అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత ఇప్పటికే ముక్కచెక్కలైన పార్టీలో దినకరన్ రూపంలో మరో ముసలం పుట్టింది. అన్నాడీఎంకేపై సర్వాధికారాలు తనవేనని, తనను బహిష్కరించే హక్కు ప్రధానకార్యదర్శికి తప్ప ఇంకెవరికీ లేదని అన్నాడీఎంకే(అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ శనివారం వ్యాఖ్యానించారు.