Nawazuddin Siddiqui First Look From Saindhav Movie Is Out Now - Sakshi
Sakshi News home page

Nawazuddin Siddiqui : వెంకటేశ్‌ మూవీలో విలన్‌గా బాలీవుడ్‌ నటుడు.. ఫస్ట్‌ లుక్‌ చూశారా?

Published Sat, May 20 2023 7:34 AM | Last Updated on Sat, May 20 2023 9:02 AM

Nawazuddin Siddiqui First Look From Saindhav Movie Is Out Now - Sakshi

వెంకటేశ్‌ హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సైంధవ్‌’. వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా బాలీవుడ్‌ వెర్సటైల్‌ యాక్టర్‌ నవాజుద్దీన్‌ సిద్ధిఖీ తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమవుతున్నారు. శుక్రవారం (మే 19) నవాజుద్దీన్‌ సిద్ధిఖీ పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి, ఈ చిత్రంలో ఆయన చేస్తున్న వికాస్‌ వలిక్‌ ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసింది.

ఇందులో నవాజుద్దీన్‌ది పవర్‌ఫుల్‌ విలన్‌ రోల్‌. ‘‘హై యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రం ‘సైంధవ్‌’. వెంకటేశ్‌ కెరీర్‌లో 75వ లాండ్‌ మార్క్‌ మూవీ ఇది. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా (మనోజ్ఞ పాత్రలో) నటిస్తుండగా, డాక్టర్‌ రేణు పాత్రలో రుహానీ శర్మ, జాస్మిన్‌ పాత్రలో ఆండ్రియా జెర్మియా కనిపించనున్నారు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. చదవండి: సుడిగాలి సుధీర్‌ సరసన దివ్యభారతి.. కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌ 

కాగా ‘సైంధవ్‌’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో డిసెంబర్‌ 22న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌ నారాయణ్, సహనిర్మాత: కిశోర్‌ తాళ్లరు, కెమెరా: ఎస్‌. మణికందన్, ఎగ్జిక్యూటివ్‌  ప్రొడ్యూసర్‌: ఎస్‌. వెంకటరత్నం (వెంకట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement