edappadi palanisamy
-
చెన్నైలో జయలలిత భారీ కాంస్య విగ్రహం అవిష్కరణ
-
పళనికి కొత్త టెన్షన్.. 40 మంది ఎమ్మెల్యేలు జంప్?
చెన్నై: వర్గ పోరులకు చెక్ పెడుతూ ముఖ్యమంత్రి పళని సామి, పన్నీర్ సెల్వంలు విలీన నిర్ణయం తీసుకోగానే తమిళనాట రాజకీయాలు అస్తవ్యస్తంగా మారాయి. శశికళ మరియు ఆమె వర్గీయులపై వేటు వేయటమే ప్రధాన ఉద్ధేశ్యంగా రొయపెట్టాలో సోమవారం నిర్వహిస్తున్న కీలక సమావేశానికి 40 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. దీంతో పళని, పన్నీర్లలో కొత్త టెన్షన్ మొదలుకాగా, పార్టీలో సంక్షోభం తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. శశికళ బంధువు దినకరన్ టీవీవీ దినకరన్ తన వర్గ ఎమ్మెల్యేలతో తిరుగుబాటు జెండాను ఎగరవేయగా ప్రస్తుతం సుమారు 22 మంది ఎమ్మెల్యేలు పుదుచ్చేరిలోని విండ్‌ఫ్లవర్ రిసార్ట్‌లో సేదతీరుతున్నారు. రొయపెట్టాలో జరిగే పార్టీ సర్వ సభ్య సమావేశానికి తమకు ఆహ్వానం అందలేదని, తామంతా దినకరన్ వెంటే నడుస్తామని ఎమ్మెల్యే తంగ తమిళసెల్వన్ స్పష్టం చేశారు. డీఎంకేకు మద్ధతుగా వ్యవహరించబోతున్నారన్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. పళని-పన్నీర్ వర్గంలో మరింత మంది స్లీపర్ సెల్స్ ఉన్నారని, వారంతా త్వరలో దినకరన్ గూటికి చేరతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ పారదర్శకంగా వ్యవహరించి అసెంబ్లీలో బలనిరూపణ పరీక్ష నిర్వహిస్తారని ఆశిస్తున్నామని, అలాకానీ పక్షంలో రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని సెల్వన్ కోరారు. ఇక పళని స్వామి సహా నేతలంతా కీలక బాధ్యతల నుంచి తొలగిస్తూ వస్తున్న దినకరన్ నేడు మరోకరిపై వేటు వేశారు. విద్యుత్ శాఖ మంత్రి పి తంగమణిని నమక్కల్ జిల్లా సెక్రటరీ పదవి నుంచి తొలగిస్తూ ఆ స్థానంలో అనబఝన్‌ను నియమించారు. అన్నాడీఎంకే సమావేశంలో నాలుగు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. శశికళ, దినకరన్ లను వెలివేయటంతోపాటు, దినకరన్ చేపట్టిన నియామకాలన్నీ చెల్లవంటూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దినకరన్ చేతల్లో ఉన్న పార్టీ అధికారిక మీడియాలు నమదు ఎంజీఆర్, జయ టీవీల పునరుద్ధరణ చేపట్టాలని నిర్ణయించుకుంది. ఇక త్వరలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించి పూర్తి స్థాయి నియామకాలు చేపట్టాలని తీర్మానాలు చేసింది. డీఎంకే-దినకరన్‌ల కాంబోలో ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపక్ష డీఎంకే పార్టీతో టీవీవీ దినకరన్ చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ నుంచి కొందరు శకునిలు పళని-పన్నీర్‌లను ఒక్కటి చేసేందుకు తీవ్రంగా యత్నించాయని, కానీ వారి ఆటలు సాగకపోవచ్చని ఆయన ట్వీట్ చేశారు. ఇంకోవైపు దినకరన్‌కు మద్ధతు ఇస్తున్న 19 మంది ఎమ్మెల్యేలతోపాటు గుట్కా స్కాం అంశాన్ని వెలుగులోకి తెస్తూ డీఎంకేలోని 20 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ పళని ప్రభుత్వం స్పీకర్‌ను కోరే అవకాశం ఉందని, తద్వారా సభలో కోరంను తగ్గించవచ్చనే ఆలోచన చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. -
అన్నాడీఎంకేలో ఇక ఆ రెండు వర్గాలేనా?
చెన్నై: జయలలిత మరణం తరువాత మూడు ముక్కలైన అన్నాడీఎంకే రెండుగా మారనుందా? ఇక ఎడపాడి, పన్నీర్‌సెల్వం వర్గాలు మాత్రమే మిగలనున్నాయా? అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యంత్రి ఎంజీ రామచంద్రన్ శత జయంతి ఉత్సవాలు పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తుంది. ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాలు నిన్నమదురైలో ఘనంగా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. పాండికోయిల్ సమీపంలోని అమ్మ మైదానంలో భారీ వేదికను నిర్మించారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి శుక్రవారం మదురైకు వచ్చారు. అయితే పార్టీపరంగా జరపాల్సిన ఈ కార్యక్రమాలకు ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్‌ను ఎడపాడి దూరంగా పెట్టారు. రెండాకుల చిహ్నం కోసం ఈసీకి డబ్బును ఎరవేసి దినకరన్ జైలు పాలైనప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా చేశారు. అయితే బెయిల్‌పై బైటకు వచ్చిన తరువాత పార్టీని తన చేతుల్లోకి తీసుకోవాలని దినకరన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇదే సమయంలో ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాల ఏర్పాట్లు ప్రారంభం కాగా దినకరన్‌ను దూరం పెట్టారు. దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు ఇందుకు తీవ్రంగా ఆగ్రహించారు. అంతేగాక మదురైలోనే పోటీగా మరో భారీ ఎత్తున ఎంజీఆర్ శతజయంతి సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఎంజీఆర్ శత జయంతికి హాజరు కాకుంటే ప్రజల్లో చెడ్డపేరు వస్తుందనే భయంతో దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యేలు తంగ తమిళ్‌సెల్వన్, బోస్ సభకు హాజరయ్యారు. దినకరన్ వర్గం ఎడపాడికి దాసోహమైందని కొందరు వ్యాఖ్యానించగా, ప్రభుత్వ కార్యక్రయం కావడంతో వచ్చామని వారు సమర్థించుకున్నారు. దినకరన్ పేరుతో పేరవై మరోవైపు దినకరన్ పేరుతో పేరవై ప్రారంభించారు. 54 జిల్లాల నిర్వాహకులను నియమించి వారిని ఆయన స్వయంగా కలిశారు. 50 లక్షల మందిని పేరవైలో చేర్పించాలనేదే తమ లక్ష్యంగా భావిస్తున్నట్లు దినకరన్ తెలిపారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ జైలుకు వెళ్లే ముందు దినకరన్, వెంకటేశ్‌లను పార్టీలో చేర్పించిన విషయం తెలిసిందే. దినకరన్‌ను ఉప ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు. అయితే దినకరన్‌కు, ఎడపాడి వర్గాలకు ఘర్షణ ఏర్పడడంతో ఆయన పార్టీ నుంచి కొంత దూరమయ్యారు. హఠాత్తుగా దినకరన్ పేరుతో పేరవై ప్రారంభించడం దానికి ఒకే రోజు 54 మంది జిల్లా నిర్వాహక కార్యదర్శులను నియమించిన సంఘటన అన్నాడీఎంకేలో సంచలనం కలిగించింది. -
దినకరన్ దూకుడు, ఈపీఎస్ వర్గంలో కలవరం!
చెన్నై: అధికార అన్నాడీఎంకే వర్గంలో విభేదాలు తీవ్రమయ్యాయి. ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి (ఈపీఎస్)- శశికళ అక్క కొడుకు దినకరన్ మధ్య వర్గపోరు ముమ్మరం కావడంతో మళ్లీ తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి. ఈపీఎస్ వర్గానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ దినకరన్‌ను కలువడంతో ఆయన ప్రభుత్వ మనుగడపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం అన్నాడీఎంకే (అమ్మ) పార్టీకి నేతృత్వం వహిస్తున్న ఈపీఎస్‌కు కేవలం 122మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉంది. మరో ఆరుగురు ఎమ్మెల్యేలు ఆయన వర్గం నుంచి జారుకుంటే ప్రభుత్వం పడిపోయే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఈ నెల 14న ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు జైలు నుంచి విడుదలైన దినకరన్ ఈపీఎస్ వర్గాన్ని సవాలు చేస్తున్నారు. అన్నాడీఎంకే నుంచి తనను, చిన్నమ్మ శశికళను ఎవరూ దూరం చేయలేరని, ఆ అధికారం ఎవరికీ లేదని దినకరన్ అంటున్నారు. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో శశికళను కలిసిన అనంతరం దినకరన్ మీడియాతో మాట్లాడారు. శశికళతో, దినకరన్‌తో అన్నాడీఎంకేకు ఎలాంటి సంబంధం లేదని తమిళనాడు ఆర్థికమంత్రి జయకుమార్ చేసిన ప్రకటనను ఆయన తీవ్రంగా ఖండించారు. అన్నాడీఎంకే నుంచి తమను బహిష్కరించే అధికారం ఎవరికీ లేదని అన్నారు. తీహార్ జైలు నుంచి దినకరన్ విడుదలైన సందర్భంగా పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ ఆయనను కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మన్నార్గుడి మాఫియా మళ్లీ పార్టీ పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరంచేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శశికళ వర్గాన్ని దూరం పెడుతూనే ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఈపీఎస్ వర్గం ప్రయత్నిస్తోంది. ఇందులోభాగంగా తనవర్గం నుంచి ఎమ్మెల్యేలు జారుకోకుండా చర్యలు తీసుకుంటోంది. దినకరన్, శశికళను ఎమ్మెల్యేలు కలువకుండా ఈపీఎస్ వర్గం పావులు కదుపుతున్నట్టు సమాచారం. -
‘అమ్మ’ పార్టీలో మరో ముసలం!
-
కమల్‌కు అండగా ఉంటాం: విశాల్
పెరంబూర్ : కమలహాసన్‌కు నడిగర్‌సంఘం అండగా ఉంటుందని ఆ సంఘ కార్యదర్శి విశాల్ వ్యాఖ్యానించారు. విశ్వనటుడు కమలహాసన్ ఇటీవల రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై స్పందిస్తూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కమల్ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో కలకలాన్ని రేకెత్తిస్తున్నాయనే చెప్పాలి. తాజాగా అగ్నిపరిక్ష పేరుతో ఒక ప్రముఖ తమిళ చానల్‌కు కమలహాసన్ ఇచ్చిన భేటీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామికి ఆగ్రహం కలిగించింది. తమిళనాడులో వెంటనే ఎన్నికలు జరగాలన్న కమల్‌పై ముఖ్యమంత్రి తీవ్రంగానే స్పందించారు. కమలహాసన్‌కు 65 ఏళ్ల తరువాత జ్ఞానోదయం అయ్యిందంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం ఇలా ఉంటే తమిళనిర్మాతల మండలి అధ్యక్షపదవికి పోటీ చేస్తున్న నటుడు విశాల్ అందుకు నిర్మాతల మద్దతు కోరే పనిలో భాగంగా తన బృందంతో కలిసి బుధవారం సేలం వెళ్లారు. అక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ కమలహాసన్‌కు రాజకీయ పరంగా సమస్యలు తలెత్తితే ఆయనకు అండగా నడిగర్‌సంఘం నిలుస్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే కమలహాసన్ హిందూ మతాన్ని కించపరచే విధంగా మాట్లాడారంటూ హిందూ మక్కల్ కట్చి నిర్వాహకులు చెన్నై పోలీస్‌కార్యాలయంలో బుధవారం ఫిర్యాదు చేశారు. మహాభారతంలోని పాత్ర గురించి కమలహాసన్ చేసిన వ్యాఖ్యలు ఖండించదగ్గవని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజేంద్రన్ ఆరోపించారు. -
పళనితో గవర్నర్ ప్రమాణ స్వీకారం
-
పళనితో గవర్నర్ ప్రమాణ స్వీకారం
చెన్నై: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ఎడప్పాడు పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సాయంత్రం రాజ్ భవన్ లోని దర్బారు హల్ లో జరిగిన కార్యక్రమంలో పళనిస్వామితో గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ప్రమాణం చేశారు. తర్వాత మంత్రులందరితో ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జయలలిత, చిన్నమ్మకు మద్దతుగా అన్నాడీఎంకే నేతలు నినాదాలు చేశారు. అమ్మ.. అమరహే, చిన్నమ్మకు జై అంటూ నినదించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శశికళ శిబిరం ఎమ్మెల్యేలు, మద్దతుదారులు హాజరయ్యారు. -
పళని కేబినెట్ లో 31 మంది
చెన్నై: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ఎడప్పాడి పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన కేబినెట్ లో మొత్తం 31 మందికి చోటు కల్పించారు. దినకరన్ కు మంత్రి ఇస్తారని వార్తలు వచ్చినా ఆయనను పార్టీకే పరిమితం చేశారు. శశికళ బంధువులకు కేబినెట్ లో స్థానం కల్పించలేదు. నలుగురు మహిళలకు స్థానం దక్కింది. తన కేబినెట్ మంత్రుల పేర్లు, వారికి కేటాయించిన శాఖల వివరాలతో కూడిన జాబితాను గవర్నర్ కు పళనిస్వామి అందజేశారు. కీలక పదవులను సీఎం పళని తన వద్దే ఉంచుకున్నారు. 19 శాఖలను తన దగ్గరే అట్టిపెట్టుకున్నారు. మంత్రులకు కేటాయించిన శాఖలు శ్రీనివాసన్- అటవీ శాఖ సెంగొట్టయ్యన్- పాఠశాల విద్య, క్రీడలు, యువజన సంక్షేమం కె రాజు- సహకార శాఖ తంగమణి- విద్యుత్, ఎక్సైజ్ వేలుమణి- మున్సిపల్, గ్రామీణాభివృద్ధి జయకుమార్- మత్స్యకార శాఖ షణ్మగం- న్యాయశాఖ అన్బలగన్- ఉన్నత విద్య వి. సరోజ- సామాజిక సంక్షేమం సంపత్- పరిశ్రమలు కరుప్పనన్- పర్యావరణం కామరాజ్- ఆహార, పౌర సరఫరాలు ఓఎస్ మణియన్- చేనేత, జౌళి కె. రాధాకృష్ణన్- హౌసింగ్, పట్టణాభివృద్ధి సి. విజయభాస్కర్- ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కదంబర్ రాజు- సమాచార, ప్రచారం ఆర్ బీ ఉదయ్ కుమార్- రెవెన్యు ఎన్. నటరాజన్- పర్యాటకం కేసీ. వీరమణి- వాణిజ్య పన్నులు కేటీ రాజేంథ్ర బాలాజీ- పాలు, పాడిపరిశ్రమ పీ. బెంజమిన్- గ్రామీణ పరిశ్రమలు నీలోఫెర్ కాఫీల్- కార్మిక శాఖ ఎంఆర్ విజయభాస్కర్- రవాణా శాఖ ఎం మణికందన్- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీఎం రాజ్యలక్ష్మి- గిరిజన సంక్షేమం భాస్కరన్- ఖాదీ రామచంద్రన్- దేవాదాయం వలర్మతి- బీసీ సంక్షేమం బాలకృష్ణారెడ్డి- పశుసంవర్థక శాఖ