
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నైలోని ఆర్కే నగర్‌లో డిసెంబర్ 31లోపు ఉప ఎన్నిక నిర్వహించాలని మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘా(ఈసీ)న్ని మద్రాసు హైకోర్టు ఆదేశించింది. తమిళనాడు సీఎం జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్‌లో గత ఏప్రిల్‌లో ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. దీనిపై నోటిఫికేషన్ కూడా గతంలో విడుదలైంది. అప్పుడు అన్నాడీఎంకే (అమ్మ) అభ్యర్థిగా పోటీచేసిన టీటీవీ దినకరన్ ఎన్నికల సమయంలో రూ.89 కోట్లు పంపిణీ చేసినట్లు తేలడంతో ఎన్నిక రద్దయింది.