
అహ్మదాబాద్: 2017 గుజరాత్ అసెంబ్లీఎన్నికల్లో రెండు దశల్లో కలిపి సగటున 68.41 శాతం పోలింగ్ నమోదయిందని ఎన్నికల సంఘం(ఈసీ) తెలిపింది. 89 స్థానాలకు తొలిదశలో జరిగిన ఎన్నికల్లో 66.75 శాతం, రెండోదశలో 93 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 69.99 శాతం పోలింగ్ జరిగిందని తెలిపింది. ఆదివాసీలు అధికంగా ఉన్న నర్మదా జిల్లాలో అత్యధికంగా 79.15 శాతం, ద్వారక జిల్లాలో అత్యల్పంగా 59.39 శాతం పోలింగ్ జరిగినట్లు తెలిపింది. తాపి(78.5%), బనస్కంథ(75.1%), సబర్కంథ(74.9%) జిల్లాల్లో భారీగా ఓటింగ్ జరిగినట్లు వెల్లడించింది.