ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని దక్కించుకునేందుకు జయ లలిత నెచ్చెలి శశికళ రంగం సిద్ధం చేసుకుం టున్నట్లు సమాచారం. దీనికి ముందే దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిథ్యం వహిం చిన చెన్నై ఆర్కేనగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి గెలుపొందాలని కూడా ఆమె భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.