
పళని కేబినెట్ లో 31 మంది
చెన్నై: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ఎడప్పాడి పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన కేబినెట్ లో మొత్తం 31 మందికి చోటు కల్పించారు. దినకరన్ కు మంత్రి ఇస్తారని వార్తలు వచ్చినా ఆయనను పార్టీకే పరిమితం చేశారు. శశికళ బంధువులకు కేబినెట్ లో స్థానం కల్పించలేదు. నలుగురు మహిళలకు స్థానం దక్కింది.
తన కేబినెట్ మంత్రుల పేర్లు, వారికి కేటాయించిన శాఖల వివరాలతో కూడిన జాబితాను గవర్నర్ కు పళనిస్వామి అందజేశారు. కీలక పదవులను సీఎం పళని తన వద్దే ఉంచుకున్నారు. 19 శాఖలను తన దగ్గరే అట్టిపెట్టుకున్నారు.
మంత్రులకు కేటాయించిన శాఖలు
శ్రీనివాసన్- అటవీ శాఖ
సెంగొట్టయ్యన్- పాఠశాల విద్య, క్రీడలు, యువజన సంక్షేమం
కె రాజు- సహకార శాఖ
తంగమణి- విద్యుత్, ఎక్సైజ్
వేలుమణి- మున్సిపల్, గ్రామీణాభివృద్ధి
జయకుమార్- మత్స్యకార శాఖ
షణ్మగం- న్యాయశాఖ
అన్బలగన్- ఉన్నత విద్య
వి. సరోజ- సామాజిక సంక్షేమం
సంపత్- పరిశ్రమలు
కరుప్పనన్- పర్యావరణం
కామరాజ్- ఆహార, పౌర సరఫరాలు
ఓఎస్ మణియన్- చేనేత, జౌళి
కె. రాధాకృష్ణన్- హౌసింగ్, పట్టణాభివృద్ధి
సి. విజయభాస్కర్- ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
కదంబర్ రాజు- సమాచార, ప్రచారం
ఆర్ బీ ఉదయ్ కుమార్- రెవెన్యు
ఎన్. నటరాజన్- పర్యాటకం
కేసీ. వీరమణి- వాణిజ్య పన్నులు
కేటీ రాజేంథ్ర బాలాజీ- పాలు, పాడిపరిశ్రమ
పీ. బెంజమిన్- గ్రామీణ పరిశ్రమలు
నీలోఫెర్ కాఫీల్- కార్మిక శాఖ
ఎంఆర్ విజయభాస్కర్- రవాణా శాఖ
ఎం మణికందన్- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
వీఎం రాజ్యలక్ష్మి- గిరిజన సంక్షేమం
భాస్కరన్- ఖాదీ
రామచంద్రన్- దేవాదాయం
వలర్మతి- బీసీ సంక్షేమం
బాలకృష్ణారెడ్డి- పశుసంవర్థక శాఖ