లండన్: ఇంగ్లాండ్ ప్రధాని రిషి సునాక్ బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామన్స్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బ్రిటీష్ సైన్యానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన స్వలింగసంపర్కులైన సైనికులకు బ్రిటీష్ ప్రభుత్వం తరపున క్షమాపణ చెప్పారు. సైన్యంలోకి వారిని తీసుకోకుండా నిషేధించడం బ్రిటీష్ ప్రభుత్వం యొక్క ఘోర వైఫల్యమని అన్నారు.
దయచేసి క్షమించండి..
రిషి సునాక్ మాట్లాడుతూ ఏమన్నారంటే.. 2000 సంవత్సరానికి ముందు వ్యక్తిగత అభిప్రాయాల ఆధారంగా స్వలింగ సంపర్కులైన సైనికులపై బ్రిటీష్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు అమానుషం. స్వలింగ సంపర్కులను సైన్యం నుండి నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారి జీవితాల పైనా వారి కుటుంబాలపైనా ఎంతటి తీవ్ర ప్రభావం చూపిందో మేము అర్ధం చేసుకున్నాము.
ఆరోజున వివక్షకు గురైన ఆనాటి వీరులందరికీ బ్రిటీష్ ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నాను. మీరు కూడా మిగతా సైన్యంలాగే దేశం కోసం చేసిన త్యాగాలను, క్లిష్ట సమయాల్లో చూపిన ఆపార ధైర్య సాహాసాలను తలచుకుని గర్వపడాలన్నారు. ఆయన ఈ ప్రకటన చేయగానే సభ్యులంతా హర్షాతిరేకాలు తెలిపారు.
యూకే డిఫెన్స్ సెక్రటరీ బెన్ వాలెస్ మాట్లాడుతూ.. 1967-2000 మధ్యలో అనుభవజ్ఞులైన ఎందరో స్వలింగసంపర్కులైన సైనికులు చాలా వివక్షకు గురయ్యారు. సైన్యంలోకి వారిని నిషేధించడంతో వారి జీవితాలు ఛిద్రమయ్యాయి. బ్రిటీష్ సాయుధ దళాల చరిత్రలోనే అదొక అవమానకరమైన సహించరాని పొరపాటని అన్నారు.
On a historic day, the Prime Minister @10DowningStreet has apologised on behalf of the British state for the treatment of veterans who were affected by the ban on LGBT personnel before 2000.https://t.co/FHIu0baTEU pic.twitter.com/3a8trpaJgI
— Office for Veterans' Affairs (@VeteransGovUK) July 19, 2023
ఇది కూడా చదవండి: ప్రపంచ కప్ టోర్నమెంటుకు ముందు కాల్పుల కలకలం.. ఇద్దరి మృతి
Comments
Please login to add a commentAdd a comment