
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళ మేనకోడలు డాక్టర్ కృష్ణప్రియ తాను వచ్చేఏడాది రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. ఆర్కేనగర్‌లో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు శశికళ అక్క కుమారుడు టీటీవీ దినకరన్ జయ వీడియో దృశ్యాలను విడుదల చేయడం వారి కుటుంబాల్లో మనస్పర్ధలకు దారితీసింది. శశికళ వదిన ఇళవరసి కుమార్తె కృష్ణప్రియ దీనిపై తీవ్రంగా స్పందించారు.
ఒక తమిళ వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘జయలలిత, శశికళ మాట్లాడుకునే దృశ్యాలను కత్తిరించి కొన్ని సెకన్ల వీడియోనే విడుదల చేశారు. జయ వీడియో విడుదలైన సంగతి శశికళకే తెలియదు. ఆమెపై హత్యానేరం ఆరోపణలు వచ్చినపుడు విడుదల చేయడం ఇష్టంలేని వీడియోను దినకరన్ కోసం విడుదల చేయడాన్ని శశికళ అంగీకరించి ఉండదు. ఒకే ఒక నియోజకవర్గంలో గెలుపుకోసం, పార్టీ చిహ్నం తమవద్ద లేనప్పుడు వీడియో విడుదల చేయడానికి దినకరన్‌కు ఎలా బుద్ధిపుట్టిందో..’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment