సాక్షి, చెన్నై : అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ శుక్రవారం రాత్రి చెన్నైకి చేరుకున్నారు. అనారోగ్యంతో ఉన్న తన భర్త నటరాజన్‌ను బాగోగులు చూసేందుకు పదిహేను రోజులపాటు తనకు పెరోల్ మంజూరు చేయాలంటూ విజ్ఞప్తి చేసుకోగా ఐదు రోజుల పెరోల్ రావడంతో కర్ణాటక పరప్పణ అగ్రహార జైలు నుంచి ఆమె విడుదలయ్యారు. బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చిన శశికళ తన బంధువు కృష్ణప్రియ నివాసానికి చేరుకున్నారు. ఆమెతో పాటు టీటీవీ దినకరన్, పలువురు బంధువులు ఆ నివాసానికి వచ్చారు.
చిన్నమ్మ శశికళ రావడంతో కృష్ణప్రియ నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది. శశికళకు హారతి ఇచ్చి ఆమె మద్ధతుదారులు ఘన స్వాగతం పలికారు. చాలా రోజుల తర్వాత తమిళనాడుకు రావడంతో శశికళను చూసేందుకు భారీగా మద్దతుదారులు తరలి వచ్చారు. శశికళ జిందాబాద్ అంటూ నినాదాలతో ఆమె మద్దతుదారులు హోరెత్తించారు.
లివర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్న నటరాజన్‌కు ప్రస్తుతం డయాలసిస్, ఇతర ఇంటెన్సివ్ కేర్ థెరఫీస్‌ను వైద్యులు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో భర్తను చూసేందుకు అనుమతించాలని, పదిహేను రోజులపాటు తనకు పెరోల్ మంజూరు చేయాలంటూ జైలు శాఖకు విజ్ఞప్తి చేసుకోగా నిరాకరించింది. ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వ వైఖరి ఏమిటని కోర్టు ప్రశ్నించింది. పెరోల్ ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో శశికళకు నేడు ఐదు రోజుల పెరోల్ లభించింది. ఈ క్రమంలో బెంగళూరు నుంచి శశికళ చెన్నైకి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment