
చెన్నై: నటి వాణిశ్రీకి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అండగా నిలిచారు. ఓ పెద్ద సమస్య నుంచి ఆమెను గట్టెక్కించారు. నటి వాణిశ్రీకి చెందిన స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. ఆ స్థలం విలువ దాదాపుగా రూ.20 కోట్లు. ఈ విషయాన్ని తెలుసుకున్న సీఎం ఎం.కె.స్టాలిన్, తమిళనాడు ప్రభుత్వం.. వాణిశ్రీ భూమిని కబ్జా కోరల్లో నుంచి విడిపించారు.
చదవండి: బన్రూటితో బంతాట.. పదవి నుంచి తప్పించిన పళణి స్వామి!
సదరు భూమి పత్రాలను వాణిశ్రీకి స్టాలిన్ అప్పగించారు . ఇదే సందర్భంలో నకిలీ పత్రాలు, వ్యక్తుల ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తే దాన్ని రద్దు చేసే అధికారాన్ని కలిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తమిళనాడు ప్రభుత్వం. తన భూమిని తనకు అప్పగించిన స్టాలిన్ సాయానికి వాణిశ్రీ ధన్యవాదాలు తెలియచేశారు.
Comments
Please login to add a commentAdd a comment