బ్రిటన్ కొత్త ప్రతిపాదిత చట్టం ప్రకారం రాబోయే కొద్ది సంవత్సరాలలో బ్రిటన్‌లో ధూమపానం సమర్థవంతంగా నిర్మూలనకానుంది. 2040 నాటికి బ్రిటన్ ‘పొగ రహిత’ దేశంగా మారుతుందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆశాభావం వ్యక్తం చేశారు.
న్యూజిలాండ్ తర్వాత రాబోయే తరం ధూమపానం చేయకుండా నిరోధించడానికి చట్టం చేసిన రెండవ దేశం బ్రిటన్. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ధూమపానం ఒక సామాజిక దురాచారంగా మారింది. ధూమపానం కారణంగా లెక్కలేనంతమంది క్యాన్సర్‌తోపాటు అనేక వ్యాధులతో బాధపడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ 2040 నాటికి దేశాన్ని ధూమపాన రహితంగా మార్చాలని నిర్ణయించారు.
ఇందుకోసం బ్రిటన్‌లో కొత్త చట్టాలను రూపొందించడంపై చర్చ జరుగుతోంది. బ్రిటీష్ వయోజనులలో 12.9 శాతం మంది ధూమపానం చేస్తున్నారు. 8.7 శాతం మంది ప్రతిరోజూ ఇ-సిగరెట్లను ఉపయోగిస్తున్నారు. నూతన చట్టాలను అమలు చేయడం ద్వారా 2075 నాటికి 1.7 మిలియన్ల మంది ధూమపానం చేయడాన్ని తగ్గించవచ్చని బ్రిటీష్ ప్రభుత్వం భావిస్తోంది. యూకేలో అమలుకానున్న కొత్త చట్టం జనవరి 1, 2009న లేదా ఆ తర్వాత జన్మించిన ఎవరికైనా పొగాకు ఉత్పత్తులను విక్రయించడాన్ని చట్టవిరుద్ధం చేశారు.
ప్రస్తుతం ధూమపానం చేసే వయస్సు 18 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం చట్టబద్ధంగా ధూమపానం చేసే వయస్సును పెంచడం అనేది సమీక్ష ముఖ్య సిఫార్సులలో ఒకటి. ధూమపానం అనేది గుండెపోటు, స్ట్రోక్, క్యాన్సర్, అంగస్తంభన, గర్భస్రావం వంటి 50 అనారోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుంది. ధూమపానం సంవత్సరానికి 76,000 మందిని పొట్టనపెట్టుకుంటోంది. కేఫ్‌లు, పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్‌లలో ధూమపానాన్ని నిషేధించిన ఏకైక దేశం న్యూజిలాండ్. ఇప్పుడు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూడా న్యూజిలాండ్ తరహాలో దేశంలో ధూమపానాన్ని నిషేధించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇది కూడా చదవండి: ఇందిర సభలోకి సింహం ఎందుకు వదిలారు?
Comments
Please login to add a commentAdd a comment