‘కొడుక్కి పిల్లను అడిగితే నాకు ఇచ్చారు’.. టికెట్‌ గురించే! | asked bride for my son bastar lok sabha candidate kawasi lakhma | Sakshi
Sakshi News home page

‘కొడుక్కి పిల్లను అడిగితే నాకు ఇచ్చారు’.. టికెట్‌ గురించే!

Published Thu, Mar 28 2024 6:42 PM | Last Updated on Thu, Mar 28 2024 7:13 PM

asked bride for my son bastar lok sabha candidate kawasi lakhma - Sakshi

ఛత్తీస్‌గఢ్‌ మాజీ మంత్రి, బస్తర్ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి కవాసీ లఖ్మా మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన చేసిన ప్రకటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనకు లోక్‌సభ టికెట్‌ దక్కిన వైనం గురించి హాస్యభరితంగా చెప్పారాయన.

"ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీయే పోటీ చేస్తోంది. నాకు టిక్కెట్ ఎందుకు వచ్చింది.. నేను అడగలేదు. అంతగా అయితే నా కొడుక్కి  నా ఇవ్వమన్నాను. నేను నా కొడుక్కి వధువును (టికెట్) అడిగాను. కానీ వారు నాకు ఇచ్చారు" అని హాస్యోక్తులు పూయించారు. అలాగే మోదీ పాలనను ఉద్దేశించి మాట్లాడుతూ నేడు మన దేశం అమ్ముడవుతోందని, మన రాజ్యాంగానికి ముప్పు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. 

కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థి కవాసీ లఖ్మాపై జగదల్ పూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ లో ఇటీవల ఎఫ్‌ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే. దంతేశ్వరి ఆలయం ముందు నోట్లు పంచినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. నోట్ల పంపిణీ సమాచారం అందిన వెంటనే మంత్రి కేదార్ కశ్యప్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 11 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇటీవల లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ జాబితాలో ఐదుగురు  అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు బీజేపీ కూడా ఇదివరకే మొత్తం 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement