బస్తర్ జిల్లాలో ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి | Maoist killed in crossfire | Sakshi
Sakshi News home page

బస్తర్ జిల్లాలో ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి

Published Mon, May 23 2016 1:56 PM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

Maoist killed in crossfire

ఛత్తిస్‌గఢ్ లో సోమవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఈనెల 13న బస్తర్ జిల్లా కాటేకళ్యాణ్ రైల్వే స్టేషన్ పై మావోయిస్టులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. వీరికి మావోయిస్టులు ఎదురయ్యారని అధికారులు తెలిపారు.

 

ఈ సందర్భంగా భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో.. బస్తర్ జిల్లా మొదనార్ అటవీ ప్రాంత దళ డిప్యూటీ కమాండర్ సుఖ్ రామ్ మృతి చెందినట్లు వివరించారు. మృతి చెందిన మావోయిస్టు పై వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 18 కేసులు ఉన్నాయి. మృతుని వద్ద నుంచి రైఫిల్, టిఫిన్ బాంబు, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ ఎస్పీ ఆర్. ఎన్ దాస్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement