సాక్షి, చెన్నై: టీటీవీ దినకరన్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ప్రెషర్ కుక్కర్ గుర్తును అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం(ఏఎంఎంకే)కు కేటాయించేలా ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం కోర్టు గురువారం స్పష్టం చేసింది. ప్రస్తుత తరుణంలో తాము ఆ పని చేయలేమని వెల్లడించింది. ఏఎంఎంకే పార్టీకీ ‘ప్రెషర్ కుక్కర్’ గుర్తు ఇవ్వాలని గత మార్చి 9న చెన్నై హైకోర్టు ఎన్నికల కమిషన్‌కు సూచించిన సంగతి తెలిసిందే. దీనిపై పళనిస్వామి వర్గం సుప‍్రీంకోర్టు తలుపు తట్టింది. అయితే, ఎమ్మెల్యేల అనర్హత కారణంగా ఖాళీ అయిన 18 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నాలుగు వారాల్లోగా ఈసీ నోటిఫికేషన్ ఇవ్వగలిగితే ముందుగా ఇచ్చిన తీర్పుకు లోబడి హైకోర్టు ఏఎంఎంకే పార్టీకి ప్రెషర్ కుక్కర్ గుర్తును కేటాయించాలని తెలిపింది. లేనిపక్షంలో ఏఎంఎంకే పార్టీకి ఎన్నికల కమిషన్ తన ఇష్టానుసారం ఎన్నికల గుర్తును కేటాయిస్తుందని జస్టిస్ ఏఎం ఖన్వికల్కర్, జస్టిస్ అజయ్ కస్తోగి ధర్మాసనం తీర్పునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment