
భారత ఎన్నికల సంఘం టైమ్‌టేబుల్ ప్రకారం ఏడు దశల లోక్‌సభ 2024 ఎన్నికల నాలుగో రౌండ్ మే 13న (సోమవారం) జరగనుంది.
అయితే ఎన్నికల పోలింగ్ సజావుగా జరిగేలా నియోజకవర్గాలలోని స్కూల్స్, ఇతర సంస్థలకు ఈసీ సెలవు ప్రకటించింది. ఆర్‌బీఐ ప్రకారం ఓటింగ్ జరగనున్న అన్ని నియోజకవర్గాల్లో బ్యాంకులు మూత పడనున్నాయి.
ఈ ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు మే 13న 4వ దశ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ- కాశ్మీర్‌లో బ్యాంక్ సేవలు నిలిచిపోనున్నాయి.