంకే తరఫున ముఖ్యమంత్రి జయలలిత పోటీ చేశారని తెలిపారు. ఈ నియోజకవర్గంలో ఆమె 39 వేలకు పైగా ఓట్ల మెజారీటీతో గెలుపొందినట్లు ప్రకటించారని వివరించారు. అయితే ఈ ఎన్నికల్లో ఓట్ల సేకరణకు అందరు అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించలేదని ఆరోపించారు. ముఖ్యంగా అధికారులు ముఖ్యమంత్రి జయలలితకు అనుకూలంగా వ్యవహరించారని పేర్కొన్నారు. ఈ కారణంగా జయలలిత గెలుపును రద్దు చేయాలన్నారు. న్యాయమూర్తి ఎం. దురైసామి సమక్షంలో విచారణ జరిగింది. ఈ సమయంలో ఎన్నికల కమిషన్ అధికారులు, ముఖ్యమంత్రి జయలలిత తరఫున న్యాయవాదులు హాజరయ్యారు. దీనిపై రిట్ పిటిషన్ దాఖలు చేసేందుకు గడువు కోరారు. దీన్ని అంగీకరించిన న్యాయమూర్తి కేసు విచారణను అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
జయలలితపై తెలుగు వ్యక్తి పోటీ
సాక్షి, హైదరాబాద్: తమిళనాడులోని ఆర్కే నగర్, హోసూరు నియోజకవర్గాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితపై స్వతంత్ర అభ్యర్ధిగా తమిళనాడు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు భాష పరిరక్షణ ఉద్యమ నేత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పోటీ చేయనున్నారు. తెలుగు భాషతో పాటు తెలుగు జాతికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఆ రెండు నియోజకవర్గాల్లో జయలలితపై పోటీ చేస్తున్నట్లు కేతిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉచిత హామీలకు ఆకర్షితులు కాకుండా స్థానికంగా ఉన్న తెలుగు ఓటర్లు కులం, మతం కంటే తెలుగు భాషను కాపాడాల్సిన బాధ్యత ఉందని గుర్తించి ఓటు అనే అస్త్రం ద్వారా తమ సత్తా చాటాలని కోరారు. -
అమ్మకే పవర్ కట్
చెన్నై: రాష్ట్రంలో సంపూర్ణ విద్యు త్ లక్ష్యం..! కాదు..కాదు.. మిగులు విద్యుత్.!. విద్యుత్ కోతల రహిత రాష్ట్రం మనదే..! అన్న నినాదంతో ముందుకు సాగుతున్న ‘అమ్మ’జయలలితకే పవర్ కట్ అంటే ఎలా ఉంటుందో విద్యుత్ శాఖ వర్గాలు రుచి చూపించాయట..!. ఇంత వరకు బాగానే ఉన్నా, ఈ కట్ ఎందరి ఉద్యోగాలకు ఎసరు పెట్టనుందో. రాష్ర్టంలో విద్యుత్ కోతలు లేవు అని, సంపూర్ణ విద్యుత్ అందుతున్నదని, త్వరలో మిగులు విద్యుత్‌ను చూడబోతున్నారంటూ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పదే పదే ఎన్నికల ప్రచారంలో తన ప్రచారాస్త్రంగా నినదిస్తున్నారు. పాలకులు ఓ రకం వ్యాఖ్యలు చేస్తుంటే, మరో వైపు విద్యుత్ శాఖ వర్గాలు తమ పనితనాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో అనధికారికంగా అక్కడక్కడ కోతలు విధిస్తూనే ఉన్నారు. ఇవన్నీ అమ్మకు మాత్రం తెలియదని సమాచారం. అందుకే కోతలంటే ఎలా ఉంటాయో అమ్మకు తెలిపినట్టున్నారు. ఆర్కేనగర్ నుంచి ఎన్నికల బరిలో ఉన్న అమ్మ జయలలిత శుక్రవారం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. రోడ్‌షోలతో దూసుకెళ్లారు. అలా...అమ్మ పయనంలో సున్నాం కాలువ నుంచి మనలి రోడ్డు వైపుగా వీధి దీపాలన్నీ వెలగకపోవడంతో చిమ్మ చీకటి తప్పలేదు. దీంతో అమ్మకు కోపం వచ్చిందో ఏమో, కాన్వాయ్ రయ్యి మంటూ ముందుకు దూసుకెళ్లినట్టు అక్కడి వాళ్లు పేర్కొంటున్నారు. నిత్యం ఇక్కడ ఆరున్నర - ఏడున్నర గంటల మధ్యలో పవర్ కట్ ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఈ సమయంలో దారి దోపిడీలూ కూడా అధికంగానే చోటు చేసుకుంటున్నాయని వారు ఆరోపిస్తున్నారు. అమ్మ రాకతో ఈ రోడ్డుకు కొత్త మెరుగులు దిద్దిన అధికారులు పవర్ కట్ సమస్యను మరిచినట్టున్నారు. అయితే, ఈ పవర్ కట్ సమస్య అధికారుల్ని వణికిస్తున్నాదట. ఇక్కడ ఈ డివిజన్లో ఉన్న అధికారులందరిపై అమ్మ కన్నెర్ర చేస్తారో అన్న భయంలో వారు జారుకున్నారట. -
'అమ్మ'పై పోటీకి తెలుగు నాయకుడి సై
చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో సీఎం జయలలిత పోటీచేస్తున్న ఆర్కే నగర్ నుంచి ఆమెపై పోటీచేసేందుకు తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి సోమవారం స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన గతంలో తాను అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు మద్ధతుగా ఎన్నికల్లో ప్రచారం చేశానన్నారు. నిర్బంధ తమిళవిద్య ప్రవేశపెట్టడం వల్ల తెలుగువాళ్లు నష్టపోతారని అందుకే ఆ అంశంపై పునరాలోచించాలని ఎన్నిసార్లు వినతిపత్రం కోరినా ఆమె పట్టించుకోలేదని తెలిపారు. తెలుగు భాష పరిరక్షణ కోసం తాను ఆర్కే నగర్ నుంచి పోటీ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికైనా అల్పసంఖ్యాక వర్గాల సమస్యలు తీరుస్తానని జయ హామీ ఇస్తే తాను పోటీ నుంచి తప్పుకొంటానని తెలిపారు. కేవలం ఆర్కే నగర్ లో లక్షా ఇరవై వేల మంది తెలుగు ఓటర్లు ఉన్నారని చెప్పారు. ద్రావిడ పార్టీలు తెలుగు వారి బాగోగుల కంటే వారిని అణగదొక్కే ప్రయత్నం ఎక్కువగా చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కృష్ణగిరి జిల్లా హోసూరు నియోజకవర్గం నుంచి కూడా బరిలోకి దిగనున్నట్లు చెప్పారు. మంగళవారం హోసూరులో నామినేషన్ వేస్తానని తెలిపారు. -
రేసుగుర్రాలు
* సీఎం అభ్యర్థుల నియోజకవర్గాలు సిద్ధం * తిరువారూర్‌లో కరుణ * ఆర్కేనగర్లో అమ్మ * ఉలందూర్ పేటలో కెప్టెన్ * పెన్నగరంలో అన్బుమణి * సీపీఎం, సీపీఐ జాబితాల విడుదల * 11 మందితో వీసీకే తొలి జాబితా * నేడు తమాకా, టీఎన్‌సీసీ జాబితాలు సాక్షి, చెన్నై : రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. సీఎం కుర్చి కైవసానికి నాలుగు కూటములకు చెందిన అభ్యర్థుల నియోజకవర్గాలు ఖరారయ్యాయి. తిరువారూర్ నుంచి కరుణానిధి, ఆర్కేనగర్ నుంచి అమ్మ జయలలితలు ఇప్పటికే రేసులో దిగారు. ఇక, ఉలందూర్ పేట నుంచి ప్రజా సంక్షేమ కూటమి సీఎం అభ్యర్థి కెప్టెన్ విజయకాంత్, పీఎంకే కూటమి అభ్యర్థి అన్భుమణి రాందాసు పెన్నాగరం నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగా రు. ఇక, సీపీఎం, సీపీఐలు తమ జాబితాల్ని ప్రకటించగా, 11 మందితో వీసీకే తొలి జాబితా ప్రకటించింది. తమిల మానిల కాంగ్రెస్, టీఎన్‌సీసీ జాబితాలు వెలువడనున్నాయి. డీఎంకే కూటమి, అన్నాడీఎంకే కూటమి , డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి, పీఎంకే కూటమి, బీజేపీ కూటమిలు పంచముఖ సమరంగా అసెంబ్లీ ఎన్నికల రేసులో దిగిన విషయం తెలిసిందే. ప్రధాన పోటీ డీఎంకే, అన్నాడీఎంకేల మధ్య ఉన్నా, తామూ ప్రత్యామ్నాయమే అంటూ డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి, పీఎంకే కూటమి, బీజేపీ కూటమిలు పరుగులు తీస్తున్నాయి. సీఎం కుర్చీని తామంటే తాము కైవసం చేసుకుంటామని ఎన్నికల రేసులో ఢీకొడుతున్నారు. ఓటమి ఎరుగని యోధుడిలో వరుస విజయాలతో దూసుకొస్తున్న డీఎంకే అధినేత కరుణానిధి ఆరోసారి సీఎం పగ్గాలు చేపట్టేందుకు తగ్గ వ్యూహ రచనలతో ముందుకు సాగుతూ, మళ్లీ తిరువారూర్ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. మళ్లీ సీఎం పగ్గాలు లక్ష్యంగా ఎన్నికల్లో క్లీన్ స్వీప్ నినాదంతో ముందుకు సాగుతున్న అమ్మ జయలలిత మళ్లీ ఆర్కేనగర్ నుంచి రేసులో నిలబడ్డారు. ఈ రెండు కూటముల సీఎం అభ్యర్థుల నియోజకవర్గాలు ఇప్పటికే ఖరారు అయ్యాయి. మిగిలిన కూటముల సీఎం అభ్యర్థులు ఏ ఏ స్థానాల్ని ఎంపిక చేసుకుంటారో అన్న ఎదురు చూపులు నెలకొంటూ వచ్చాయి. మూడో సారిగా అసెంబ్లీ మెట్లు ఎక్కేందుకు డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి సీఎం అభ్యర్థి కెప్టెన్ విజయకాంత్ మళ్లీ సిట్టింగ్ స్థానాన్నే ఎంపిక చేసుకోవచ్చన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే, వ్యూహాత్మకంగా స్థానాన్ని మార్చారు. తొలి సారిగా చిదంబరం నుంచి ఒక్కడే అసెంబ్లీ మెట్లు ఎక్కినా, తదుపరి రిషి వందియం నుంచి ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన విజయకాంత్ ఈ సారి ఉలందూరు పేట నుంచి సీఎం పగ్గాలు చేపట్టి తీరుతానన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇక, తొలి సారిగా 2014 లోక్ సభ ఎన్నికల బరిలో ప్రత్యక్షంగా దిగిన నేత అన్భుమణి రాందాసు. ఆ ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి పార్లమెంట్ మెట్లు ఎక్కిన అన్భుమణి ప్రస్తుతం తమిళనాడు సీఎం కుర్చీ లక్ష్యంగా ఉరకలు తీస్తున్నారు. పీఎంకే కూటమి సీఎం అభ్యర్థిగా రేసులో ఉన్న ఆయన తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్ని ప్రత్యక్షంగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యారు. అయితే, లోక్ సభ ఎన్నికల్లో తనకు భారీ మెజారిటీ ఇచ్చిన ధర్మపురి జిల్లా పెన్నగరం అసెంబ్లీ నియోజక వర్గాన్ని ఎంపిక చేసుకోవడం విశేషం. ఈ నాలుగు కూటముల సీఎం అభ్యర్థుల నియోజకవర్గాల ప్రకటనతో ఇక, ఆయా స్థానాల్లో ప్రాధాన్యత సంతరించుకుని ఉన్నది. వీవీఐపీ నియోజకవర్గాల జాబితాలో ఆ నాలుగు చేరి ఉన్నాయి. కాగా, బీజేపీ కూటమికి సీఎం అభ్యర్థిని ప్రకటించేనా, లేదా..? అన్నది వేచి చూడాల్సిందే. సీపీఎం, సీపీఐ, వీసీకే అభ్యర్థుల జాబితా: డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమిలోని సీపీఎం, సీపీఐ, వీసీకేలు సోమవారం తమ అభ్యర్థుల జాబితాల్ని ప్రకటించాయి. సీపీఎం 25 స్థానాలకు, సీపీఐ 25 స్థానాలకు ప్రకటించగా, 11 మందితో తొలి జాబితాను వీసీకే ప్రకటించింది. మలి జాబితాను మంగళవారం విడుదల చేయడానికి వీసీకే నేత తిరుమావళవన్ నిర్ణయించారు. ఇక, ఈ కూటమిలోని తమిల మానిల కాంగ్రెస్ సైతం మంగళవారం జాబితను ప్రకటించనున్నది. కాగా, ఈ కూటమిలో ప్రధాన పార్టీలుగా ఉన్న డీఎండీకే 104, ఎండీఎంకే 26 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించేశాయి. సీపీఎం విడుదల చేసిన జాబితాలో పది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఏడుగురికి మళ్లీ అవకాశం కల్పించారు. దూరంగా పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సౌందరరాజన్ - పెరంబూరు, బాలకృష్ణన్- చిదంబరం, కె తంగ వేల్ - తిరుప్పూర్ దక్షిణం, లాజర్ - పెరియకుళం, కె భీమ్ రావ్ - మదురవాయిల్, రామమూర్తి - విక్రవాండి, విపి నాగై మల్లి - కీల్ వేలూరు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. ఇక, సీపీఐ విడుదల చేసిన జాబితాలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎం ఆర్ముగం - అవినాశి, గుణశేఖరన్ - శివగంగై, కె ఉలగనాథన్ - తిరుత్తరై పూండి, లింగముత్తు - గుడియాత్తం, నంజప్పన్ - పెన్నాగరం, టి రామచంద్రన్ - తలి, సుందరం - భవానీ సాగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. అలాగే, డిఎంకే అధినేత కరుణానిధి రేసులో ఉన్న తిరువారూర్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత మాసిలామణి రంగంలోకి దిగనున్నారు. ఇక, వీసీకే 11 మందితో తొలి జాబితా విడుదల చేయగా, 14 స్థానాల అభ్యర్థుల జాబితాను మంగళవారానికి వాయిదా వేసింది. పీఎంకే జాబితా : అన్భుమణి రాందాసు సీఎం అభ్యర్థిగా బరిలో దిగిన పీఎంకే ఇప్పటి వరకు 90 మంది అభ్యర్థులను ప్రకటించింది. 234 స్థానాల్లో పోటీ చేస్తున్న పీఎంకే మిగిలిన స్థానాలకు అభ్యర్థుల ఎంపిక కసరత్తుల్లో మునిగి ఉన్నది. ఈ పరిస్థితుల్లో సోమవారం 117 మందితో నాలుగో జాబితాను ప్రకటించారు. మిగిలిన 27 స్థానాలకు మంగళవారం అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు. తాజా జాబితాలో అన్భుమణి పెన్నగరం నుంచి పోటీ చేస్తుండగా, ఆ పార్టీ అధ్యక్షుడు జీకే మణి మెట్టూరు నుంచి బరిలోకి దిగనున్నారు. కాగా, డిఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్ 41 స్థానాలకు గాను అభ్యర్థుల్ని మంగళ వారం సాయంత్రం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. -
ఈ దేవి సీఎంకు షాక్ ఇస్తుందా?
చెన్నై: పెద్ద పెద్ద వేదికలు లేవు. భారీ సభలు లేవు. తండోపతండాలుగా తరలివచ్చే జనాలు లేరు. అయినా చెన్నై ఆర్కే నగర్‌లోని వీధివీధికి కాలినడకతో తిరుగుతూ.. ఇంటింటికి వెళ్లి ఓటర్లను పలుకరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు సీ దేవి. మేలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న తొలి ట్రాన్స్‌జెండర్ అభ్యర్థిగా ఆమె చరిత్ర సృష్టించబోతున్నారు. అంతేకాకుండా ఏకంగా అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు సీఎం జయలలితను ఆమె ఢీకొనబోతున్నారు. జయలలితకు ఆర్కే నగర్ కంచుకోట. భారీ మెజారిటీతో ఆమె గెలువడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. అయినా వెనుదీయని 33 ఏళ్ల సీ దేవి గట్టి ప్రచారమే చేస్తున్నారు. తమిళ జాతీయవాద పార్టీ అయిన నామ్ తమిలార్ కచ్చి తరఫున అభ్యర్థిగా దిగిన ఆమె ప్రతి ఒక్క ఓటరును పలుకరిస్తున్నారు. నిజానికి ఆర్కే నగర్లో జయలలితను ఓడించడమనే ప్రసక్తే ఉండకపోవచ్చు. 2015 ఉప ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కన్నా 16 రెట్ల ఓట్లు అత్యధికంగా సాధించి బంఫర్ మెజారిటీతో జయలలిత విజయం సాధించారు. అయితే, ఈసారి జయమ్మ ఓటుబ్యాంకును గణనీయంగా దెబ్బతీయడమే దేవి లక్ష్యంగా పెట్టుకున్నారు. జయలలితపై పోటీచేయడానికి తానేమీ భయపడటం లేదని ఆమె స్పష్టం చేస్తున్నారు. 'ఈ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి పోటీ చేస్తారని తెలిసినప్పుడు నేను మొదట భయపడ్డాను. కానీ మా పార్టీ ఇక్కడ బలంగా ఉంది' అని ఆమె చెప్తున్నారు. స్థానిక నియోజకవర్గ సమస్యలైన నీటి కొరత, అందరికీ రేషన్ కార్డులు లేకపోవడం వంటి సమస్యలను ఆమె ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె సీఎంపై పోటీచేయడం ఒక ఎత్తు అయితే, ఒక ట్రాన్స్‌జెండర్ పట్ల సమాజంలో ఉన్న ప్రతికూల అపనమ్మకాల కారణంగా ఆమె ఓటర్లు చేరువ కావడం మరొక ఎత్తు అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
జయలలిత ఒంటరి పోరు
♦ 227 మందితో జాబితా ♦ ఆర్కే నగర్ నుంచే జయ పోటీ చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల కోసం ఒంటరిగానే బరిలోకి దిగాలని ఏఐఏడీఎమ్‌కే నిర్ణయించింది. ఈ మేరకు మొత్తం 234 స్థానాలకు గాను 227 సీట్లకు అభ్యర్థుల జాబితాను పార్టీ అధినేత్రి, సీఎం జయలలిత సోమవారం ప్రకటించారు. ఆర్కే నగర్ నుంచి మళ్లీ పోటీ చేయడానికి జయ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కాగా, చిన్న మిత్రపక్షాలకు కేవలం ఏడు సీట్లతో సరిపెట్టారు. వీరు కూడా అన్నాడీఎంకే రెండాకుల గుర్తుపైనే పోటీచేయనున్నారు. జయ తనకు నమ్మకస్తుడైన ఆర్థిక మంత్రి పన్నీర్‌సెల్వంతో పాటు మొత్తం 17 మంది మంత్రులకు మళ్లీ సీట్లు కేటాయించగా.. మరో 10 మందికి టికెట్లు తిరస్కరించారు. 149 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ అవకాశం కల్పించారు. ఇద్దరు సిట్టింగ్ మహిళా మంత్రులతో సహా 32 మంది మహిళలకు సీట్లు కేటాయించారు. పుదుచ్చేరిలోని 30 నియోజకవర్గాలకు, కరైకల్, మాహె, యానంలోని ఏడు సీట్లకు, కేరళలోని ఏడు ప్రాంతాలకు అభ్యర్థులను ఏఐఏడీఎమ్‌కే ప్రకటించింది. కాంగ్రెస్ 41, డీఎంకే 180 స్థానాల్లో పోటీ సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడిన డీఎంకే, కాంగ్రెస్‌ల మధ్య సీట్ల సర్దుబాటు ముగిసింది. మొత్తం 234 స్థానాలకు గాను డీఎంకే 180, కాంగ్రెస్ 41 స్థానాల్లో పోటీచేసేలా సోమవారం నిర్ణయించారు. మిగిలిన 13 సీట్లను డీఎంకే కూటమిలోని చిన్న పార్టీలకు కేటాయించారు. గులాం నబీ ఆజాద్, ముకుల్ వాస్నిక్ సోమవారం డీఎంకే చీఫ్ కరుణానిధితో మంతనాలు జరిపాక, కాంగ్రెస్‌కు 41 సీట్లు కేటాయించేలా ఒప్పందం కుదిరింది. మరోపక్క.. కేరళలో కాంగ్రెస్ 83 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. -
రిజర్వేషన్ల కోసం హిజ్రాల పట్టు
♦ ప్రతి పార్టీ ఒక టికెట్ ఇవ్వాలని డిమాండ్ ♦ చెన్నై ఆర్కేనగర్ నుంచి హిజ్రా పోటీ చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని హిజ్రాలు కోరుతున్నారు. ఇకపై ప్రతి ఎన్నికల్లో హిజ్రాలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశాయి. ప్రస్తుత ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోని ప్రతి పార్టీ ఒక టికెట్‌ను హిజ్రాకు కేటాయించాలని డిమాండ్ చేశాయి. 12 స్వచ్ఛంధ సేవా సంస్థల ప్రతినిధులు డాక్టర్ శ్యామలా నాధూరాజ్, డాక్టర్ విజయరామన్, భక్తవత్సలం, జయ సహోదరన్, భావన, హరిహరన్ చెన్నై ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మతం, భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలకు అనేక అవకాశాలు ఇవ్వడంలో తమిళనాడు ఎప్పుడూ ముందున్నదని అన్నారు. అయితే హిజ్రాలపై మాత్రం వివక్షచూపుతున్నారని ఆరోపించారు. సమాజంలో మూడో రకం మనుషులుగా గుర్తింపుపొందిన తాము అన్నిరంగాల్లో అవకాశాలు, గుర్తింపు పొందుతుండగా రాజకీయపార్టీలు మాత్రం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో తాము స్థిరపడాలంటే ఆర్థిక, రాజకీయ బలం అవసరమని అన్నారు. రాజకీయంగా ముందడుగు వేస్తే ఆర్థిక బలం తానుగా సమకూరుతుందని చెప్పారు. అందుకే ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు ప్రతి పార్టీ కనీసం ఒక్క సీటైనా హిజ్రాలకు కేటాయించాలని కోరుతున్నట్లు వారు తెలిపారు. ఈ మేరకు తమ వినతిపత్రాన్ని, దరఖాస్తులను ప్రతిరాజకీయ పార్టీకి సమర్పించినట్లు వారు చెప్పారు. అన్నాడీఎంకే నుంచి పోటీ చేసేందుకు సుధ, డీఎంకే నుంచి రగసియ, డీఎండీకే నుంచి రాధిక దరఖాస్తులు సమర్పించారని వారు తెలిపారు. చెన్నై ఆర్కేనగర్ నుంచి సేలం దేవి (హిజ్రా) నామ్‌తమిళర్ కట్చి అభ్యర్థిగాా ఖరారైనట్లు వారు తెలిపారు. నామ్ తమిళర్ కట్చి తీరులోనే ప్రతిపార్టీ ఒక స్థానంలో హిజ్రాలకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రజలకు సేవలు చేసే విషయంలో తాము ఎవ్వరికీ తీసిపోమనివారు పేర్కొన్నారు. తమిళనాడును ప్రగతిపథంలో నడిపించడంలో తమను భాగస్వామ్యులను చేయాలని వారు అన్నారు. తమ డిమాండ్లను ఎన్నికల కమిషన్, రాజకీయపార్టీలు పరిశీలించాలని వారు కోరారు. -
ఆర్కె నగర్ ఎన్నికలో జయలలిత ఘనవిజయం
-
చెన్నై అర్కేనగర్‌లో పోలింగ్
-
నేటితో ప్రచారానికి తెర
ఉప ఎన్నిక సందర్భంగా అధికార, ప్రతిపక్షాల పర్యటనలతో హోరెత్తిపోయిన ఆర్కేనగర్లో గురువారం ప్రచారానికి తెరపడనుంది. 27వ తేదీన పోలింగ్ కారణంగా గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రచారాన్ని నిలిపివేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా ప్రకటించారు. చెన్నై :చెన్నైలోని ఆర్కేనగర్ ఉప ఎన్నికలో అన్నాడీఎంకే అభ్యర్థిగా పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత, సీపీఐ అభ్యర్థిగా మహేంద్రన్ ప్రధాన పార్టీల నుంచి రంగంలో ఉన్నారు. వీరిద్దరుకాక మరో 26 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీచేస్తున్నారు. అమ్మ తరపున మంత్రులు, 50 మంది ప్రచార బృందం పెద్ద ఎత్తున ప్రచారం జరుపుతోంది. సీపీఐ అభ్యర్థి సైతం తన వంతు ప్రచారం సాగిస్తున్నారు. అభ్యర్థి హోదాలో జయలలిత ఈనెల 22వ తేదీన నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు. 27 వ తేదీన పోలింగ్ సందర్భంగా గురువారం సాయంత్రానికి ప్రచారం ముగించాలని, అలాగే ఇతర ప్రాంతాల నుంచి వ చ్చిన వారంతా ఆర్కేనగర్ విడిచి వెళ్లాలని సందీప్ సక్సేనా ఆదేశించారు. ఎన్నికలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు పది కంపెనీల పారా మిలిటరీ దళాలు బందోబస్తులో ఉన్నాయని, వీరుగాక వెయ్యి మంది రాష్ట పోలీసులు, 1150 మంది ఎన్నికల సిబ్బంది, ఫ్లైయింగ్ స్క్వాడ్లు పనిచేస్తున్నారని తెలిపారు. అన్నదాతల ఆందోళన: ఆర్కేనగర్ నియోజకవర్గంలో గురువారం అన్నదాతలు ఆకస్మిక ఆందోళన చేపట్టి పోలీసులను పరుగులు పెట్టించారు. తండయార్‌పేట-తిరువత్తియూర్ రోడ్డులోని కార్పొరేషన్ మండల కార్యాలయం వద్ద ఉదయం 9 గంటల నుంచి రైతులు గుమికూడడం ప్రారంభించారు. మీరు ఎవరు, ఏం చేస్తున్నారని పోలీసులు ప్రశ్నించగా, ఊరికినే నిలుచున్నా తప్పా అని ఎదురు ప్రశ్నించారు. 10 గంటల సమయానికి సుమారు వందమంది రైతులు గుంపుగా చేరి మండల కార్యాలయంలోకి చొరబడే ప్రయత్నం చేశారు. మీకు ఏమి కావాలని పోలీసులు ప్రశ్నించగా, ముఖ్యమంత్రి దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లేందుకే ఆమె పోటీ చేస్తున్న ఆర్కేనగర్లో వినతి పత్రం సమర్పిస్తున్నామని బదులిచ్చారు. వినతి పత్రాలు ఇక్కడ ఇవ్వకూడదని పోలీసులు వారికి అడ్డుతగలడంతో అకస్మాత్తుగా రోడ్లపై పడుకున్నారు. పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్నదాతల ఆందోళనతో సుమారు అరగంటపాటు ట్రాఫిక్ స్తంభించి పోయింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి ట్రాఫిక్‌ను పునరుద్దరించారు. ఆర్కేనగర్ పరిధిలో బుధవారం రాత్రి వాహనాల తనిఖీల్లో పోలీస్ పేరుతో ఉన్న వాహనం నుండి ఫ్లైయింగ్ స్వ్కాడ్ అధికారులు రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ఆర్కేనగర్ నుంచి స్వతంత్య్ర అభ్యర్థులుగా పోటీచేస్తున్న వసంతకుమార్, ఎమ్ఎల్ రవి, పాల్‌రాజ్, తదితర 9 మంది అభ్యర్థులు గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో తండయార్‌పేటలోని కార్పొరేషన్ మండల కార్యాలయంలో ఫిర్యాదు చేయడానికి దూసుకెళ్లారు. పోలీసులు సర్దిచెప్పి పంపివేశారు. అలాగే ప్రచార సమయంలో తనపై రాళ్లు రువ్వారని మరో స్వతంత్య్ర అభ్యర్థి ట్రాఫిక్ రామస్వామి ఫిర్యాదు చేశారు. ఇతని ఫిర్యాదు స్వీకరించక పోవడంతో ధర్నాకు దిగాడు. 4రోజులు టాస్మాక్ సెలవు : ఆర్కేనగర్ ఉప ఎన్నిక పోలింగ్, లెక్కింపు సందర్బంగా నాలుగురోజుల పాటూ టాస్మాక్ దుకాణాలకు, బార్లకు సెలవు ప్రకటించారు. 25వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి 27వ తేదీ రాత్రి వరకు, అలాగే లెక్కింపురోజైన 30వ తేదీ రాత్రి వరకు శలవు దినాలను అమలుచేయనున్నారు. ‘అమ్మగెలుపు-తెలుగోడి గెలుపు’ కేతిరెడ్డి ప్రచారం: తెలుగువారు అత్యధికంగా నివసించే ఆర్కేనగర్ నియోజకవర్గంలో తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి అన్నాడీఎంకే తరపున ఈనెల 13 వ తేదీ నుంచి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడి తెలుగు ప్రజలంతా తమ నూరుశాతం ఓట్లను రెండాకుల చిహ్నంపై వేసి అమ్మను అఖండమెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. అమ్మ గెలుపు తెలుగోడి గెలుపు అనే నినాదంతో కరపత్రాలు పంచుతూ వాడవాడలా ప్రచారం నిర్వహించారు. అమ్మను గెలిపిస్తే రాష్ట్రం మరిన్ని మంచి పథకాలతో ముందుకు దూసుకుపోతుందని అన్నారు. ఏఐటీఎఫ్ ప్రచారం: ఆలిండియా తెలుగు ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ సీఎంకే రెడ్డి నేతృత్వంలో పలు తెలుగు సంఘాల ప్రముఖులు గురువారం ఆర్కేనగర్లో ప్రచారం నిర్వహించారు. అమ్మను గెలిపించడం ద్వారా రాష్ట్ర ప్రగతికి బాటలు వేయాలని పేర్కొంటూ అన్నాడీఎంకే తరపున ప్రచారం జరిపారు. చెన్నైపురి ట్రస్ట్ చైర్మన్ తంగుటూరి రామకృష్ణ, టామ్స్ అధ్యక్షులు గొల్లపల్లి ఇజ్రాయేల్, ద్రవిడ దేశం అధ్యక్షులు కృష్ణారావు, దక్షిణభారత తెలుగు సంక్షేమం సంఘం అధ్యక్షులు దోర్నాదుల సత్యనారాయణ, మెహతానగర్ తెలుగు ప్రముఖులు ప్రకాష్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. -
నేటి నుంచి నామినేషన్లు
చెన్నై ఆర్కేనగర్ నియోజకవర్గ ఉప ఎన్నికకు బుధవారం నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 10వ తేదీ వరకు సాగనుంది. చెన్నై, సాక్షి ప్రతినిధి :ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష కారణంగా శాసన సభ్యత్వాన్ని సీఎం జయ కోల్పోయారు. నిర్దోషిగా బైటపడిన నేపథ్యంలో గత నెల 23వ తేదీన మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఆరునెలల్లోగా ఎమ్మెల్యేగా గెలవడం ఆమెకు అనివార్యమైంది. జయ పోటీకోసం సిద్ధమైన ఆర్కేనగర్లో ఈనెల 27వ తేదీన పోలింగ్ జరుగనుంది. నామినేషన్ల ప్రక్రియకు బుధవారం శ్రీకారం చుట్టనున్నారు. జయపై పోటీ చేసేందుకు ప్రధాన పార్టీలన్నీ విముఖత వ్యక్తం చేశాయి. తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్ సైతం పోటీకి దూరమని మంగళవారం ప్రకటించారు. ఆర్కేనగర్లో పోటీకి దిగాల్సిందేనని డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌పై ఒత్తిడిపెరుగుతోంది. రెండు రోజుల్లో కెప్టెన్ తన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. మంగళవారం వరకు ట్రాఫిక్ రామస్వామి మినహా మరెవ్వరూ రంగంలో దిగే దాఖలాలు కనిపించలేదు. అప్పీలుతో హ డావుడి.. జయను నిర్దోషిగా పేర్కొంటూ వెలువడిన తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో హడావుడికి కారణమైంది. కర్ణాటక ప్రకటన వెలువడగానే అన్నాడీఎంకే నేతలంతా సోమవారం రాత్రి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. 9 గంటల సమయంలో మంత్రి ఓ పన్నీర్ సెల్వం ఎన్నికల ప్రచార బాధ్యతలకు నియమితులైన 50 మందితో సమావేశమయ్యారు. కేవలం పది నిమిషాల్లో ముగిసిన ఈ సమావేశానికి మీడియాను అనుమతించలేదు. తమిళనాడు-కర్ణాటక సరిహద్దుల్లో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెన్నై కోయంబేడు బస్‌స్టేషన్ నుంచి కర్ణాటక వైపునకు వెళ్లే బస్సులను నిలిపివేశారు. కోయంబేడులో ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల వరకు 54 బస్సులకు గాను కేవలం ఏడు బస్సులు మాత్రమే నడిచాయి. బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చే తమిళనాడుకు చెందిన బస్సులను సైతం నిలిపివేశారు. గుండెపోటుతో మృతి కీరనూర్ పట్టణానికి చెందిన అన్నాడీఎంకే నేత జయకుమార్ (45) సోమవారం రాత్రి గుండెపోటుకు గురై మృతి చెందాడు. రాత్రి ఇంట్లో కూర్చుని టీవీలో వార్తలు చూస్తుండగా జయకేసులో కర్ణాటక ప్రభుత్వం అప్పీలుకు వెళుతున్నట్లు చెప్పడంతో తీవ్రస్థాయిలో గుండెనొప్పి వచ్చింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా చనిపోయినట్లు ధ్రువీకరించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ఆర్కే నగర్ నుంచే జయ పోటీ
చెన్నై: వచ్చే నెల 27న తమిళనాడులో జరిగే ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి జయలలిత స్థానిక రాధాకృష్ణన్(ఆర్కే) నగర్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు అన్నాడీఎంకే పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు జయ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నుంచి జయకు విముక్తి లభించగానే ఆర్కే నగర్ ఎమ్మెల్యే వెట్రివేల్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె అక్కడి నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతూ వచ్చింది. తాజాగా దీన్ని ఆమె నిర్ధారించారు. ఇంతకుముందు ఆమె శ్రీరంగం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఆస్తుల కేసులో బెంగళూరు ప్రత్యేక కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చే యాల్సి వచ్చింది. అయితే ఈ నెల 11న కర్ణాటక హైకోర్టు ఆమెపై కేసును కొట్టివేసిన నేపథ్యంలో ఆమె మళ్లీ సీఎం పీఠమెక్కి ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తున్నారు. మరోవైపు ఈ ఉప ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు డీఎంకే, పీఎంకే ప్రకటించాయి. ఈసారి ధన ప్రవాహమే కీలకపాత్ర పోషిస్తోందని, ఓటర్లకు అధికార పార్టీ భారీగా డబ్బులు పంచుతోందని పీఎంకే ఆరోపించింది. ఇక ఆర్కే నగర్లో పోటీ చేసే అంశంపై విజయ్‌కాంత్ నేతృత్వంలోని డీఎండీకేతో బీజేపీ తాజాగా చర్చలు జరిపింది. -
మద్దతివ్వండి
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆర్కేనగర్ ఉప ఎన్నికలో అన్నాడీఎంకే అభ్యర్థి జయలలితపై పోటీకి దిగుతున్న సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి మద్దతు కూడగట్టే కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. రోడ్లకు అడ్డంగా వెలిసిన బ్యానర్లు, ఫ్లెక్సీల తొలగింపు ద్వారా ప్రజల్లో పలుకుబడిని పెంచుకున్న ట్రాఫిక్ రామస్వామి ఆర్కేనగర్ నుంచి పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అన్నాడీఎంకే అభ్యర్థిగా రంగంలో నాణ్యమైన నిర్మాణాలు ఎలాసాధ్యమని కిందిస్థాయి సిబ్బంది విమర్శిస్తున్నారు. ఉపేక్షిస్తే లాభం లేదని నిర్ణయించుకున్న సిబ్బంది సినిమా ఒరవడిని ఆశ్రయించారు. అవినీతిని విడనాడకుంటే పేర్లను బహిర్గతం చేస్తూ బ్యానర్లను పెడతామని ఠాగూర్ సినిమా తరహాలో హెచ్చరికలు జారీచేశారు. హెచ్చరించినట్లుగానే 30 మంది లంచావతారుల పేర్లతో నెలరోజుల క్రితం సచివాలయం ఎదురుగా బ్యానర్ పెట్టారు. అయితే పోలీసులు వెంటనే దానిని తొలగించారు. మరికొన్ని రోజుల తరువాత మరో బ్యానర్ పెట్టారు. అనేక పోస్టర్లు వెలిసాయి. మక్కల్ సైదిమయ్యం పేరుతో ఈ బ్యానర్ల వ్యవహారం క్రమేణా రాష్ట్రమంతా పాకడం లంచావతారులనేగాక సంబంధిత శాఖలను పర్యవేక్షిస్తున్న ఐఏఎస్ అధికారులను సైతం అప్రతిష్టపాలు చేసింది. కమిషనర్‌ను కలిసిన ఐఏఎస్ సంఘం: తమిళనాడు ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షులు డేవిదార్, కార్యదర్శి రాజారామన్ తదితరులు శుక్రవారం చెన్నై నగర పోలీస్ కమిషనర్ జార్జ్‌ను కలిసి విజ్ఞప్తి అందజేశారు. 12 మంది ఐఏఎస్ అధికారులను అవినీతి పరులుగా పేర్కొంటూ ఈనెల 14వ తేదీన నగరంలో అనేక ఫొటోలతో బ్యానర్లు, పోస్టర్లు వేశారని వారు చెప్పారు. అయితే అందులో పేర్కొన్న వివరాలు పూర్తిగా అవాస్తవాలని, ఉద్దేశపూర్వకంగా బురదజల్లుతున్నారని వారు అన్నారు. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా అధికారులను రచ్చకీడుస్తున్న వారిపై కేసులు బనాయించి తగిన చర్య తీసుకోవాల్సిందిగా వారు కోరారు. ప్రభుత్వంలో కీలకబాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారులు నేరుగా కమిషనర్‌ను కలిసి వేడుకోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. -
జయపై పోటీ చేయట్లేదు: కరుణ
-
జయపై పోటీ చేయట్లేదు: కరుణ
హైదరాబాద్: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై పోటీకి డీఎంకే దూరంగా జరిగింది. ఆమె పోటీ చేయనున్న ఆర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టడం లేదని డీఎంకే అధినాయకుడు కరుణానిధి తెలిపారు. జయలలితపై అక్రమాస్తుల కేసును కర్ణాటక హైకోర్టు కొట్టేసిన తర్వాత.. ఆమె మళ్లీ ఎన్నికయ్యేందుకు వీలుగా ఆర్కేనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆరు నెలల్లోగా ఏదో ఒక సభకు ప్రాతినిధ్యం వహించడం తప్పనిసరి. దాంతో.. ఆమె త్వరలోనే ఆర్కేనగర్ నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ తాము తమ అభ్యర్థిని బరిలోకి దించడంలేదని కరుణానిధి ప్రకటించడం గమనార్హం. అక్కడ పోటీ చేస్తే బాగుండదేమో అని భావించిన డీఎంకే సారథి కరుణానిధి తమ పార్టీ నుంచి అభ్యర్థులను పోటీలో ఉంచబోమని స్పష్టం చేశారు. ఇంకా వేరే పార్టీల అభ్యర్థలు పోటీలో ఉంటారా.. లేదా ? అన్న విషయం తెలియరాలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం ఖుష్బూ పోటీ చేయొచ్చని చెబుతున్నారు. ఒకవేళ ఏ పార్టీ నుంచి అభ్యర్థులు బరిలో లేకుంటే 'అమ్మ' ఎన్నిక ఏకగ్రీవమే కావచ్చు. -
తమిళనాట ముందస్తు లేనట్లే
జయ కోసమే ఆర్కేనగర్ సిద్ధం చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడులో తాజాగా మారిన రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తే ముందస్తు ఎన్నికలు లేనట్లేనని తెలుస్తోంది. ఉప ఎన్నిక లేకుండా ముందస్తుకు జయ సిద్ధమవుతారని అన్నాడీఎంకేలో జోరుగా సాగిన ప్రచారానికి విరుద్ధంగా మార్పులు చోటుచేసుకున్నాయి. ఈనెల 22వ తేదీన పార్టీ ఎమ్మెల్యేల సమావేశాన్ని నిర్వహించనున్నారు. అదే సమయంలో జయను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుని సీఎం పీఠం ఎక్కిస్తారని తెలుస్తోంది. అయితే, ఈనెల 23వ తేదీలోగా ఏదేని అసెంబ్లీ నియోజకవర్గం ఖాళీ అయితేనే ఉప ఎన్నిక సాధ్యమని ఎన్నికల కమిషన్ నిబంధన వల్ల ఆర్కేనగర్ ఎమ్మెల్యే వె ట్రివేల్ చేత హడావుడిగా రాజీనామా చేయించారు. స్వల్ప అనారోగ్యం తో బాధపడుతున్న జయలలిత దూరప్రాంతాలకు వెళ్లి ప్రచారంచేసే స్థితిలో లేనందునే ఆర్కేనగర్‌ను ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా సైతం ఆరు నెలల్లో ఆర్కేనగర్లో ఉపఎన్నిక నిర్వహించనున్నట్లు సోమవారం ప్రకటించారు. ఉప ఎన్నికకు జయ సిద్ధమయినట్లు తేలటంతో ముందస్తు ఎన్నికలు లేనట్లేనని భావిస్తున్నారు. అప్పీలుకు మరికొన్ని రోజులు: మరోవైపు జయలలితను నిర్దోషిగా విడుదల చేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో సవాలు చేసే అంశంపై నిర్ణయం తీసుకోవటానికి మరికొద్ది రోజులు పట్టవచ్చని ఆ రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి టీబీ జయచంద్ర సోమవారం తెలిపారు. ‘జయ’తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీలు చేయాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య ఇప్పటికే ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. ఇక నిర్ణయం తీసుకోవలసింది ప్రభుత్వమేనని ఆయన అన్నారు.