
పళనితో గవర్నర్ ప్రమాణ స్వీకారం
చెన్నై: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ఎడప్పాడు పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సాయంత్రం రాజ్ భవన్ లోని దర్బారు హల్ లో జరిగిన కార్యక్రమంలో పళనిస్వామితో గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ప్రమాణం చేశారు. తర్వాత మంత్రులందరితో ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా జయలలిత, చిన్నమ్మకు మద్దతుగా అన్నాడీఎంకే నేతలు నినాదాలు చేశారు. అమ్మ.. అమరహే, చిన్నమ్మకు జై అంటూ నినదించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శశికళ శిబిరం ఎమ్మెల్యేలు, మద్దతుదారులు హాజరయ్యారు.