
చెన్నై: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకుడుగా మూడు దశాబ్దాలు వెలుగొందిన స్వర్గీయ దాసరి నారాయణరావుకి నివాళిగా తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సభ జరిగింది. దాసరి నారాయణరావు గారికి కేంద్రం 2022 కి పద్మవిభూషణ్‌ను ప్రకటించాలని అందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేంద్రానికి ఒక లేఖ ద్వారా సిఫార్సు చేయాలని కేతిరెడ్డి పేర్కొన్నారు.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను అభ్యర్థిస్తూ ఒక వినతిపత్రాన్ని పంపారు. దానికి ముందు జరిగిన తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈసి సమావేశంలో తీసుకొన్న నిర్ణీయాన్ని వారు రెండు ప్రభుత్వాలకు తెలిపారు.తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ లేఖలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవలే సినిమా టిక్కెట్ ధరలను పెంచుకొనే అవకాశాన్ని జీవో ద్వారా రద్దు చేయడాన్ని అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment