బస్తర్ జిల్లాలో ఎదురుకాల్పులు.. మావోయిస్టు మృతి
ఛత్తిస్గఢ్ లో సోమవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఈనెల 13న బస్తర్ జిల్లా కాటేకళ్యాణ్ రైల్వే స్టేషన్ పై మావోయిస్టులు దాడి చేశారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. వీరికి మావోయిస్టులు ఎదురయ్యారని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో.. బస్తర్ జిల్లా మొదనార్ అటవీ ప్రాంత దళ డిప్యూటీ కమాండర్ సుఖ్ రామ్ మృతి చెందినట్లు వివరించారు. మృతి చెందిన మావోయిస్టు పై వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో 18 కేసులు ఉన్నాయి. మృతుని వద్ద నుంచి రైఫిల్, టిఫిన్ బాంబు, కరపత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ ఎస్పీ ఆర్. ఎన్ దాస్ తెలిపారు.