
న్యూఢిల్లీ: తమిళనాడు సీఎం స్టాలిన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో సత్తై దురై మురుగన్ అనే యూట్యూబర్‌కు బెయిల్‌ను సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. ‘‘యూట్యూబ్‌లో ఆరోపణలు చేశారంటూ ఎన్నికల వేళ ప్రతి ఒక్కరినీ జైళ్లలో వేయడం ప్రారంభిస్తే ఎందరు కటకటాల పాలవుతారో ఊహించండి’’ అని జస్టిస్ ఏఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
నిరసన తెలపడం, అభిప్రాయాల వ్యక్తీకరణ ద్వారా స్వేచ్ఛను దుర్వినియోగపరిచినట్లుగా భావించరాదని పేర్కొంది. స్టాలిన్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు ఆపడం లేదన్న ఫిర్యాదుపై మద్రాస్ హైకోర్టు బెయిల్ రద్దు చేయడంతో మురుగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.