![జయలలితపై తెలుగు వ్యక్తి పోటీ](/styles/webp/s3/article_images/2017/09/4/81463310908_625x300.jpg.webp?itok=_fcAQu3Z)
జయలలితపై తెలుగు వ్యక్తి పోటీ
సాక్షి, హైదరాబాద్: తమిళనాడులోని ఆర్‌కే నగర్, హోసూరు నియోజకవర్గాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితపై స్వతంత్ర అభ్యర్ధిగా తమిళనాడు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగు భాష పరిరక్షణ ఉద్యమ నేత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పోటీ చేయనున్నారు.
తెలుగు భాషతో పాటు తెలుగు జాతికి జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఆ రెండు నియోజకవర్గాల్లో జయలలితపై పోటీ చేస్తున్నట్లు కేతిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఉచిత హామీలకు ఆకర్షితులు కాకుండా స్థానికంగా ఉన్న తెలుగు ఓటర్లు కులం, మతం కంటే తెలుగు భాషను కాపాడాల్సిన బాధ్యత ఉందని గుర్తించి ఓటు అనే అస్త్రం ద్వారా తమ సత్తా చాటాలని కోరారు.